జమూయి జిల్లా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో జమూయి జిల్లా (హిందీ:) ఒకటి. జమూయి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.1991 ఫిబ్రవరి 21లో ముంగేర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. 86° 13' డిగ్రీల తూర్పు రేఖాంశంలో, 24° 55' ఉత్తర అక్షాంశంలో ఉంది.

జమూయి జిల్లా

जमुई जिला,ضلع جموئ
బీహార్ పటంలో జమూయి జిల్లా స్థానం
బీహార్ పటంలో జమూయి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంబీహార్
డివిజనుముంగేర్
ముఖ్య పట్టణంజమూయి
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుజమూయి
విస్తీర్ణం
 • మొత్తం3,122 km2 (1,205 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం17,56,078
 • సాంద్రత560/km2 (1,500/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.16 %
 • లింగ నిష్పత్తి921
సగటు వార్షిక వర్షపాతం1102 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి
నల్దంగా ప్యాలెస్, లట్టు కొండ, సిముల్తాలా

చరిత్రసవరించు

వివిధసాహిత్యాలలో జమూయి భూభాగం జాంబియాగ్రాంగా ప్రద్తావించబడింది. జైనిజం అనుసరించి 24వ తీర్ధంకర్ భగవాన్ మహావీర్ జాంబియాగ్రాంలో ఙానోదయం పొందాడని విశ్వసిస్తున్నారు.జాంబియాగ్రాం ఉజ్జిహువాలియా నదీతీరంలో ఉంది. భగవాన్ మహావీర్ ఙానోదయం పొందాడని భావిస్తున్న మరొక ప్రదేశం రిజువాలికా నదీతీరంలో ఉన్న జ్రింభిక్‌గ్రాం జాంబియాగ్రాం ఒకటేనని భావిస్తున్నారు.

పేరువెనుక చరిత్రసవరించు

జాంబియా, జ్రింభిక్‌గ్రాం పదాలకు హిందీలో జమూహి అని అర్ధం. కాలక్రమంలో జమూహి జమూయి అయింది. అలాగే కాలక్రమంలో ఉఝువాలియా (రిజువాలికా) నది పేరు ఉలైగా మారింది. రెండు ప్రదేశాలు జుమూయిలో ఉన్నట్లు గుర్తుంచబడ్డాయి. జమూయి సమీపంలో ఇప్పటికీ ఉయిలి నది ప్రవహిస్తుంది. జమూయి జంభుబానిగా లిఖించబడిన తామ్రపత్రం మ్యూజియంలో ఉంది. ఇది 12 శతాబ్ధానికి చెందిన జంభుమాయి ప్రస్తుత జమూయి అని భావిస్తున్నారు. పురాతనమైన జంబుయాగ్రాం, జంబుబాని పేర్లు ఈ ప్రాంతం జైనమతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని సూచిస్తున్నాయి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం గుప్తుల పాలనలో ఉంది. చరిత్రకారుడు బుచానన్ 1811 లో ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఇతర చరిత్రకారులు కూడా మాభాభారతకాలంలో ఈ ప్రాంతం ఉంకిలో ఉందని భావిస్తున్నారు.

పాలకులుసవరించు

సాహిత్యంలో లభిస్తున్న ఆధారాలు 12 వ శతాబ్ధానికి ముందు జమూయి గుప్తా, పాలా పాలకులతో సంబంధితమై ఉందని భావిస్తున్నారు. తరువాత ఈ ప్రాంతంమీద చండేల్ పాలకులు ఆధిక్యత సాధించారు. చండేల్ రాజుకంటే ముందు ఈ ప్రంతాన్ని నిగోరియా రాజు పాలించాడు. నిగీరియాను చండేల్ రాజు ఓడించాడు. 13వ శతాబ్దంలో చండేల్ రాజ్యం స్థాపించబడింది. క్రమంగా చండేల్ రాజ్యం జమూయి వరకు విస్తరించింది. జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.[1]

