జి.శ్రీనివాస నాయుడు

జి.శ్రీనివాస నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో నిడదవోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

గడ్డం శ్రీనివాస నాయుడు
జి.శ్రీనివాస నాయుడు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు బూరుగుపల్లి శేషారావు
నియోజకవర్గం నిడదవోలు, ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం 1968
నిడదవోలు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం శాంతినగర్, నిడదవోలు

జననం, విద్యాభాస్యం మార్చు

జి.శ్రీనివాస నాయుడు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు లో జన్మించాడు. అయన హైదరాబాద్ రామంతాపూర్ లోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 1984లో పదవ తరగతి పూర్తి చేసి తరువాత బిఈ (మెకానికల్‌) పూర్తి చేసి, అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

జి.శ్రీనివాస నాయుడు 1994 నుంచి 2004 వరకు కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి జీఎస్‌ రావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయాడు.[2] ఆయన 2019లో వైఎస్సార్‌ సీపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుపై 21,688 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "Nidadavole Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  3. V6 Velugu (31 May 2019). "ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన 13 మంది శ్రీనివాసులు." (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)