భారతదేశ ప్రధానమంత్రి

(ప్రధానమంత్రి నుండి దారిమార్పు చెందింది)

భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ అధినేత.[2][3] ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం నామమాత్రం కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి, మంత్రి వర్గం వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.[4][5] లోక్‌సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి నాయకుడే సాధారణంగా ప్రధానమంత్రి అవుతారు.[6]

భారత ప్రధానమంత్రి
అధికారిక చిత్రం -2022 మార్చి 15
Incumbent
నరేంద్ర మోదీ

since 26 మే 2014 (2014-05-26)
ప్రధానమంత్రి కార్యాలయం
విధం
రకంప్రభుత్వాధినేత
స్థితికార్యనిర్వాహక నేత
AbbreviationPM
సభ్యుడు
రిపోర్టు టు
అధికారిక నివాసం7, లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూ ఢిల్లీ
స్థానంPrime Minister's Office, South Block, Central Secretariat, Raisina Hill, New Delhi, Delhi, India
Nominatorలోక్‌సభ సభ్యులు
నియామకంభారత రాష్ట్రపతి
by convention, based on appointee's ability to command confidence in the Lok Sabha
కాలవ్యవధిAt the pleasure of the President
Lok Sabha term is 5 years unless dissolved sooner
No term limits specified
స్థిరమైన పరికరంArticles 74 & 75, Constitution of India
అగ్రగామిVice President of the Executive Council
నిర్మాణం15 ఆగస్టు 1947; 77 సంవత్సరాల క్రితం (1947-08-15)
మొదట చేపట్టినవ్యక్తిజవాహర్‌లాల్ నెహ్రూ
ఉపఉప ప్రధాని
జీతం
  • 2,80,000 (US$3,500) (per month)[1]
  • 33,60,000 (US$42,000) (Annual)[1]
నరేంద్ర మోడీ

భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. ప్రధానమంత్రి, తన మంత్రివర్గంతో సహా అన్నివేళలా లోక్‌సభకు జవాబుదారీగా ఉంటారు.[7][8]

ప్రధానమంత్రి నియామకం

మార్చు

ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. లోక్‌సభలో ఆధిక్యత కలిగిన పార్టీకి చెందిన నాయకుడిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు. కాని, ఏ ఒక్క పార్టీకి కూడా పూర్ణ ఆధిక్యత (సభ్యుల సంఖ్యలో సగానికంటే ఒకటి ఎక్కువ) లేనపుడు, అత్యధిక సభ్యుల మద్దతు కలిగిన సంకీర్ణ నాయకుడిని గాని, లోక్‌సభలో అత్యధికుల మద్దతు కూడగట్టగలిగిన అతిపెద్ద పార్టీ నాయకుడిని గాని రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు.

విధులు, అధికారాలు

మార్చు

ప్రధానమంత్రి తన విధుల నిర్వహణలో సహాయపడేందుకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రధాని ఎంపిక చేసిన సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు.[9] మంత్రుల ప్రమాణం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. మంత్రుల శాఖలను ప్రధానమంత్రి కేటాయిస్తాడు. మంత్రులను తొలగించే అధికారం ప్రధానమంత్రిదే. మంత్రివర్గ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తాడు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సాధన, వివాదాల పరిష్కారం ప్రధానమంత్రి బాధ్యత. ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు.

రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రధాన ఎన్నికల కమిషనరు, ప్రధాన విజిలెన్సు కమిషనరు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, న్యాయమూర్తులు మొదలనిన వారి నియామకాల్లో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. పార్లమెంటు సమావేశాలు, లోక్‌సభను రద్దు చేయడం, ఎమర్జెన్సీ ప్రకటన, యుద్ధ ప్రకటన, యుద్ధ విరమణ మొదలైన కీలక ఆంశాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తాడు.[10]

