జిల్లా కోర్టులు (భారతదేశం)
భారత దేశంలోని జిల్లా కోర్టులు అనేవి, జిల్లాలలోని కేసుల సంఖ్య, జనాభా పంపిణీ పరిగణనలోకి తీసుకొని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకు కలిపి, లేదా ప్రతి జిల్లాకు ఏర్పాటైన జిల్లా ప్రధాన న్యాయస్థానాలు. ఇవి జిల్లా స్థాయిలో న్యాయ నిర్ణయాలు చేస్తాయి.జిల్లా న్యాయాధిపతి న్యాయస్థానం ప్రతి జిల్లాకు అత్యున్నత న్యాయస్థానంగా పరిగణిస్తారు.ఇది పౌరులకు సంబంధించిన విషయాలలో ప్రధానంగా దాని అధికార పరిధిని రాష్ట్ర హైకోర్టుతో పాటు సరియైన పౌరవిషయాలపై అధికార పరిధిని ఉన్నత న్యాయస్థానం పౌరవిధాన నియమావళి నుండి పొందింది. నేరస్వభావాల విషయాలపై కూడా నేరచట్టం కింద తన అధికార పరిధిని ఉపయోగించి, జిల్లా న్యాయస్థానాలు న్యాయనిర్ణయాలు తీసుకుంటాయి.ఆ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సలహాతో, ఆ రాష్ట్ర గవర్నర్ నియమించిన జిల్లా న్యాయమూర్తి ఆ జిల్లా కోర్టుకు అధ్యక్షత వహిస్తాడు.జిల్లా న్యాయమూర్తి పనిభారాన్ని బట్టి అతనితోబాటు, అదనపు జిల్లా న్యాయమూర్తులును, అసిస్టెంట్ జిల్లా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది..జిల్లా న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయమూర్తికి ఉన్న సమానమైన అధికారపరిధి, అదనపు జిల్లా న్యాయమూర్తికి కూడా ఉంటుంది.[1]
ఏదేమైనా, అదనపు, సహాయ జిల్లా న్యాయమూర్తులపై, వారి పని కేటాయింపులపై నిర్ణయాలతో సహా, పర్యవేక్షక నియంత్రణను జిల్లా న్యాయమూర్తి కలిగిఉంటారు.పౌర విషయాలకు అధ్యక్షత వహించేటప్పుడు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిని తరచుగా "జిల్లా న్యాయాధిపతి" అని, నేర విషయాలకు అధ్యక్షత వహించేటప్పుడు "సెషన్స్ న్యాయాధిపతి" అని పిలుస్తారు.[2] జిల్లా స్థాయిలో అత్యున్నత న్యాయాధిపతి కావడంతో, జిల్లాలో న్యాయవ్యవస్థ అభివృద్ధికి కేటాయించిన రాష్ట్ర నిధులను జిల్లా న్యాయాధిపతికి నిర్వహించే అధికారం కూడా కలిగిఉంటాడు.
"మహానగర ప్రాంతంలోని" నగరంలో ఏదేని ఒక జిల్లా కోర్టుకు అధ్యక్షత వహించే జిల్లా న్యాయాధిపతిని "మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి" అని కూడా వ్యవహరిస్తారు. మహానగర ప్రాంతంలోని జిల్లా కోర్టుకు లోబడి ఉన్న ఇతర న్యాయస్థానాలను కూడా సాధారణ హోదాకు ముందు "మెట్రోపాలిటన్"తో సూచిస్తారు.ఏదేని ప్రాంత జనాభా ఒక మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా పేర్కొంటుంది.[3]
నియామకం, తొలగింపు
మార్చుసబార్డినేట్ కోర్టుల న్యాయాధిపతులు సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి గవర్నర్ ద్వారా నియమించబడతారు.ప్రత్యక్ష ప్రవేశ స్థాయికి కనీసం ఏడు సంవత్సరాల న్యాయవాద వృత్తి చేసినవారిని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ రాతపరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూలో ఎంపికైన వారిని, జిల్లా న్యాయాధిపతిగా నియమించటానికి హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సబంధిత రాష్ట్రప్రభుత్వానికి తెలియజేస్తుంది. దీనిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అంటారు. న్యాయస్థానాల నుండి కనీస సంవత్సరాల సేవలను నెరవేర్చినట్లయితే,జిల్లా న్యాయస్థానాలకు న్యాయమూర్తులు పదవీవృద్ధి చేయడం ద్వారా జిల్లా న్యాయమూర్తులను నియమిస్తుంటారు. దురదృష్టవశాత్తు దానివలన ప్రవేశ స్థాయి జిల్లా న్యాయమూర్తి పరీక్షలు, న్యాయవ్యవస్థ దిగువ స్థాయిలలోని న్యాయమూర్తులు తమ అవకాశాలను కోల్పోయేలా చేశాయనే భావన ఉంది.అలా పోస్టులను నింపడం వల్ల వారు చేసిన పనికి పదోన్నతులు ఎప్పటికీ ఫలవంతం కావటంలేదు, ఎందుకంటే తరువాత పోస్టులునందు న్యాయవాదులు నేరుగా జిల్లా న్యాయమూర్తులు అవుతున్నారు.
