జర్మనీలో హిందూమతం
జర్మనీలో హిందూ మతం మైనారిటీ మతం. జర్మనీ జనాభాలో 0.1% మంది దీనిని పాటిస్తున్నారు. [1] దేశంలో దాదాపు 1,00,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [2]
జనాభా వివరాలు
మార్చు1950 నుండి, భారతీయ హిందువులు జర్మనీకి వలస వస్తూ ఉన్నారు. 1970ల నుండి, శ్రీలంక నుండి తమిళులు జర్మనీకి శరణార్థులుగా వచ్చారు (వారిలో ఎక్కువ మంది హిందువులు). 2000లో జర్మనీలో 90,000 మంది హిందువులు ఉన్నారు. [3] 2007లో బెర్లిన్‌లో 6,000 మంది హిందువులు నివసిస్తూ ఉన్నారు. [4] 2009 నాటికి, దిగువ సాక్సనీలో దాదాపు 5,000 మంది హిందువులు నివసిస్తున్నారు. [5]
REMID గణాంకాల ప్రకారం, [6] 2017లో జర్మనీలో 1,30,000-1,50,000 మంది హిందువులు ఉన్నారని అంచనా. వారిలో దాదాపు 42,000–45,000 మంది శ్రీలంక తమిళులు ; 60,000–80,000 మంది భారతీయులు; 7,500 పైచిలుకు మంది శ్వేతజాతీయులు, ఇతరులు; 7,000–10,000 మంది ఆఫ్ఘన్ హిందువులు.
దేవాలయాలు
మార్చు-
శ్రీ ముత్తుమారియమ్మన్ దేవాలయం.
-
బ్రిట్జ్ బ్లాష్కోలీ శ్రీ మయూరపతి మురుగన్ ఆలయం.
-
హామ్‌లోని శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం.
శాఖలు
మార్చుఇస్కాన్
మార్చుజర్మనీలోని మొదటి హరే కృష్ణ దేవాలయాన్ని 1970లో హాంబర్గ్‌లో నిర్మించారు. ఇస్కాన్ గురువు సచ్చిదానంద స్వామి భగవద్గీతను జర్మన్ భాషలోకి అనువదించాడు. [7]
బాలినీయ హిందూమతం
మార్చుజర్మనీలో దాదాపు 700 బాలినీయ హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. [8] హాంబర్గ్‌లోని ఎథ్నాలజీ మ్యూజియం ముందు ఒక దేవాలయం ఉంది. రెండవది, బెర్లిన్‌లోని ఎర్హోలుంగ్‌స్పార్క్ మార్జాన్‌లో ఉన్న పురా త్రి హిత కరణ. [9] [10] పురా త్రి హిత కరణ అనేది పార్క్‌లోని బాలినీయ గార్డెన్‌లో ఉన్న హిందూ దేవాలయం. బాలినీయ వాస్తు శైలిలో ఇండోనేషియా వెలుపల నిర్మించిన హిందూ దేవాలయాలలో ఇది ఒకటి.
ప్రసిద్ధ జర్మన్ హిందువులు
మార్చు- క్లాడియా సిస్లా, బాలీవుడ్ నటి.
- వాల్తేర్ ఈడ్లిట్జ్, రచయిత, కవి, ఇండాలజిస్ట్
- హంసదుత్త స్వామి
- తల్లి మీరా
- శివశ్రీ పాస్కరకురుక్కల్
- మథియాస్ రస్ట్
- సదానంద
- సచినందన స్వామి
మూలాలు
మార్చు- ↑ "Religionszugehörigkeiten in Deutschland 2017".
- ↑ "Religionen & Weltanschauungsgemeinschaften in Deutschland: Mitgliederzahlen – REMID – Religionswissenschaftlicher Medien- und Informationsdienst e.V." (in జర్మన్). Retrieved 2021-07-12.
- ↑ Martin Baumann (April 2001). "Disputed Space for Beloved Goddesses". Martin Baumann (2001 International Conference at LSE). Archived from the original on 14 జూన్ 2016. Retrieved 24 July 2012.
- ↑ "Construction Starts on Berlin's First Hindu Temple". Spiegel Online. Germany. 11 February 2007.
- ↑ "A New Hindu Temple for Germany". Spiegel Online. Germany. 23 March 2009.
- ↑ "Mitgliederzahlen: Hinduismus – REMID – Religionswissenschaftlicher Medien- und Informationsdienst e.V." (in జర్మన్). Retrieved 2021-07-12.
- ↑ "First translation of the Gita". The Hindu (in Indian English). 2017-11-11. ISSN 0971-751X. Retrieved 2021-07-12.
- ↑ "Feature: The Hindu Diaspora within Continental Europe". Hinduism Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-01-01. Retrieved 2021-07-12.
- ↑ Blogger, Balinese (2008-09-28). "Bali "The Truly Of Paradise": The First Temple in Hamburg Germany". Bali "The Truly Of Paradise". Retrieved 2021-07-12.
- ↑ "Balinese Hinduism in Germany". Bali blogs.
{{cite web}}
: CS1 maint: url-status (link)