జాన్ నేపియర్
లాగరిధమ్స్ గురించి ఎంతోమందికి తెలుసు. క్లిష్టమైన సమస్యలను త్వరితగతిలో చేయాలంటే ఇప్పటికీ ఎంతో మంది లాగరిధమ్స్ నే ఉపయోగిస్తారు. క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చి లాగరిథంమ్స్ వాడకాన్ని తగ్గించాయి. కాని దాని వైశిష్ట్యాన్ని మాత్రం కొంచెంకూడా తగ్గించలేకపోయాయి. ఈ వేళ ఏ విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకున్నా లాగరిథమ్స్ వాడటం తప్పనిసరిగా జరుగుతోంది. అంత ప్రాముఖ్యాన్ని పొందిన లాగరిథమ్స్ సృష్టి కర్త జాన్ నేపియర్.
జాన్ నేపియర్ | |
---|---|
జననం | 1550 మెర్చిస్టన్ టవర్, ఎడిన్ బర్గ్ |
మరణం | ఏప్రిల్,4,1917. ఎడింబర్గ్ |
జాతీయత | స్కాటిష్ |
రంగములు | గణిత శాస్త్రము |
చదువుకున్న సంస్థలు | సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | లాగరిథమ్స్ నేపియర్ స్కేళ్ళు దశాంశవిధానము |
ప్రభావితులు | హెన్రీ బిగ్స్ |
బాల్యం
మార్చుఈయన స్కాట్ లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త. 1550 లో ఎడిన్ బర్గ్ లో జన్మించాడు. గమ్మత్తు ఏమిటంటే అప్పుడు ఈయన తండ్రి వయస్సు కేవలం 16 సంవత్సరాలే. 13 సంవత్సరాల వయస్సులో నేపియర్ సెయింట్ ఆండ్రూన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కాని డిగ్రీ మాత్రం పుచ్చుకోలేదు. నేపియర్ తరువాతి జీవితం గూర్చి సరిగా తెలియలేదు. బహుశా విదేశాలకు వెళ్ళి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. 1571 లో నేపియర్ మళ్ళీ జన్మస్థలం చేరుకున్నాడు. 1572 లో పెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ళ తరువాత భార్య చనిపోయిందని తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తోంది. ఈయనకు వివాదస్పదమైన విషయాలంటె మహా యిష్ఠం. 1593 లో మతాధికారులగురించి ఒక పుస్తకం రాసాడు.అందులో 1688-1700 మధ్య కాలంలో పోప్ లు ప్రపంచాన్ని నాశనం చేస్తారని రాసాడు. ఈ పుస్తకం ఎంతో గొడవను రేపింది. ఇది 21 సార్లు ప్రచురించబడింది.అందులో పదిసార్లు నేపియర్ జీవిత కాలంలోనే జరగటం విశేషం.
జీవితం
మార్చుఆ తరువాత నేపియర్ యుద్ధ పరికరాలు తయారు చేయడంలో నిమగ్నుడయ్యాడు. కాచివేసే దర్పణాలను రెండు రకాల వాటిని రోపొందించాడు. వీటి సాయంతో శత్రువును దెబ్బకొట్టడం తేలికగా ఉండేది. ఒక లోహరథాన్ని తయారుచేశాడు. ఈ రథం పైకి ఎక్కి సురక్షితంగా ఉండి శత్రువుల మీద తుపాకీ తూటాలు వర్షాన్ని కురిపించవచ్చు. ఇంతటి అమోఘమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన నేపియర్ తన ప్రతిభా పాటవాలను గణితంలో కూడా చూపడం మొదలుపొట్టాడు. నేపియర్ రాడ్ అనే పరికరాన్ని తయారు చేసి ఈ పరికరం సాయంతో కూడికలు, తీసివేతలు, వర్గమూలాలు చేయటం చాలా తేలికగ ఉండేది. 1593 నాటికి నేపియర్ లాగరిథమ్స్ ను రంగంలోకి తీసుకుని వచ్చాడు. రకరకాల గణిత విన్యాసాలను అతి తేలికగా అతి తొందరగా చేయటానికి లాగరిథమ్స్ కు మించింది లేకపోయింది. నేపియన్ అంటే లాగరిథమ్స్ అనే ముద్ర పడింది. ఈయన ఏప్రియల్ 4, 1617 న మరిణించాడు.
సేవలు
మార్చునేపియర్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు తెలియాలంటే "డిస్క్రిప్షన్ ఆఫ్ మార్వెలాన్స్ కానన్ ఆఫ్ లాగరిథమ్స్ " (1614 ప్రచురణ), "కనస్ట్రక్షన్ ఆఫ్ ది మార్వెలాన్స్ కానన్ ఆఫ్ లాగరిథమ్స్ " (1620 ప్రచురణ) సంపుటాలను చూస్తే చాలు గణిత శాస్త్రంలో లాగరిథమ్&శ్ ఒక నవ శకాన్ని సృష్టించింది. ఈ లాగరిథమ్స్ నిలిచియున్నంత కాలం నేపియర్ నిలిచే ఉంటాడు.
చిత్రమాలిక
మార్చు-
Bust of Napier, holding his 'bones', at the Craighouse Campus of Napier University, Edinburgh
-
An ivory set of Napier's Bones from around 1650
-
A set of Napier's calculating tables from around 1680