రాజ్ కపూర్

భారతీయ చిత్ర నటుడు, నిర్మాత మరియు దర్శకుడు

రణ్‍బీర్‍రాజ్ "రాజ్" కపూర్ (హిందీ: राज कपूर, పంజాబీ: ਰਾਜ ਕਪੂਰ, ఉర్దూ: راج کپُور‎ Rāj Kapūr, 1924 డిసెంబరు 14 - 1988 జూన్ 2), ది షో-మాన్ పేరిట ప్రసిద్ధుడైన వ్యక్తి, హిందీ సినిమాకు చెందిన భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత మరియు దర్శకుడు.[1] అతడు తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించాడు, అతడి చిత్రాలు ఆవారా (1951) మరియు బూట్ పోలిష్ (1954) అనేవి కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్మే డి ఓర్ కొరకు నామినేట్ అయ్యాయి. భారతీయ చలనచిత్ర రంగానికి అతడు చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అతడిని 1971లో పద్మ భూషణ్ మరియు 1987లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది.

Raj Kapoor
Raj Kapoor In Aah (1953).png
జననంRanbir Raj Kapoor
(1924-12-14) 1924 డిసెంబరు 14
Peshawar, British India Permanent Residence: Chembur, Mumbai, India
మరణం1988 జూన్ 2 (1988-06-02)(వయసు 63)
Chembur, Mumbai, India
ఇతర పేర్లు The Show Man
వృత్తిActor, Producer, Director
క్రియాశీలక సంవత్సరాలు1935-1985

బాల్య జీవితం మరియు నేపథ్యంసవరించు

దస్త్రం:Raj Kapoor birth place burhan.jpg
రాజ్ కపూర్ జన్మ స్థలం ధాకి మునావర్ షా, పెషావర్, పాకిస్తాన్

రాజ్ కపూర్ బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతపు పాకిస్తాన్) లోని పెషావర్‌లో, నటుడు పృథ్వీరాజ్ కపూర్ మరియు రామ్‍సరణి (రమా) దేవి కపూర్ (వివాహత్పూర్వం మెహ్రా). అతడు సదరు పంజాబీ[2] కుటుంబంలో ఆరుగురు పిల్లలలో జ్యేష్టుడు.[3][4][5] అతడు ప్రసిద్ధ కపూర్ కుటుంబంలో భాగమైన దీవాన్ బసేశ్వర్‍నాథ్ కపూర్ యొక్క మనుమడు మరియు దీవాన్ కేశవ్‍మల్ కపూర్ యొక్క మునిమనుమడు. రాజ్ యొక్క సోదరులలో ఇద్దరు నటులు శశి కపూర్ (నామాంతరం బల్‍బీర్ రాజ్ కపూర్) మరియు షమ్మి కపూర్ (నామాంతరం షంషేర్ రాజ్ కపూర్); మరో ఇద్దరు బాల్యంలోనే మరణించారు. అతడికి ఊర్మిళా సియా పేరిట సోదరి ఉండేది.

రాజ్ కపూర్ 1930లలో డెహ్రాడూన్‍లోని కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ స్కూల్లో చదువుకున్నాడు.

వృత్తి జీవితంసవరించు

పదకొండేళ్ళ వయసులో, అతడు మొట్టమొదటి సారి 1935లో చలనచిత్రం ఇంక్విలాబ్లో నటించడం ద్వారా, చలనచిత్రాలలో కనిపించాడు. తరువాతి 12 సంవత్సరాలలో ఎన్నో ఇతర చలనచిత్రాలలో నటించిన తరువాత, మధుబాల మొదటిసారి కథానాయికగా నటించిన నీల్ కమల్ (1947) చిత్రంలో కథానాయకుడుగా నటించి రాజ్ కపూర్ ఘనవిజయం సాధించాడు. 1948లో, ఇరవైనాలుగేళ్ళ వయసులో, అతడు తన స్వంత స్టూడియో, R. K. ఫిల్మ్స్ స్థాపించాడు, మరియు ఆగ్ చిత్రంతో దర్శకుడిగా రంగప్రవేశం చేసి, అప్పట్లో అతిపిన్న వయస్కుడైన చలనచిత్ర దర్శకుడిగా పేరొందాడు. ఆగ్ చిత్రంతో ప్రారంభమై, ఎన్నో చలనచిత్రాలలో అతడు మరియు నర్గీస్ కలిసి నటించారు. 1949లో అతడు మెహబూబ్ ఖాన్ యొక్క ఘనవిజయం సాధించిన అందాజ్ చిత్రంలో దిలీప్ కుమార్ సరసన నటించి, నటుడిగా మొట్టమొదటి సారి గొప్ప విజయం సాధించాడు.

