జలప్రళయం కధలు - రెండవ భాగం

  • దెదాంగ్ (Dedong ) నది గ్రామాలను ముంచెత్తింది. ఉత్తర కొరియా ప్యోంగ్యాంగ్ (Pyongyang) లో ఒక వృద్ధుడు పడవ నడుపుతూ ఒక దుప్పుని, సర్పాన్ని, ఒక బాలుడునిరక్షించాడు. వారిని ఒడ్డుకు చేర్చాడు. అనాథయైన ఆ బాలుడు వృద్దుడికి దత్తుడయ్యాడు. ఒక రోజు దుప్పి ఆ వృద్ధుడికి గుప్త నిధి చూపించింది. వృద్ధుడు ధనవంతుడయ్యాడు. దత్తుడు దుష్టుడిగా పెరిగి తండ్రిలాంటి వౄద్ధుడిపై దొంగతనం నేరం మోపి జైలుపాలు చేస్తాడు. సర్పం కటకటల్లో ఉన్న వృద్ధుడికి కరిచింది. అది తిరిగి వచ్చి ఔషధాన్ని తీసుకు రాగా దాన్ని లేపనంగా గాయంపై పూస్తాడు. గాయం మానిపోతుంది. మర్నాడు ఉదయం మునసబు భార్యను సర్పం కాటువెసినట్లు తెలుసుకొని, ఆమెను రక్షించడానికి వెళతాడు. ఆమెను రక్షిస్తాడు. వృద్ధుడు నిర్దోషిగా బయటకొస్తాడు, దత్తుడు కటకటాల్లోకి వెళతాడు.
  • ఒక అనాథ బాలుడు చాలా వేగంగా పెరిగి మహాబలుడై ఐరన్ షూస్ అనే పేరు పొంది, ప్రయాణమై - అధిక శ్వాసము గల ముక్కు-శ్వాస, కొండలను నమిలిన పొడవు-పలుగొర్రు, మూత్రంతో నదులను చేసిన జలపాతం అను తోటి వింతైన మనుష్యుల వద్దకు వెళ్ళాడు. వారు ఒక వృద్ధ స్త్రీ వద్దకు వెళ్ళగా, ఆమె వారిని తన ఇంటిలో బంధించింది. ఆమె - తన నలుగురు కుమారులు మనుష్యుల రూపంలో ఉన్న పులులు అని తెలుసుకొంటారు. వృద్ధ స్త్రీ- ఆమె పిల్లలు బంధించడిన నలుగురిని కాల్చేసి తినాలనుకుంటారు. కాని ముక్కు శ్వాస గదిని చల్లగాలితో నింపేస్తాడు. మర్నాడు ఆ వృద్ధ స్త్రీ ఆ శక్తిమంతులకి పైన్ చెట్లు తీసుకొచ్చే పోటీ పెడుతుంది. వారు పైన్ చెట్లు తీసుకొస్తుండగా ఆమె కుమారులు వాటిని ఒకదాని పై ఒకటి అమర్చసాగారు. పని పూర్తి అయిన తర్వాత ఆమె ఆ దుంగలకు నిప్పు అంటించింది. జలపాతం వెంటనే నీటితో ఆ నిప్పుని ఆర్పివేసి, ఆ పులులు కొట్టుకుపోయేలా వరద సృష్టించాడు. ముక్కు శ్వాస ఆ నీటిని ఊది మంచుగా మార్చాడు. ఐరన్ షూ స్కేటింగ్ చేసి ఆ పులుల తలలను తన్నాడు. పొడవు రేకు మంచును బ్రద్దలగొట్టి ముక్కలను దూరంగా పడవేశాడు.
  • ముండా (మధ్య భారతదేశం) తెగ వారి నమ్మకం ప్రకారం సింగ్ బొంగ అను దేవుడు మట్టినుండి మనుష్యులను సృష్టించాడు. కాని సోమరితనాన్ని, దుష్టత్వాన్ని, అల్లరిని అలవర్చుకొన్న మనుష్యులను చూచి దేవుడు ఆగ్రహించి స్వర్గం నుంచి అగ్నివంటి నీరును ప్రవహింపజేసి అందరినీ ముంచేశాడు. కాని ఒక్క అన్నా చెల్లెలు మాత్రం తిరిల్ చెట్టు కాండంలో దాక్కొని రక్షింపబడ్డారు. తరువాత దేవుడు లుర్బింగ్ అను సర్పాన్ని సృష్టించగా, అది తన ఆత్మను ఇంద్రధనస్సు వలే ఊది ఆ ప్రళయాన్ని ఆపింది. నేడు ముండాలు ఇంద్రధనస్సుని ఈ సర్పంగా కొలుస్తారు.
  • శాంతల్ (బెంగాల్) ప్రజల నమ్మకం ప్రకారం పిల్చు బుద్ధి, పిల్చు హరాం అను మొదటి స్త్రీ పురుషులు యవ్వనంలోకి అడుగుపెట్టేసరికి, 7 రోజుల పాటూ అగ్ని వర్షం సంభవించింది. అది సమాప్తమయ్యేవరకూ వారిద్దరూ రాతి గుహలో దాక్కొని రక్షింపబడ్డారు.

వర్ణవ్యవస్త ఏర్పడిన క్రొత్తలో హెరె పర్వతంపై నివసించే మర్నడీసులు తృణీకరించబడ్డారు. ఆ తెగకు చెందిన అంబిర్ సింగ్, బిర్ సింగ్ అనువారు ఇతర తెగలవారిని నాశనం చేయమని దేవుడికి ప్రార్థించగా, అగ్ని పడి సగం జనాభా నాశనమైనది. ఈ ప్రళయానికి కారణం వీరిద్దరే అని కిష్కు రాజ్ అను రాజు తెలుసుకొని వారిద్దరిని పిలిపిస్తాడు. వారు వాస్తవాన్ని చెప్పి అగ్నిని ఆపేశారు. మర్నడీసులు అప్పటినుండి రాజుల సంపదలకు సంరక్షకులుగా నియమింపబడ్డారు. ఖోజ్ కమన్ కు చెందిన ప్రజలు దేవుడికి కోపం తెప్పించారు. అందుకు థాకుర్ జు అను దేవుడు అగ్ని వర్షాన్ని సృష్టించగా హరదాత పర్వతంపై గుహలో తలదాచుకొన్న ఇద్దరు తప్ప మిగిలినవారంతా నాశనమైయ్యారు.

