జమూయి

బీహార్ రాష్ట్రం లోని పట్టణం

జమూయి బీహార్ రాష్ట్రం జమూయి జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ముంగేర్ జిల్లా నుండి కొంత ప్రాంతాన్ని విడదీసి జమూయి ముఖ్యపట్టణంగా 1991 ఫిబ్రవరి 21 న ఈ జిల్లాను ఏర్పరచారు. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

జమూయి
పట్టణం
జమూయి is located in Bihar
జమూయి
జమూయి
బీహార్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°55′N 86°13′E / 24.92°N 86.22°E / 24.92; 86.22
దేశం India
రాష్ట్రంబీహార్
జిల్లాజమూయి
Named forజంభియా గ్రామ్
Elevation
78 మీ (256 అ.)
జనాభా
 (2011)
 • Total87,357
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
811307 811307
టెలిఫోన్ కోడ్06345
ISO 3166 codeIN-BR
Vehicle registrationBR-46
లింగ నిష్పత్తి912/1000(2011) /

జమూయి జిల్లా పేరు మూలానికి సంబంధించి చరిత్రకారులు పేర్కొన్న రెండు పరికల్పనలు ప్రధానంగా ఉన్నాయి. వర్ధమాన మహావీరుని 'సర్వజ్ఞానం' ( కేవల జ్ఞానం ) పొందిన స్థలమైన "జంభియా గ్రామ్" లేదా "జృభిక్‌గ్రామ్" పేరు మీదుగా వచ్చిందనేది మొదటి పరికల్పన. మరొక పరికల్పన ప్రకారం జమూయి అనే పేరు జంబువాణి నుండి వచ్చింది

భౌగోళికం

మార్చు

జమూయి 24°55′N 86°13′E / 24.92°N 86.22°E / 24.92; 86.22 వద్ద [1] సముద్ర మట్టం నుండి 78 మీటర్ల ఎత్తున ఉంది.

పట్టణ రఒల్వేస్టేషను 3 కిలోమీటర్ల దూరంలో నున్న మల్లేపూర్ వద్ద ఢిల్లీ-హౌరా రైలు మార్గంపై ఉంది. దగ్గర లోని విమానాశ్రయం 161 కి.మీ. దూరంలోని పాట్నాలోని లోక్ నాయక్ జయప్రకాష్ విమానాశ్రయం

జనాభా

మార్చు

2011 జనగణన ప్రకారం,[2] జమూయి జనాభా 87,357. జనాభాలో పురుషులు 52.6%, స్త్రీలు 47.26%. జమూయిలో అక్షరాస్యత 64.33%, జాతీయ సగటు 74.04% కన్నా తక్కువ: పురుషుల అక్షరాస్యత 57.39%, స్త్రీ అక్షరాస్యత 42.6%. పట్టణ జనాభాలో 16.22% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc - Jamui
  2. http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=270985


"https://te.wikipedia.org/w/index.php?title=జమూయి&oldid=3554724" నుండి వెలికితీశారు