జానకీ శపథం హరికథా పితామహునిగా గుర్తింపు పొందిన ఆదిభట్ల నారాయణదాసు రచించిన హరికథ.

కవి పరిచయం

మార్చు

ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహునిగా సుప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీత, సాహిత్య, నృత్య కళలను మేళవించి హరికథ అన్న కొత్త ప్రక్రియను తయారుచేసిన సృజనశీలి. హరికథా సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతూండడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. సంగీత విద్వాంసునిగా ఆయన విజయనగర సంస్థానాధీశుని అభిమానాన్ని చూరగొన్నారు. నడుముకు పైపంచ బిగించి, గంధం పెట్టుకుని, మెడలో మాలవేసి హరికథను ప్రారంభిస్తూ "శంభో" అని నినదిస్తే చుట్టుపక్కల గ్రామాలకు ఆయన కంఠం వినవచ్చేదంటారు. నోబెల్ బహుమతి అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు ఆదిభట్ల వారి అనితర సాధ్యమైన విస్తృత ప్రతిభకు ఆశ్చర్యపోయారు. ఆయన రచించిన పరిమితమైన హరికథల్లో ఇది ఒకటి.

మూలాలు

మార్చు