బూరుగుపల్లి శేషారావు

బూరుగుపల్లి శేషారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నిడదవోలు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

బూరుగుపల్లి శేషారావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2019
తరువాత జి.శ్రీనివాస నాయుడు
నియోజకవర్గం నిడదవోలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రత్తయ్య
జీవిత భాగస్వామి విశాలాక్షి
పూర్వ విద్యార్థి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్

రాజకీయ జీవితం మార్చు

బూరుగుపల్లి శేషారావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పనిచేస్తూ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జి.శ్రీనివాస నాయుడు పై 5766 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎస్‌. రాజీవ్ కృష్ణా పై 6359 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. శేషారావు 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జి.శ్రీనివాస నాయుడు చేతిలో 21688 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "Nidadavole Constituency Winner List in AP Elections 2019 | Nidadavole Constituency MLA Election Results 2019". Archived from the original on 6 April 2022. Retrieved 6 April 2022.