రేబీస్ లిస్సా వైరస్ సమూహమునకు చెందిన ఆర్. ఎన్. ఎ వైరస్ ల వలన కలిగే వ్యాధి. రేబీస్ పేరు లాటిన్ భాషలో rebere (ఉద్వేగము, కోపము ) పదము, సంస్కృత భాషలో రభస్ పదములతో సంబంధము కలిగి పుట్టింది. [1]దీని వలన మెదడువాపు కలుగుతుంది. ఇది మానవులకు, ఉష్ణరక్త జంతువులకు సోకగలదు. [2] గురైన ప్రాంతం వద్ద ప్రారంభ లక్షణాలుగా తిమ్మిరి ఆపై జ్వరం, వాంతిభావన, వాంతులు ,జలదరింపు కలుగవచ్చు.[2] ఈ క్రింది లక్షణాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించిన తరువాత ఈ లక్షణాలు కనిపిస్తాయి: కుదుపు వంటి కదలికలు, ఉద్రిక్తత , మింగుటలో ఇబ్బంది, నీటి భయం , శరీర భాగాలను కదలించలేకపోవుట, గందరగోళము, అపస్మారక లక్షణాలు కనిపించిన తరువాత, దాదాపు రేబీస్ ఎల్లప్పుడూ మరణానికి దారితీస్తుంది.[2] ఉగ్ర తరగతికి చెందిన రేబీస్ వ్యాధిగ్రస్థులలో జలభయము ఒక ముఖ్య లక్షణము. వీరు నీటిని, ఇతర పదార్థములను మింగడానికి ప్రయత్నించేటపుడు మింగు కండరములు సరిగా పనిచేయక వాటిలో పదే పదే నొప్పితో కూడిన దుస్సంకోచములు కలుగుతాయి. స్వరపేటిక కండరములలోను, మెడలో ఉండు ఉరఃకర్ణ మూలిక స్నాయువు ( ష్టెర్నో మాష్టాయిడ్ కండరము ) వంటి అదనపు శ్వాసకండరములలోను, ఉదరవితాన కండరములలోను కూడా ఈ దుస్సంకోచములు కలుగుతాయి. ఈ దుస్సంకోచములతో బాధ ఉండుట వలన రేబీస్ వ్యాధిగ్రస్థులు నీటిని ద్రవపదార్థములను చూసినపుడు భయానికి, ఆందోళనకు గురి అవుతారు. రేబీస్ ‘ జలభయ వ్యాధి’గా ( హైడ్రోఫోబియా ) ప్రసిద్ధి కెక్కింది. వ్యాధి లక్షణములు పొడచూపిన తర్వాత 2 నుండి 10 దినములలో మరణము కలుగుతుంది. వ్యాధి సోకటం, లక్షణాల ప్రారంభం కావటానికి మధ్య కాలం సాధారణంగా ఒకటి నుండి మూడు నెలల ఉంటుంది. అయితే, ఈ సమయ వ్యవధి ఒక వారం కంటే తక్కువ నుండి ఒక సంవత్సరం కంటే ఎక్కువ వరకు మారుతుంది.[2] వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థ కు చేరుకోవడానికి ప్రయాణించే దూరంపై ఈ సమయ వ్యవధి ఆధారపడి ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. [3] ప్రతి సంవత్సరం సెప్టెంబరు 28న ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు.

రేబీస్

కారణం, వ్యాధి నిర్ధారణ మార్చు

రేబీస్ ఇతర జంతువుల నుండి మానవులకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన జంతువు వేరే వ్యక్తిని లేదా జంతువును గీరినప్పుడు లేదా కరిచినప్పుడు రేబీస్ వ్యాప్తి చెందుతుంది.[2] మరో జంతువు లేదా మానవుని యొక్క శ్లేష్మ పొరకు రేబీస్ సోకిన జంతువు యొక్క లాలాజలం తగిలితే, ఆ లాలాజలం కూడా రేబీస్‍ను వ్యాప్తి చేయవచ్చు.[2] మానవులలో చాలా రేబీస్ కేసులు కుక్క కరవటం వలన సంభవిస్తాయి.[2] సాధారణంగా రేబీస్ కుక్కలు ఉన్న దేశాలలో 99% కంటే ఎక్కువ రేబీస్ కేసులు కుక్క కరవటం వలన సంభవిస్తాయి.[4] అమెరికా ప్రజలలో గబ్బిలం కరవటం అనేది రేబీస్ ఇన్ఫెక్షన్ల యొక్క సర్వసాధారణ మూలంగా ఉంది, 5% కంటే తక్కువ కేసులు కుక్కల ద్వారా సంభవిస్తాయి.[2][4] చిట్టెలుకలకు చాలా అరుదుగా రేబీస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది.[4] రేబీస్ వైరస్ పరధీయ నాడుల ద్వారా మెదడుకు ప్రయాణిస్తుంది. లక్షణాలు ప్రారంభమైన తరువాత మాత్రమే ఈ వ్యాధి యొక్క రోగనిర్ధారణ జరుగుతుంది.[2]

