జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ

జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (National Geophysical Research Institute or NGRI) భారతదేశంలోని భూమికి సంబంధించిన భౌతిక విషయాల మీద పరిశోధన చేసే ప్రభుత్వ సంస్థ. ఇది హైదరాబాదు నగరం యందు తెలంగాణ రాష్ట్రంలో ఉంది.

జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ
రకంAutonomous
స్థాపితం1961
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారత్

హైదరాబాదులో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన ఈ సంస్థ 1961లో ప్రారంభమై భూమి ఉపరితలం, భూగర్భంలో చోటుచేసుకున్న పరినామాలను, మార్పులను అధ్యనం చేస్తున్నది. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిశోధనలో వినూత్న పరిశోధనలకు శ్రీకారం చుట్టి, విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కీర్తి గడించింది. హైడ్రో కార్బన్లు, భూగర్భ వనరులు, భూకంప అధ్యయనం, ఖనిజాలు, జియోఫిజికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్, భూభౌతిక అధ్యయనం, జియోడైనమిక్స్ మొదలగు పలు అంశాల మీద అధ్యయనాలు చేస్తుంటారు. ఈ సంస్థలో ఉన్న మొత్తం 800 మంది శాస్త్రవేత్తలలో 200 మంది భూభౌతిక శాస్త్ర రంగంలో పరిసోధనలు చేస్తూంటారు.

ఈ సంస్థలో పనిచేసిన, పనిచేస్తున్న శాస్త్రవేత్తలు య్ంగ్ సైంటిస్టు, భట్నాగర్ ప్రైజ్, జాతీయ ఖనిజ అవార్డు, పద్మశ్రీ, ఫ్యాప్సీ, ఫిక్కీ మొదలగు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందుకున్నారు. 2006 వరకూ ఈ సంస్థ 38 పేటెంట్స్ దాఖలు చేసింది. ఈ సంస్థకు పరిసోధనల నిమిత్తం అందుతున్న నిధులు రూ.30.2 కోట్ల వరకు ఎగబాకింది (2005-06). నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాంపాద సాగర్, డ్యాం ల వద్ద అనాలాగ్ సెస్మోగ్రాఫ్ కేంద్రాలను, హైదరాబాద్, కడప, కొత్తగూడెం లలో సెస్మిక్ స్టేషన్లు ఏర్పాటు చేసి భూకంప తీవ్రతను అధ్యయనం చేస్తూంటారు.

బయటి లింకులు

మార్చు