భౌగోళికంసవరించు

జనుయి జిల్లా వైశాల్యం 3098 చ.కి.మీ.[2] ఇది ఇండోనేషియా లోని యాందేనా ద్వీపం వైశాల్యానికి సమానం.[3]

ఆర్ధికంసవరించు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జమూయి జిల్లా ఒకటి అని గుర్తించింది .[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[4]

డివిజన్లుసవరించు

 • పోలీస్ జిల్లా 1
 • సబ్ డివిజన్లు 1
 • బ్లాక్స్ 10
 • వలయాలు 10
 • పోలీస్ స్టేషన్లు 28
 • పంచాయతీల్లో 153
 • గ్రామాలు 1,506

బ్లాక్సవరించు

 • గిధౌర్
 • ఇస్లాంనగర్-అలిగంజ్
 • బర్హత్
 • చకై
 • జమూయి
 • ఝఝ
 • ఖైర
 • లక్ష్మిపుర్
 • సికంద్రా
 • సోనో
 • మఖ్దూం పుర్ దన్ర్

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,756,078,[5]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 273వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 567 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 25.54%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 62.16%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లాలోని ప్రముఖులుసవరించు

లాతే మొహమ్మద్ ఉస్మాన్సవరించు

లాతే మొహమ్మద్ ఉస్మాన్ జమూయీ జిల్లాలోని అద్సర్ (జమూయీకి 9 కి.మీ దూరంలో ఉన్న గ్రామం) లో జన్మించాడు. ఆయన గొప్ప సాంఘిక కారూకర్త. అలాగే జమూయి చైర్మంగా కూడా పనిచేస్తున్నాడు. ఆయన అద్సర్ పరిసర ప్రాంతాలలో పలు సంస్కరణలు చేపట్టాడు. ఆయన 70-80 లలో ప్రారంభించిన కార్యక్రమ ఫలితంగా అద్సర్ ప్రాంతం అంతా విద్యుదీకరణ చేయబడింది. ఆయన గ్రామంలోని వివాదాలను పరిష్కరిస్తుంటాడు. ఆయన కుమార్తె రషీదా ఖాటూన్ పఠశాలకు అవసరమైన సహాయం చేసి అద్సర్ ప్రజలకు విద్యా వసతి కల్పించింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు.

చంద్రశేఖర్ సింగ్సవరించు

చంద్రశేఖర్ సింగ్ జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. ఆయన 1983 ఆగస్టు నుండి 1985 మార్చి వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇందిరాగాంధి, రాజీవ్‌గాంధి మంత్రివర్గంలో ఆయన పలు మార్లు క్యాబినెట్ మత్రిగా సేవలందించాడు.

త్రిపురారి సింగ్సవరించు

రాజకీయ నాయకుడు త్రిపురారి సింగ్ బీహార్ అసెంబ్లీ చైర్మన్‌గా పనిచేసాడు.

శుక్రదాస్ యాదవ్సవరించు

శుక్రదాస్ యాదవ్ ప్రఖ్యాత సాంఘిక కార్యకర్త, రాజకీయనాయకుడు. ఆయన బలహీన వర్గాల కొరకు పోరాటం సాగించాడు. ఆయన వరకట్నం, బాల్య వివాహం, కులవిధానాలకు వ్యతిరేకంగా పోరాడాడు.

శ్యామప్రసాద్ సింగ్సవరించు

శ్యామప్రసాద్ సింగ్ స్వతంత్ర సమరయోధుడు. ఆయన మహాత్మా గాంధీ సహాయనిరాకరణ పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన కలకత్తా సమాచార్ పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. నవశక్తి పాట్నా డైరెక్టర్‌గా కూడా పనిచేసాడు.

గిరిధర్ నారాయణ్ సింగ్సవరించు

గిరిధర్ నారాయణ్ సింగ్ ప్రబల స్వతంత్ర సమరయోధుడు, సోషలిస్ట్ పార్టీ సభ్యుడు, ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా " కిషన్ సభను " స్థాపించాడు. 1942లో ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. .

