జాతీయ సేవా పథకం

భారత ప్రభుత్వ ప్రాయోజిత ప్రజా సేవా కార్యక్రమం

జాతీయ సేవా పథకం (National Service Scheme) భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరం ప్రారంభించబడిన యువజన కార్యక్రమం.ఈ పథకాన్ని ప్రారంభించి నేటికీ 50 సంవత్సరాలు.(సెప్టెంబర్ 24 2019)

జాతీయ సేవా పథకం యొక్క చిహ్నం.
జాతీయ సేవా పథకం యొక్క చిహ్నం.

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ, ఉద్యమాలలోనూ విద్యార్థులు పాలుపంచుకుంటారు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు కానీ కల్లాకపటం తేలియని నిర్మల మనస్కులు వీరు. వీరు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే, కాబట్టి సంఘసేవ (Social service) వాళ్ళకి బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.

ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం. అదేవిధంగా మనం పదిమందిలో ఉన్నప్పుడు మనవల్ల ఆ పదిమందికీ ప్రయోజనం వుండాలి- లేదా మనవల్ల మరొకరికి మేలు కలగాలి. ఆ విధంగా పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవ.

చరిత్ర సవరించు

డా. డి.ఎస్. కొఠారి (1964-66) నేతృత్వంలోని విద్యా కమీషన్, విద్య అన్ని దశలలో ఉన్న విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసింది. ఏప్రిల్ 1967 సంవత్సరంలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి వారి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే అప్పటికే విశ్వవిద్యాలయ దశలో, స్వచ్ఛంద ప్రాతిపదికన ఉనికిలో ఉన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) లో చేరడానికి విద్యార్థులను అనుమతించాలని, దీనికి ప్రత్యామ్నాయాన్ని నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) అని పిలువబడే కొత్త కార్యక్రమం రూపంలో వారికి అందించవచ్చని వారు సిఫార్సు చేశారు. 1969 సంవత్సరంలో సెప్టెంబరులో జరిగిన వైస్ చాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఈ సిఫారసు ప్రకారంగా,సమస్యను వివరంగా పరిశీలించడానికి వైస్ చాన్సలర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. భారత ప్రభుత్వ విద్యపై జాతీయ విధానం ప్రకటనలో, పని అనుభవం, జాతీయ సేవ విద్యలో అంతర్భాగంగా ఉండాలని నిర్దేశించబడింది. మే, 1969 సంవత్సరంలో, విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ప్రతినిధుల సమావేశం కూడా ఏకగ్రీవంగా 'జాతీయ సేవ జాతీయ సమైక్యతకు శక్తివంతమైన సాధనం కాగలదని ప్రకటించింది. పట్టణ విద్యార్థులను గ్రామీణ జీవితానికి పరిచయం చేయడానికి, తద్వారా దేశ పురోభివృద్ధికి, అభ్యున్నతికి విద్యార్థి సమాజం చేస్తున్న కృషికి చిహ్నంగా ఉంటుందని జాతీయ సేవా పథకం తీసుకరావడం జరిగింది. 1969 సెప్టెంబరు 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ పథకం అమలుకు సహాయం,సహకారాన్ని అడిగినారు[1].

ఉద్దేశ్యం సవరించు

వాలంటీర్ ల్లో దిగువ పేర్కొన్న లక్షణాలు/సామర్థ్యాలను అభివృద్ధి చేయడం కొరకు,'క్యాంపస్ అండ్ కమ్యూనిటీ', 'కాలేజ్ అండ్ విలేజ్', 'నాలెడ్జ్ అండ్ యాక్షన్' అనే లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.[2]

 • ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఏ సంఘం లేదా సమాజం (కమ్యూనిటీ)లో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవడానికి, దానికి సంబంధించి తమను తాము అర్థం చేసుకోవడానికి.
 • సమాజం(కమ్యూనిటీ) అవసరాలు, సమస్యలను గుర్తించడం వాటి సమస్యా పరిస్కారములో ఉండటం.
 • తమలో తాము సామాజిక, పౌర బాధ్యతల భావనను పెంపొందించుకోవడం.
 • వ్యక్తిగత,కమ్యూనిటీ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడంలో వారి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం.
 • కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని సమీకరించడంలో నైపుణ్యాలను పొందడం.
 • నాయకత్వ లక్షణాలను, ప్రజాస్వామిక విలువలను పెంచుకోవడం.
 • అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యాన్ని అభ్యసించడం.

'

కార్యక్రమాలు సవరించు

 1. కళాశాలను పరిశుభ్రంగా వుంచటం- తోటలు పెంచటం- రోడ్లు వెయ్యటం.
 2. పరిసర గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామంలో రోడ్లు వేయటం, మురికి వాడలను శుభ్రపరచడం, నిరక్షరాస్యులకి విద్య బోధించడం.
 3. ఆరోగ్య సూత్రాలను, వయోజన విద్య ఆవశ్యకతను, జనాభా సమస్య నివారణను ప్రజలకు తెలియజేయడం.
 4. వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమదాలలోనూ సహాయం చేయడం.
 5. ధనవంతుల నుండి విరాళాలు సేకరించి బీదవారికి, అనాథలకు సహాయపడటం.
 6. పొదుపు ఆవస్యకతను, అంటు వ్యాధుల వల్ల వచ్చే అరిష్టాలను అరికట్టే విధానాలను ప్రచారం చేయడం.

ఇవికూడా చూడండి సవరించు

బయటి లింకులు సవరించు

మూలాలు సవరించు

 1. "Organisation | National Service Scheme". nss.gov.in. Retrieved 2022-11-23.
 2. "National Service Scheme-Objectives of NSS". yas.nic.in/. 23 November 2022. Retrieved 23 November 2022.