అటుపై అతడు బర్సాత్ (1949), ఆవారా (1951), శ్రీ 420 (1955), చోరి చోరి (1956), జాగ్‍తే రహో (1956) మరియు జిస్ దేశ్ మే గంగా బెహతీ హై (1960) వంటి ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్లను నిర్మించి, దర్శకత్వం వహించి, వాటిలో నటించాడు. ఈ చలనచిత్రాలు అతడి వెండితెర రూపాన్ని చార్లీ చాప్లిన్ యొక్క అత్యంత ప్రసిద్ధ వెండితెర రూపమైన ది ట్రాంప్ నమూనాగా సుస్థిరం చేసాయి. 1964లో, అతడు తన మొట్టమొదటి వర్ణ చిత్రం సంగం నిర్మించి, దర్శకత్వం వహించి, అందులో నటించాడు. ఇది అతడు ప్రధాన పాత్రలో ఘన విజయం సాధించిన చివరి చిత్రం. స్వంత నిర్మాణంలో కాక అతడు నటించిన ఇతర ప్రముఖ చలనచిత్రాలు అనారీ (1959), ఛలియా (1960) మరియు తీస్రీ కసం (1963). అతడు వైభవంగా నిర్మించి, దర్శకత్వం వహించి, నటించిన చలనచిత్రం మేరా నామ్ జోకర్ (నా పేరు జోకర్) పూర్తికావడానికి ఆరేళ్ళకు పైగా పట్టింది. 1970లో విడుదలయ్యాక, అది బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది.

1971లో అతడు తన పెద్ద కుమారుడు రణ్‍ధీర్ కపూర్‍ను, రణ్‍ధీర్ యొక్క నటనా మరియు దర్శకత్వ ప్రారంభం కల్ ఆజ్ ఔర్ కల్‍తో ప్రవేశపెట్టాడు, ఇందులో రాజ్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ మరియు రణ్‍ధీర్ యొక్క భార్యకాబోయే బబితా నటించారు. అతడు తన రెండవ కుమారుడు రిషి కపూర్ యొక్క సినీ రంగ ప్రవేశం, తానే నిర్మించి, దర్శకత్వం వహించిన బాబీ (1973)తో ప్రారంభించాడు, అది పెద్ద బాక్స్ ఆఫీస్ విజయం మాత్రమే కాక నటి డింపుల్ కపాడియాను పరిచయం చేసిన చిత్రం, అటుపై ఆమె ఎంతో ప్రసిద్ధ నటిగా రూపొందింది, అంతేకాక యువకుల ఊహలలో చోటుచేసుకున్న మొదటి తరం నటి. డింపుల్ అప్పటి భారతీయ చలనచిత్రాలలో ఎన్నడూ లేని విధంగా బికినీలు ధరించింది.

