జిమ్ సర్భ్

ఒక భారతీయ చలనచిత్ర, రంగస్థల నటుడు.

జిమ్ సర్భ్ (జననం: 1987 ఆగస్టు 27) భారతీయ చలనచిత్ర, రంగస్థల నటుడు. ఇతను నీర్జా సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు.[2]

జిమ్ సర్భ్
సర్భ్, 2018 సంవత్సరములో
జననం
జిమ్ సర్భ్

(1987-08-27) 1987 ఆగస్టు 27 (వయసు 37)[1]
జాతీయతఇండియన్
పౌరసత్వంభారతదేశం
విద్యఅమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే
విద్యాసంస్థఎమోరీ విశ్వవిద్యాలయం
వృత్తినటుడు, రంగస్థల దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం

మార్చు

జిమ్ సర్భ్ 1987 ఆగస్టు 27 న భారతదేశం, మహారాష్ట్ర, బొంబాయిలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లి రిటైర్డ్ ఫిజియోథెరపిస్ట్, తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్, పి&ఓ పోర్ట్స్ సౌత్, మిడిల్ ఈస్ట్ ఆసియా రీజినల్ డైరెక్టర్. సర్భ్‌కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇతని కుటుంబం భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వెళ్లి, మళ్ళి తిరిగి ఇతనికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు బొంబాయికి వచ్చింది, ఇతను దక్షిణ ముంబైలోని బాంబే ఇంటర్నేషనల్ స్కూల్‌లో, తరువాత పశ్చిమ ముంబైలోని బాంద్రాలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో చదివాడు. జిమ్ యునైటెడ్ స్టేట్స్‌, జార్జియా, అట్లాంటాలోని ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు.

కెరీర్

మార్చు

ఇతను ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక, అట్లాంటాలోని అలయన్స్ థియేటర్‌లో సాహిత్య ఇంటర్న్‌గా ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత సర్భ్ 2012లో తిరిగి ముంబైకి వెళ్లి స్థానిక థియేటర్ ప్రొడక్షన్స్‌లో నటించడం ప్రారంభించాడు.[3] ఇతను 2015 లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. సర్భ్ 2016 లో రామ్ మాధ్వని బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం అయిన నీర్జాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. అంతేకాకుండా లైక్ సమ్మర్ లైక్ రెయిన్ అనే లఘు చిత్రానికి కూడా పనిచేశాడు. 2020లో, ఇతను అక్టోబరులో జీ5 లో విడుదలైన బెజోయ్ నంబియార్ చిత్రం అయిన తైష్‌లో నటించాడు.

చలనచిత్రాలు

మార్చు
సంవత్సరం చలన చిత్రం పాత్ర
2014 షురూవాత్ కా ఇంటర్వెల్ వాజ్
2016 నీర్జా ఖలీల్
2017 ఎ డెత్ ఇన్ ది గంజ్ బ్రియాన్ మెకంజీ
రబట జాక్ మర్చంట్/ఖాబీర్
తీన్ ఔర్ ఆదా నటరాజ్
2018 పద్మావత్ మాలిక్ కాఫర్
సంజు జుబిన్ మిస్త్రీ
ది వెడ్డింగ్ గెస్ట్ (2018 సినిమా) దీపేష్
జోనాకి (సినిమా) లవర్
2019 సంటైమ్స్, ఐ థింక్ డైయింగ్ రాబర్ట్
ఫోటోగ్రాఫ్ (సినిమా) రాజ్ వీర్
హౌజ్ అరెస్ట్ (2019 సినిమా) జంషెడ్ దనేజా
2020 తైష్ రోహన్ కర్ణా[4]
యెహ్ బ్యాలెట్ అకాడమీ హెడ్
బినీత్ ఏ సీ ఆఫ్ లైట్స్ జిమ్మీ
2022 గంగుబాయి కథియావాడి అమిన్ ఫైజీ

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఛానల్
2018 స్మోక్ (వెబ్ సిరీస్) రాయ్ ఎరోస్ నౌ
2019 మేడ్ ఇన్ హెవెన్ (టీవీ సిరీస్) ఆదిల్ ఖన్నా అమెజాన్ ప్రైమ్ వీడియో
ఫ్లిప్ కేకి ఎరోస్ నౌ
2022 ఎటర్నల్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఈగర్ ఫర్ లవ్ విజ్ నెట్ఫ్లిక్స్
రాకెట్ బాయ్స్ (వెబ్ సిరీస్) హోమీ జె. భాభా సోనిలైవ్

మ్యూజిక్ వీడియోలు

మార్చు
సంవత్సరం పేరు ఆర్టిస్ట్ నోట్స్
2018 కోల్డ్/మెస్ ప్రతీక్ కుహాద్ [5]

అవార్డులు

మార్చు
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిల్మ్ ఫేర్ అవార్డులు) - నీర్జా (2017) [6]
  • బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ (ఆసియావిజన్ అవార్డులు) - పద్మావత్ (2019) [7]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Happy Birthday Jim Sarbh Unknown facts and droolworthy pics of actor". News Nation English. 2019-08-27. Retrieved 2021-01-09.
  2. "Jim Sarbh Wiki, Age, Girlfriend, Family, Caste, Biography & More – WikiBio". Retrieved 2022-03-25.
  3. "Neerja actor Jim Sarbh talks about his career and more". The Indian Express. 2016-04-03. Retrieved 2022-03-25.
  4. "Bejoy Nambiars Taish to premiere on ZEE5 in October". Outlook India. Retrieved 28 September 2020.
  5. Srishti Magan (7 December 2018). "Jim Sarbh In A Prateek Kuhad Video Is The On-Screen Magic". Scoop Whoop. Retrieved 28 April 2021.
  6. "Star Screen Awards 2016 winners list: nirja movie". India Today. Retrieved 2022-03-25.
  7. Hooli, Shekhar H. (2019-02-17). "Asiavision Movie Awards 2018 winners list: Ranveer Singh, jim sirbh". www.ibtimes.co.in. Retrieved 2022-03-25.