ధవళేశ్వరం

ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలం లోని జనగణన పట్టణం


ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం.[2] ఈ పట్టణం రాజమహేంద్రవరం పట్టణానికి తూర్పు వైపు ఉంది. ధవళేశ్వరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (GRMC)లో ఒక భాగం.[3][4]ఇది గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భాగంగా కూడా ఉంది. [5] ఈ పట్టణం చివరిలో ఆర్ఠర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట ఉంది. ఇది కాటన్ గోదావరి నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే బొబ్బర్లంక, మద్దూర్లంక, విజ్జేశ్వరం అనకట్టలు వస్తాయి. ఈ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం 1982 సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.

రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 16°57′02″N 81°46′55″E / 16.9506°N 81.7819°E / 16.9506; 81.7819
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండలంరాజమండ్రి గ్రామీణ మండలం
Area
 • మొత్తం7.67 km2 (2.96 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం44,637
 • Density5,800/km2 (15,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1059
Area code+91 ( 8837 Edit this on Wikidata )
పిన్‌కోడ్533125 Edit this on Wikidata

సరిహద్దులు మార్చు

రాజమహేంద్రవరం రైలు స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున బొమ్మూరు గ్రామం, పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన వేమగిరి గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, పిచ్చుకలంక, బొబ్బర్లంక గ్రామాల మీదుగా విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.

గణాంకాలు మార్చు

ధవళేశ్వరం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ధవళేశ్వరం పట్టణంలో మొత్తం 11,631 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరధిలో మొత్తం జనాభా 44,637, అందులో 21,681 మంది పురుషులు కాగా, 22,956 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు లింగ నిష్పత్తి 1,059. పట్టణ పరిధిలో నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4527, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 2255 మంది మగ పిల్లలు, 2272 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 1,008, ఇది సగటు లింగ నిష్పత్తి (1,059) కంటే తక్కువ.పట్టణ అక్షరాస్యత మొత్తం రేటు 78.9%. తూర్పుగోదావరి జిల్లాలో 71%తో పోలిస్తే దౌలేశ్వరంలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 83.02%, స్త్రీల అక్షరాస్యత రేటు 75.1%.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో అనేక ప్రభుత్వ, ప్రయివేటు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. బాలురకు, బాలికలకు విడివిడిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

రవాణా సదుపాయాలు మార్చు

ధవళేశ్వరం గ్రామానికి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ గ్రామం గుండా పదహారవ నంబరు జాతీయ రహదారి పోతున్నది. ఈ రహదారి విశాఖపట్నం, విజయవాడలను కలుపుతుంది. రాజమహేంద్రవరం నుండి కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం మొదలైన జిల్లాలోని ప్రధాన పట్టణాలకు పోవు రాష్ట్ర రహదారి ఈ గ్రామం మీదుగా వెళ్తుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా బొబ్బర్లంక, విజ్జేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లాను చేరుకోవచ్చు. సమీపంలో రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉంది.

స్థల పురాణం మార్చు

ఈ గ్రామానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు.

ఇతర విశేషాలు మార్చు

ధవళేశ్వరం రాజమహేంద్రవరం పొలిమేర్లలో ఉండడం వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నది. గ్రామానికి దగ్గర్లోని రైలు స్టేషను రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం నుండి ఈ గ్రామానికి తరచు బస్సు సదుపాయం ఉంది. గ్రామంలో ఒక బస్సు స్టాండు కూడా ఉంది. తొలి తెలుగు నవలగా పేరుగొన్న రాజశేఖర చరిత్రములో కథా స్థానంగా ధవళేశ్వరం వివరణ ఉంది. కందుకూరి వీరేశలింగం ఈ ఊరిలో నివసించాడు.

ఆకర్షణలు మార్చు

 
ధవళేశ్వర ఆనకట్ట
 
కాటన్ మ్యూజియం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం
 • ధవళేశ్వరం బ్యారేజి: సాయంత్రం వేళ ఈ ఆనకట్ట చూడడానికి చాలా బాగుంటుంది. చుట్టుపక్క గ్రామంల నుండి చాలా మంది సందర్శకులు నిత్యం ఇక్కడకు వస్తారు. బ్యారేజి దిగువన గల ఇసుక తిన్నెలు పిల్లలకు పెద్దలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
 • కాటన్ మ్యూజియం: కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్రను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో వినియోగించిన వస్తువులు, ఆనకట్ట నిర్మాణ సామగ్రిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్ధతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఒక మంచి వనము కూడా ఉంది.
 • రామపాదాల రేవు - ప్రధాన పుష్కరాల రేవు,
 • జనార్ధనస్వామి ఆలయం : ఈ ఆలయం నవ జనార్ధన ఆలయములలో ఒకటి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉంది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
 • లూథరన్ చర్చి: ధవళేశ్వరం గ్రామంలో పురాతనమైన, అతి పెద్దదైన చర్చి ఉంది. దీనిని నిక్కం మెమోరియల్ ఇమ్మానుయెల్ లూథరన్ చర్చి అని అంటారు. విస్తీర్ణంలో పెద్ద కట్టడం అవడం వలన స్థానికులు దీనిని పెద్ద చర్చి అని అంటారు. ఇది ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ మిషన్ కు సంబంధించింది. మరొక ముఖ్యమైన విషయం, చర్చి కట్టడంలో ప్రముఖ విశేషం - చర్చి గోపురం, దానిలో ఉంచిన పెద్ద కంచు గంట. అ రోజులలో అంత భారీ గంటను అంత పైకి ఎక్కించటం అనేది నాటి పని వారి పనితనానికి మచ్చు తునక .
 • అగస్త్యేశ్వరస్వామి ఆలయం: పురాతన స్వయంభూ శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల శివలింగం ఉద్భవించినది గనుక, ఈ గుడిని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అంటారు.
 • సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం: సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
 • కంట్రి క్లబ్ విహార కేంద్రం: గోదావరి నది ఒడ్డున గల కంట్రీక్లబ్ విహార కేంద్రంలో సేద తీరుటకు గల అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఒక మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది.

పరిశ్రమలు మార్చు

ధవళేశ్వరంలో ఒక పారిశ్రామిక వాడ ఉంది. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఈ వాడలో ఉన్నాయి.

ముఖ్య పరిశ్రమలు మార్చు

 • గ్లాక్సో స్మిత్క్లైన్
 • సిరామిక్ పరిశ్రమలు
 • చిన్న టైర్ల పరిశ్రమ

ఇతర ముఖ్య కేంద్రాలు మార్చు

 • కాయిర్ బోర్డు వారి కేంద్రం
 • భారత ఆహార సంస్థ గిడ్డంగి
 • ప్రభుత్వ కోతమిళలు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

 1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
 2. "Villages and Towns in Rajahmundry Rural Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
 3. BVS Bhaskar (20 March 2013). "21 gram panchayats merged into RMC". The Hindu. Rajahmundry. Retrieved 24 August 2015.
 4. "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats". Tgnns. Archived from the original on 4 March 2016. Retrieved 24 August 2015.
 5. "Constitution of Godavari Urban Development Authority with headquarters at Godavari" (PDF). Municipal Administration and Urban Development Department. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 18 January 2017. Retrieved 9 November 2016.[permanent dead link]

వెలుపల లంకెలు మార్చు