1970ల ఉత్తరార్థంలో మరియు 1980ల ప్రారంభంలో అతడు స్త్రీలు ప్రధాన పాత్రలుగా చలనచిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించాడు: జీనత్ అమన్‍తో సత్యం శివం సుందరం (1978), పద్మిని కొల్హాపురితో ప్రేమ్ రోగ్ (1982) మరియు మందాకినీని పరిచయం చేసిన రామ్ తేరి గంగా మైలి (1985). 1970ల చివర్లో మరియు 1980ల ప్రారంభంలో అతడు తక్కువ చిత్రాలలో నటించి, చలనచిత్రాలు నిర్మించడం మరియు దర్శకత్వం చేపట్టడంపై దృష్టి సారించాడు. అతడు నౌకరీ (1979) లో రాజేష్ ఖన్నా సరసన నటించాడు, మరియు అబ్దుల్లా (1980) లో శీర్షిక పాత్రను సంజయ్ ఖాన్ సరసన పోషించాడు.

రాజ్ కపూర్ చివరగా చలనచిత్రంలో ప్రముఖంగా కనిపించింది, అతడు తన తమ్ముడు శశితో కలిసి నటించిన వకీల్ బాబు (1982). అతడు చివరగా నటించింది 1984లో విడుదలైన బ్రిటిష్ దూరదర్శన్-కొరకు-నిర్మించిన కిమ్ పేరుగల చిత్రంలో అతిథి పాత్ర.

మరణంసవరించు

దస్త్రం:Raj Kapoor birth place burhan2.jpg
పాకిస్తాన్‍లోని పెషావర్‍లో ధాకి మునావర్ షా, రాజ్ కపూర్ జన్మ స్థలం యొక్క ప్రధాన ద్వారం.

రాజ్ కపూర్ తన శేష జీవితంలో ఆస్తమాతో బాధపడ్డాడు; అతడు ఆస్తమాకు సంబంధించిన సమస్యలతో 1988లో తన 63 ఏళ్ళ వయసులో మరణించాడు. అతడు మరణించే సమయానికి, అతడు హీనా చిత్రంపై పనిచేసేవాడు (ఇది ఇండో-పాకిస్తాన్ ఆధారిత ప్రేమకథ). అటుపై ఈ చిత్రాన్ని అతడి కుమారులు రణ్‍ధీర్, రిషి కపూర్ పూర్తిచేసారు మరియు దీనికి వ్యాఖ్యానం అతడి సోదరుడు షమ్మి కపూర్ అందించాడు, ఈ చిత్రం 1991లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అతడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసినప్పుడు; అతడి సోదరులు శశి కపూర్ మరియు షమ్మి కపూర్ సైతం అక్కడే ఉన్నారు; ప్రజలందరూ చప్పట్లు కొడుతుండగా, కపూర్ అసౌకర్యంగా ఉండడం చూసిన రాష్ట్రపతి వెంకటరామన్, వేదిక నుండి దిగి ఆ అవార్డు అందించడానికి వచ్చారు, కానీ చెవులు దద్దరిల్లే ఆ చప్పట్ల నడుమ అతడు తన తుదిశ్వాస తీసుకుంటున్నాడు. అక్కడ అకస్మాత్తుగా కపూర్ కూలిపోయాడు, అతడిని వెంటనే చికిత్సకై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్‍కు తరలించడం జరిగింది. దేశంలోని ఉత్తమ హృద్రోగ నిపుణులు శాయశక్తులా ప్రయత్నించినా, అతడిని బ్రతికించలేకపోయారు.[6]

