జాతీయ అంతరిక్ష దినోత్సవం

చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.[1] 2023 ఆగస్టు 23 న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్ ను, రోవర్ ను చంద్రుని పై విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా ఒక మైలురాయిను చేరుకుంది.[2] ఈ విజయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోదీ, ఆగస్టు 23 ను భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్ణయించాడు.[3]

మూలాలు

మార్చు
  1. "PM Modi announces August 23 as 'National Space Day', lauds Isro scientists". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-08-26. Retrieved 2023-08-27.
  2. Noor, Sherina (2021-05-07). "National Space Day". National Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-27.
  3. "National Space Day". Days Of The Year (in ఇంగ్లీష్). 2024-05-03. Retrieved 2023-08-27.