జబల్‌పూర్ - జమ్మూ తావి ఎక్స్‌ప్రెస్

జబల్పూర్-జమ్ము తావీ ఎక్స్‌ప్రెస్ లేదా దుర్గావతి ఎక్స్‌ప్రెస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అందించే ఒక ద్వి వీక్లీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవ. ఇది, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్యమైన సైనిక కేంద్రంగా ఉన్న జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను, భారతదేశం లోని జమ్మూ & కాశ్మీర్ లోని జమ్ము తావీ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలుకు "దుర్గావతి ఎక్స్‌ప్రెస్ " యొక్క పేరు జబల్పూర్ లోని మహాకోసల ప్రాంతం పరిపాలించిన గొప్ప యువరాణి ప్రిన్సెస్ దుర్గావతి (రాణి దుర్గావతి) జ్ఞాపకార్ధముగా ఇవ్వడం జరిగింది. ఆమె సామ్రాజ్యం మొఘల్ చక్రవర్తుల స్వాధీనం నుండి రక్షించుకునేందుకు వారికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడింది, ఆమె తన ప్రాంతము కొరకు ప్రాణత్యాగం చేసింది.

కోచ్ మిశ్రమం

మార్చు

రైలు 23 కోచ్‌లు కలిగి ఉంటుంది:

  • 1 ఎసి 1వ టైర్
  • 2 ఏసీ టూ టైర్
  • 3 ఎసి త్రీ టైర్
  • 14 స్లీపర్
  • 3 సాధారణ
  • 1 చిన్నగది
  • 1 సామాను / బ్రేక్ వ్యాను

మూలాలు

మార్చు