ఉత్తరదాయిత్వంసవరించు

రాజ్ కపూర్ చలనచిత్ర విమర్శకులు మరియు సాధారణ చలనచిత్ర అభిమానుల నుండి ప్రశంసలు పొందాడు. చలనచిత్ర చరిత్రకారులు మరియు చలనచిత్ర అభిమానులు అతడిని భారతీయ చలనచిత్ర రంగం యొక్క "చార్లీ చాప్లిన్‍గా అభివర్ణిస్తారు, ఎందుకంటే అతడు తరచూ పేదరికంలో ఉన్నా సంతోషంగా మరియు నిజాయితీగా ఉండే దేశదిమ్మరి వంటి పాత్రలు ధరించాడు. అతడి ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది. అతడిని ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మునుపటి సోవియట్ యూనియన్, చైనా, మరియు ఆగ్నేయాసియాలలో ఎన్నో చోట్ల ప్రేక్షకులు అభిమానించారు; అతడి చలనచిత్రాలు ప్రపంచమంతటా వ్యాపార విజయాల్ని సాధించాయి. రాజ్ ఎవరి నుండైనా ఉత్తమమైన ప్రదర్శనను రాబట్టుకునే కిటుకు తెలిసినవ్యక్తి, ఎందుకంటే అతడు చలనచిత్ర నిర్మాణంలో అన్ని రంగాలలోనూ నైపుణ్యం సాధించాడు, మరియు వాటిని ఎలా ప్రజలవద్దకు తీసుకెళ్ళాలో తెలిసినవ్యక్తి.మూస:Peacock inline పండిట్ జవహర్‍లాల్ నెహ్రూ 1964లో సంగం విడుదల సమయంలో మరణించినప్పుడు, అతడు ఆ అవకాశాన్ని పురస్కరించుకుని పండిట్ నెహ్రూ తన పద్యాత్మక వీలునామాలో వివరించినట్టూ గోపాల్ అస్థికలు గంగానదిలో కలిపే దృశ్యాన్ని సృష్టించి, చిత్రీకరించాడు. అతడి చలనచిత్రాలు అవి తయారైన యుగాన్ని ప్రతిబింబిస్తాయి.

అతడికి ప్రజల అభిరుచి మరియు బాక్స్-ఆఫీస్ గురించి ఎంతో పరిజ్ఞానం ఉండేది.హిందీ చలనచిత్ర రంగం యాభైలలో ప్రపంచ వాణిజ్యరంగం నుండి గొప్ప ఆదాయాన్ని సంపాదించగలదని ఊహించిన మొదటి భారతీయ సినీ ప్రముఖుడు, ఆ విషయం ఈనాడు నిజమైంది.[7]

రాజ్ కపూర్ యొక్క చలనచిత్రాలు ఎన్నో దేశభక్తి నేపథ్యంతో తయారయ్యాయి. అతడి చలనచిత్రాలు ఆగ్ , శ్రీ 420 మరియు జిస్ దేశ్ మే గంగా బెహతీ హై (గంగానది ప్రవహించే దేశంలో ) క్రొత్తగా స్వతంత్రం సాధించిన భారతదేశాన్ని కొనియాడి, చలనచిత్ర-ప్రేక్షకులు దేశభక్తులుగా మారేందుకు ప్రోత్సహించాయి. రాజ్ కపూర్ శ్రీ 420 చలనచిత్రం నుండి ఈ గీతంలో, "మేరా జూతా హై జపానీ" గేయాన్ని వ్రాయించాడు:

మేరా జూతా హై జపానీ
ఏ పటలూన్ ఇంగ్లిస్తానీ
సర్ పే లాల్ టోపీ రూసీ
ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ '
నా బూట్లు జపానువి
నా ప్యాంట్లు ఇంగ్లీషువి
నా తలమీది ఎర్ర టోపీ రష్యాది
కానీ, నా హృదయం మాత్రం భారతదేశానిది.'

ఈ పాట ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధమైంది మరియు శ్రీ 420 విడుదలైనప్పటి నుండి ఎన్నో చలనచిత్రాలలో ఉపయోగించబడింది. 2006 ఫ్రాంక్‍ఫర్ట్ పుస్తక ప్రదర్శనలో భారతీయ రచయిత్రి మహాశ్వేతా దేవి తన ప్రారంభోపన్యాసంలో తన మనఃపూర్వక దేశభక్తి మరియు దేశానికి తను ఎంత ఋణపడి ఉందో చెప్పడానికి ఈ గేయంలోని పదాలు ఉపయోగించి ప్రదర్శనను ఆపివేసింది.