దుఖరన్ ప్రసాద్సవరించు

దుఖరన్ ప్రసాద్ ప్రబల స్వతంత్ర సమరయోధుడు. ఆయన స్వతంత్ర సమరాన్ని సాధారణ ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాడు. 1943లో ఆయన ఖైదు చేయబడ్డాడు. ఆయన పోలీస్ దౌర్జన్యానికి బలై అమరుడుగా నిలిచాడు.

ప్రయాణ సౌకర్యాలుసవరించు

తూర్పు మధ్య రైల్వే జోన్‌లోని దనపూర్ డివిజన్‌లో ప్రధాన రైల్వే స్టేషనులలో జముయి రైల్వే స్టేషను (జె.ఎం.యు) ఒకటి. జముయి భారతీయ మహానగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. హౌరా- ఢిల్లీ ప్రధాన రైలు మార్గం మొగల్‌సరాయ్ - పాట్నా మార్గం మీదుగా పయనిస్తుంది. ఇది కొంత దూరం చరిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంట సాగిపోతుంది. [8][9] జమూయి జిల్లాకు జమూయి పట్టణం కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో రైల్వే, రహదారి మార్గాలు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పాట్నా, బరౌని మార్గంలో రైళ్ళు జమూయీ మీదుగా పయనిస్తుంటాయి. హౌరా, సీల్దా, రాంచి, తాతానగర్ రైళ్ళు ఇక్కడ ఆగుతుంటాయి.[10]

సంస్కృతిసవరించు

మ్యూజియంసవరించు

చంద్రశేఖర్ సింగ్ సంగ్రహాలయం 1983 మార్చి 16వ శతాబ్దంలో స్థాపించబడింది. 178 ఆర్కిటెక్చురల్ అవశేషాలు ఈ మ్యూజియంలో బధ్రపరచబడి ఉన్నాయి. బధ్రపరచబడిన వాటిలో విష్ణుమూర్తి పలు రూపాలు, బుద్ధుని శిల్పాలు, ఉమదేవి, దుర్గ, సూర్యుడు, పురాతన శిలలు, టెర్రకోటా ముద్రలు ప్రధానమైనవి.

సంగీతంసవరించు

పురాతన కాలం నుండి జిల్లా సంగీత సంప్రదాయం సుసంపన్నమైనది. రెండు దశాబ్ధాలుగా శ్రీ బజరంగ్ లాల్ గుప్తా ఎ.ఐ.ఆర్ లలిత సంగీత కళాకారుడుగా పనిచేసాడు. శ్రీ జ్యోత్రింద్ర కుమార్, డాక్టర్ అంజుబాలా, శ్రీనతి సుజాత కుమారి, కుమార్ అమితాబ్, శ్రీ చందన్ గుప్తా, శ్రీ శైలేష్ కుమార్, శ్రీమతి. అభ సింగ్, శ్రీ అనిల్ పాఠక్, చందన్ సింగ్, డి.డి సింగ్ వంటి సంగీత కళాకారులు జిల్లా సంగీత సంప్రదాయానికి మెరుగులు దిద్దారు. జిల్లాలో షాసి రాజన్ ప్రసాద్ నృత్యకళాకారుడుగా పేరు తెచ్చుకున్నాడు.