  • హో (నైరుతి బెంగాల్) ప్రజల నమ్మకం ప్రకారం మొదటి మానవులు విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు కలిగియుండి జీవిస్తుండగా ఆగ్రహించిన సిర్మా థాకుర్ (లేదా సింగ్ బొంగ) అను దేవుడు వారిలో 16 మందిని తప్ప అందరినీ నాశనం చేశాడు.
  • బహనార్, కొచిన్ చైనా ప్రజల నమ్మకం ప్రకారం ఓ గ్రద్ధ ఒకసారి ఒక పీతతో దెబ్బలాడి ఆ పీత పెంకు పై బెజ్జం పొడిచింది. ఆగ్రహించిన పీత సముద్రాలు, నదులు ఆకాశమంత ఎత్తున పొంగేటట్లు చేసింది. ఒక అన్నా చెల్లెలు పెద్ద పడవలో సమస్త జంతువుల జంటలను తీసుకొని, 7 రోజుల పాటూ తప్పించుకోసాగారు. కోడి కూత వినపడగానే ప్రళయం సమాప్తమైనదని వారికి అర్ధమైంది. అన్నిటినీ నేలపై దింపారు. ఏం చెయ్యాలో తెలియక వారిద్దరూ పడవలో తెచ్చుకొన్న ఆహారాన్ని తినేశారు. అంతలో ఒక నల్ల చీమ వారి వద్దకు రెండు వరి గింజలు తెచ్చింది. ఆ గింజలను భూమిలో నాటారు. మర్నాడు ఉదయానికి ఆ ప్రాంతమంతా వరి పంటతో నిండిపోయింది.
  • కమ్ము (ఉత్తర థాయ్ లాండ్) ప్రజల నమ్మకం ప్రకారం ఒక అన్నా చెల్లెలు ఒక ఎలుక వెదురు గెడకు తొర్ర పెట్టడం చూశారు. ఆ ఎలుక వారిద్దరికి రాబోయే జలప్రళయం గురించి హెచ్చరించి ఒక డబ్బాలో దాక్కొని రక్షించుకోమంటుంది. జల ప్రళయం సంభవించగా వారిద్దరూ ఒక డబ్బాలో దాక్కొని మూత వేసేసుకున్నారు. ధనవంతులు మాత్రం తెప్పలు చేసుకొని వాటిపై ఎక్కారు. భీకరమైన అలల వల్ల ఆ తెప్పలు తిరగబడి ధనవంతులంతా చనిపోయారు. జల ప్రళయం ఆగిపోయిన తర్వాత నేల కనిపించింది. డబ్బాలోంచి బయటకొచ్చి నేలమీద కాలుపెట్టారు. సహచరులు ఎవ్వరూ కనిపించలేదు. ఒక కోకిల "అన్నా చెల్లెలు ఇద్దరూ ఆలింగనం చేసుకోవచ్చు" అని పాట పాడింది. ఆనా చెల్లెలు ఇద్దరూ కోకిల చెప్పినట్లు చేయగా 7 సంవత్సరాల తర్వాత వారికి ఆనప కాయ వలె ఒక కుమారుడు జన్మించాడు. ఆ కాయలోంచి కొన్ని శబ్దాలు రాగా, దాన్నికి చిన్న రంధం చేసారు. ఆ రంధ్రంలోంచి కమ్ము, థాయ్, వెస్టనర్, చైనీయులు వంటి ఎన్నో జాతులవారు ఉద్భవించారు. వీరు మొదట మాట్లడలేక ఒక చెట్టు కాండంపై కూర్చున్నారు. ఆ కాండం విరిగడంతో వారు గట్టిగా అరిచారు. అప్పటినుండి మాట్లాసాగారు, వ్రాత తీరులను నేర్చుకొన్నారు.
  • అండమాన్ దీవులు (బంగాళా ఖాతం) ప్రజల నమ్మకం ప్రకారం పులుగ నే దేవుడు దుష్టులుగా మారిన మానవులను నాశనం చేయదలచి జల ప్రళయాన్ని సృష్టించాడు. తాటి బొండులపై ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు తప్ప అంతా నాశనమైయ్యారు. పులుగ తిరిగి పక్షులను, జంతువులను సృష్టించాడు. చనిపొయినవారిలో ఒకని ఆత్మ పల్లెంక పక్షి (Kingfisher) రూపంలో పులుగ యొక్క అగ్నిలోంచి ఒక నిప్పు కణాన్ని దొంగిలించడానికి ప్రయత్మచేయగా, నిప్పు కణం తిరిగి పులుగ పై పడింది. పులుగు లేచి నిప్పు కణాన్ని పక్షి పై విసిరేశారు. గురి తప్పిన నిప్పు కణం ఈ నలుగురి మనుష్యుల దగ్గర పడింది. వారు తమ శరీరాలను వెచ్చబరచుకొన్న తరువాత, పులుగునే చంపడానికి పూనుకొన్నారు. ఆగ్రహించిన పులుగు "మానవుల దుష్టత్వం వల్లనే జలప్రళయం వచ్చిందని, మరొకసారి కూడా వస్తుందని" అని వాళ్లని హెచ్చరించాడు. సృష్టికర్త మానవులతో మాట్లాడటం అదే ఆఖరిసారి.
  • జువాంగ్ (Zhuang), చైనా వారి నమ్మకం ప్రకారం ఉరుము దేవుడు బుబొ (Bubo) అను వ్యక్తిని తన పంటల్లో భాగం ఇమ్మంటాడు. "పంటలో ఏ భాగం కావాలి?" అను బుబొ అడుగగా "నేను పైన ఉంటాను కనుక నాకు నీ పంటలో పైభాగం కావాలి" అని ఉరుము దేవుడు అంటాడు. బుబొ తెలివిగా ఆ సంవత్సరం కర్రపెండలం పండిస్తాడు. ఉరుము దేవుడు కోత కాలానికి రాగా ఆకులు మాత్రమే దక్కుతాయి. రెండవ సంవత్సరానికి పంటలో క్రింద భాగం కావాలంటాడు ఉరుము దేవుడు. బుబొ తెలివిగా వరిని పండిస్తాడు. కోత కాలంలో దేవుడుకి వరి గడ్డి వేళ్ళు మాత్రమే దక్కుతాయి. ఉరుము దేవుడు కోపగించి పంటలో క్రింది, పైన భాగాలు రెండూ కాలావంటాడు. బుబొ మూడొ సంవత్సరం జొన్న పండిస్తాడు. కోత కాలంలో ఉరుము దేవుడు రాక ముందు బుబో, తన పిల్లలతో కలిసి జొన్న పొత్తులన్నీ కోత కోసి ఇంట్లో దాచేస్తాడు. ఆగ్రహించిన ఉరుము దేవుడు తన తమ్ముడైన డ్రాగన్ రాజుతో ఈ విషయం చెబుతాడు. బుబొ తన ప్రజలతో కలిసి దేవలోక నది ద్వారాలు బ్రద్దలగొడతాడు. కాని ఉరుము దేవుడు వాటిని మూసేస్తాడు. బబొ డ్రాగన్ రాజు దగ్గరకెళ్ళి నీటిని అడుగగా, డ్రాగన్ రాజు నిరాకరిస్తాడు. బుబొ తన ప్రజలను డ్రాగన్ రాజు గెడ్డం పీకేసేలా చేస్తాడు. బాధ తట్టుకోలేక డ్రాగన్ రాజు పొలాలకు నీళ్ళు ఇచ్చేస్తాడు. మూడవ సంవత్సరం బుబొ ఉరుము దేవుడితో పోరాడటానికి బాచి అను పర్వతమెక్కి భూమిని స్వర్గాన్ని కలిపే సూర్యచంద్ర వృక్షం ఎక్కుతాడు. ఉరుము దేవుడి సైనికుల్లో ఒకడైన కిగావో

బుబొ దైవ సముద్రాన్ని ఈది ఉరుముదేవుడిని చేరి నీరు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తానని హెచ్చరిస్తాడు. మూడు రోజుల్లో నీరు ఇస్తానని ఉరుముదేవుడు మాట ఇస్తాడు. బుబొ అక్కడ నుండి నిష్క్రమించగానే, ఉరుముదేవుడు మాట తప్పి బుబొని అంతం చేయాలనుకుంటాడు. ఈ విషయం కిర్గావొ బుబొకు చేరవేస్తాడు. బుబొ తన ఇంటి కప్పు మీద చెఱువునుండి తెచ్చిన నాచుని పరుస్తాడు. ఉరుము దేవుడు భయంకరమైన తుఫాను సృష్టించి బుబొ గృహాన్ని త్రొక్కివేయబోయి బుబొ చేత బంధింపబడతాడు. బుబొ తన పిల్లలతో ఉరుముదేవుడికి ఏమీ ఇవ్వొద్దని చెప్పి, తన భార్యతో బయటకు వెళతాడు. ఉరుము దేవుడు తన తెలివితో పిల్లలను మభ్యపెట్టి తప్పించుకుంటాడు. వెళుతూ ఆ పిల్లలకు తాను సృష్టించబోయే జలప్రళయాన్ని గురించి చెప్పి, తన దంతాన్ని పీకి వారికి ఇచ్చి, దాన్ని భూమిలో నాటమని చెప్పి వెళిపోతాడు. ఉరుము దేవుడు చెప్పిన ప్రకారం పిల్లలు ఆ దంతాన్ని నాటగా, అది ఒక రాత్రికే రాకాసి ఆనప తీగగా ఎదిగి, ఇల్లు పరిమాణంలో కాయ కాస్తుంది. జల ప్రళయం సంభవిస్తుంది. ఆ పిల్లలు (అన్నా - చెల్లెలు) ఇద్దరూ ఆ ఆనపకాయకు రంధ్రం పొడిచి, డొల్లగా చేసి అందులోకి దూరిపోతారు. బుబొ తన గొడుగును తిరగ బెట్టి ఆ నీటిలో పడవలా వాడుకుంటాడు. ఏ మాత్రం ఆత్మ స్తైర్యం కోల్పోకుండా ఉరుము దేవుడితో పోరాడతాడు. ఉరుము దేవుడు తన సోదరుడైన డ్రాగన్ రాజుతో కలిసి ఆకాశమంత ఎత్తు ఉవ్విన జల ప్రళయాన్ని వెంటనే ఆపేస్తాడు. బుబొ తన గొడుగుతో పాటూ బాచి కొండపై పడి ముక్కలయ్యాడు. తన గుండె మాత్రం ఆకాశం పొరపై పడి అది బుధ గ్రహం లా మారింది. ప్రళయం సమాప్తమైన తర్వాత ఆనా చెల్లెలు ఇద్దరూ బయటకొచ్చారు. వారికి మానవులెవ్వరూ కనిపించలేదు. వారికి ఒక తాబేలు ఎదురుపడి, వారిద్దరినీ వివాహం చేసుకోమంటుంది. "సరే.. కాని నిన్ను చంపుతాం. నువ్వు మళ్ళీ బ్రతికితే మేం పెళ్ళి చేసుకుంటాం" అని అంటారు. వారు ఆ తాబేలును చంపగా అది తిరిగి బ్రతికి నవ్వి వెళిపోతుంది. ఒక వెదురు చెట్టు తాబేలులాగే అంటుంది. వారు వెదురును నరకగా అది తిరిగి బ్రతుకుంది. బుధగ్రహం రూపంలో ఉన్న తండ్రి "మీరిద్దరూ వేరు వేరు కొండలపైకి వెళ్ళి, దుంగలు వెలిగించండి. రెండు పొగలు కలిస్తే మీరు పెళ్ళి చేసుకోండి" అని అంటాడు. వారు తండ్రి చెప్పినట్లు చేయగా రెండు పొగలు కలిశాయి. ఆ విధంగా అన్నా చెల్లెలు పెళ్ళి చేసుకొన్నారు. వారిద్దరికీ ఒక మాంసం ముద్ద జన్మించింది. ఏం చేయాలో అర్ధం కాక ఆ ముద్దను ముక్కలు ముక్కలుగా చేసి విసిరేశారు. ఆ ముక్కలు స్త్రీలు, పురుషులుగా మారాయి.