ప్రధానమంత్రుల జాబితా

మార్చు

స్వాతంత్ర్యం తరువాత 14 మంది ప్రధానమంత్రులుగా పనిచేసారు. [a] జవహర్‌లాల్ నెహ్రూ నాలుగు సార్లు చేసాడు (1947-1952, 1952-1957, 1957-1962, 1962-1964).[11] ఇందిరా గాంధీ మూడు సార్లు (1966-1971, 1971-1977, 1980-1984), అటల్ బిహారీ వాజపేయి మూడు సార్లు (1996, 1998-1999, 1999-2004) ప్రధానమంత్రిగా పనిచేసాడు. గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసినా, ఆపద్ధర్మ ప్రధానిగా మాత్రమే చేసాడు. నరేంద్ర మోదీ రెండుసార్లు (2014-2019, 2019-) ప్రధానమంత్రి అయ్యాడు. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోది.[12]

స్వాతంత్ర్యం తరువాత, 30 ఏళ్ళపాటు కాంగ్రెసు పార్ఠీకి చేందిన వారే ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చారు. 1977లో మొట్టమొదటి సారిగా మొరార్జీ దేశాయ్ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. భారతీయ జనతా పార్టీకు చెందిన అటల్ బిహారీ వాజపేయి 1996లో మొదటిసారి ఎన్నికయ్యాడు. మళ్ళీ, 1998లో ప్రధానమంత్రి అయ్యాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెసు నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలోకి వచ్చి డా.మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు.

ప్రధాని అధికార నివాసం

మార్చు

జాబితా

రంగుల సూచీ: కాంగ్రెసు
భారత జాతీయ కాంగ్రెస్
జనతా
జనతా పార్టీ
దళ్
జనతా దళ్
భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ
క్ర్ సం. పేరు నుండి వరకు పార్టీ
01 జవహర్‌లాల్ నెహ్రూ ఆగష్టు 15, 1947 మే 27, 1964 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా మే 27, 1964 జూన్ 9, 1964 కాంగ్రెస్
02 లాల్ బహదూర్ శాస్త్రి జూన్ 9, 1964 జనవరి 11, 1966 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా జనవరి 11, 1966 జనవరి 24, 1966 కాంగ్రెస్
03 ఇందిరా గాంధీ జనవరి 24, 1966 మార్చి 24, 1977 కాంగ్రెస్
04 మొరార్జీ దేశాయ్ మార్చి 24, 1977 జూలై 28, 1979 జనతా పార్టీ
05 చరణ్‌సింగ్ జూలై 28, 1979 జనవరి 14, 1980 జనతా పార్టీ
** ఇందిరా గాంధీ జనవరి 14, 1980 అక్టోబర్ 31, 1984 కాంగ్రెస్
06 రాజీవ్ గాంధీ అక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989 కాంగ్రెస్***
07 వి.పి.సింగ్ డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990 జనతా దళ్
08 చంద్రశేఖర్ నవంబర్ 10, 1990 జూన్ 21, 1991 జనతా దళ్
09 పి.వి.నరసింహారావు జూన్ 21, 1991 మే 16, 1996 కాంగ్రెస్
10 అటల్ బిహారీ వాజపేయి మే 16, 1996 జూన్ 1, 1996 భారతీయ జనతా పార్టీ
11 దేవెగౌడ జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997 జనతా దళ్
12 ఐ.కె.గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998 జనతా దళ్
** అటల్ బిహారీ వాజపేయి మార్చి 19, 1998 మే 22, 2004 భారతీయ జనతా పార్టీ
13 డా.మన్మోహన్ సింగ్ మే 22, 2004 మే 25, 2014 కాంగ్రెస్ సంకీర్ణం
14 నరేంద్ర మోడీ మే 26, 2014 భారతీయ జనతా పార్టీ
రంగుల సూచీ: కాంగ్రెసు
భారత జాతీయ కాంగ్రెస్
జనతా
జనతా పార్టీ
దళ్
జనతా దళ్
భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ
  • * ఆపద్ధర్మ
    ** మళ్ళీ అధికారానికి వచ్చారు
    *** ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చీలి కాంగ్రెస్ ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.

