జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.[1] భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి రోజును జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపబడుతుంది.[2]
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | భారతదేశం |
జరుపుకొనే రోజు | మే 21 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రారంభం , చరిత్ర
మార్చు1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదుర్ ఎన్నికల ప్రచారంలో ఎల్.టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్ గాంధీ మరణించాడు. ఆయన చనిపోయిన నాటినుండి విపి సింగ్ ప్రభుత్వం హయాంలో మే 21 తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించబడింది.[3] శాంతి, సామరస్యం, మానవజాతి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కూడా ఈ రోజును జరుపుకుంటారు.
ఇతర వివరాలు
మార్చు- తీవ్రవాద చర్యలు రూపుమాపి, దేశప్రజలు సహజీవనంతో మెలగాలన్నది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దశ్యం.
- తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారిచే తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
- ↑ విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
- ↑ మన తెలంగాణ, సంపాదకీయం (21 May 2019). "అభివృద్ధికి అడ్డు ఉగ్రవాదం". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.