  • సుయి (Sui) (దక్షిణ గుజౌ, చైనా, దులియు నదుల ప్రాంతాలు) ప్రజల నమ్మకం ప్రకారం సూర్య పర్వతం మీద క్షియాంగ్ (Xiang), య (Ya) అను భార్యా భర్తలు జీవించేవారు. ఒకసారి కుండపోత వర్షం తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడింది. వెదురు చిగురు కోసం దానివైపు క్షియాంగ్ వెళ్ళుతూ ఒకచోట ఒక గ్రద్ద ఓ చిన్న ఎర్ర సర్పాన్ని తీసుకెళుతోంది. క్షియాంగ్ తన బుట్టను పైకి విసిరేయగా ఆ గ్రద్ద సర్పాన్ని విడిచిపెట్టి ఎగిరిపోయింది. ఆ సర్పం అదృశ్యమై, పర్వతాన్ని మంచు కప్పింది. ఒక బంగారు డ్రాగన్ కృతజ్ఞతతో "నా కూతుర్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. అందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాను" అని ఒక బంగారు డ్రాగన్ చెప్పినట్లు క్షియాంగ్ కు కల వచ్చింది. క్షియాంగ్ భార్యకు కూడా అదే కల వచ్చింది. క్షియాంగ్ తన భార్యా పిల్లల్ని తోడ్కొని కల వచ్చిన ప్రకారం, మూడు పర్వతాలను దాటి వెళ్ళాడు. మార్గంలో ఒక అందమైన అమ్మాయి ఎదురుపడి వారిని ఒక అద్భుతమైన చెఱువు వద్దకు ఆహ్వానించింది. వారు అక్కడే స్థిరపడి చెఱువులోని చేపలు తినడంవల్ల వృద్ధాప్యాన్ని వీడి తిరిగి యవ్వనాన్ని పొందారు. క్షియాంగ్ గ్రామానికి తిరిగి వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ ఈ చెఱువు దగ్గరకి ఆహ్వానించాడు. వారందరూ కూడా యవ్వనాన్ని పొందారు. ఆప్పటినుండి ఆనందంగా జీవించసాగారు. అయితే ఒకడి అత్యాశ వల్ల చెఱువును కలుషితమై, చేపలు మరణించసాగాయి. క్షియాంగ్ తో మరణ దశలో ఉన్న ఒక చేప తనపై జొన్న పిండిని అద్దమని, ఒక చెక్క ఇల్లు నిర్మించుకోమంటుంది. దాని ప్రకారం క్షియాంగ్, ఇతర ప్రజలు చెక్క ఇళ్ళు నిర్మించుకొంటారు, ఒక్క ఆ దుష్టుడు తప్ప. ఆ చేప ఎర్ర సర్పంగా మారి వస్తువులన్నిటినీ ఇళ్లలో పెట్టుకోమంటుంది. జలప్రళయం రానే వచ్చింది. బంగారు డ్రాగన్ తన శరీరాన్ని కదిలించగా, సూర్య పర్వత పైభాగం ఆకాశంలా మారింది. దుష్టుడి శరీరం రాళ్ళ క్రింద కప్పబడింది. ఇతరులు ప్రవాహంలో కొట్టుకుపోయి చేప ఆకారంలో రాయిని చెక్కారు. నేడు ఈ శిల, సూర్య పర్వతం క్రింద భాగం షుయిలాంగ్ (Shuilong) వద్ద కనిపిస్తాయి.
  • షాన్ (Shan), బర్మా వారి నమ్మకం ప్రకారం పూర్వం మధ్య ప్రపంచంలో గాని, క్రింద ప్రపంచంలో గాని రాజ వంశాలు లేవు. వెదురు గెడలను చీల్చుకొని జంతువులు బయటకొచ్చి జీవించడానికి అడవుల్లోకి వెళ్ళిపోయాయి. Hpi-pok, Hpi-mot అను రాజు, రాణి స్వర్గం నుండి భూమికి దిగి వచ్చి కంబోడియా నది ఒడ్డున ఉన్న మాంగ్ హి అను ప్రదేశంలో స్థిరపడి షాన్ రాజ వంశస్తులకు పూర్వీకులైయ్యారు. ఎటువంటి బలి అర్పణలు చేయని ఈ దంపతులపై లింగ్ లాన్ అను తుఫాను దేవుడు ఆగ్రహించి మానవాళిని నాశనం చేయదలచి రాక్షస కొంగలను పంపాడు. అక్కడ ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వారందరినీ తినలేకపోయాయి. పంపబడిన రాక్షస సింహాలు కూడా వారిని తినలేకపోయాయి. అలాగే రాకాసి సర్పాలు కూడా వారి చేతిలో గాయాలపాలైయ్యాయి. మరింత ఆగ్రహించిన దేవుడు ఆ ప్రాంతానికి భయంకరమైన కరువు తెచ్చాడు. ప్రజలంతా తిండిలేక మరణించసాగారు. ఇతర మంత్రులను పిలిచి సమావేశపరచి మానవాళిని నాశనం చేయుటకు తన మంత్రివర్గంలో చెరువులు, సెలయేరులకు, జలచరాలకు డేవుడైన Hkang-hkak ను భూమ్మీదకు పంపిస్తాడు. Hkang-hkak లిప్ లాంగ్ ను ఒక ఋషిని కలిసి దేవుడు జలప్రళయాన్ని సృష్టించబోతున్నాడని, ఒక పడవ చేసుకొని, ఒక ఆవుని ఎక్కించుకొని తప్పించుకోవాలని, ఈ విషయం భార్యా పిల్లలకు కూడా చెప్పరాదని చెబుతాడు. లిప్ లాంగ్ విచారంగా తన ఇంటికి వెళ్ళి తన చిన్న కుమారుడిని ఎత్తుకొని ఏడిచాడు, జరుగబోయేది చెప్పలేకపోయాడు. రేవుకి వెళ్ళి కొద్ది రోజులపాటూ శ్రమించి పడవ నిర్మించుకొన్నాడు. ఇది చూచిన భార్యా పిల్లలు నిర్ఘాంతపోయారు, ఊరివారంతా నవ్వారు. జలప్రళయం వచ్చి సమస్త మనుష్యులను, జీవరాశిని నాశనం చేసింది. పడవలో ఆవుని ఎక్కించుకొన్న లిప్ లాంగ్ తన భార్యా పిల్లల శవాలను చూచి రోదించాడు. ఆ విధంగా షాన్ వంశం అంతమై ఆత్మలన్నీ స్వర్గంలో భవనాలకు వెళ్ళాయి. నీటిలో తేలుతూ సూర్య కాంతికి మెరుస్తున్న శవాలను తొలగించ దలచి తుఫాను దేవుడు సర్పాలను, 9999 పులులను పంపాడు. లెక్కలేని శవాలు ఉన్నందున అవి తినలేక అవి గుహల్లోకి వెళ్లిపోయాయి. ఆగ్రహంతో అగ్ని దేవుళ్ళను పంపాడు. వారి రాకతో భూమినంతా అగ్ని కప్పేసింది. ఇది గమనించిన ఋషి తన ఆవుని చీల్చి అందులోకి వెళ్లి ఆనపకాయ విత్తనాన్ని కనుగొన్నాడు. మరణించిన ఆవుని చూచి అగ్ని ఏడిచి వెళిపోయింది. ఋషి బయటకొచ్చాడు. జల దేవుడు చెప్పిన ప్రకారం ఋషి ఆనప విత్తనాన్ని భూమిలో నాటగా, అది కొండలమీదకు చెట్ల మీదకు పొదల మీదకు పాకింది. తుఫాను దేవుడు ఆనప తీగ సంరక్షణ కోసం ఒక తోటమాలిని పంపాడు. ఒక ఉదయం తోటమాలి వచ్చి దానికి ఎరువు వేశాడు. వర్షాకాలంలో అది మరింత ఎదిగి పెద్ద ఆనపకాయ కాసింది. తుఫాను దేవుడు మానవాళికోసం భూమిని సిద్ధం చేయాలని సవో పాంగ్ అను ఆకాశ దేవుడిని పంపాడు. సవో పాంగ్ వేడిని సృష్టించి భూమినంతా ఆరబెట్టాడు. తుఫాను దేవుడు పిడుగులతో కాయలను బ్రద్దలగొట్టాడు. ఒక ఆనపకాయనుండి మనుష్యులు బయటకొచ్చారు. మరో ఆనపకాయనుండి షాన్ వంశస్థులు బయటకొచ్చి "దేవుడా మేం ఏం చెయ్యాలి?" అను అడుగగా, దేవుడు "మీరు సామ్రాజ్యాలు పాలించాలి" అని అన్నాడు. ఇలా పిడుగుల వల్ల ఆనపకాయలు బ్రద్దలై, వాటిలోంచి పక్షులు, జంతువులు ఉద్భవించాయి.

