జాణవులే నెరజాణవులే

జాణవులే నెరజాణవులే ఆదిత్య 369 చిత్రం కోసం వేటూరి సుందరరామమూర్తి రచించిన పాట. దీనికి ఇళయరాజా సంగీతాన్నందించగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,జిక్కి, ఎస్.పి.శైలజ గానం చేసారు. సినిమాలో బాలకృష్ణ, మోహిని నటించారు.[1]

సినిమా పోస్టరు

జాణవులే నెరజాణవులే వరవీణవులే కిలికించి తాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో
గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో ||

మోమటుదాచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల
చెలి పై యెదలో తుంగ అలా పొంగే ఈవేళ
మరియాదకు విరిపనుపు సవరించవేమిరా ||

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నారతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా ||

మూలాలు

మార్చు
  1. "Aditya 369 Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-22. Archived from the original on 2016-11-20. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు

మార్చు