జిరాఫీ వీవిల్ జిరాఫీ లాంటి మెడతో ఉండే ఓ చిన్ని పురుగు . చూడ్డానికి దీని మెడ జిరాఫీలా కనిపించడంతో దీనికా పేరు వచ్చింది. దీనిది జిరాఫీలా భారీ ఆకారం కాదు, కేవలం అంగుళమంత పొడువుతో ఉంటుంది. ఈ పురుగుల్లో మగ వాటి మెడలే విపరీతమైన పొడవుంటాయి. ఆడవాటి కన్నా మూడింతలు ఉండి, అబ్బుర రుస్తాయి. శరీర పరిమాణంతో చూస్తే మగవాటి మెడలు జిరాఫీ కన్నా పొడవనే చెప్పాలి!చి ఈ వింత పురుగులు మడాగాస్కర్ దీవిలో మాత్రమే కనిపిస్తాయి. 2008లో దీనిని కనుగొన్నారు.వీటికి మెడే ఓ పరికరంలాగా పనిచేస్తుంది. మెడసాయంతో ఆడవి లో గూళ్లు కట్టి ప్రత్యేకంగా దాని మెడతో చెట్టు ఆకులను పైప్‌లా చుట్టి అందులో ఒక గుడ్డు పెడతాయి. అంటే ఆకునే పొట్లంలా చుట్టి గుడ్డుకు రక్షణగా ఉంచుతాయి. తర్వాత గుడ్డు నుంచి వచ్చే లార్వా ఆ ఆకునే ఆహారంగా తీసుకుంటూ పెరుగుతుంది. ఆడవి శ్రమ జీవులు కష్టపడి పనులు చేసుకుంటే మగవేమో ఆడవాటిని ఆకర్షించడానికి మెడలు పట్టుకుని యుద్ధాలు చేస్తాయి. ఒక్కోసారి రెండింటిలో ఒకటి ప్రాణాలు కూడా కోల్పోతుంది.

జిరాఫీ వీవిల్
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Superfamily:
Family:
Genus:
Species:
T. giraffa
Binomial name
Trachelophorus giraffa
Jekel, 1860

విశేశాలు మార్చు

  • జిరాఫీ పురుగులు చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. ఎర్రని శరీరం, నల్లని మెడతో ఉండే వీటికి పారదర్శకంగా ఉండే పలచని రెండు రెక్కలు ఉంటాయి. వీటితోనే ఎగురుతాయి కూడా! కానీ ఇవి ఎక్కువగా చెట్లపైనే జీవిస్తాయి. ఆకులనే ఆహారంగా తీసుకుంటాయి. మరేజీవుల జోలికీ వెళ్లవు!
  • వీవిల్స్‌లో సుమారు 60,000 జాతులుండగా వాటన్నింటిలో అతి పొడవైన మెడ ఉంది మాత్రం జిరాఫీ వీవిల్‌కే.
  • ఇవి కొన్ని నెలల నుంచి ఏడాది వరకు బతుకుతాయి.

బయటి లంకెలు మార్చు