మరో వెర్షన్ ప్రకారం పరిశుద్ధులైన ఏడుగురు పురుషులు, ఏడుగురు స్త్రీలు పెద్ద ఆనప కాయలోకి దూరి జల ప్రళయం నుండి బయటపడ్డారు. జల ప్రళయం సమాప్తమైన తర్వాత వారు బయటకొచ్చి విస్తరించారు.

  • ఫొర్మోసా (Formosa) పర్వత ప్రాంతంలో ట్సువొ (Tsuwo) అను తల వేటగాళ్ళు (head hunters) ఉండేవారు. ఈ తెగల వారు శత్రువుల తలలను నరికి విజయానికి గుర్తుగా వెదురు గెడలకు కట్టేవారు. జల ప్రళయం సంభవించినప్పుడు వారు నితకాయమ (Niitaka-yama) అను పర్వతం ఎక్కారు. ప్రళయం సమాప్తమయ్యే వరకూ అక్కడే ఉండి తర్వాత వారు దిగి ఎవరి దారిన వారు తోచిన దిక్కులవైపు వెళ్ళారు. వీరు కల్లోలంలో పర్వతమెక్కినప్పుడు దివిటీలను వెంట తీసుకెళ్ళడం మరచిపోయారు. ఫలితంగా అక్కడ చలికి జలుబుతో బాధపడ్డారు. పొరుగున ఉన్న కొండపైనుండి ఎవరొ తిలకిస్తున్నట్లు వారికి కనిపించింది. "ఆ మండుతున్న అగ్నిని ఎవరు తీసుకురాగలరు?" అని అనుకున్నారు. ఒక గొర్రె ఎదురుపడి "నేను తీసుకొస్తాను" అని ఈదుకుంటూ వెళ్ళి మండుతున్న అగ్ని త్రాడును తీసుకొస్తుండగా, నిస్సత్తువతో మునిగిపోయి, అగ్ని ఆరిపోయి ప్రయత్నం విఫలమైంది. వారు మరో జతువుని పంపగా అది అగ్నిని తీసుకురావడంలో సఫలమైంది.
  • బనున్, ఫోర్మోసా (Bunun, Formosa) ప్రజల నమ్మకం ప్రకారం చాలా రోజులు వర్షం పడింది. ఒక భారీ సర్పం నదికి అడ్డంగా పడుకోవడం వలన వరద సంభవించింది. ఎంతో మంది మునిగిపోయారు. మిగిలినవారు కొండపైకి ఎక్కారు. ఒక పీత ఆ సర్పం శరీరంలోకి చీలుకొని వెళ్ళగా, వరద ఆగిపోయింది.

ఒక రాకాసి పీత ఓ సర్పాన్ని మ్రింగాలని ప్రయత్నించింది. ఆ సర్పం సముద్రంలోకి తప్పించుకొనిపోగా జల ప్రళయం సంభవించి భూమినినంతా ముంచేసింది. బునన్ పూర్వీకులు ఉసాబేయ (Usabeya / Niitaka-yama), షింకాన్ (Shinkan) పర్వతాల పైకి చేరుకున్నారు. ప్రళయం తగ్గే వరకూ అక్కడే వుండి అడవి జంతువులను వేటాడుతూ జీవించసాగారు. ప్రళయం తగ్గిపోగా వారు క్రిందకొచ్చి నేలపాలైన తమ పంటలను చూచారు. కేవలం కొన్ని విత్తనాలు మాత్రమే మిగిలాయి. వారు విత్తనాలు నాటి మళ్ళీ పండిచుకున్నారు. జల ప్రళయం వల్ల పర్వతాలు, లోయలు ఏర్పడ్డాయి.

  • అమి, తూర్పు తైవాన్ ప్రజల నమ్మకం ప్రకారం ఒకసారి సుర అను బాలుడుని, నకావొ అను బాలికని, ఒక పందిని, ఒక కోడిని వెంటబెట్టుకొని కకుమోదన్ సపతర్రొకు అను దేవుడు, బుదైహబు అను దేవత తరాయన్ అను ప్రాంతానికి వచ్చారు. ఒకరోజు కబిత్, అక అను దేవుళ్ళు వేటకై వచ్చి పందిని, కోడిని చూచి ఆశపడ్డి వాటిని అడుగగా సపతరోకు అందుకు నిరాకరించాడు. కబిత్, అకాలు అందుకు ఆగ్రహించి మహాహన్, మరియారు, మరిమోకోషి, కొసోమతోర అను నాలుగు ఇతర సముద్ర దేవుళ్ళని పిలిచారు. వారు "ఐదు రోజుల్లో వచ్చే పౌర్ణమి నాడు సముద్రం భయంకరమైన శబ్దం చేస్తుంది. అప్పుడు నక్షాత్రాలు ఉండే పర్వతాలపైకి వెళ్ళిపోండి" అని కబిత్ అక లకు చెప్పారు. ఐదవరోజున వారిద్దరూ పర్వతం పైకి పారిపోయారు. సముద్రం పొంగిది. కుకుమోదన్, అతని భార్య, కంగారులో పిల్లలను మరచిపోయి ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కేశారు. అన్నా చెల్లెలు ఇద్దరూ నీటిలో తేలే చెక్క రోలు ఎక్కి క్షేమంగా రగసన్ కొండకు చేరుకున్నారు. ఒంటరిగా ఉన్న వారిద్దరూ పెళ్ళి చేసుకుని ముగ్గురు కొడుకులను, ముగ్గురు కుమార్తెలను కన్నారు. నకావొ మొదటిసారి గర్భం ధరించినప్పుడు, ఆమె చెవిలో ఒక ధాన్యపు గింజ పుట్టినది. ఆ సమయంలో వారిద్దరూ ఆ గింజను జాగ్రత్తగా కాపాడి మొక్కగా అభివృద్ధి చేసి క్రమేణా పండించారు.
  • ఒకసారి భూకంపాలు వచ్చి, కొండలు కూలి, సముద్రాలు పొంగి భూమి అంతా మునిగిపోసాగింది. ఒక అన్నా- ఇద్దరు చెల్లెలు చెక్క రోలు పై ఎక్కి దక్షిణ దిశన రరారన్ అను ప్రాంతంలో కుబురుగాన్ అను పర్వతానికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాలను గుర్తించడానికి చెల్లెళ్ళు దక్షిణం వైపు వెళ్ళగా, అన్న పశ్చిమం వైపు వెళ్ళాడు. ఎక్కడా నేల కనిపించకపోవడంతో వారు మళ్ళీ ఒక చోటకు చేరారు. జ్యేష్ట సోదరి అలసిపోయి కొండ ఎక్కలేక సొమ్మసిల్లి పడిపోయి రాయిగా మారిపోయింది. మిగిలిన ఇద్దరూ (ఒక అన్న, ఒక చెల్లి) తమ స్వగ్రామానికి తిరిగివెళ్ళిపోవాలని కొంత దూరం కాలి నడకన వెళ్ళసాగారు. చెల్లెలు అలసిపోయి అక్కడే పడిపోయింది. ఎక్కడికీ వెళ్ళలేక వారిద్దరూ అక్కడే కొన్ని రోజులు ఉండిపోయారు. వారిద్దరూ ఒంటరిగా కూర్చుని భవిష్యత్తులో పిల్లలు లేని వృద్ధాప్యం గురించి ఆలోచించి ఆందోళన పడి సాటి మానవుల తోడు లేనందున వారిద్దరూ పెళ్ళి చేసుకోడానికి నిర్ణయించుకొని ఉదయాన్నే సూర్యుడిని అడిగారు. నిస్సందేహంగా పెళ్ళి చేసుకోవచ్చు అని సూర్యుడు సమాధానమివ్వగా వారిద్దరూ ఆనందంగా పెళ్ళి చేసుకొన్నారు. కొన్ని నెలల తర్వాత భార్య ఉభయ లింగాలకు చెందని రెండు పిండాలకు జన్మనిచ్చింది. వారు కలత చెంది ఆ పిండాలను నదిలో పడేశారు. ఒక పిండం నేరుగా క్రిందకు వెళ్ళిపోయి చేపలకు పూర్వ జాతి అయ్యింది. మరో పిండం ఈదుతూ వెళ్ళి పీతల ఆవిర్భావానికి కారణమైంది. ఈ విషయం గూర్చి భర్త చంద్రుడిని అడుగగా, చంద్రుడు "వరుసకు ఆనా చెల్లెలు అయిన మీ ఇద్దరి మధ్య వివాహం నిషిద్ధం. ఎవ్వరూ లేరు కనుక కలిశారు. అయితే మీ ఇద్దరి మధ్య ఒక చాపను పెట్టుకోండి" అని సమాధానమిచ్చాడు. ఆ ప్రకారంగా భార్యా భర్తలు చేశారు. మరికొంత కాలానికి భార్య ఒక రాయికి జన్మనిచ్చింది. వారు చాలా కలత చెంది ఆ రాయిని నీటిలో పడవేయబోగా "అది రాయే కావొచ్చు. కాని దాన్ని జాగ్రత్త చేసుకోండి" అని చంద్రుడు చెప్పాడు. చెప్పిన ప్రకారం వారు ఆ రాయిని తీసుకొని పర్వతం క్రిందికి దిగి, తరువాత అరపనై అను ప్రాంతానికి చేరారు. కొంతకాలం తర్వాత భర్త చనిపోగా భార్య ఒంటరితనాన్ని ఓర్చుకోలేకపోయింది. త్వరలో ఆమెకు సంతానం కలుగుతుందని చంద్రుడు చెబుతాడు. ఐదు రోజుల తర్వాత ఆ రాయి పరిమాణం పెరిగి అందులోనుండి నలుగురు పిల్లలు (కొంతమంది పాదరక్షలతోను, మరికొంతమంది పాదరక్షలు లేకుండా) వచ్చారు. పాదరక్షలతో వచ్చిన వారు చైనీయూలకు పూర్వీకులైయ్యారు.

