జాతీయ ఓటర్ల దినోత్సవం

ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటారు

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.[1]

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ
ప్రాముఖ్యతకొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు
జరుపుకొనే రోజుజనవరి 25

ఏర్పాటు

మార్చు

ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రంలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.

ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.

మూలాలు

మార్చు
  1. ప్రజాశక్తి (24 January 2019). "ఓటరుడా మేలుకో." Archived from the original on 25 January 2019. Retrieved 25 January 2019.