ప్రధానమంత్రుల జీవితకాలం, పదవీకాలం

మార్చు
నరేంద్ర మోదీమన్మోహన్ సింగ్ఐ.కె.గుజ్రాల్దేవెగౌడఅటల్ బిహారీ వాజపేయిపి.వి. నరసింహారావుచంద్రశేఖర్విశ్వనాథ్ ప్రతాప్ సింగ్రాజీవ్ గాంధీచరణ్ సింగ్మొరార్జీ దేశాయ్ఇందిరా గాంధీలాల్ బహదూర్ శాస్త్రిగుల్జారీలాల్ నందాజవాహర్‌లాల్ నెహ్రూ

నోట్స్

మార్చు
  1. Not including Gulzarilal Nanda who served, twice, as acting prime minister.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 as per Section 3 of "The Salaries and Allowances of Ministers Act 1952 and the rules made thereunder" (PDF). Ministry of Home Affairs. Retrieved 28 January 2019.
  2. Pillay, Anashri (2019), "The Constitution of the Republic of India", in Masterman, Roger; Schütze, Robert (eds.), Cambridge Companion to Comparative Constitutional Law, Cambridge University Press, pp. 146–147, doi:10.1017/9781316716731, ISBN 978-1-107-16781-0, LCCN 2019019723, S2CID 219881288,  The head of government is the Prime Minister.
  3. Dam, Shubhankar (2016), "Executive", in Choudhry, Sujit; Khosla, Madhav; Mehta, Pratap Bhanu (eds.), The Oxford Handbook of the Indian Constitution, Oxford and New York: Oxford University Press, p. 307, ISBN 978-0-19-870489-8, The Prime Minister is the head of government.
  4. Pillay, Anashri (2019), "The Constitution of the Republic of India", in Masterman, Roger; Schütze, Robert (eds.), Cambridge Companion to Comparative Constitutional Law, Cambridge University Press, pp. 146–147, doi:10.1017/9781316716731, ISBN 978-1-107-16781-0, LCCN 2019019723, S2CID 219881288,  An elected President is the nominal head of state but exercises little power.
  5. Majeed, Akhtar (2005), "Republic of India", in Kincaid, John; Tarr, G. Alan (eds.), Constitutional Origins, Structure, and Change in Federal Countries, A Global Dialogue on Federalism, Volume I, Montreal & Kingston: McGill-Queen's University Press for Forum of Federation and International Association of Centers for Federal Studies, pp. 180–207, 185, ISBN 0-7735-2849-0,  ...The president is the constitutional head. (p. 185)
  6. Britannica, Eds. Encycl. (20 February 2020), "List of prime ministers of India", Encyclopaedia Britannica, Encyclopædia Britannica, Inc., retrieved 2 April 2022,  the prime minister, who is chosen by the majority party or coalition in the Lok Sabha (lower house of parliament) is formally appointed by the president.
  7. Dam, Shubhankar (2016), "Executive", in Choudhry, Sujit; Khosla, Madhav; Mehta, Pratap Bhanu (eds.), The Oxford Handbook of the Indian Constitution, Oxford and New York: Oxford University Press, p. 307, ISBN 978-0-19-870489-8,  Along with his or her cabinet, the Prime Minister is responsible to the Lower House of Parliament.
  8. Majeed, Akhtar (2005), "Republic of India", in Kincaid, John; Tarr, G. Alan (eds.), Constitutional Origins, Structure, and Change in Federal Countries, A Global Dialogue on Federalism, Volume I, Montreal & Kingston: McGill-Queen's University Press for Forum of Federation and International Association of Centers for Federal Studies, pp. 180–207, 185, ISBN 0-7735-2849-0,  ...Both for the Union and the states, a "cabinet-type" system of parliamentary government has been instituted in which the executive is continuously responsible to the legislature. (p. 185)
  9. "Prime Minister and the Cabinet Ministers". pmindia.nic.in. Archived from the original on 20 April 2008. Retrieved 5 June 2008.
  10. "(Allocation of Business) Rules 1961". cabsec.nic.in. Archived from the original on 30 April 2008. Retrieved 5 June 2008.
  11. "A Man Who, with All His Mind and Heart, Loved India". Life. 5 June 1964. p. 32.
  12. "Narendra Modi appointed Prime Minister, swearing in on May 26". The Times of India. New Delhi. Press Trust of India. 20 May 2014. OCLC 23379369. Retrieved 6 April 2018.
  13. "PM chairing meeting on CWG". sify.com. Archived from the original on 11 August 2011. Retrieved 20 April 2021.

బయటి లింకులు

మార్చు