తగినన్ని సంవత్సరాలు పనిచేసిన జిల్లా న్యాయమూర్తికి తదుపరి స్థాయి ఎగువస్థాయి పదవి ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి పదవిలో నియమిస్తారు. సాధారణంగా ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదవృత్తి చేస్తున్న న్యాయవాదులు తగినన్ని సంవత్సరాలు పనిచేసిన జిల్లా న్యాయమూర్తులు నుండి, ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా నియమితులవుతుంటారు. హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయవాదులను నేరుగా ఉన్నత న్యాయస్థానాలకు, న్యాయమూర్తులుగాా నియమించటంవలన వల్ల, వారు చాలా సంవత్సరాల సేవలో చేసిన కృషికి పదోన్నతులు లభించే వారి ప్రక్రియను మందగించిందని వారు గ్రహించినందున, ఇది జిల్లా న్యాయమూర్తులు సామర్థ్యం క్షీణించటానికి కారణమైంది.జిల్లా న్యాయమూర్తిని లేదా అదనపు న్యాయమూర్తిని గవర్నరు తన కార్యాలయం ద్వారా ఉన్నత న్యాయస్థానం కొలీజియం నుండి తొలగించవచ్చు.
అధికార పరిధి
మార్చుజిల్లాలో తలెత్తే పౌర, నేర విషయాలలో జిల్లా న్యాయస్థానం లేదా జిల్లా కోర్టు అదనపు న్యాయస్థానం విచారణ అధికార పరిధి, పునర్విచారణ అధికారపరిధి అధికారాన్ని కలిగి ఉంటుంది. పౌర విషయాలలో ప్రాదేశిక, ధనాత్మక అధికార పరిధి సాధారణంగా పౌర న్యాయస్థానాల విషయంపై సంబంధిత రాష్ట్ర చట్టాలలో పొందుపర్చబడుతుంది. నేరాల విషయాలలో అధికార పరిధి నేర విచారణ నియమావళి చట్టం, నేర విచారణ విధానం నుండి ప్రత్యేకంగా తీసుకోబడింది. ఈ నియామావళి ప్రకారం, జిల్లా న్యాయస్థానం సెషన్స్ న్యాయమూర్తి దోషికి గరిష్ఠంగా మరణశిక్ష విధించటానికి అధికారం ఉంది.
జిల్లాలో ఉన్న అన్ని దిగువ న్యాయస్థానాలు ఇచ్చే పౌర, నేర విషయాలపై ఇచ్చే న్యాయ నిర్ణయాలపై పునర్విచారణచేసే అధికార పరిధి జిల్లా కోర్టుకు ఉంది. దిగువ న్యాయస్థానాలు, పౌర నిర్ణయాల వైపు (ఆరోహణ క్రమంలో), దిగువ సివిల్ న్యాయస్థానం,[4] ప్రధాన దిగువ న్యాయస్థానం, ఎగువ న్యాయమూర్తి న్యాయస్థానం, (దీనిని సబ్ కోర్ట్ అని కూడా పిలుస్తారు). సబార్డినేట్ కోర్టులు, నేరనిర్ణయాల వైపు దిగువ న్యాయస్థానాలను ఆరోహణ క్రమంలో, రెండవ తరగతి నేర న్యాయాధికారి న్యాయస్థానం, మొదటి తరగతి నేరన్యాయధికారి న్యాయస్థానం, ప్రధాన నేరన్యాయాధికారి న్యాయస్థానం అని వ్యవహరిస్తారు.నేర, పౌర సంబంధమైన కొన్నివిషయాలను దిగువ కోర్టు విచారించలేదు.ఇలాంటి విషయాలలో వాటిని జిల్లా న్యాయస్థానంలోనే పరిష్కరించటానికి మాత్రమే, జిల్లా కోర్టుకు అధికార పరిధి కలిగిఉంది.జిల్లా కోర్టుల నుండి వెలువడిన న్యాయనిర్ణయాలపై పునర్విచారణ చేసే అధికారం సంబంధిత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంది.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Courts of India". web.archive.org. 2013-01-22. Archived from the original on 2013-01-22. Retrieved 2020-10-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://indiankanoon.org/doc/978569/
- ↑ https://indiankanoon.org/doc/1663045/
- ↑ జిల్లా ఇ-కోర్టులు ఇండియా జిల్లా కోర్టులు, అధికారిక వెబ్‌సైట్ ఢిల్లీ జిల్లా కోర్టులు, అధికారిక వెబ్‌సైట్ మహారాష్