మరో నమ్మకం ప్రకారం అన్న చెల్లెలు చెక్క రోలు పై ఎక్కి జలప్రళయం భారినుండి తప్పించుకొని ఒక పర్వతానికి చేరారు. వారు పెళ్ళి చేసుకొని, పిల్లల్ని కని, కొండల నడుమ పాప్కాక్ అను గ్రామాన్ని స్థాపించారు.

  • బెనువా జకున్, మలై పెనున్సులా (Benua-Jakun, Malay Peninsula) తెగల నమ్మకం ప్రకారం మనం నిలబడే నేల సముద్రాన్ని కప్పిన చర్మం. పూర్వం పిర్మాన్ అను డేవుడు తన చర్మాన్ని ఒలిచేసుకుని జల ప్రళయాన్ని సృష్టించాడు. పిర్మాన్ స్త్రీ పురుషులను సృష్టించి వారిని పులై అను చెక్కతో చేసిన ఓడలో పెట్టాడు. ఆ ఓడ కొట్టుకుంటూ వెళ్ళి ఒక ప్రాంతాం వద్ద ఆగింది. ఆ స్త్రీపురుషులు ఓడకు ఉన్న చిన్న ఖాళీద్వారా బయటకొచ్చి నేల పై అడుగుపెట్టారు. దేవుడు ఇంకా సూర్యుడిని సృష్టిచలేదు కనుక అక్కడ పగలు లేకుండా చీకటిగా ఉంది. వెలుగు వచ్చిన తరువాత వారు రోఢోడెండ్రాన్ (Rhododendron) పొదలను, సంబ అను గడ్డి జాతి మొక్కలను చూచారు. "ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాం, పిల్లలు, మనుమలు లేకుండా?" అని అనుకున్నారు. వారిద్దరూ శారికంగా కలిశారు. కొంతకాలమైన తరువాత భార్య ఆమె కుడి మోకాలి నుండి మగ శిశువుకి, ఎడమ మోకాలినుండి ఆడా శిశువుకి జన్మనిచ్చింది. అందుకే ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలమధ్య వివాహాలు నిషిద్ధం అని అంటారు. ఈ పుట్టిన శిశువులనుండే ఇప్పటి మానవాళి ఆవిర్భవించింది.
  • కెలంతాన్, మాలై పెనిన్సులా (Kelantan, Malay Peninsula) వారి ప్రకారం ఒక సున్నతి వేడుకకు హాజరైన జంతువులు దెబ్బలాడుకున్నాయి. ఏనుగుల మధ్య, దున్నపోతులమధ్య, మేకలమధ్య, కుక్కల మధ్య, పిల్లుల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో జలప్రళయం వచ్చింది. కొండపైకి ఎక్కిన ఇద్దరు ముగ్గురు ఊడిగీడులు తప్ప సమస్త మనుష్యులు నశించిపోయారు. సూర్య, చంద్ర, నక్షత్రాలు వెలుగు కోల్పోయి అంతా చీకటైపోయింది. తిరిగి వెలుగు వచ్చిన తర్వాత అంతా జలమయమైపోయింది. మనుష్యుల ఇళ్ళన్నీ నాశనమైపోయాయి.
  • ఇఫుగావొ, ఫిలిప్పియన్స్ (Ifugao, Pillippeans) ప్రజల ప్రకారం భయంకరమైన కరువు వచ్చి నదులన్నీ ఇంకిపోయాయి. పెద్దవారు నీళ్లకోసం భూమిని త్రవ్వాలనుకున్నారు. మూడు రోజులు త్రవ్విన తరువాత జలఊట పైకి ఉబికింది. దాంతో త్రవ్వేవారిలో చాలమంది మునిగిపోయారు. నీరు రావడంతో ప్రజలు సంబరం జరుపుకొంచుండగా తుఫాను సంభవించింది. అందరూ కొండలవైపు పరుగుతీశారు. జలప్రళయంలో అందరూ మరణించగా అముయావ్వొ (Amuyao), కలవితాన్ (Kalawitan) అను కొండలపై విగాన్ (Wigan), బుగాన్ (Bugan) అను అన్నా-చెల్లెలు మాత్రమే మిగిలారు. జల ప్రళయం సమాప్తమైన తర్వాత విగాన్ తన సోదరి దగ్గరకి వెళ్ళాడు. మానవాళి నశించినందున, తిరిగి మానవాళి విస్తరించడానికి విగాన్ తన చెల్లెలు బుగాన్ తో రమించాడు. ఫలితంగా బుగాన్ ఒక శిశువుకు జన్మనిచ్చి నది ప్రవాహం వెంబడి సిగ్గుతో తన శిశువును తీసుకొని పరుగు తీసింది. మక్నాంగాన్ అను దేవుడు ఒక వృద్ధుడి రూపంలో దర్శనమిచ్చి ఆమెతో "నువ్వు, నీ సోదరుడు తిరిగి ప్రజలను సృష్టించాలి కనుక నీవు సిగ్గు పడుటలో అర్ధం లేదు" అని చెప్పాడు.

మరొక కథ ప్రకారం విగాన్, బుగాన్ అను అన్నా చెల్లెలు జల ప్రళయం నుండి తప్పించుకొని అముయాస్ (Amuyas) అను పర్వతానికి చేరారు.

  • కైంగాన్, ఇఫుగావొ (Kiangan Ifugao) వారి ప్రకారం హడాగ్ అను ఆకాశ లోకం నుండి విగాన్ (Wigan) మొదటి కుమారుడైన కబిగాత్ (Kabigat) భూలోకంలోకి కుక్కలతో అడుగుపెట్టాడు. ఆ సమయంలో భూమి బలపరుపుగా ఉంది. కుక్కలు అరచినా ప్రతిధ్వనులు వినపడకపోవడంవలన కబిగాత్ ఆలోచించి ఆకాశ లోకంలోకి వెళ్ళి పెద్ద వస్త్రాన్ని తీసుకొచ్చి నదులను సముద్రంలో కలవకుండా దానితో అడ్డుపెట్టాడు. హడాగ్ కు తిరిగి వెళ్ళి బొంగాబొంగ్ (Bongabong ) అను దేవుడితో తాను చేసింది చెప్పాడు. బొంగాబొంగ్ మూడు రోజులపాటూ జల ప్రళయాన్ని రప్పించి ఆపేశాడు. విగాన్ చెప్పిన విధంగా కబిగాత్ వరద ఆగిపోవడాన్ని నిర్మూలిచాడు. భూమిని ఆరబెట్టాలని ముంబా అన్ (Mumba'an) అను దేవుడిని పిలిచాడు బొంగాబొంగ్.
  • పిలిప్పీ దీవుల్లో దవవో (Dava) జిల్లాకు చైందిన అట (Atá) అను తెగ వారి నమ్మకం ప్రకారం జల ప్రళయం సంభవించి భూమినంతా ముంచేసింది. ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ మాత్రమే తప్పించుకొన్నారు. ఒక గ్రద్ద వారిని స్వగ్రామంలో దింపడానికి వచ్చింది. ఒక పురుషుడు నిరాకరించగా, మరో పురుషుడు. ఆ స్త్రీ ఆ గ్రద్ద పై ఎక్కి వారి స్వగ్రామమైన మపుల (Mapula) కు చేరారు.

మండయ (Mandayas) అను తెగలవారి నమ్మకం ప్రకారం జలప్రళయం సంభవించి అందరూ నశించారు ఒక్క గర్భిణీ తప్ప. ఆమె అనుకున్నట్టుగానే యుకాటన్ (Uacatan) అను కుమారుడిని కన్నది. అతడు పెరిగి పెద్దవాడై తల్లినే పెళ్ళాడగా, వారి నుండి మండయ తెగలవారు ఆవిర్భవించారు.