రాజ్ కపూర్ చలనచిత్ర సంగీతం మరియు గీతాల్ని నేర్పుతో అంచనా వేయగలిగేవాడు. అతడు వ్రాయించిన ఎన్నో గీతాలు నిత్యనూతనమైనవి. అతడు సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ మరియు గీతరచయిత హస్రత్ జైపురి మరియు శైలేంద్రలను పరిచయం చేశాడు. అతడి గొప్ప దృశ్య శైలి కూడా అందరికీ గుర్తుండేలా ఉంటుంది. సంగీతం ద్వారా తయారైన ఉద్వేగాన్ని పూర్తిచేయడానికి ఆకర్షణీయమైన దృశ్య చిత్రాలూ, విశాలమైన నేపథ్యాలూ, మరియు నాటకీయమైన దీపాలంకరణ ఉపయోగించేవాడు. అతడు నటీమణులు నిమ్మి, డింపుల్ కపాడియా, నర్గీస్ మరియు మందాకినీలను పరిచయం చేశాడు, అంతేకాక తన కుమారులు రిషి, రణ్‍ధీర్ మరియు రాజీవ్‍ల వృత్తిగత జీవితాల్ని ప్రారంభించడం మరియు పునరుద్ధరించడం చేశాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

కపూర్ కుటుంబం స్వస్థలం పెషావర్ మరియు వారు హింద్‍కోవాన్ పంజాబీలు, కానీ వారు ప్రస్తుతం ఫైసలాబాద్ అని పిలువబడే బ్రిటిష్ ఇండియాలో పంజాబ్ ప్రాంతంలోని ల్యాల్పూర్ జనావాసంలో భూస్వాములు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండే ఆ ప్రాంతంలో వారి కుటుంబం కొంతకాలం నివసించింది. అతడు నటులు రాజేంద్ర నాథ్ మరియు ప్రేమ నాథ్‍ల సోదరి కృష్ణ కపూర్‍ను వివాహం చేసుకున్నాడు.[8][9]

అంతేకాక కపూర్ ప్రసిద్ధ నటి నర్గీస్‍తో 1950లలో సుదీర్ఘ ప్రేమాయణం సైతం నడిపాడని తెలిసిందే. ఆ జంట ఆవారా మరియు శ్రీ 420 లతో పాటుగా ఎన్నో చలనచిత్రాలలో కలిసి పనిచేశారు. అతడికి సంగంలో సహనటి వైజయంతిమాలతో సన్నిహిత సంబంధం ఉండేదని చెబుతారు.[ఉల్లేఖన అవసరం]

కపూర్ యొక్క మనవళ్ళు/మనవరాళ్ళలో ముగ్గురు ప్రస్తుతం బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖులు. అతడి మనవరాళ్ళు కరిష్మా కపూర్ మరియు కరీనా కపూర్, రాజ్ కుమారుడైన రణ్‍ధీర్ కపూర్ మరియు అతడి భార్య బబితల కుమార్తెలు. అతడి మనవడు రణ్‍బీర్‍ కపూర్, రిషి కపూర్ మరియు అతడి భార్య నీతూ సింగ్‍ల కుమారుడు.

పురస్కారాలుసవరించు

కపూర్ తన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు పొందాడు, వాటిలో 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు 19 నామినేషన్లు ఉన్నాయి. అతడి చలనచిత్రాలు ఆవారా (1951) మరియు బూట్ పాలిష్ (1954) కేన్స్ చలనచిత్రోత్సవంలో పాల్మే డి ఓర్ కొరకు నామినేట్ అయ్యాయి. అంతేకాక అతడి చిత్రం జాగ్‍తే రహో (1956) కార్లోవీ వారీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో క్రిస్టల్ గ్లోబ్ అవార్డు సాధించింది.

భారత ప్రభుత్వం అతడికి 1971లో పద్మ భూషణ్ మరియు 1987లో భారతదేశంలో చలనచిత్ర శ్రేష్టతకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసింది. 2001లో అతడికి స్టార్‍డస్ట్ అవార్డ్స్ ద్వారా “శతాబ్ది ఉత్తమ దర్శకుడు” గౌరవం లభించింది. 2002లో అతడు స్టార్ స్క్రీన్ అవార్డ్స్ ద్వారా “షోమాన్ అఫ్ ది మిలెనియం” పేరొందాడు.

