జలతరంగం

సంగీత వాయిద్యం

జలతరంగం (ఆంగ్లం: Jal Tarang; హిందీ: जल तरंग, ఉర్దూ: جل ترںگ), Jaltarang, Jal-tarang, Jal-yantra, లేదా Jalatarangam) ఒక ప్రాచీనమైన వాద్య పరికరము. దీనియొక్క విశిష్టమైన శబ్దతరంగాలు వీనులవిందుచేస్తాయి. జలతరంగం అనగా జలం (నీరు) నుండి పుట్టిన తరంగాలు ("waves in water").

జలతరంగం గిన్నెలు

జలతరంగం ప్రాచీన తూర్పు భారతదేశంలో ప్రాచీనకాలం నుండి ఉపయోగంలో ఉన్న వాద్యమని కొందరు విద్వాంసుల అభిప్రాయం. ఇది ప్రాచీన సంగీత పారిజాతం (Sangeet Parijaat) గ్రంధంలో ఘన వాద్యంగా పేర్కొనబడింది. సంగీతసారం (SangeetSaar) లో 22 పాత్రలతో వాయించే జలతరంగం ఉత్తమమైనదిగాను, 15 పాత్రలతో వాయించేది మాధ్యమికమైనదిగాను పేర్కొనబడింది. వివిధ పరిమాణాలు కలిగిన పాత్రలు ఇత్తడి గాని పింగాణితో గాని చేయబడి వుంటాయి. ఆధునిక కాలంలో పింగాణీతో తయారైన 16 పాత్రల జలతరంగం ఉపయోగిస్తున్నారు. ఈ పాత్రలను అర్ధచంద్రాకారంలో అమర్చి వాద్యకారునికి అందుబాటులో ఉంచుతారు. పాత్రలలో నీటితో వివిధ స్థాయిల వరకు నింపుతారు. వాద్యకారుడు పాత్రలను చెక్క కర్రతో మెల్లగా తాకినప్పుడు వివిధ స్వరాలు పలుకుతాయి. అయితే స్వర రాగ బద్ధమైన సంగీతాన్ని పండించడానికి విశిష్టమైన అనుభవం చాలా అవసరం.

డా.లాల్‌మణి మిశ్రా రచించిన 'భారతీయ సంగీత వాద్యాలు' (Bharatiya Sangeet Vadya) పుస్తకంలో జలతరంగం గురించి పేర్కొన్నారు.

మూలాలు

మార్చు

భారతీయ సంగీత వాద్యాలు. భారతీయ జ్ఞానపీఠ్, క్రొత్తఢిల్లీ.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జలతరంగం&oldid=3887077" నుండి వెలికితీశారు