<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2023

ఏప్రిల్ (April), గ్రెగోరియన్, జులియన్ కేలెండర్ ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో నాలుగవ నెలగా ఉంది.ఈ నెలకు 30 రోజులు ఉన్నాయి.ఈ పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది.ఏప్రియల్ పేరు గ్రీకు దేవత అనే ఆఫ్రొడైట్ (ఆఫ్రోస్) పేరు మీద పెట్టబడిందని కొంత మంది నమ్మకం.[1] ఏప్రియల్, చెట్లు చిగిర్చి, పూలు పూసే వసంత ఋతువులో ఒక భాగంగా ఉంది.

ఏప్రిల్, బ్రెవేరియం గ్రిమణి, ఫోల్. 5 వి (ఫ్లెమిష్)

చరిత్రసవరించు

రోమన్ క్యాలెండరు ప్రకారం వాస్తవంగా సంవత్సరంలో 30 రోజులు కలిగిన రెండవ నెలగా ఉంది. సా.శ.పూ.450లో జనవరి నెలను మొదటి నెలగా గుర్తించినప్పుడు 29 రోజులు నిడివితో సంవత్సరంలో నాలుగవ నెలగా మారింది.జూలియస్ సీజర్ క్యాలెండరును సవరించినప్పుడు తిరిగి ఏప్రియల్ నెలకు 30 రోజుల నిడివికిపెరిగింది.[2]

చాలా మందిలో పాతసామెత ఒకటుంది. "ఏప్రియల్ పూలును వెదజల్లింది.మే పూలను తెచ్చింది." అంటారు. ఏప్రియల్ మొదటి రోజు పూల్స్ డేగా భావిస్తారు. ఆ రోజు నమ్మదగిన జోక్సును ఒకరిపై ఒకరు ప్రయోగిస్తారు. ఆ సంప్రదాయం స్వతాహాగా ప్రెంచి దేశానికి చెందినప్పటికి ఇది ప్రపంచం అంతటా వ్యాప్తి చెంది వాడుకలోకి వచ్చింది.దీనిని గ్రెగెరీ XIII 1582 లో జనవరి 1 వ తేదీకి మార్చారు.అయినా పాత సంప్రదాయం మరువలేదు.ఏప్రియలే్ మాసంలో పగలు ఎక్కువ సమయాన్ని ఇస్తుంది.ఏప్రియల్ నెల మొదటి వారం జులై నెల మొదటి వారం మొదలై, డిసెంబరు చివరి వారంతో ముగుస్తుంది.లీపు సంవత్సరంలో మాత్రం, మొదటి వారం జనవరి నెల మొదటి వారంతో మొదలైంది.[2][3]

ఏప్రిల్ నెలలో ముఖ్యమైన రోజులుసవరించు

ఏప్రియల్ ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలుగా గుర్తించబడ్డాయి.[4]

ఏప్రిల్ 1సవరించు

 • పూల్స్ డే:ఏప్రిల్ పూల్స్ డేని ఆల్ పూల్స్ డే అని కూడా పిలుస్తారు. దీనిని శతాబ్దాల నుండి జరుపుకుంటున్నారు. కానీ దీని మూలాలు అనిశ్చితంగా ఉన్నాయి. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, దీనిని మొదటిసారిగా 1852 లో జరుపుకున్నారు, ఫ్రాన్స్ జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారినప్పుడు, కొంతమంది ఇది అప్పటి మలుపుకు సంబంధించినదని అంటారు.
 • ఒడిశా ఫౌండేషన్ డే:1936 ఏప్రియల్ 1న బీహారు రాష్ట్రం నుండి ఒడిస్సా విడిపోయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.దానికి జ్ఞాపకార్థంగా ప్రత్యేక రాష్ట్రం ప్రావిన్సు దినోత్సవంగా జరుపుకుంటారు.[5]

ఏప్రిల్ 4సవరించు

 • అంతర్జాతీయ గనుల అవగాహన దినం: అవగాహన, మైన్ చర్యలలో సహాయం కోసం, భద్రత, ఆరోగ్యం, జీవితాలకు ల్యాండ్‌మైన్‌ల వల్ల కలిగే ముప్పు గురించి అవగాహన కల్పించడానికి, గనుల క్లియరింగ్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి నిర్వహించబడుతుంది.