ఇతర కళాకారులతో సాంగత్యంసవరించు

శంకర్ జైకిషన్సవరించు

శంకర్-జైకిషన్ అతడు ఎంపిక చేసుకున్న సంగీత దర్శకులు. అతడు మొత్తమ్మీద వారితో 20 చలనచిత్రాలలో పనిచేశాడు, వాటిలో బర్సాత్ నుండి కల్ ఆజ్ ఔర్ కల్ వరకూ 10 అతడి స్వంత నిర్మాణాలు. (ఈ కాలపరిధిలో సలీల్ చౌదరి చేసిన జాగ్‍తే రహో మరియు అబ్ దిల్లీ దూర్ నహీ అనేవి మినహాయింపులు). జైకిషన్ మరణించాక మాత్రమే, అతడు వేరొక సంగీత దర్శకుడు - లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍ను బాబీ, సత్యం శివం సుందరం, మరియు ప్రేమ్ రోగ్‍లకు (అటుపై అతడి కుమారులు ప్రేమ్ గ్రంథ్ చిత్రానికి సైతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్‍‍ను ఉపయోగించుకున్నారు) మరియు రవీంద్ర జైన్‍ను (రామ్ తేరి గంగా మైలీ మరియు హెన్నా) నియోగించాడు. ఆసక్తికరంగా, రాజ్ కపూర్ మదన్ మోహన్ సంగీత దర్శకత్వం వహించిన ఏ చిత్రంలోనూ నటించలేదు, మరియు O. P. నయ్యర్ (దో ఉస్తాద్)తో ఒకే చిత్రం చేశాడు.

శంకర్ జైకిషన్‍లతో కలిసి చేసిన చలనచిత్రాల జాబితా: (18 చలనచిత్రాలు)

 • బర్సాత్ (1949)
 • ఆగ్ (1953)
 • ఆవారా (1951)
 • బూట్ పాలిష్ (1954)
 • శ్రీ 420 (1955)
 • చోరి చోరి (1956)

 • అనారీ (1959)
 • కన్హైయా (1959)
 • మైఁ నషే మే హూఁ (1959)
 • జిస్ దేశ్ మే గంగా బెహతీ హై (1960)
 • ఆషిక్ (1962)
 • ఏక్ దిల్ సౌ అఫ్సానే (1963)

 • సంగం (1964)
 • తీస్రీ కసం (1966)
 • అరౌండ్ ది వరల్డ్ (1967)
 • దివానా (1967)
 • సప్నోఁ కా సౌదాగర్ (1968)
 • మేరా నామ్ జోకర్ (1970)

నర్గీస్సవరించు

 • రాజ్ కపూర్ మరియు నర్గీస్ కలిసి 16 చలనచిత్రాలలో పనిచేసారు, అందులో 6 అతడి స్వంత నిర్మాణాలు.

 • ఆగ్ (1948)
 • అందాజ్ (1949)
 • బర్సాత్ (1949)
 • ప్యార్ (1950)

 • జాన్ పహ్‍చాన్ (1950)
 • ఆవారా (1951)
 • అంబర్ (1952)
 • అన్‍హోనీ (1952)

 • ఆషియానా (1952)
 • బేవఫా (1952)
 • ఆహ్ (1953)
 • పాపి (1953)

 • ధూన్ (1953)
 • శ్రీ 420 (1955)
 • చోరి చోరి (1956)
 • జాగ్‍తే రహో (1956)

