జారుడుమెట్లు (నాటిక)

జారుడుమెట్లు కళాంజలి, హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్న సాంఘిక నాటిక. దేశాన్ని పాలిస్తున్న నల్ల దొరల దోపిడీతో ప్రజల జీవితాలు ఇంకా చీకటిలో మగ్గుతున్నాయనే అంశాన్ని ఇతివృత్తంగా సాగిన 'జారుడుమెట్లు' నాటికను కంచర్ల సూర్యప్రకాశ్ రచించగా, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.[1]

జారుడుమెట్లు
రచయితకంచర్ల సూర్యప్రకాశ్
దర్శకుడుకొల్లా రాధాకృష్ణ
తారాగణంనవీన షేక్,
రజనీ శ్రీకళ,
వరప్రసాద్,
రాధాకృష్ణ,
మణికంఠ
ఒరిజినల్ భాషతెలుగు
విషయంసాంఘిక నాటిక
నిర్వహణకళాంజలి, హైదరాబాద్

అర్ధరాత్రి వచ్చిన స్వాతంత్ర్యంతో దేశం నుండి బ్రిటీష్‌ దొరలు వెళ్ళిపోయినా, ఇక్కడి నల్ల దొరల పాలనలోనూ బడుగు బలహీన వర్గాలు జీవితాల్లో చోటు చేసుకుంటున్న చీకటి తెరలను రాజకీయాల సుడిగుండంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. అంతేకాకుండా పాలకులు తెల్లదొరల చెప్పుల్లో కాళ్లు పెట్టి నడుస్తున్నారని, స్వాతంత్ర్యం తీసుకువచ్చేందకు నాయకులు చేసిన త్యాగాలను మర్చిపోయి ప్రజారక్షకులగా కాక ప్రజాభక్షకులుగా మారి, సామాన్యుడికి అందాల్సిన స్వాతంత్ర్య ఫలాలను ధనవంతులు ఎగరేసుకుపోవటాన్ని, నాయకులంతా బంధుగణ సేవే పరమావధిగా భావించడం ఇందులో చూపించడం జరిగింది.[2]

నట, సాంకేతికవర్గం

మార్చు

నటవర్గం:

  1. నవీన షేక్
  2. రజనీ శ్రీకళ
  3. వరప్రసాద్
  4. రాధాకృష్ణ
  5. మణికంఠ

సాంకేతికవర్గం

  • సంగీతం: పుట్టా ఆనంద్
  • ఆహార్యం: నవీన
  • రంగొద్దీపనం: జెట్టి హరిబాబు
  • నిర్వహణ: అన్నమనేని ప్రసాద్
  • రచన: కంచర్ల సూర్యప్రకాశ్
  • దర్శకత్వం: కొల్లా రాధాకృష్ణ

మూలాలు

మార్చు
  1. ప్రజాశక్తి. "నల్లదొరల దోపిడీతో ఇంకా చీకట్లోనే". Retrieved 22 July 2017.
  2. నమస్తే తెలంగాణ. "సామాన్యుడి గోడును చాటిన జారుడుమెట్లు..." Retrieved 22 July 2017.