ఏప్రిల్ 5సవరించు

 • జాతీయ సముద్ర దినోత్సవం:1919 లో ఈ రోజున ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్ మొదటి ఓడ, యునైటెడ్ కింగ్‌డమ్‌కు ప్రయాణించి, ఎస్ఎస్ లాయల్టీ చరిత్ర సృష్టించింది.భారతీయ నావిగేషన్ ఖాతాలో ఇది ఎర్ర అక్షరాల రోజుగా గుర్తించబడింది.దానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారు.

ఏప్రిల్ 7సవరించు

 • ప్రపంచ ఆరోగ్య దినోత్సవం:"ఆరోగ్యం సంపద" అని అందరికి తెలుసు.ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వివిధ కార్యక్రమాలు, ఏర్పాట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది. ఇది 1950 లో మొదటిసారిగా జరిగింది.

ఏప్రిల్ 10సవరించు

 • ప్రపంచ హోమియోపతి దినోత్సవం (WHD): హోమియోపతి వైద్య వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హనీమాన్ కు నివాళి అర్పించడానికి దీనిని పాటిస్తారు. ఈ రోజు ప్రజారోగ్యంలో హోమియోపతి వైద్యం గురించి అవగాహన కలిగించడం ప్రధాన లక్ష్యం.వాస్తవానికి ఏప్రిల్ 10 నుండి 16 వరకు ప్రపంచ హోమియోపతి వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. దీనిని ప్రపంచ హోమియోపతి అవగాహన సంస్థ నిర్వహిస్తుంది.

ఏప్రిల్ 10సవరించు

 • తోబుట్టువుల దినోత్సవం: తోబుట్టువులను గౌరవించటానికి, ఆప్యాయత చూపించడానికి, ఒకరినొకరు అభినందించడానికి దీనిని జరుపుకుంటారు. భారతదేశంలో రక్షా బంధన్ సందర్భంగా తోబుట్టువుల మధ్య ప్రత్యేక బంధాన్ని జరుపుకుంటారు.యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా వంటి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో తోబుట్టువుల దినోత్సవాన్ని జరుపుకుంటారు, కానీ సమాఖ్య గుర్తింపు పొందలేదు.

ఏప్రిల్ 11సవరించు

 • జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం:ప్రసూతి సౌకర్యాలు, పాలిచ్చే మహిళలు, మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఎన్‌ఎస్‌ఎండిని పాటిస్తారు.

ఏప్రిల్ 13సవరించు

 • జలియన్ వాలా బాగ్ డే:ఇది 13 ఏప్రిల్ 1919 న జనరల్ డయ్యర్ నాయకత్వంలో బ్రిటిష్ దళాలు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిరాయుధ భారతీయులపై పెద్ద సంఖ్యలో కాల్పులు జరిపారు. అనేక వందల మంది మరణించారు, వందల మంది గాయపడ్డారు.దీనిని అమృత్‌సర్‌ ఊచకోత అని కూడా అంటారు.

ఏప్రిల్ 14సవరించు

 • బి.ఆర్. అంబేద్కర్ జ్ఞాపక దినం:బిఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు జ్ఞాపకార్థంగా దీనిని జరుపుకుంటారు.అంబేద్కర్ జయంతి లేదా భీమ్ జయంతి అని కూడా పిలుస్తారు.

ఏప్రిల్ 17సవరించు

 • ప్రపంచ హిమోఫిలియా దినం:హిమోఫిలియా వ్యాధి, ఇతర వారసత్వంగా రక్తస్రావం లోపాల గురించి అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ ష్నావెల్ పుట్టినరోజును పురస్కరించుకుని 1989 లో, ప్రపంచ హేమోఫిలియా దినోత్సవాన్ని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హేమోఫిలియా (WFH) ప్రారంభించింది.

ఏప్రిల్ 18సవరించు

 • ప్రపంచ వారసత్వ దినోత్సవం:మానవ వారసత్వాన్ని కాపాడటానికి, ఈ రంగంలో సంబంధిత సంస్థలందరి కృషిని గుర్తించడానికి ఈ రోజును పాటిస్తారు. ఈ రోజును 1982 లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS) ప్రకటించింది. దీనిని యునెస్కో జనరల్ అసెంబ్లీ 1983 లో ఆమోదించింది.

ఏప్రిల్ 21సవరించు

 • జాతీయ పౌర సేవా దినోత్సవం: ఈ రోజున దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పౌర సేవకులు ఒకచోట చేరి, వారి అనుభవాలను పంచుకుంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఇతరుల అనుభవాలను కూడా నేర్చుకుంటారు.

