జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల

గుంటూరు నగరంలో వెలిసిన విద్యాసంస్థ

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల (జెకెసి. కళాశాల):గుంటూరు నగరంలో వెలిసిన విద్యాసంస్థ. విద్యాదాత, దానశీలి జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి పేరు మీదుగా దీన్ని స్థాపించారు.[1] కుప్పుస్వామి, గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షునిగా వ్యవహరించాడు.[2] ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ శాసన మండలికి 18 సంవత్సరాలు సభ్యునిగా వ్యవహరించాడు. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఆద్వర్యంలో కుప్పుస్వామి కుమారుడు జాగర్లమూడి చంద్రమౌళి ఈ కళాశాలను 1968లో స్థాపించారు[1].

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల
శీలేన శోభితే విద్యా
ఇతర పేర్లు
జెకెసి కళాశాల
నినాదంఅత్యున్నత ప్రమాణాలతో గ్రామీణ విద్యార్దులకు ఉన్నత విద్యను అందించి వారికి ఉజ్వల భవిషత్తును కల్పించుట.
రకండిగ్రీ కళాశాల, అటానమస్ కళాశాల
స్థాపితం1968
స్థానంగుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాలగూడుhttps://www.jkcc.ac.in/

గుర్తింపులు

మార్చు

2016లో నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ద్వారా కళాశాలకు ఎ గ్రేడ్ లభించింది.[3] యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా కూడా ఈ కళాశాల గుర్తింపు పొందింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "J K C College". Archived from the original on 2009-03-18. Retrieved 2016-12-24.
  2. Census of India, 1961, Vol. 2, Part 2, Issue 21; p. 19
  3. "18 SC 2nd cycle" (PDF). naac.gov.in. Retrieved 18 Feb 2017.

బయటి లంకెలు

మార్చు