  • పిలిప్పియన్ దీవుల్లో తింగుఇయన్ తెగల నమ్మకం ప్రకారం కబోనియన్ అను దేవుడు భూమిని జలప్రళయంలో ముంచేశారు. అగ్ని వెదురు గెడలో, రాయిలో, ఇనుములో దాగుంది. మనుష్యులు తర్వాత అగ్నిని ఎలా బయటకు తీయాలో నేర్చుకొన్నారు.
  • సుమత్ర దీవుల్లో బతక్ అను తెగల నమ్మకం ప్రకారం ఒకప్పుడు భూమి నాగ పడోహ (Naga Padoha) అను భారీ సర్పం కొమ్ములపైన ఉంది. భూమి భారాన్ని మోయలేక ఆ సర్పం భూమిని సముద్రంలోకి విసిరేసింది. ఆ భూమిని అగాధం నుండి వెనక్కు తీసుకురావడానికి బతర గురు (Batara Guru) అను దేవుడు తన కుమార్తె అయిన పుతి-ఒర్ల-బులాన్ (Puti-orla-bulan) ని పంపుతాడు. ఆమె తెల్ల గుడ్లగూబను, కుక్కను తోడ్కొని క్రిందికి వచ్చింది. కాని వారికి ఎక్కడా విశ్రాంతి ప్రదేశం కనిపించలేదు. బతర గురు బకర్ర పర్వతాన్ని క్రింద పడేశాడు. అందులోనుండి సకల ప్రదేశాలు ఉద్భవించాయి. పుతి-ఒర్ల-బులాన్ కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరినుండి మానవ జాతి ఉద్భవించింది. తరువాత భూమి సర్పం తల మీద పెట్టబడింది. అందుకు దేవుడికి సర్పానికి మధ్య నిరంతర శత్రుత్వం ఉండేది. బతర గురు తన కుమారుడైన లయాంగ్ మందిని పంపి ఆ సర్పం చేతులను, కాళ్ళను బంధింపజేశాడు. అయితే ఆ పాము విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు భూమిని సముద్రంలో పడవేస్తే, భూమి బ్రద్దలైతే, మనుష్యులు స్వర్గానికి గాని, కాలుతున్న గంగాళం (Cauldron) లో గాని పడవచ్చు. సూర్యుడు మన ప్రపంచానికి దగ్గరగా వచ్చి, అతని అగ్నిని గంగాళం అగ్నిలో జత చేసి, భౌతిక సృష్టిని లీనపర్చుకొంటాడు.

మరో కథ ప్రకారం భూమి అంతా పాపంతో నిండిపోయినప్పుడు దెబాత (Debata) అను దేవుడు జలప్రళయాన్ని సృష్టించాడు. మనుష్యులలో మిగిలిన ఒక స్త్రీ పురుషుల జంట మాత్రం కొండపైన తలదాచుకొన్నారు. దారానికి ఒక మట్టి ముద్దను అంటించి క్రిందకు పంపాడు. ఆ దంపతులు ఆ మట్టిముద్ద పైకి ఎక్కారు. వారి సంతానం విస్తరించగా ఆ మట్టి ముద్ద పరిమాణం పెరిగి తిరిగి భూమిలా మారింది.

  • నియాస్, పడమర సుమత్ర (Nias, an island west of Sumatra) వారి నమ్మకం ప్రకారం పర్వతాలు తమ తాము ఎవరు ఎత్తో అన్న విషయం మీద వాగ్వివాదమాడుకున్నాయి. చిరాకుతో బలుగ లువొమేవొన (Baluga Luomewona) అను కొండల పూర్వీకుడు ఒక దువ్వెన సముద్రంలోకి విసిరి అలలు ఎగసేటట్లు చేశాడు. జల ప్రళయం ఒక్క రెండు మూడు పర్వతాలను తప్పించి, అన్నింటినీ ముంచేసింది. పాడి పశువులతో ఈ పర్వతాలపైకి తప్పించుకొన్న మనుష్యులు మాత్రమే రక్షించబడ్డారు.
  • ఎంగానో, పశ్చిమ సుమత్ర దీవి (Engano (an island west of Sumatra) ప్రజల నమ్మకం ప్రకారం జలప్రళయంలో ద్వీపం మునిగిపోయింది. మనుష్యులంతా మరణించారు, ఒక్క స్త్రీ తప్ప. కారణం ఆమె జుత్తు ముండ్ల చెట్టుకు చిక్కుకొన్నది. జల ప్రళయం ఆగిపోయింది. ఆమె చెట్టు దిగి వచ్చి ఆకలిగొని, చేపలకోసం సముద్ర గట్టుకి వచ్చింది. అక్కడ ఎన్నో శవాలు కనిపించాయి. ఒక చేప అక్కడ తిరుగుతూ కనిపించింది. ఆమె చిన్న రాయి తీసుకొని దాన్ని కొట్టింది. ఆ రాయి ఒక శవానికి తగిలింది కాని ఆ చేప తప్పించుకొన్నది. ఆమె కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగా ఒక మనుష్యుడు ఆమెకు ఎదురుపడటం చూచి ఆశ్చర్యపడింది. "ఎవరో నా మృత దేహాన్ని తట్టుట వలన లేచాను" అని ఆమెతో అతడు చెప్పాడు. అంతట వారిద్దరూ మిగిలిన వారందరినీ తట్టి లేపారు.
  • దుసున్, బ్రిటీష్ నార్త్ బొర్నియొ (Dusun, British North Borneo) ప్రజల నమ్మకం ప్రకారం కంపాంగ్ తుడు అనే తెగలో కొందరు కంచె నిర్మించడం కోసం కర్రలను వెదకసాగారు. వారికి దారిలో పడిపోయివున్న పెద్ద చెట్టు కాండంలాంటిది ఒకటి కనిపించింది. వారు దానిని నరకడం ప్రారంభించగానే రక్తం బయటకు రాసాగింది. అంతట వారు అది సర్పం అని తెలుసుకున్నారు. దాన్ని చంపేసి చర్మం వలిచేశారు. వారు ఆ సర్పం ముక్కలను ఇళ్ళకు తీసుకెళ్ళి విందు ఏర్పాటు చేసుకొన్నారు, దాని చర్మంతో పెద్ద మద్దెల చేసుకొన్నారు. కాని మద్దెల నుండి ఎటువంటి శబ్దమూ రాలేదు. ఒక అర్ధరాత్రి ఆ మద్దెల నుండి "డక్ డక్ కగు" అను శబ్దాలు వచ్చాయి. అంతే, భారీ తుఫాను వచ్చి ఇళ్లను, మనుష్యులను తుడిచిపెట్టేసింది. కొంతమంది సముద్రంలో మునిగిపోగా, మరికొంత మంది వేరే ప్రాంతాల్లోకి తప్పించుకొన్నారు.
  • డ్యాక్, బోర్నియొ (Dyak, Borneo) ప్రజల నమ్మకం ప్రకారం కొంతమంది స్త్రీలు వెదురు కొమ్మలను నరికి ఒక చోట పేరుస్తున్నారు. అయితే వెదురు గెడనుండి నరికిన చోట రక్తం రావడం వారు చూచారు. కొంతమంది పురుషులు ఆ వెదురు గెడను ఒక భారీ సర్పంగా గుర్తించి దానిని చంపి ఇంటికి తినడానికి తీసుకొనిపోయారు. సర్పం ముక్కలను వేపిస్తుండగా పెనంలోనుండి వింత శబ్దాలొచ్చాయి. అంతే భారీ వర్షం వచ్చి ఒక్క ఎత్తైన పర్వతం తప్ప సమస్తాన్ని కుంభవృష్టితో ముంచేసింది. ఒక స్త్రీ, కుక్క, ఎలుక, మరికొన్ని చిన్న జీవులు మాత్రమే బ్రతికాయి. భర్త లేని ఆమె వెచ్చగా ఉన్న ఒక తీగ క్రింద కుక్కను తలదాచుకున్నట్లు చూచింది. ఆ తీగను మరో చెట్టు కాండానికి రుద్దడం ద్వారా వెచ్చదనం వస్తుందని గ్రహించి, ఆ తీగను మరో చెట్టు కాండానికి రుద్ది అగ్ని పుట్టించింది. ఆ అగ్ని సహాయంతో ఆమె సింపాంగ్-ఇంపాంగ్ (Simpang-impang) అను కుమారుడుకి జన్మనిచ్చింది. ఆ సగం మనిషియైన ఆ శిశువుకు ఒక కాలు, ఒక చేయి, ఒక కన్ను, ఒకే చెవి, ఒకే ముక్కు రంధ్రం, ఒకే చెంప ఉన్నాయి. తరువాత సింపాంగ్-ఇంపాంగ్ పండించిన ధాన్యాన్ని గాలి ఆత్మ తీసుకెళిపోయింది. సింపాంగ్-ఇంపాంగ్ నష్టపరిహారం అడుగగా గాలి ఆత్మ నిరాకరించాడు. చివరికి గాలి ఆత్మ సింపాంగ్-ఇంపాంగ్ కు పుట్టుకతో లేని అవయువాలను ఇచ్చాడు.