ముకేష్సవరించు

దాదాపుగా అతడి అన్ని చలనచిత్రాలలోనూ ముకేష్ రాజ్ కపూర్ యొక్క నేపథ్య గాయకుడుగా వ్యవహరించాడు. అంతేకాక, ముకేష్ మరణించినప్పుడు, రాజ్ ఇలా అన్నాడు, "మైనే అప్నీ ఆవాజ్ కో ఖో దియా..." ("నేను నా గాత్రాన్ని కోల్పోయాను..."). కానీ, మన్నా డే సైతం రాజ్ కపూర్ కొరకు ఎన్నో ప్రముఖమైన మరియు ప్రసిద్ధి చెందినా గీతాలను ఆలపించాడు, ఉదాహరణకు శ్రీ 420 మరియు చోరీ చోరీలలో. ఈ క్రింది గీతాలు అటువంటి వాటికి ఉత్తమమైన ఉదాహరణలు:

 • దిల్ కా హాల్ సునే దిల్ వాలా (శ్రీ 420)
 • ఆజా సనమ్ మధుర్ చాందినీ మే హమ్ (చోరి చోరి)
 • జహాఁ మై జాతీ హూఁ వహీఁ చలే ఆతే హో (చోరి చోరి)
 • యే రాత్ భీగీ భీగీ, యే మస్త్ ఫిజాయే (చోరి చోరి)
 • మస్తీ భరా హై సమా (పర్వరిష్)
 • ఏ భాయ్ జరా దేఖ్ కే చలో (మేరా నామ్ జోకర్)
 • ప్యార్ హువా ఇక్రార్ హువా హై (శ్రీ 420)
 • లాగా చునరీ మే దాగ్ (దిల్ హీతో హై)

ఫిల్మోగ్రఫీసవరించు

మరింత చదవండిసవరించు

 • ది కపూర్స్: ది ఫస్ట్ ఫ్యామిలీ అఫ్ ఇండియన్ సినిమా, మధు జైన్. పెంగ్విన్ చే, వైకింగ్, 2005. ISBN 0670058378.

సూచనలుసవరించు

 1. అల్ మ్యూజిక్ బయోగ్రఫి
 2. Gibson, Pamela Church; Bruzzi, Stella (14 Dec 2000). "11 Bombay Ishstyle". In Rachel (సంపాదకుడు.). Fashion cultures: theories, explorations, and analysis (English లో) (1 edition సంపాదకులు.). New York: Routledge. p. 181. ISBN 0-415-20685-5. Retrieved 13 February 2011. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: unrecognized language (link) CS1 maint: extra text (link)
 3. "Bollywood's First Family". Rediff. Retrieved 2007-09-08. Cite web requires |website= (help)
 4. "Prithviraj Kapoor: A centenary tribute". Daily Times / University of Stockholm. మూలం నుండి 2009-05-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-11-03. Cite web requires |website= (help)
 5. "Prithviraj Kapoor:". Kapoor Family Page. Retrieved 2007-11-03. Cite web requires |website= (help)
 6. "Remembering Indian cinema's greatest showman.'". movies.rediff.com. Retrieved 22 Oct 2010. Cite web requires |website= (help)
 7. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-09-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-27. Cite web requires |website= (help)
 8. ఫేర్ వెల్ రాజేంద్రనాద్ : లఫ్టర్ హాస్ లెఫ్ట్ ది బిల్డింగ్ Archived 2008-07-08 at the Wayback Machine. పాషన్ ఫర్ సినిమా , ఫిబ్రవరి 13, 2008.
 9. "Bye bye, Bina". The Telegraph (Kolkata). December 13 , 2009. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help); Check date values in: |date= (help)

మూలాలుసవరించు

 • రాజద్యక్ష, ఆశిష్; విల్లిమెన్, పాల్. ఎన్సైక్లోపెడియా అఫ్ ఇండియన్ సినిమా . లండన్: బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యుట్; న్యూ ఢిల్లీ: ఆక్ష్ఫోర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణ, 1994
 • కిషోర్, వలీచ. ది మూవింగ్ ఇమేజ్ . హైదరాబాద్: ఒరిఎంట్ లాంగ్మేన్, 1988

బాహ్య లింకులుసవరించు

మూస:FilmfareAwardBestDirector మూస:FilmfareBestActorAward మూస:Bollywood