జాతీయ వృద్ధుల దినోత్సవం

జాతీయ వృద్ధుల దినోత్సవం (నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే) ప్రతి సంవత్సరం ఆగస్టు 21న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. వృద్ధులకు మద్దతునిస్తూ వృద్ధుల శ్రేయస్సు,సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించి అభినందించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు[1].

జాతీయ వృద్ధుల దినోత్సవం
జరుపుకొనేవారుదేశవ్యాప్తంగా
ప్రారంభంఆగస్టు 21
ఆవృత్తివార్షికం
వృద్ధుల అశ్రమంలో వృద్ధులు ఉన్న దృశ్యచిత్రం

ప్రారంభం

మార్చు

1988, ఆగస్టు 19న అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రకటనపై సంతకం చేశారు, ఆగస్టు 21ను జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించాడు. దాని ఆధారంగా, వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 21ని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది.[2]భారతదేశంలో ప్రస్తుతం 15 కోట్లమందికి పైగా వృద్ధులున్నారు.

భారతదేశంలో

మార్చు

భారతదేశంల, అరవై లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను వృద్దులుగా (సీనియర్ సిటిజన్లు) అని పిలుస్తారు. వీరు దశాబ్దాలుగా జీవిస్తున్న జీవితం నుంచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాలతో సమాజానికి ఎంతో దోహదపడతారని, వస్తున్న యువతరంకు వివేకం, తెలివితేటలతో జీవితాన్ని ఎలా గడపాలో, సమాజాన్ని ఉద్ధరించడానికి, సీనియర్ సిటిజన్లు చేసిన కృషిని గౌరవించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు[3].

భారతదేశంలో వృద్దులకు కలిపిస్తున్న ఆర్థిక ప్రయోజనాలలో పోస్ట్ ఆఫీస్, బ్యాంకులలో వేసే సొమ్ముపై సాధారణ పౌరుల కంటే వీరికి ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లకు అర్హులు. వీరికి అందిస్తున్న ప్రయోజనాలలో పన్ను మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది, వారు వైద్య బిల్లులు, ఆరోగ్య భీమా ప్రీమియంలు, కొన్ని పథకాలలో పెట్టుబడి వంటి ఖర్చులకు మినహాయింపులను క్లెయిమ్ చేయవచ్చును. ప్రభుత్వాల నుంచి వచ్చే పెన్షన్ పథకాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) వంటి అనేక పెన్షన్ పథకాలు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. ఇంతేగాక ఆరోగ్య బీమా, రవాణా, భారతదేశం లోని కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్లకు ఆస్తి పన్ను మినహాయింపులను అందిస్తున్నాయి[4].

కార్యక్రమాలు

మార్చు
  1. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
  2. వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన వృద్ధులకు సత్కారాలు, సన్మానాలు చేస్తారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "World Senior Citizen's Day 2021: Date, History And Celebration". NDTV.com. Retrieved 2023-08-24.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (21 August 2019). "ఆ వయసులో ఆదరించాలి". www.andhrajyothy.com. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
  3. "World Senior Citizen Day 2023: Date, history, significance". https://www.hindustantimes.com/. 21 August 2024. Retrieved 21 August 2024. {{cite web}}: External link in |website= (help)
  4. "7 financial benefits of being a senior citizen in India". Financialexpress (in ఇంగ్లీష్). 2023-05-10. Retrieved 2024-08-21.

బయటి లింకులు

మార్చు