ఏప్రిల్ 22సవరించు

 • ప్రపంచ భూ దినోత్సవం:1970 లో ఆధునిక పర్యావరణ ఉద్యమం పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజున దీనిని జరుపుకుంటారు.ఇతర గ్రహాల గురించి అవగాహన కల్పించడానికి, వాటిపై జీవించే అవకాశం ఉన్న రోజును గురించి కూడా చర్చిస్తారు.

ఏప్రిల్ 23సవరించు

 • ప్రపంచ పుస్తకం, కాపీరైట్ దినోత్సవం: పుస్తకాల పఠనం వలన కలిగే ఆనందాన్ని ప్రోత్సహించడానికి జరుపుకుంటారు.పుస్తకాల శక్తులను గుర్తించడం అవసరం అని, అవి గతానికి, భవిష్యత్తుకు మధ్య సంబంధాన్ని, తరాల మధ్య, సంస్కృతుల మధ్య ఒక వంతెనను సృష్టిస్తాయి అనే భావనపై అవగాహన కల్పిస్తారు.
 • ఆంగ్ల భాషా దినోత్సవం:ఆంగ్ల భాషా దినోత్సవం ఐక్యరాజ్యసమితి (యుఎన్) పాటించే రోజు.ఈ రోజు విలియం షేక్స్పియర్ పుట్టినరోజు, మరణించిన రోజు. దాని జ్ఞాపకార్థం జరుపుతారు.

ఏప్రిల్ 24సవరించు

 • జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం:ప్రతి సంవత్సరం భారతదేశంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ రోజున 73 వ రాజ్యాంగం 1993 ఏ ప్రియల్ 24 నుండి అమల్లోకి వచ్చింది.2010 లో మొదటి జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆర్టికల్ 243 నుండి 243 (ఓ) కు "పంచాయతీలు" పేరుతో 73 వ సవరణ చట్టాన్ని ఆమోదించడం ద్వారా రాజ్యాంగం పార్ట్ IX లో కొత్త భాగం చేర్చబడింది.పంచాయతీల విధుల్లో 29 విషయాలతో కూడిన కొత్త పదకొండవ షెడ్యూల్ కూడా చేర్చబడింది.[6]

ఏప్రిల్ 25సవరించు

ఏప్రిల్ చివరి శనివారంసవరించు

 • ప్రపంచ పశువైద్య దినోత్సవం:పశువైద్యులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రల గురించి, ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో చివరి ప్రతి శనివారం జరుపుకుంటారు.ప్రపంచ సంస్థ జంతు ఆరోగ్యం, ప్రపంచ పశువైద్య సంఘం కోసం ఈ రోజును సృష్టించింది.

ఏప్రిల్ 26సవరించు

 • ప్రపంచ మేధో సంపత్తి దినం: పేటెంట్లు, కాపీరైట్, ట్రేడ్‌మార్క్‌లు, నమూనాలు రోజువారీ జీవితంలో ఎలా ప్రభావం చూపుతాయో అవగాహన పెంచడానికి 2000 లో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) చేత స్థాపించబడింది.

ఏప్రిల్ 28సవరించు

 • పని వద్ద భద్రత, ఆరోగ్య ప్రపంచ దినోత్సవం:ఈ రోజును 2003 నుండి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పాటిస్తుంది.ఈ రోజు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో సూచిస్తుంది. సాంకేతికత, జనాభా, వాతావరణ మార్పు మొదలైన అనేక మార్పుల ద్వారా ఈ ప్రయత్నాలను కొనసాగించాలని చూస్తుంది.

మూలాలుసవరించు

 1. "The Month of April". www.timeanddate.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-29.
 2. 2.0 2.1 "April Overview". National Day Calendar. Retrieved 2020-07-29.
 3. "20 Awesome Facts About April". The Fact Site (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-01. Retrieved 2020-07-29.
 4. "April 2020: List of important National, International Days and Events". Jagranjosh.com. 2020-04-27. Retrieved 2020-07-29.
 5. "Story of Creation of a Separate Province or Modern State of Odisha – History of Odisha" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-29.
 6. "24 April: National Panchayati Raj Day". Jagranjosh.com. 2010-10-22. Retrieved 2020-07-29.

వెలుపలి లంకెలుసవరించు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
"https://te.wikipedia.org/w/index.php?title=ఏప్రిల్&oldid=3253902" నుండి వెలికితీశారు