జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్

జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్(ఆంగ్లం:Jawahar Navodaya Vidyalaya, Hindi: जवाहर नवोदया विद्यलया) ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాల. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోసం స్థాపించబడింది. ఈ పాఠశాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యాశాఖ నిర్వహిస్తుంది. భారతదేశంలో మొత్తం 661 నవోదయ విద్యాలయాలున్నాయి, వీటన్నింటిని నవోదయ విద్యాలయ సమితి నిర్వహిస్తోంది.

జవహర్ నవోదయ విద్యాలయం నిజాంసాగర్
స్థానం
పటం
సమాచారం
రకంప్రభుత్వ
Mottoప్రజ్ఞానః బ్రహ్మ
స్థాపన1987
ప్రిన్సిపాల్ఏం.వెంకటరమణ
తరగతులు6 నుండి 12వ తరగతి
విద్యార్ధుల సంఖ్య464
Campus size25-ఎకరం (100,000 మీ2)
Campus typeగ్రామీణ
పరీక్షల బోర్డుసిబిఎస్‌ఈ
Websiteఅధికారిక జాలస్థలి

సంక్షిప్తంగా దీన్ని జేఎన్వీ నిజాంసాగర్ అని పిలుస్తారు.[1][2]

చరిత్ర

మార్చు

1986లో నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఈ నవోదయ విద్యాలయాలు చేయబడ్డాయి. వాటిల్లో ఒకటి ఈ జేఎన్వీ నిజాంసాగర్.

ప్రవేశ విధానం

మార్చు

ప్రతి సంవత్సరం 6వ తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారు. ప్రతి సంవత్సరం సుమారు 10000 నుండి 20000 దరఖాస్తులు వస్తాయి, జేఎన్వీఎస్టి(JNVST) ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగుతుంది. తరగతులు 9 ఇంకా 11 లో కూడా పాఠశాలలో ఉన్న ఖాళీలను బట్టి దరఖాస్తుల ద్వారా ప్రవేశం ఉంటుంది.

విద్య, వసతి

మార్చు

ఈ పాఠశాలలో 6 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు చదువు చెప్తారు. అన్ని తరగతుల వారికి సి.బి.యస్.ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉంటుంది.ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో పాఠశాల భవనం, విద్యార్థులకు ఇంకా ఉపాధ్యాయులకు వసతి గృహములు ఉన్నాయి. ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఉంది.

ఇవి కూడా చూడండి

మార్చు

జవహర్ నవోదయ విద్యాలయం

మూలాలు

మార్చు
  1. "home". www.navodaya.gov.in. Retrieved 2021-07-06.
  2. "Wayback Machine". web.archive.org. 2013-03-30. Archived from the original on 2013-03-30. Retrieved 2021-07-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)