నవీన షేక్ (జులై 5, 1979) ప్రముఖ రంగస్థల, సినీ, టివీ నటి.

నవీన షేక్
జననం (1979-07-05) 1979 జూలై 5 (వయసు 44)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
తల్లిదండ్రులుఎస్. మహబూబ్ సాహెబ్, ఎస్. ఖాజాబి,

జననం మార్చు

ఈవిడ 1979, జులై 5 వ తేదిన శ్రీమతి ఎస్. ఖాజాబి, ఎస్. మహబూబ్ సాహెబ్ దంపతులకు కడపలో జన్మించింది.

రంగస్థల ప్రస్థానం మార్చు

1995 మే 28న రంగస్థలంపై అడుగుపెట్టింది.

  • పద్యనాటకాలు: తారాశశాంకము, వేమన యోగి, చింతామణి, రావణ విజయం, శివకేశవ సంగ్రామం, శ్రీకృష్ణతులాభారం, మహారథికర్ణ.
  • సాంఘిక నాటకాలు: కొయ్యగుర్రం, సీనియర్ సిటిజన్, నువ్వో సగం - నేనో సగం, రూపాయి – మహిత, మహాప్రస్థానం, అనుబంధం, నరావతారం, కళాఖండం, చూడు చూడు తమాషా, జగమే మాయ, జారుడుమెట్లు

బహుమతులు మార్చు

అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

  1. జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017.[1]
  2. ప్రత్యేక బహుమతి - జగమే మాయ (నాటిక), (అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5)[2]

టీవీరంగం మార్చు

అపరంజి, ఆడపిల్ల, చక్రవాకం, గీతాంజలి, మాయాబజార్, తూర్పు పడమర, అనుబంధం, సంధ్యారాగం, యువ, అంజలి, కోయిలమ్మ వంటి ధారావాహికలలో నటించింది.

చలనచిత్రరంగం మార్చు

మేస్త్రీ, ఆదివిష్ణు, సుందరానికి తొందరెక్కువ, బ్రహ్మ, డాన్ సినిమాల్లో నటించింది.

మూలాలు మార్చు

  1. "నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి". www.andhrabhoomi.net. 2017-04-17. Archived from the original on 2017-04-21. Retrieved 2021-12-14.
  2. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
  • నవీన. ఎస్, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 55.
"https://te.wikipedia.org/w/index.php?title=నవీన_షేక్&oldid=4069575" నుండి వెలికితీశారు