జష్పూర్ జిల్లా
ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో జశ్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా జశ్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా సరిహద్దులలో జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం.[1] జాస్‌పుర్ పట్టణంలో ప్రముఖ సేవాసంస్థ, అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమ కేంద్ర కార్యాలయాన్ని స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా అనేక శాఖలతో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తోంది.
జశ్‌పూర్ జిల్లా
जशपुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్గఢ్ |
ముఖ్య పట్టణం | జశ్‌పూర్ నగర్ |
మండలాలు | 8 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 |
• శాసనసభ నియోజకవర్గాలు | 4 |
విస్తీర్ణం | |
• మొత్తం | 5,838 కి.మీ2 (2,254 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 8,51,669 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82% |
• లింగ నిష్పత్తి | 1000:1005 |
ప్రధాన రహదార్లు | 1(NH-43) |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
మార్చుబ్రిటిష్ రాజ్ పాలనా సమయంలో " ఈస్టర్న్ స్టేట్ ఏజంసీకి " జశ్‌పూర్ పట్టణం జశ్‌పూర్ రాజసంస్థానానికి రాజధానిగా ఉండేది.[2]
భౌగోళికం
మార్చుజిల్లా ఉత్తర దక్షిణాల పొడవు 150 కి.మీ. అలాగే తూర్పు, పడమర వెడల్పు 85 కి.మీ. జిల్లా వైశాల్యం 6,205చ.కి.మీ. జిల్లా 22° 17′, 23° 15′ డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83° 30′, 84° 24′ తూర్పు రేఖాంశంలో ఉంది.
- జశ్‌పూర్ 2 విభాగాలుగా విభజించబడింది : ఉత్తర పర్వత ప్రాంతం, నీచ్‌ఘాట్ అని పిలువబడే దక్షిణ భూభాగం.ఉత్తర భూభాగం లోరోఘాట్‌లో మొదలై కస్తురా, నారాయణపూర్, సుర్గుజా సరిహద్దులో ఉన్న బగీచా వరకు సాగుతుంది. ఈ ప్రాంతం సంరక్షిత అరణ్యాలుగా నిర్ణయించిన అరణ్యాలతో నిండి ఉంటుంది. సన్నా, బగీచా, నారాయణపూర్ అరణ్యాలతో నిండి ఉంది. సముద్రమట్టానికి 1200 ఎత్తున ఉన్న ఎగువభూభాగ పీఠభూమి వైశాల్యం 1384 చ.కి.మీ. ఇది దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. ఈ పీఠభూమిని పాత్ అంటారు. ఎగువభూములను లోరోఘాట్ నుండి పైకి పోతూఉంది. లోరోఘాట్ 3 టర్నిగ్ పాయింట్లతో 4కి.మీ పొడవు ఉంటుంది. నీచ్ఘాట్ సాధారణంగా చదరంగా ఉంటుంది. అయినా ఈ భూభాగంలో ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. జశ్‌పూర్, రాయ్‌పూర్ రహదారిలో వద్ద ఉన్న 2 ఘాట్ రోడ్లలో ఒకటి కంసబెల్ ముందున్న జండాఘాట్ అలాగే మరొకటి కంసబెల్ తర్వాత ఉన్న బాలాఘాట్.
పట్టణాలు
మార్చుజాతీయరహదారి 78లో జిల్లాలోని ప్రధాన పట్టణాలు (ఎగువ భూములలో లోడం, ఘోలెంగ్, జశ్‌పూర్, కుంకురి, బందర్చువాన్, కంసబెల్, లడెగ్, పత్తలగొయన్) ఉన్నాయి.
- జశ్‌పూర్ నుండి పోతున్న రహదార్లు :
- జష్పూర్ రాంచీ. మనోరా, కుస్మి (170) ద్వారా
- జష్పూర్ అంబికాపూర్ . సన్న బగీచా (కిమీ 170 & ఎన్.బి.ఎస్.పి ) ద్వారా
- జష్పూర్ అంబికాపూర్. ఈ 2, 3 వాతావరణ రోడ్డు కాదు. కుంకురి, పత్తల్గొయన్ ద్వారా
- జష్పూర్ అంబికాపూర్ (200 కిమీ). నారాయణపూర్, బగీచా ద్వారా
- జష్పూర్ అంబికాపూర్.
చరిత్ర
మార్చుజిల్లా లోని నిచ్ఘత్ ప్రాంతంలోని కున్‌కురి అత్యంత వేడి ప్రదేశం. అలాగే ఎగువ పర్వతభూభాగంలో ఉన్న పంద్రపతి జిల్లాలో అత్యంత చల్లని ప్రదేశం. ఇది అరణ్యప్రాంతంలో ఉంది. రాయ్‌ఘర్, అంబికాపూర్‌ల లేక జశ్‌పూర్ మధ్య ఇది కూడలి ప్రాంతం.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 852,043, [3] |
ఇది దాదాపు. | క్వతార్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 473వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 146 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.65%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1004:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.6%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Qatar 848,016 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
South Dakota 814,180
వెలుపలి లింకులు
మార్చు- అధికారిక వెబ్సైటు
- [1] List of places in Jashpur
- Tribes of Jashpur District Archived 2007-10-30 at the Wayback Machine
- Tourism in Jashpur District Archived 2007-09-28 at the Wayback Machine