నివారణ, చికిత్స మార్చు

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కుక్కల ద్వారా వచ్చే రేబీస్ ప్రమాదాన్ని జంతు నియంత్రణ, టీకా కార్యక్రమం తగ్గించింది.[2] వ్యాధి నిరోధీకరణను పొందే ప్రజలు వ్యాధిబారిన పడటానికి ముందు వారికి అధిక ప్రమాదవకాశం ఉందని సిఫార్సు చేయబడింది. రేబీస్ సాధారణంగా ఉన్న ప్రపంచంలోని ప్రాంతాలలో గబ్బిలాలతో పని చేసే లేదా ఎక్కువ కాలం గడిపే వ్యక్తులు అత్యధిక ప్రమాదవకాశం కలిగిన బృందాలుగా ఉంటారు.[2] రేబీస్‍కు గురైన వ్యక్తులు, రేబీస్ లక్షణాలు ప్రారంభం కావడానికి ముందే, వ్యాధి నివారణకు రేబీస్ టీకాను, కొన్నిసార్లు రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ చికిత్సను పొందితే అవి సమర్థవంతంగా ఉంటాయి.[2] గాట్లు, గీతలను సబ్బు, నీటితో 15 నిమిషాలు కడగటం వల్ల పోవిడన్ అయోడిన్ , లేదా సబ్బు వైరస్‍ను చంపవచ్చు, రేబీస్ వ్యాప్తిని నిరోధించడంలో అవి కొంతవరకు ప్రభావంతంగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది.[2] లక్షణాలు కనబడిన తర్వాత కొద్ది మంది మాత్రమే రేబీస్ వ్యాధి నుండి ప్రాణాలతో బయటపడగలిగారు. ఇది మిల్వాకీ ప్రోటోకాల్ అని పిలువబడే విస్తృతమైన చికిత్స.[5]

టీకా మార్చు

రేబీస్ టీకా
Vaccine description
Target disease రేబీస్
Type Killed/Inactivated
Clinical data
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a607023
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి ?
Identifiers
ATC code J07BG01
ChemSpider none  N
  N (what is this?)  (verify)

రేబీస్ టీకా అనేది ఒక టీకా, ేబీస్‌‌‍ను నివారించటానికి దీన్ని ఉపయోగిస్తారు.[6] సురక్షితమైన, సమర్థవంతమైనవి చాలా అందుబాటులో ఉన్నాయి.రేబీస్ గల జంతువు కరచిన తరువాత వ్యాధి కలుగుటకు ముందు, రేబీస్‍ను నిరోధించడానికి వీటిని ఉపయోగించవచ్చు. మూడు మోతాదుల తరువాత వృద్ధి చెందే రోగనిరోధకశక్తి ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణంగా చర్మం లేదా కండరాలలోకి ఇంజెక్షన్ ద్వారా వీటిని ఇస్తారు. వ్యాధికి గురయ్యాక ఇచ్చే టీకాను సాధారణంగా రేబీస్ ఇమ్యునోగ్లోబిన్‍తో కలిపి ఉపయోగిస్తారు. వ్యాధికి గురయ్యే ప్రమాదవకాశం ఉన్నవారు దానికి గురవటానికి ముందే టీకా‍ను వేయించుకోవాలని సిఫార్సు చేయబడింది. టీకాలు మానవులలో, ఇతర జంతువులలో సమర్థవంతంగా ఉన్నాయి. వ్యాధి నిరోధీకరణను పొందే కుక్కలు మానవులలో వ్యాధిని నివారించటంలో ఇవి చాలా సమర్థవంతంగా ఉన్నాయి.[6]