ట్రొ (Trow) అనే వ్యక్తి కుండపోత వర్షం వచ్చినప్పుడు చెక్క రోకలి నుండి ఒక పడవను చేసుకొని అందులో భార్యను, కుక్కను, పందిని, పిల్లిని, కోడిని, ఇతర జంతువులను ఎక్కించుకొని నడపసాగాడు. వర్షం ఆగిపోయిన తర్వాత అతడు రాళ్లనుండి, దుంగలనుండి బహు భార్యలను పొందదలచి, కుటుంబాన్ని విస్తరించాడు. అతని కుటుంబమే డ్యాక్ తెగలకు పూర్వీకులైయ్యారు. కుప్పగా పోసిన ధాన్యాన్ని ఆకాశం నుండి ఒక సర్పం చూచి అక్కడికి వచ్చి తినసాగింది. ప్రజలు అక్కడికి వచ్చి దాని తల నరికేశారు. మర్నాడు ఒకడు వచ్చి ఆ సర్పం యొక్క మాంసం తినసాగాడు. అంతే కుంభవృష్టి కురిసి, వరదగా మారింది. కొండలెక్కిన కొందరు తప్ప మిగిలినవారందరూ చనిపోయారు.

  • ఒట్ డనోం, డచ్ బోర్నియో (Ot-Danom, Dutch Borneo) ప్రజల ప్రకారం జల ప్రళయం వచ్చి చాలా మంది మునిగిపోయారు. కొంతమంది మాత్రమే పడవలు ఎక్కి ఒక పర్వతం చేరారు మూడు నెలలు ఆ పర్వతం పైన జల ప్రళయం సమాప్తమయ్యేవరకూ ఉన్నారు.
  • తొరాడ్జ, మధ్య సెలెబెస్ (Toradja, Central Celebes) ప్రజల ప్రకారం జల ప్రళయం వచ్చి వవొం పెబాతొ అనే పర్వతం తప్ప సమస్తం మునిగిపోయింది. ఈ పర్వతం మీద లభించిన ఆల్చిప్పలు ఆధారాలుగా ఉన్నాయి. ఒక నిండు చూలాలు, ఒక సూడి ఎలుక దోనె ఎక్కి కుండ గరిటెని తెడ్డుగా ఉపయోగించి బయటపడ్డారు. వరద తగ్గుముఖం పట్టింది. ఆ స్త్రీ కూలిపోయిన చెట్టు కొమ్మలకు వ్రేలాడుతున్న వరిధాన్యపు కట్టను చూచింది. "నాకు కూడా ధాన్యాన్ని తినే హక్కు కావాలి. అప్పుడే నీకోసం ఆ కట్టను తీసుకొస్తాను" అని ఎలుక పలుకగా స్త్రీ అందుకు అంగీకరించింది. ఆ ఎలుక తీసుకు రావడానికి వెళ్ళింది. ఈలోగా ఆ స్త్రీ ఒక కుమారుడికి జన్మనిచ్చి, ఆ కుమారుడిని భర్తగా స్వీకరించి అతడిమూలంగా రెండవసారి ఒక కుమారుడిని, ఒక కుమార్తెను కన్నది. వీరు ప్రస్తుత మానవాళికి పూర్వీకులైయ్యారు.
  • చెలెబెస్, న్యూ గినియాకు మధ్య ఉన్న సెరం (Celam) అనే ద్వీపంలో అల్ఫూర్ (Alfoor) తెగలవారి ప్రకారం నొసేక్ అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి చెట్లతో వస్త్రాలుగా కప్పబడి ఉంది. ఆ చెట్ల ఆకులు యోని (Vagina) వలే ఉన్నాయి. జలప్రళయం సంభవించుట వలన ఆ పర్వతం ఎక్కిన ముగ్గురు పురుషులు మాత్రమే బ్రతికారు. ఆకులను ఉపయోగించి మరలా సంతానాన్ని వ్యాప్తి చేశారు.
  • ఇండొనేషియా దీవుల్లో తిమార్ దీవి (Timor) ఒకటి. ఈ దీవికి నైరుతిలో రొట్టి (Rotti) అనే చిన్న దీవి ఉంది. ఇక్కడ వున్న ప్రజల నమ్మకం ప్రకారం లకిమోల (Lakimola) అను పర్వతం తప్ప భూమి అంతా జల ప్రళయంలో మునిగిపోయింది. ఒక పురుషుడు, అతని భార్యా పిల్లలు ఆ కొండపై కొన్ని నెలల పాటూ తలదాచుకున్నారు. ఆ పర్వతం కూడా మునిగిపోతుండగా వారు సముద్రానికి శాంతించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు సముద్రం వారి మొరకు స్పందిచి: "అలాగే శాంతిస్తాను, కాని నేను లెక్కపెట్టలేనన్ని వెండ్రుకలున్న జంతువుని నాకివ్వండి" అని అన్నది. అప్పుడు పురుషుడు ఒక పందిని, మేకను, కుక్కను, కోడిని ఆ సముద్రానికి ఇచ్చాడు. కాని సముద్ర లెక్కపెట్టగలిగినది కనుక ఫలితం లేకపోయింది. తరువాత పురుషుడు పిల్లిని ఇవ్వగా ఆ సముద్రం దాని వెండ్రుకలు లెక్కపెట్టలేక శాంతించింది. ఆ తరువాత ఓ సముద్రపు కాకి నీటిలో కొంత ఇసుకను చల్లింది. అంతట ఆ దంపతులు తమ పిల్లలతో పర్వతం దిగి తమ క్రొత్త ఇంటి కోసం వెళ్లారు. దేవుడు ఆ కాకితో "వెళ్ళు ... మనుష్యులు పండించుకొని తినే ప్రతి విత్తనాన్నీ తీసుకు రా" అని ఆ కాకితో చెప్పాడు. ఆ ప్రకారంగా కాకి వాటిని తీసుకొచ్చింది.
  • ఫ్లోర్స్ (Flores) అనే ఈస్ట్ ఇండియన్ ద్వీపంలో నగెస్ (Nages) అను తెగలవారి ప్రకారం డూయ్ (Dooy) అనే పూర్వీకుడు జల ప్రళయం నుండి ఓడ సాయంతో రక్షింపబడ్డాడు. అతని సమాధి బొవా వై (Boa Wai) అను రాజధానిలో ఉంది.
  • అర్న్ హెం లాండ్, ఉత్తర టెరిటరీ, ఆస్ట్రేలియా (Arnhem Land, Northern Territory) వారి నమ్మకం ప్రకారం ఒక అక్క, ఒక చెల్లెలు తమ పిల్లలతో ఒక బావి వద్ద విశ్రాంతి తీసుకొంటున్నారు. పెద్ద సోదరి యొక్క బహిష్టు రక్తం బావిలోకి కారింది. ఈ రక్తం వాసన చూచిన యుర్లుంగ్గుర్ (Yurlunggur) అను ఇంద్రధనస్సు సర్పం తన బావినుండి బయటకొచ్చింది. ఆ బావిలో నీరు కొంత తీసుకొని ఆకాశం వైపు చిమ్మి వర్షం తెప్పించింది. బావి నిండుతుండగా ఆ స్త్రీలు కంగారుగా వెళ్ళి ఇళ్ళు నిర్మించుకున్నారు. కాని ఆ స్త్రీలను ఈ సర్పం నిద్రింపజేసి, వారిని పిల్లలను మ్రింగేసింది. ఆ సర్పం మబ్బులంత ఎత్తులో నిటారుగా నిలబడటంతో నీటి మట్టం అంత ఎత్తు పెరిగింది. అది క్రిందకు వాలగా నీటిమట్టం కూడా పడిపోయింది, నేల ఆరిపోయింది.

ఇద్దరు అనాథలు విరిలి అప్ (Wirili-up) అను బాధ్యత తీసుకోని వ్యక్తి సంరక్షణలోకి తీసుకోబడ్డారు. వారు విపరీతమైన ఆకలిగొనగా, ఇంద్రధనస్సు సర్పం (ngaljod) వచ్చి వరద బీభత్సాన్ని సృష్టించింది. విరిలి అప్ తప్పించుకొనగా పిల్లలు మునిగిపోయారు.

