జయగోపాల్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
డా. జయగోపాల్ (జ. 1944[1]) నాస్తిక యుగం పత్రిక సంపాదకుడు, భారత నాస్తిక సమాజం స్థాపకుడు. ఇతడు విశాఖపట్నం నివాసి. ఇతడు ఇస్లాం మీద పెద్ద గ్రంథం రాశాడు. దేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోపాల్ చాలెంజ్ చేశాడు. ఇతడు 1972లో భారత నాస్తిక సమాజం, నాస్తిక యుగం పత్రికను స్థాపించాడు.హేతువాది నాస్తికుడు.
నాస్తిక యుగం పత్రిక
మార్చునాస్తిక యుగం పత్రిక 1972లో డా.జయగోపాల్ చే స్థాపించబడినది. ఈ పత్రిక విశాఖపట్నం నుంచి ప్రచురితమవుతోంది. ఈ పత్రికలో హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల పైన తీవ్ర విమర్శలు ప్రచురించారు. గ్రామాలలో చేతబడి పేరుతో జరిగే హత్యలు, మానభంగాల పై కూడా వార్తలు ప్రచురించారు.
రచనలు
మార్చు- క్రైస్తవం-బానిసత్వం 1983
- కులనిర్మూలన 1983
- మహాత్ములంటే ? 1985
- భయమే బాణామతి 1991
- పెరియార్ ఇ.వి.ఆర్.జీవితం 1992
భారత నాస్తిక సమాజం
మార్చుభారత నాస్తిక సమాజం వారు మతతత్వానికి వ్యతిరేకంగా సభలు పెడుతున్నారు. మతతత్వ సంస్థలకి వ్యతిరేకంగా పాటలు కూడ సంకలనం చేస్తున్నారు. "ఓరోరి మతోన్మాది, నీకు కడతాం గోరీ" వంటి పాటలు మతతత్వ రాజకీయ పార్టీలని భయపెట్టేలా ఉంటాయి. గ్రామాలలో మంత్ర గాళ్ళు దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు సృష్టించి ప్రజలని భయపెట్టి వాటిని శాంతి చెయ్యిస్తామని చెప్పి డబ్బులు లాగుతున్నారు. ఆ సందర్భాలలో భారత నాస్తిక సమాజం వారు గ్రామాలకి వెళ్ళి భయాల్ని పోగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జయగోపాల్ విశాఖపట్నంలో గొడ్డుమాంసం, పందిమాంసం విందు నిర్వహించాడు. బహిరంగంగా మతగ్రంథాలను తగులబెట్టాడు. రాజకీయాలకు అతీతంగా హేతువాద దృష్టితో అనేక సాహవంతమైన కార్యక్రమాలను నిర్వహించాడు.[2] అయితే నిజాన్ని తెలుసుకోవటానికి కాక కేవలం అస్తిత్వవాదంపై గుడ్డి ద్వేషంతో హిందూ ముస్లింల సునిశిత భావాలకు ఖేదం కలిగించడానికే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాడని విమర్శకులు ఖండించారు.[3]
సవాళ్ళు
మార్చుదేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోపాల్ చాలెంజ్ చేశాడు. విశాఖపట్నంలోనే ఇతనికి పోటీగా పాస్టర్ పొట్లూరి దేవ సుందర రావు అనే వ్యక్తి తనని తాను అంతర్జాతీయ చాలెంజర్ గా ప్రకటించుకున్నాడు. అతను బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వాహకుడు. అతనికి bibleverdict.org పేరుతో వెబ్ సైట్ కూడా ఉంది, భూతలక్రిందులు అనే పేరుతో పత్రిక కూడా ఉంది. విశాఖపట్నంలోని గోడల మీద, బోర్డుల మీద పెయింటింగులు వెయ్యించి తాను ప్రపంచంలో ఎవరినయినా చాలెంజ్ చెయ్యగలనని ప్రకటించుకుంటుంటాడు. డా విన్సీ కోడ్ విషయంలో కూడా సుందర రావు సవాల్ విసిరాడు. ఆ సవాల్ ని అంగీకరిస్తూ జయగోపాల్ అతన్ని బహిరంగ చర్చకి రమ్మన్నాడు.[4] క్రైస్తవులు తొక్కిపెట్టిన ఫిలిప్ సువార్త గురించి జయగోపాల్ ప్రస్తావిస్తారనే భయంతో అతను జయగోపాల్ పిలిచిన వేదికకి రాలేదు. క్రైస్తవ మతవాదులని సవాల్ చేస్తూ జయగోపాల్ క్రీస్తు చారిత్రక పురుషుడా? అనే టైటిల్ తో గ్రంథం కూడా వ్రాసాడు.
వివాదాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ http://www.amazon.de/Gabriels-Einfl%C3%BCsterungen-historisch-kritische-Bestandsaufnahme-Islam/dp/3894846011
- ↑ "We Become Atheists By Gora Chapter XVII. Spread of Atheism". Archived from the original on 2009-02-01. Retrieved 2008-12-16.
- ↑ In Search of a Scientific Religion By Sham Lal Sharma పేజీ.x [1]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-13. Retrieved 2008-12-16.