భద్రత మార్చు

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు టీకాను వేయించుకున్నారు, సంవత్సరానికి 250,000 కంటే ఎక్కువ మంది ప్రజలను ఇది కాపాడుతుందని అంచనా వేయబడింది.[6] అన్ని వయసుల వారికి దీన్ని సురక్షితంగా వాడవచ్చు. సుమారు 35 నుండి 45 శాతం ప్రజలలో ఇంజక్షన్ ఇచ్చిన ప్రాంతం వద్ద కొంత సమయం పాటు ఎర్రబడటం, నొప్పి కలిగింది. సుమారు 5 నుండి 15 శాతం ప్రజలకు జ్వరం, తలనొప్పి లేదా వికారం కలుగవచ్చు. రేబీస్‍కు గురయ్యాక దీన్ని వాడటంలో ఎటువంటి నిషేధం లేదు. ఎక్కువ టీకాలు తిమిరొసాల్‌ను కలిగిలేవు. నాడి కణజాలం నుంచి తయారు చేసే టీకాలు ప్రధానంగా కొన్ని దేశాలలో ఆసియా, లాటిన్ అమెరికాలో ఉపయోగించబడుతున్నాయి కానీ ఇవి తక్కువ ప్రభావవంతంగా ఉండి, ఎక్కువ దుష్ప్రభావాలను కలిగియున్నాయి. అందువల్ల వీటి వాడకం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా సిఫార్సు చేయబడలేదు.[6]

2014 నాటికి చికిత్స కోర్సు 44 నుండి 78 యుఎస్‍డి టోకుధరగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‍లో రేబీస్ టీకా కోర్సు 750 యుఎస్‍డి కంటే ఎక్కువగా ఉంది.[7]

ఎపిడిమియాలజీ (సాంక్రమిక రోగ విజ్ఞానం) మార్చు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 26,000 నుండి 55,000 మరణాలకు రేబీస్ కారణమవుతోంది.[2][8] 95% కంటే ఎక్కువ మరణాలు ఆసియా , ఆఫ్రికాలో సంభవిస్తాయి.[2] రేబీస్ 150 కంటే ఎక్కువ దేశాలలో, అన్ని ఖండాలలో ఉంది కానీ అంటార్కిటికాలో లేదు.[2] ప్రపంచంలో రేబీస్ సంభవించే అనేక ప్రాంతాలలో 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు.[2] యూరప్, ఆస్ట్రేలియాలోని అత్యధిక ప్రాంతాలలో, రేబీస్ గబ్బిలాలలో మాత్రమే ఉంది.[9] అనేక చిన్న ఐలాండ్స్‍లో రేబీస్ లేదు.[10]

ప్రస్తావనలు మార్చు

  1. Behnam Dalfardi; Mohammad Hosein Esnaashary; Hassan Yarmohammadi (2014). "Rabies in medieval Persian literature – the Canon of Avicenna (980–1037 AD)". Infectious Diseases of Poverty. 3. doi:10.1186/2049-9957-3-7.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 2.15 2.16 "Rabies Fact Sheet N°99". World Health Organization. July 2013. Retrieved 28 February 2014.
  3. Cotran RS; Kumar V; Fausto N (2005). Robbins and Cotran Pathologic Basis of Disease (7th ed.). Elsevier/Saunders. p. 1375. ISBN 0-7216-0187-1.
  4. 4.0 4.1 4.2 Tintinalli, Judith E. (2010). Emergency Medicine: A Comprehensive Study Guide (Emergency Medicine (Tintinalli)). McGraw-Hill. pp. Chapter 152. ISBN 0-07-148480-9.
  5. Hemachudha T; Ugolini G; Wacharapluesadee S; Sungkarat W; Shuangshoti S; Laothamatas J (May 2013). "Human rabies: neuropathogenesis, diagnosis, and management". Lancet neurology. 12 (5): 498–513. doi:10.1016/s1474-4422(13)70038-3. PMID 23602163.
  6. 6.0 6.1 6.2 6.3 "Rabies vaccines: WHO position paper" (PDF). Weekly epidemiological record. 32 (85): 309–320. Aug 6, 2010.
  7. Shlim, David (June 30, 2015). "Perspectives: Intradermal Rabies Preexposure Immunization". Retrieved 6 December 2015.
  8. Lozano R; Naghavi M; Foreman K; Lim S; Shibuya K; Aboyans V; Abraham J; Adair T; Aggarwal R; et al. (Dec 15, 2012). "Global and regional mortality from 235 causes of death for 20 age groups in 1990 and 2010: a systematic analysis for the Global Burden of Disease Study 2010". Lancet. 380 (9859): 2095–128. doi:10.1016/S0140-6736(12)61728-0. PMID 23245604.
  9. "Presence / absence of rabies in 2007". World Health Organization. 2007. Retrieved 1 March 2014.
  10. "Rabies-Free Countries and Political Units". CDC. Archived from the original on 5 మార్చి 2014. Retrieved 1 March 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=రేబీస్&oldid=3889264" నుండి వెలికితీశారు