జాతీయ గ్రంథాలయ దినోత్సవం
జాతీయ గ్రంథాలయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ గుర్తుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.
జాతీయ గ్రంథాలయ దినోత్సవం | |
---|---|
యితర పేర్లు | గ్రంథాలయ దినోత్సవం |
జరుపుకొనేవారు | భారతదేశం |
జరుపుకొనే రోజు | ఆగష్టు 12 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రారంభం
మార్చులెక్కల ప్రొఫెసరైన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 1923లో మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరాడు. తనకు దొరికిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, 1924లో క్లాసిఫికేషన్, 1933లో గ్రంథాలయ కేటలాగుల్ని తయారుచేయడానికి ఒక కొత్త కోడ్‌ను రూపొందించాడు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ పద్ధతిని దేశంలోని అనేక గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.[1][2]
భారతదేశంలో అకడమిక్ లైబ్రరీలతోపాటు, పబ్లిక్ లైబ్రరీలలో అభివృద్ధికి, గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషంగా కృషి చేసిన ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజైన ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నారు.[3]
కార్యక్రమాలు
మార్చు- ఈ దినోత్సవం సందర్భంగా భారతదేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఎస్.ఆర్ రంగనాథన్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు.
- విద్యార్థినివిద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, క్విజ్ వంటి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు.
మూలాలు
మార్చు- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (12 August 2019). "పుస్తకాన్ని ప్రేమించు.. విజ్ఞానాన్ని సంపాదించు!". www.andhrajyothy.com. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
- ↑ డైలీహంట్, ప్రజాశక్తి (12 August 2018). "జ్ఞాన బడి.. గ్రంథాలయ ఒడి". www.dailyhunt.in (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.