సాహిత్యంసవరించు

జమూయి సాహిత్యానికి, కవులకు పుట్టిల్లు. డాక్టర్.ప్రొఫెసర్.అవధ్ కిషోర్ సిన్హా, డాక్టర్.ష్యామానంద్ ప్రసాద్ సాహిత్యంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. యువ కవులు, ప్రొఫెసర్ డాక్టర్ జగ్రూప్ ప్రసాద్, ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ యాదవ్, ప్రొఫెసర్ సుఖ్దేవ్ ఠాకూర్, ప్రొఫెసర్ ప్రభాత్ సరసిజ్, డాక్టర్ గిరిధర్ ఆచార్య, ప్రొఫెసర్ బ్రజ్నందన్ మోడీ రచయితలు సాహిత్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పండిట్. జగన్నాథ్ పి.డి చతుర్వేది సాహిత్యంలో తమ ప్రత్యేక ముద్రవేసారు. రామేశ్వర్ పి.డి. కుమార్ రణబీర్ సింగ్ పురాతన కాలంలో వంటి కవులు బ్రజ్ భాషలో ప్రతిభను చాటారు. ప్రస్తుతం బ్రజ్ వల్లభ్ చతుర్బేది, శ్రీమతి. కిషోరి, లేట్ కిరణ్ జీ త్రిపురారి సింగ్ మత్వాలా, దెవెరెంద్ర, మలయాపురి, ప్రభాత్ సరసిజ్, వినయ్ అషాం, శ్యాం ప్రసాద్ దీక్షిత్, ఆనంది ప్రసాద్ సింగ్, రాజ్ కిషోర్ ప్రసాద్ (అడ్వకేట్), అభినవ్ సింగ్ (దర్హ) (రాజకీయవేత్త & సామాజిక కార్యకర్త) మొదలైన వారు సాహిత్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు.

వృక్షజాలం, జంతుజాలంసవరించు

1987లో జమూయి జిల్లాల్లో 7.9 చ.కి.మీ వైశాల్యంలో " నాగీ ధాం వన్యమృగాభయారణ్యం " స్థాపించబడింది.

[11]1987లో జిల్లాలో 3.3 చ.కి.మీ వైశాల్యంలో నక్తి ధాం వన్యమృగాభయారణ్యం స్థాపించబడింది. .[11]

క్రీడలుసవరించు

జముయి జిల్లా శీఘ్రగతిలో క్రీడలలో ముందుకు సాగుతుంది. జిల్లాలో అమెచ్యూర్ అథ్లెటిక్ అసోసియేషన్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్, జిల్లా మహిళా ఫుట్బాల్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వంటి క్రీడాసంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలలోని క్రీడాకారులు చురుకుగా పోటీలలో పాల్గొంటూ ఉన్నారు. పలు క్రీడా సంస్థలు ఉన్నందున జిల్లా వాసులు వివిధ క్రీడల శిక్షణ పొంది క్రీడాపోటీలలో చురుకుగా పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నాయి. జిల్లాలో నిర్వహించబడుతున్న క్రీడలకు లెఫ్టినెంట్ పరస్నాథ్ బారియార్, తపేశ్వర్ పి.డి. బారియార్, హోదా సాహెబ్, కమ్త, పి.డి. సింగ్, విక్కీ కుమార్, నతు రామ్, కౌశల్ కుమార్ యాదవ్ కేదార్ పి.డి. సింగ్ వంటి క్రీడాకారులు నాయకత్వం వహిస్తున్నారు. జముయీ జిల్లా క్రీడా కారులు మూడ దశాబ్ధాలుగా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. సామీపకాలంలో 1 వ జిల్లా స్ధాయి అథ్లెటిక్స్ మీట్, 11 రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కప్ ఫుట్బాల్ టోర్నమెంట్, లేట్ శుక్రదాస్ దాస్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి. జిల్లాలో రెండు స్టేడియంలలో అవి (జమూయి స్టేడియం,జమూయి & కుమార్ సురేంద్ర ప్రతాప్ సింగ్ స్టేడియం, (గిధౌర్) )ఉన్నాయి .

మూలాలుసవరించు

 1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
 2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
 3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2015-12-01. Retrieved 2011-10-11. Yamdena 3,100km2
 4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
 7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
 8. "About District". Official District website. Archived from the original on 18 ఆగస్టు 2011. Retrieved 15 April 2012.
 9. "Jamui". Overview. Brandబీహార్. Archived from the original on 19 ఏప్రిల్ 2012. Retrieved 15 April 2012.
 10. "Violation of rly rules led to Jamui mishap". The Times of India. Aug 19, 2001. Archived from the original on 2012-12-01. Retrieved 16 April 2012.
 11. 11.0 11.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

బయటి లింకులుసవరించు

Coordinates: 24°55′12″N 86°13′12″E / 24.9200°N 86.2200°E / 24.9200; 86.2200మూలాలుసవరించు