కేథలిక్ బైబిల్ గ్రంధాలు

(డా విన్సీ కోడ్ నుండి దారిమార్పు చెందింది)

బైబిల్ అనేది కొన్ని గ్రంథాల కలయిక. ఇందులో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేవి ప్రధాన భాగాలు. వీటిలో, ప్రధానంగా పాతనిబంధనకు చెందిన భాగంలో కొన్ని గ్రంథాలు లభ్యం కాలేదు. లేదా లభ్యమైన వాటిని మతాధికారులు ప్రామాణికంగా అంగీకరించలేదు. ఇలాంటివాటిని "ఆమోదింప బడనివి" లేదా "తొక్కిపెట్టబడినవి" లేదా "నిరాకరింపబడినవి" అని అనవచ్చును. దొరికిన గ్రంథాలు గుహలు, పురాతన గ్రంథాలయాలు, తవ్వకాలలో బయటపడ్డాయి. అవి పురాతన గ్రంథాలయాలలో మూల పడేయబడ్డాయి లేదా పురాతన చర్చిలలో నేల కింద పాతి పెట్ట బడ్డాయి. ఇలాంటి గ్రంథాలను ఆంగ్లంలో Biblical apocrypha అని అంటారు. en:Apocrypha అనే గ్రీకు మూల పదానికి "దాచబడినవి" అని అర్ధం. ఇలా కొన్ని బైబిల్ గ్రంథాల కర్తృత్వాన్ని లేదా దివ్యత్వాన్ని వివిధ మతాధికారులు సంశయిస్తున్నారు లేదా నిరాకరిస్తున్నారు. వాటిని "బిబ్లికల్ అపోక్రైఫా" అని, లేదా సూక్ష్మంగా "అపోక్రైఫా" అని కూడా అంటారు. ఈ పదాన్ని తిరస్కార పూర్వకంగాను లేదా వివాదాస్పదంగాను వాడడం కద్దు. ఈ "నిరాకరణ" విషయంలో కేథలిక్కు, ప్రొటెస్టంటు సంప్రదాయాలలో విభేదాలున్నాయి. క్రైస్తవ మతాధికారులచే ఇవి పాక్షికముగా లేదా పూర్తిగా లభ్యమైనా కొన్ని పూర్తిగా కనుమరుగు చెయ్యబడ్డాయి అని కూడా ఒక భావన ఉంది. కేథలిక్కు బైబిల్ లో అదనంగా ఉన్నగ్రంథాలు: 7 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.

  1. తోబితు
  2. యూదితు
  3. మక్కబీయులు 1
  4. మక్కబీయులు 2
  5. సొలోమోను జ్ఞానగ్రంథము
  6. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము
  7. బారూకు

హనోకు గ్రంథము

క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక బైబిల్ గ్రంథములలో హనోకు గ్రంథము (Book of Enoch) ఒకటి. ఇది గఅజ్ భాషలో వ్రాయబడింది. దీన్ని ఇథియోపియా ఆర్థొడాక్స్ సంఘము వాళ్ళు మాత్రమే ప్రామాణిక గ్రంథముగా నమ్ముతారు. చాలా క్రైస్తవ శాఖల వాళ్ళు దీన్ని అప్రామాణిక గ్రంథముగా కొట్టి పారేసినప్పట్టికీ, యూదా ఉత్తరములో దీన్ని ప్రామాణిక గ్రంథముగా పేర్కొనడం జరిగింది.

ఏలియా దర్శనములు

ఏలియా దర్శనములు (Apocalypse of Elijah) క్రైస్తవులు తొక్కిపెట్టిన గ్రంథములలో ఒకటి. ఈ గ్రంథము ఎవరు వ్రాశారు అన్న ప్రశ్న ఇప్పటికీ వివాదాస్పదముగా ఉంది. ఈ గ్రంథాన్ని కాప్టిక్ భాషలోనూ, హీబ్రూ భాషలోనూ వ్రాయడం జరిగింది.

జ్ఞాన గ్రంథము

జ్ఞాన గ్రంథము (Book of Wisdom) క్రైస్తవులు తొక్కి పెట్టిన అనేక గ్రంథాలలో ఒకటి, ఆ గ్రంథ రచయిత పేరు ఆ గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు కానీ ఆ గ్రంథమును సోలోమోను రాజు వ్రాసినట్టు భావించడం జరిగింది. ఈ పుస్తకం గ్రీకు భాషలో వ్రాయబడింది. పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రంథం క్రీస్తు పూర్వం ఒకటవ లేదా రెండవ శతాబ్దంలో వ్రాయబడింది.

అరబ్బీయుల బాల్య సువార్త

క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక సువార్తలలో అరబ్బీయుల బాల్య సువార్త (Arabic Infancy Gospel) ఒకటి. యేసు క్రీస్తు బాల్యం గురించి సిరియాక్ భాషలో ఒక సువార్త వ్రాయబడింది. దాన్ని అరబిక్ భాషలోకి అనువదించడం జరిగింది. కానీ దాన్ని క్రైస్తవ చర్చిలు తొక్కిపెట్టినాయి. ఆ సువార్తలో ఎముందో పూర్తిగా తెలియరావడం లేదు కానీ అందులోని కొన్ని భాగాలు ఖురాన్లో చేర్చబడ్డాయి.[ఆధారం చూపాలి]

బర్నబాస్ సువార్త

క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక గ్రంథాలలో బర్నబాస్ సువార్త ఒకటి. బర్నబాస్ సువార్త ప్రకారం క్రీస్తు దేవుడు కాదు, దేవుని బిడ్డ కాదు. అతను ఒక ప్రవక్త మాత్రమే. ఇలా రాసినందుకే క్రైస్తవ మతాధికారులు బర్నబాస్ సువార్తను తొక్కిపెట్టారు. క్రీస్తు తరువాత మరొక ప్రవక్త వస్తాడని బర్నబాస్ సువార్తలో వ్రాయబడింది. దీన్ని క్రైస్తవులు ఎలాగూ నమ్మరు కానీ ముస్లింలు నమ్ముతారు. ముస్లింల నమ్మకం ప్రకారం ముహమ్మదే చివరి ప్రవక్త, యేసు క్రీస్తు (ఈసా అల్ మసీహ్) రెండవ గొప్ప ప్రవక్త. ఒకప్పుడు ఈజిప్ట్ దేశములో క్రైస్తవులు బర్నబాస్ సువార్తని ప్రామాణిక సువార్తగా నమ్మేవారు కానీ 325 C.E. తరువాత క్రైస్తవ మతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. ఇప్పుడు కొందరు ఇస్లామిక్ పండితులు మాత్రమే బర్నబాస్ సువార్తని ప్రామాణిక సువార్తగా భావిస్తున్నారు. వారిలో ప్రముఖులు అబుల్ అలా మౌదూదీ, రషీద్ రీదా . పౌలును పేతురుకు పరిచయం చేసింది, తన యావదాస్తిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర ప్రజా వినియోగానికై పెట్టిన మొదటి వ్యక్తి బర్నబాస్ .

మూలాలు

బయటి లింకులు