జాతీయ పించను పథకం


జాతీయ పింఛను పథకం (ఆంగ్లం: National Pension System)[2] 2004 తరువాత చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంప్రదాయ పించను పద్ధతిని రద్దు చేసి కొత్త పించను పతాకాన్ని ప్రవేశ పెట్టారు. అదే జాతీయ పించను విధానము / నేషనల్ పెన్షన్ సిస్టం. తరువాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టం లేదా ఎన్.పి.ఎస్ ను తప్పనిసరి చేశాయి. నేషనల్ పెన్షన్ సిస్టం సంప్రదాయ పించను విధానానికి చాలా భిన్నమైనది. ఇక్కడ ఒక ఉద్యోగి పించను ఎంత అనేది అతడు తన ఉద్యోగాకాలంలో ఎంత పించను నిధికి జమ చేసాడు, దానిపై ఎంత రాబడి వచ్చింది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. 18 నుండి 60 సంవత్సరాల మధ్యవయస్కులు ఎవరైనా నేషనల్ పెన్షన్ సిస్టంలో సభ్యులుగా చేరవచ్చు. ఎన్.పి.ఎస్ ను పించను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ / పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పి.ఎఫ్.ఆర్.డి.ఎ.) నియంత్రిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టంలో రెండు ఖాతాలు ఉంటాయి – ఒక ప్రాథమిక టయర్-I ఖాతా, ఐచ్చిక టయర్ –II ఖాతా. టయర్-I ఖాతాలోని మొత్తాన్ని 60 సంవత్సరాలు నిండినంతవరకు ఉపసంహరించుకోవడం వీలుపడదు. టయర్ –II ఖాతా ఐచ్చికం (optional). ఇందులో జమచేసే మొత్తాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, తిరిగి జమ చేయవచ్చు. ఈ ఖాతాలలో జమ చేయబడిన మొత్తాన్ని వివధ నిధి నిర్వాహకులు (ఫండ్ మేనేజర్స్) స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఈ విధంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో భవిష్య నిధిలాగా నిర్ణీత వడ్డీ, నిర్ణీత రాబడి ఉండదు. ఎన్.పి.ఎస్ పై వచ్చే రాబడి స్టాక్ మార్కెట్ల కదలికలపై, సూచీల (ఇండెక్స్) గమనంపై ఆధారపడి ఉంటుంది.[3]

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (NPS ట్రస్ట్)
రకంపెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ
పరిశ్రమపెన్షన్ ఫండ్
స్థాపన2014; 10 సంవత్సరాల క్రితం (2014)
స్థాపకుడుభారత ప్రభుత్వం
ప్రధాన కార్యాలయంన్యూ ఢిల్లీ, భారతదేశం
కీలక వ్యక్తులు
మునీష్ మాలిక్ (CEO)
AUMIncrease 6,03,667.02 crore (US$76 billion) (2021)
యజమానిపెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇండియా
వెబ్‌సైట్https://enps.nsdl.com/eNPS/
Footnotes / references
[1]

కనిష్ట, గరిష్ట జమ

మార్చు
  • టయర్-I ఖాతా : కనీస వార్షిక జమ రూ. 6,000/- (ఒక సారి కనిష్ఠ జమ రూ. 500/-), గరిష్ఠ జమపై నియంత్రణ లేదు.
  • టయర్ –II ఖాతా : కనీస వార్షిక జమ రూ. 2,000/- (ఒక సారి కనిష్ఠ జమ రూ. 250/-), గరిష్ఠ జమపై నియంత్రణ లేదు.

01.01.2004 తరువాత చేరిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఎన్.పి.ఎస్ తప్పనిసరి. వారికి సాంప్రదాయ పించను విధానం (డిఫైనడ్ బెనిఫిట్ పెన్షన్ సిస్టం) కానీ ప్రభుత్వ భవిష్య నిధి (గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ / జి.పి.ఎఫ్) కానీ వర్తించవు. ప్రతి ఉద్యోగికీ ఒక శాశ్వత పదవీవిరమణ ఖాతా సంఖ్య (పెర్మేనంట్ రిటైర్మెంట్ ఎకౌంటు నెంబర్ / పి.ఆర్.ఎ.ఎన్. / ప్రాన్) ఇవ్వబడుతుంది. ఒక ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారినప్పటికీ ప్రాన్ ను బదిలీ చేసుకోవచ్చు. ఇందులో రెండు ఖాతాలు ఉంటాయి. టయర్ – I ఖాతా కచ్చితమైనది. ఉద్యోగుల నెలసరి ప్రాథమిక వేతనం, కరువు భత్యం (బేసిక్ పే + డియర్నెస్ అలవెన్స్) లలో 10% ప్రాన్ ఖాతాకు జమచేయబడుతుంది. దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ టయర్ –I ఖాతానుండి 60 సంవత్సరాలవరకు ఉపసంహరనలకు వీలులేదు. ఉద్యోగి ఒక ఐచ్చిక టయర్ –II ఖాతా తెరచి అందులో కూడా జమ చేయవచ్చు. టయర్ –II ఖాతాలకు ప్రభుత్వం జమ చేయదు, అందులో ఎన్ని సార్లైనా మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అలా జమ చేయబడిన మొత్తం ఫండ్ మేనేజర్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టబడుతుంది. ఉద్యోగికి 60 సంవత్సారాలు వచ్చిన తరువాత టయర్ –I ఖాతాలోని మొత్తంలో కనీసం 40% ఏదైనా ఒక గుర్తింపబడిన పించను పథకం కొనడానికి వినియోగించాలి. మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ 60 సంవత్సరాలకు ముందే పించను పథకం కోనేట్లయితే 80% మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఎన్.పి.ఎస్ కోసం ఎన్.యెస్.డి.ఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరి లిమిటెడ్) కేంద్రీయ సంలేఖనలు భద్రపరచు సంస్థ (సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ / సి.ఆర్.ఎ.) గా పనిచేస్తుంది. ఖాతాల నిర్వహణ, అకౌంటింగ్ ఇతరత్రా దీని విధులు.

మూలాలు

మార్చు
  1. "Annual Report & Audited Accounts for the Financial Year 2019-20" (PDF). National Pension System Trust (NPS Trust). 31 March 2020. Archived from the original (PDF) on 26 మే 2021. Retrieved 26 May 2021.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-12. Retrieved 2016-04-07.
  3. "Use NPS to save tax after exhausting Sec 80C limit". Retrieved 6 February 2016.

ఇతర లింకులు

మార్చు