జలభయం అంటే నీరంటే భయముండడం. ఈ భయం నీళ్ళు త్రాగడానికైనా ఉండవచ్చు, లేక నీటిలో మునిగిపోతామనే భయమైనా కావచ్చును.

రభస (రేబీస్) వ్యాధిలో జలభయం మార్చు

రభసవ్యాధిగ్రస్తులలో జలభయానికి కారణం ఉంటుంది. వీరు నీటిని గాని ఇతర ద్రవపదార్థాలను చూసేటప్పుడు, లేక తాగుటకు ప్రయత్నించినపుడు వీరి మ్రింగు కండరాలలోను, ఉదారవితానంలోను నొప్పితో కూడిన దుస్సంకోచాలు, వాంతిభావన కలుగుతాయి. ఆ నొప్పిని దుస్సంకోచాలను భరించలేకపోవుట వలన వీరికి జలభయం, ఆందోళన కలుగుతాయి. అందువలన వీరిని నీళ్ళు, ఇతర ద్రవాలను త్రాగమని బలవంతం చేయకూడదు. రభసవ్యాధిలో కలిగే జలభయాన్ని ఆంగ్లంలో ‘హైడ్రోఫోబియా’ గా వ్యవహరిస్తారు.

మానసిక జలభయం మార్చు

మరో జలభయం నీళ్ళలో మునిగిపోతామనుకొనే కారణం లేని మానసిక వికారము. వీరిలో నీళ్ళంటే విపరీతమైన భయం, ఆందోళన అవసరానికి మించి కలుగుతాయి. నిశ్చలంగా ఉన్న నీళ్ళకు, వాతావరణంలో మార్పులకు ప్రపంచంలో 2.-3%[1] ప్రజలకు భయం ఉంటుంది. నీళ్ళ కొలనులలో నీళ్ళకు, ప్రకృతిలో గల జలశయాలకు భయం, ఆందోళన కలిగి భౌతిక లక్షణాలు కలిగిస్తాయి[2]. మానసికంగా కలిగే జలభయాన్ని ఆంగ్లంలో ‘ఆక్వాఫోబియా’ గా వ్యవహరిస్తారు.

కారణాలు మార్చు

మునిగిపోతామనే సహజంగా కలిగే భయం, తల్లిదండ్రుల అతిజాగ్రత్త, నీళ్ళలో కలిగిన భయంకరమైన చేదు అనుభవం, నీళ్ళకు మానసికంగా అలవాటు పడలేకపోవడం, నీళ్ళంటే తొలగని అపనమ్మకం జలభయంకి కారణాలు. మానసికంగా కలిగే భయాలు కుటుంబాలలో కొనసాగుతుంటాయి[3]

లక్షణాలు మార్చు

మానసిక జలభయం కలిగినప్పుడు చాలా ఆందోళన, ఉక్కిరిబిక్కిరవడం, ముఖం ఎఱ్ఱబడడం, విపరీతంగా చెమటపోయడం, గుండెదడ, ఆయాసం,వాంతిభావన, కళ్ళుతిరగడం వణుకు,చలి, ఛాతిలో బిగుతు,ఛాతినొప్పి,నోటి తడి ఆరిపోవడం,గాభరా,చెవుల్లో గింగురు,గందరగోళం ఏమైనా కలుగవచ్చు[1]

మానసికంగా తూలిపోవడం స్పృహతప్పిపోతామనే భయం,చనిపోతామనే భయం కలుగవచ్చు

చికిత్స మార్చు

మానసిక జలభయం స్మృతివర్తన చికిత్స ( కాగ్నిటివ్ బిహేవియరల్ థిరపీ), సమ్మోహన చికిత్స (హిప్నోసిస్)[1] మెల్లమెల్లగా నీటికి అలవాటు చేయడం[1]వలన తగ్గే అవకాశం ఉంది. కొందఱికి ఆందోళన తగ్గించు మందులు, మానసిక క్రుంగుదల పోగొట్టు మందులు సహాయపడుతాయి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Aquaphobia (Fear of Water): Symptoms & Treatment". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2024-03-01.
  2. Murphy, Nicole (2022-10-27). "What is Aquaphobia?". CPD Online College (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-03-01.
  3. "Aquaphobia: Symptoms, Treatment, Definition, Hydrophobia, and More". Healthline (in ఇంగ్లీష్). 2018-03-12. Retrieved 2024-03-02.
"https://te.wikipedia.org/w/index.php?title=జలభయం&oldid=4155456" నుండి వెలికితీశారు