జింద్ జిల్లా

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో జింద్ జిల్లా ఒకటి. జింద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. ఇది హిస్సార్ డివిజన్‌లో భాగం. 1986 నుండి ఈ జిల్లా ఏర్పాటైంది. హర్యానా రాష్ట్రానికి కేంద్రస్థానంలో ఉన్న జింద్ జిల్లా, సిక్కు రాజ్యాలలో ఒకటి. జాట్ బెల్టులో ఇది 4 వ జిల్లా. మిగిలిన 3 జిల్లాలు రోహ్‌తక్, హిస్సార్, సోనిపట్.

జింద్ జిల్లా
హర్యానా పటంలో జింద్ జిల్లా స్థానం
హర్యానా పటంలో జింద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
డివిజనుహిసార్
ముఖ్య పట్టణంజింద్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
 • మొత్తం2,702 కి.మీ2 (1,043 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం11,89,872
 • జనసాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత72.7%
సగటు వార్షిక వర్షపాతం434 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

పేరువెనుక చరిత్ర

మార్చు

జిల్లా కేంద్రం నుండి జిల్లాకు ఈ పేరు వచ్చింది. జింద్ అనే పేరుకు మూలం జయంతిపురి (విజయాధిదేవత). ఈ నగరం మహాభారత కాలంలో స్థాపించబడిందని భావిస్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు పాండవులు ఇక్కడ ఆలయం నిర్మించి పూజించి విజయం సాధించారనీ, క్రమంగా ఆలయం చుట్టూ నగరం ఏర్పడిందనీ ప్రతీతి. జయంతిపురి కాలక్రమంలో జింద్‌గా నామాంతరం చెందింది.

చరిత్ర

మార్చు

ఫుల్కియాన్ మిస్ల్ రాజ్య స్థాపకుడు ఫుల్ మనుమడు రాజా గజ్పత్ సింగ్ 1763లో ఆఫ్గన్ గవర్నర్ జైన్ ఖాన్ నుండి ప్రస్తుత జింద్ జిల్లా భూభాగాన్ని ఆక్రమించి స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించి రాజ్యానికి జింద్ నగరాన్ని రాజధానిగా చేసాడు. 1775లో రాజా గజ్పత్ సింగ్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. ఆ తరువాత రాజ్యానికి సంగ్‌రూర్‌ను రాజధానిగా చేసాడు. తరువాత ఈ ప్రాంతాన్ని 1822 -1834 వరకూ రాజా సంగత్ సింగ్ పాలించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జింద్ రాజ్యం భారతదేశంతో కలిసిపోయింది. అలాగే 1948 జూలై 15న ప్రస్తుత జింద్ ప్రాంతం సంగ్‌రూర్ జిల్లాలో భాగం అయింది. 1966 నవంబరు 1 న హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేయబడిన సమయంలో సంగ్‌రూరు జిల్లా నుండి జింద్, నర్వానా తాలూకాలను వేరుచేసి జింద్ జిల్లాగా రూపొందించబడింది. అంతే కాక 1967లో జింద్ జిల్లా జింద్, సాఫీడన్ తాలూకాలుగా విభజించబడింది.

విభాగాలు

మార్చు

విభాగాల వివరణ

మార్చు
విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 3 జింద్, నర్వానా, సాఫిడన్.
జింద్ ఉపవిభాగం 3 జింద్, జులానా, అలెవా
నర్వానా ఉపవిభాగం నర్వానా, ఉచానా.
సాఫిడన్ ఉపవిభాగం సాఫీడన్-పిల్లు ఖెరా
అసెంబ్లీ నియోజక వర్గం 5-జింద్,జులానా, సాఫీడన్,ఉచానా కలానా, నర్వానా
పార్లమెంటు నియోజక వర్గాలు 3- సోనీపట్, హిస్సార్, సిర్సా..[1]
సోనిపట్ పార్లమెంటు నియోజక వర్గం జింద్, జులానా
సిర్సా పార్లమెంటు నియోజక వర్గం నర్వానా, ఉచానా కలానా
 • జిల్లాకేంద్రం జింద్ పట్టణంలో అర్జున్ స్టేడియం, మిల్క్ ప్లాంట్, కేటిల్ ఫీడ్ ప్లాంట్, పెద్ద ధాన్యపు సంత ఉంది.
 • జిల్లాలో తాత్కాలికంగా బస చేయడానికి పి.డబల్యూ. డి రెస్ట్ హౌస్, కెనాల్ రెస్ట్ హౌస్, మార్కెట్ కమిటీ రెస్ట్ హౌస్ ఉన్నాయి.
 • నగరంలో పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర సాధారణ వసతులు ఉన్నాయి.
 • రాణితలాబ్, పాండు- పిండారా, రాంరాయ్ అమావాస్య స్నాలకు ప్రసిద్ధి చెందాయి.

గ్రామాలు

మార్చు
 • జింద్ - రోహ్‌తక్ రహదారిలో ఉన్న గతౌలి ఒక ఆదర్శగ్రామంగా ఉంది. ఇక్కడ కౌశిక్, భరద్వాజ్, జాట్, మాలిక్, ధండ, చాహల్మొదలైన ప్రజలు నివసిస్తున్నారు.గ్రామంలో ప్రజలు అత్యధికంగా విద్యాధికులు కనుక వీరు అధికంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అంతే కాక వ్యవసాయం కూడా ముఖ్యవృత్తిగా స్వీకరిస్తూ చక్కగా స్థిరపడి ఉన్నారు. గ్రామంలో అందమైన శివాలయాలు, పాఠశాలలు, సుందర్ బ్రాంచ్ వంటి నదులు ఉన్నాయి.
 • బ్రాహ్మణవాస్- జింద్ - రోహ్‌తక్ రహదారిలో ఉన్న బ్రాహ్మణవాస్ గ్రామంలో వాత్స్ మ్రాతాస్ గోత్రస్తులు నివసిస్తున్నారు. పానిపట్ 3 వ యుద్ధం అపజయం తరువాత ఈ గ్రామం స్థాపించబడింది. ప్రస్తుత సర్పంచిగా రాధేశ్యాం పనిచేస్తున్నాడు. గ్రామవాసులకు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. గ్రామంలో పెద్ద శివాలయం, దేవీ ఆలయం ఉంది.
 • సుందర్పురా-ఈ గ్రామం హిస్సార్- చండీగఢ్ రహదారిలో ఉంది. ఈ గ్రామంలో బెనివాల్స్ అధికంగా ఉన్నారు. గ్రామంలో అందమైన శివాలయం ఉంది.

అంతేకాక పురాతన హవేలీ, పెద్ద జలాశయం, భకరా నది ఉన్నాయి.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,332,042,[2]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. మైనే నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 364 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 493 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.95%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 870:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 72.7%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో ప్రధానంగ హర్యానవి & పంజాబి భాషలు వాడుకలో ఉన్నాయి.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
 1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 151, 157. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-08-25.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Maine 1,328,361