  • మాంగ్, గౌల్బర్న్ దీవులు, ఆర్నహెం లాండ్ (Maung, Goulburn Islands, Arnhem Land) ప్రజల నమ్మకం ప్రకారం ప్రజలు చేపలను పంచుకొంటూ ఒక కాకికి నాసిరకం చేపలను ఇచ్చారు. ఆగ్రహించిన కాకి ఒక పెద్ద చెట్టుని నరకగా అది సెలయేరుకి అడ్డంగా పడింది. చెట్టుపై కూర్చొని "వాగ్ వాగ్" అని కాకి కూయగా అ సెలయేరు వెడల్పు పెరిగి ఆ ద్వీపాన్ని రెండుగా చీల్చింది. ఆ కాకి మరో పక్షి రూపం దాల్చుకొని ప్రజల వైపు ఎగిరింది. చెట్టుకి తాకిన నీరు ఎగసిపడసాగింది. దాంతో సెలయేరు ఒడ్డున ఉన్న ప్రజలందరూ మునిగిపోయారు. ఇది చూచిన ఒక అడవి తొండ (Wild Lizard) తన భార్య కొరకు దక్షిణపు ద్వీపం వైపు ఈదింది. కాని అది మధ్య మార్గంలో మునిగిపోయి సెలయేరు రాయిగా మారిపోయింది.
  • గన్వింగ్గు (ఉత్తర ఆర్నహెం లాండ్) Gunwinggu (northern Arnhem Land) ప్రజల నమ్మకం ప్రకారం గల్బిన్ అనే స్త్రీ ఒక సర్పాన్ని చంపి దాన్ని ఉడికిస్తూ పడుకుంది. భూగర్భంలో ఉన్న తల్లి సర్పం నీటిని బయటకు తన్ని ఆ స్త్రీని ముంచివేసి ఆరగించింది. తరువాత ఆ స్త్రీ ఎముకలను వాంతిచేసుకొంది. ఆ ఎముకలు రాయిగా మారింది.

ఒకప్పుడు ఆదిమానవులు నడిసముద్రంలో ఉండేవారు. అజ్ఞానంతో కొంతమంది మార్ అనే ప్రమాదకరమైన డ్రీమింగ్ రాయిని తట్టారు. వారు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సేపు వర్షం పడింది. మంచి నీరు వారి వెంబడి వచ్చింది. భయంతో వారు ఆ నీటిలో ఈది ఆరిన నేలకోసం వెదకసాగిరి. అక్కడ అరాగలది అనే రాయితప్ప ఎంకేమీ లేదు. కాని అరాగలది అనేది నిజమైన రాయి కాదు. సర్పము నీటి అలలను మనుషులపై ఎత్తింది, ఉప్పునీటిని మూత్రంగా పోసింది. సర్పము అందరినీ మ్రింగివేసి వారి ఎముకలను వాంతి చేసుకొంది. ఆ ఆది మానవులందరూ రాళ్ళైపోయారు. అందుకే అరగాడి రాయి వద్దకు ఎవరూ వెళ్ళరు.

ఒక అనాథ బాలుడు తన తోటి కులస్తులచే తృణీకరింపబడి ఏడుస్తున్నాడు. వేటకు వెళ్ళి తిరిగివచ్చిన అతని సోదరుడు కులస్తులవద్దకు వెళ్ళి "నా తమ్ముడి కొరకు నేను చింతిస్తున్నాను. మిమ్మలందరినీ చంపేస్తాను" అని ఇంద్రధనస్సు గ్రుడ్డులను పగులగొట్టగా, వాటిలోంచి నీరు ఉబికి విస్తరించింది. అతడు తన తమ్ముడిని తీసుకువెళ్ళి కొండపైకి వెళ్ళాడు. తరువాత వారు ఆ కొండపై రాళ్ళుగా మారారు. కొందరు ఉత్తర దిక్కునుండి వచ్చి న్యలైడ్జ్ (Nyalaidj) అనే వేడుకలో నాట్యం చేశారు. అది జరుగుచుండగా ఒక బాలిక చెట్టు ఎక్కి అరవసాగింది, ఒక బాలుడు ఏడవసాగాడు. అంతే నీరు భూమిలోంచి బయటకు ఉబికింది. వారందరూ తప్పించుకోలేక నీటిలో మునిగిపోయారు. Ngalyod అనే ఇంద్రధనస్సు సర్పం అందరినీ మ్రింగేసింది. ఆ ప్రదేశం గాల్బరాయ. అది ఇప్పటికీ చర్చగానే ఉంటుంది. ఒక కల్లుగీతగాడు తేనె తెరల వేటకైవెళ్ళాడు. సరైనవి దొరకక డ్జంగ్ (djang) పాం చెట్టుని తిన్నాడు. తేనెటీగలు "గు గు" (నీరు నీరు) అని మాట్లాడుకోవడం విన్నాడు. అతడు ఇతరులవద్దకు పరుగెత్తి తాను తెలియకుండా చేసిన ప గురించి చెప్పాడు. వారు చెట్టుని కాల్చివేయాలని చూశారు. కాని అందులోంచి నీరు బయటకు ఉబికింది. ఒక బాలిక కొండపైకి వెళ్ళి హెచ్చరించింది. ఇతరులు మంబదెరి చెట్టు ఎక్కారు కాని అది కూడా పడిపోయింది. ఆ బాలిక రాయిగా మారింది. ఇద్దరు వ్యక్తులు స్వప్న సమయంలో నడుస్తున్నారు. అందులో ఒకడు నీరసించి పడిపోయాడు. వురాల్ (Wuraal) అనే పక్షి వచ్చింది. రెండవ వాడు గ్రహించి - "Maybe we're making ourselves wrong, coming into Dreaming." అని అన్నాడు. ఆ రాత్రి పక్షి నీరసించిన వాడిని పొడిచి చంపింది. నీరు బయటకు ఉబికి అతనిని తాకింది. రెండవాడు తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. కాని ఆ పక్షితో సహా ఆ ఇద్దరూ గొయ్యిలో పడిపోయి కలలోకి వచ్చారు.

  • గుమైడ్జ్ (ఆర్న్ హెర్మ్ లాండ్) (Gumaidj, Arnhem Land) ప్రజల నమ్మకం ప్రకారం తుఫాను వచ్చే సమయంలో ఇద్దరు అక్కా చెళ్ళెళ్ళు సముద్ర గట్టు పై ఆల్చిప్పలు పోగుచేస్తున్నారు. Namaranginiఅనే పురుష ఆత్మ చెల్లెలిని పట్టుకొని ఆమెతో సంభోగించడానికి ప్రయత్నిస్తుండగా అక్క వచ్చి అతడిని చెట్టు కొమ్మతో కొట్టింది. అతడు ఆమెను గుడారం వద్దకు తీసుకొనిపోయి, అచట ఒక మంట వేసి, ఆమెతో మళ్ళీ సంభోగించడానికి ప్రయత్నించి అనుకోకుండా ఆమె యోనిలో వక్క గింజలను కొట్టే రాయిని కనుగొన్నాడు. దాన్ని కర్రతో తీసివేసి, తరువాత ఆమెతో సులభంగా సంభోగించాడు. కార్యం పూర్తయిన తర్వాత బాధితురాలు తుమ్మెదగా మారి ఆమె భర్త వద్దకు వెళ్ళింది. యోనిలో రాయి లేకుండుట చూచిన భర్త కాల్చిన కర్రను ఆమె యోనిలోకి దూర్చి ఆమెను చంపాడు. మర్నాడు ఆమె అక్కకు ఈ విషయం తెలిసి మరో స్త్రీతో కలిసి అతడిని కొట్టి దూరంగా తరిమేశారు. అతడు మరణించి పాలబెరడు చెట్టుగా మారిపోయాడు. స్త్రీలు ఏడవగా భారీ వర్షము కొన్ని వారాలపాటూ వచ్చింది. వారు పడవలను తయారుచేసుకున్నారు. నేలపై పడిన నీరు వారిని సముద్రంలోకి త్రోసివేసింది. ఆప్పుడు వారు వారి యోనుల్లో ఉన్న రాళ్ళను పోగొట్టుకొన్నారు. వారి ఏడుపు ఇప్పటికీ వినబడుతూవుంటుంది.
  • మంగర్, అర్ణెం ఐలాండ్ (Manger, Arnhem Land) ప్రజల నమ్మకం ప్రకారం ఒక కాకి ఇద్దరు మనుషులతో వాగ్వివాదానికి దిగింది. దీనికి కారణం కాకి వల్ల అనుకోకుండా ఆకుపచ్చని చీమలు వారు తెచ్చుకొన్న చేపలను పట్టుకోవడమే. కాకి వారితో పోరాడి గెలిచింది. అది తన సమూహం దగ్గరకు వెళ్ళింది. ఇద్దరు మనుషులు కాకులు వేడుక జరుపుకోవడం చూశారు. అందరూ పడుకున్నప్పుడు కాకి ఒక చెట్టు కొమ్మను నరికింది. అది వారిద్దరి మీద పడగా మరణించారు. తర్వాత కాకి ఒక తేనె సంచె తెచ్చి క్రింది గుమ్మరించింది. ఆ తేనె వరదగా మారింది. అప్పుడు అందరు మనుషులూ పక్షులైపోయారు.
  • Fitzroy River area, Western Australian ప్రజల నమ్మకం ప్రకారం ఒరాంబ (Woramba) అను ప్రళయం వచ్చినప్పుడు గుమన అను ఓడ నొవాహును, ప్రజలను, జీవజాలమును తీసుకు వెళ్తుండగా అది దక్షిణమువైపు కొట్టుకువచ్చి Djilinbadu (about 70 km south of Noonkanbah Station, just south of the Barbwire Range and east of the Worral Range) అను నేడు కనిపించే డెక్కన్ ప్రదేశంలో ఆగింది.

ఇంకా చదవండి మార్చు