జసియా అక్తర్
జసియా అక్తర్ రాజస్థాన్ తరపున ఆడుతున్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె కుడిచేతి వాటం బ్యాటర్.[1][2] గతంలో పంజాబ్, IPL ట్రైల్‌బ్లేజర్స్ తరఫున ఆమె ఆడింది.[3][4]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జసియా అక్తర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | షోపియన్, జమ్ము కాశ్మీర్, భారత దేశము | 1988 మే 27|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2020/21 | పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
2019 | IPL ట్రెయిల్ బ్లేజర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
2021/22–present | రాజస్థాన్ మహిళా క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||
2023–present | ఢిల్లీ క్యాపిటల్స్ (WPL) | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2023 ఫిబ్రవరి 8 |
జీవిత విశేషాలు
మార్చుఆమె జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో బ్రారీ పోరా గ్రామంలో 1988 మే 27న జన్మించింది. ఐదుగురు సంతానంలో ఆమె రెండవది. తండ్రి చిన్న ఆపిల్ పండ్ల తోట వ్యవసాయము చేసుకునే రైతు. తల్లి గృహిణి. చిన్నతనము నుంచి క్రికెట్ ఆట అంటే మక్కువ చూపించేది. ఆమెకు క్రికెట్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, హర్మాన్ ప్రీత్ కౌర్లు అంటే చాల అభిమానము.
విద్యార్థిగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్రికెట్, సాఫ్ట్‌బాల్, కబడ్డీతో సహా పలు రకాల క్రీడల కోసం ఆమె అనేక U-17, U-19 జాతీయ పోటీలలో పాల్గొంది. 2005లో, ఆమె భోపాల్‌లో జరిగిన క్రికెట్ U-19 బాలికల టోర్నమెంట్‌లో పాల్గొంది. జాతీయ స్కూల్ గేమ్స్‌లో J & K U-19 జట్టు స్వర్ణం సాధించడంలో సహాయపడింది. పహల్గామ్‌లోని పి.టి ఉషా అకాడమీలో అథ్లెట్‌గా ఎంపికయ్యే అవకాశం కూడా ఆమెకు లభించింది.
జసియా తండ్రి ఆమెకు వృత్తిపరమైన క్రికెట్ అభిరుచికి ఆర్థికంగా మద్దతు ఇవ్వలేకపోయాడు. కాబట్టి, ఆమె 2007 నుండి 2011 వరకు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. అయితే ఆమె గురువు ఖలీద్ హుస్సేన్ ప్రోత్సాహంతో ఆటపై దృష్టి సారించింది. ఆమె చివరికి క్రికెట్ లో స్థిరపడింది.
క్రికెట్ విశేషాలు
మార్చుజసియా 2012లో భారతదేశంలో ఉత్తర మండలానికి చెందిన జమ్మూ కాశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహించింది. అప్పుడు కాశ్మీర్‌లో క్రికెట్ కు తగిన సౌకర్యాలు లేకపోవడంతో 2013లో పంజాబ్‌కు వెళ్ళింది. అక్కడ ఆమె తన శిక్షకుడైన రంజిత్ సింగ్ సలహాతో అమృతసర్ లోని గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీలో చేరి జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడటం ఆరంభించి మొదటి రెండు మాచ్ లలోనే 65, 206 పరుగులు తీయడముతో జాతీయ శిబిరానికి ఎంపిక అయి క్రమంగా రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించింది.
పంజాబ్ జట్టు తరఫున ఆమె దాదాపు 40 వన్డేలు, టీ20ల్లో పాల్గొంది. ఆమె 2014లో ఢాకా క్రికెట్ లీగ్‌లో రూపాలి బ్యాంక్‌కు ప్రాతినిధ్యం వహించి, బంగ్లాదేశ్‌లో క్రికెట్ ఆడిన మొదటి జమ్మూ కాశ్మీరీ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమె ఏడు మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేసి పోటీలో మొత్తానికి రెండో స్థానానికి వచ్చింది.[5]
2017 సెప్టెంబరులో, అక్తర్ భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు తరపున ఆడటానికి ఎంపిక చేసారు. జసియా జమ్మూ కాశ్మీర్ నుండి జాతీయ శిబిరానికి ఎంపికైన మొదటి మహిళా క్రికెటర్.[6]
ఆమె 2018లో ఇండియా రెడ్ మహిళల జట్టులో చేరింది. 2019 మహిళల ఛాలెంజర్ ట్రోఫీ వన్డే పోటీలో వారి తరపున ఆడింది. జసియా 2021లో రాజస్థాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన తొమ్మిది ఆటలలో, సీనియర్ మహిళల వన్డే పోటీలలో రెండు శతకాలు ఒక యాభైతో సహా 501 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. 2023 ఫిబ్రవరి 13న, ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఆడటానికి ఎంపిక చేసారు. తద్వారా WPL ఆడిన మొదటి కాశ్మీరీ మహిళా క్రికెట్ క్రీడాకారిణిగా ఆమె పేరు నమోదు చేసుకుంది.[5]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Player Profile: Jasia Akhtar". ESPNcricinfo. Retrieved 8 February 2023.
- ↑ "Player Profile: Jasia Akhtar". CricketArchive. Retrieved 8 February 2023.
- ↑ "Jasia Akhtar: Top Kashmiri woman cricketer who plays for Punjab". Greater Kashmir. Archived from the original on 14 December 2018. Retrieved 12 October 2020.
- ↑ "Sachin fan, Kashmir's first woman IPL player dreams of playing for India".
- ↑ 5.0 5.1 Patil, Preeti (16 May 2023). "Jasia Akhtar: First Woman Cricketer From Kashmir Making It To Women's National Cricket Team". Feminism In India. Retrieved 29 August 2023.
- ↑ "Kashmiri cricketer Jasia Akhtar nurtures big dreams after national camp call-up". Hindustan Times. Retrieved 12 October 2020.
బాహ్య లింకులు
మార్చు- జసియా అక్తర్ at ESPNcricinfo
- Jasia Akhtar at CricketArchive (subscription required)
- https://www.outlookindia.com/sports/shopian-villages-celebrate-as-jasia-akhtar-gets-picked-in-women-s-premier-league-news-262227
- https://wikibio.in/jasia-akhtar/
- https://starsunfolded.com/jasia-akhtar/
- https://www.dnaindia.com/cricket/report-meet-delhi-capitals-cricketer-jasia-akhtar-her-inspiring-journey-from-getting-threats-from-terrorists-to-wpl-3028318