జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహకనౌక

జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహక నౌక భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందిన భూసమస్థితి ఉపగ్రహ వాహకనౌక (Geosynchronous Satellite Launch Vehicle (GSLV). జీఎస్‌ఎల్‌వి శ్రేణిలో ఇది పదవ వాహకనౌక. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇస్రో 2211 కిలోగ్రాముల బరువున్న ఇన్సాట్-3DRఅనే ఉపగ్రహాన్ని దీర్ఘవృత్తాకార భూస్థిర బదిలీకక్ష్యలో ప్రవేశపెడుతుంది. అక్కడి నుండి ఉపగ్రహం తనస్వంత చోదకవ్యవస్థ ద్వారా భూసమస్థితి కక్ష్యలో, 74 డిగ్రీల తూర్పురేఖాంశంలో చేరును.[1] ఇస్రోవారి వాహకనౌకల అంబులపొదిలో బ్రహ్మస్త్రాం లాంటి పిఎస్‌ఎల్‌వి-ఎక్సుఎల్ శ్రేణి తరువాత అంతటి విశిష్టత కల్గిన ఉపగ్రహ వాహకనౌక జీఎస్‌ఎల్‌వి శ్రేణి. పిఎస్‌ఎల్‌వి శ్రేణి వాహకనౌకలో నాలుగు దశలుంటాయి. అందులో రెండు దశలు ఘనఇంధనాన్ని, రెండుదశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తే, జీఎస్‌ఎల్‌వి శ్రేణి వాహకనొకల్లో కేవలం మూడుదశలు ఉంటాయి. మొదటిదశలో ఘనఇంధనం, రెండోదశలో ద్రవఇంధనం ఉపయోగించగా, మూడవది క్రయోజనిక్ దశ. ఈ క్రయోజనిక్ భాగం వాహకనౌక పై భాగంలో ఉండును (Cryogenic Upper Stage -క్లుప్తంగా CUS). ఇందులో ఇంధనాన్ని అతిశీతలస్థితిలో భద్రపరచబడి ఉంటుంది. ఈ క్రయోజనిక్ ఇంజనును పూర్తి స్వదేశీ సాంకేతికపరిజ్ఞానంతో ఇస్రో రూపొందించింది. [1] జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్రాష్ట్రం లోని నెల్లూరుజిల్లాపరిధిలోని శ్రీహరికోటలో ఉన్న సతిష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదికనుండి 2016 సంవత్సరం సెప్టెంబరు గురువారం సాయంత్రం 4:50 గంటలకు ప్రయోగించారు.[2] ఇప్పటికి ఇస్రో జీఎస్‌ఎల్‌వి శ్రేణిలో పది ప్రయోగాలను చేయగా, ఈ ప్రయోగంతో ఏడవ విజయాన్ని స్వంతం చేసుకుంది. ఇందులోని క్రయోజనిక్ దశలోని క్రయోజనిక్ ఇంజనును పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసారు. ఈప్రయోగ విజం ఇస్రో చరిత్రలో ఒకమైలురాయివంటిది.

జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహకనౌక సాంకేతిక వివరాలు

మార్చు

ఈ వాహకనౌక పొడవు 49.1 టన్నులు. మూడు దహన అంచెలు/దశలు ఉన్నాయి. ప్రయోగ సమయానికి ఈ వాహకనౌక బరువు, ఇంధనంతో సహా 416 టన్నులు. మొదటిదశకు నాలుగు స్ట్రాపన్ బూస్టరులు న్నాయి. ఒక్కో స్ట్రాపానులో 40 టన్నుల ఘన ఇంధనం ఉంది. మొదటి దశ దహనసమయం 151. 5 వ సెకండు వరకు. 39. 44 టన్నుల ఇంధనం కలిగిన రెండవ దశ 292.6 వ సెకండు వరకు మండుతుంది. అత్యంత ప్రాధాన్యత గల క్రయోజనిక్ దశలో 12.83 టన్నుల ఇంధనం 1012 వ సెకండు వరకు మండుతుంది. ఈ దశ అంతిమ స్థితిలో ఇన్సాట్ -3DR ఉపగ్రహాన్ని 170 కిలోమీటర్ల పెరిజీ, 35,975 కిలోమీటర్ల అపోజిలో భూమధ్య రేఖకు 20.66 డీగ్రీల కోణంలో ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతుంది. [3]

కౌంట్‌డౌన్-ప్రయోగం

మార్చు

29 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం 11:10 గంటలకు ప్రారంభమై, ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది[4] నిజానికి 29 గంటల కౌంట్‌డౌన్ తరువాత ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం 4:10గంటలకు జరుగవలసిఉన్నది. అయితే ఉపగ్రహ వాహకనొకలోని, క్రయోజనిక్ దశలో ద్ర హైడ్రోజన్, ద్రవఅక్సిజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభించినప్పుడు, అందుకు సంబంధించిన రక్షణకవాటం సరిగా మూసుకోక పోవడం వలన, మధ్యాహ్నం 2:53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేసి, లోపాన్ని సరిదిద్దారు. దీనితో ప్రయోగం 40 నిమిషాలు ఆలస్యమైంది. కౌంట్‌డౌన్ పునఃప్రారంభించి, వాహకనౌకను సాయంత్రం 4:50 గంటలకు నింగిలోకి పంపారు [5].

ప్రయోగానంతర వివరాలు

మార్చు

జీఎస్‌ఎల్‌వి-F05 ఉపహ్రగ వాహకనౌక మొత్తం ప్రయోగం గతంలో చెప్పిన విధంగా మూడుదశల్లో జరిగింది. మొదటిదశలో కోర్‌ ఎలోన్ స్టేజిలో 139 టన్నుల ద్రవఇంధనం, దానికి అనుసంధానించిన నాలుగు స్ట్రాపాన్ బూస్టరులోనింపిన 160 టన్నుల ద్రవఇంధనం (ఒక్కోస్ట్రాపను బుస్టరులో 40టన్నుల ఇంధనంచొప్పున) సయంతో ఇంజిన్లను మండించి 151. 6సెకన్లలలో మొదటిదశ విజయవంతంగా ముగిసింది. తరువాత 39 టన్నుల ద్రవ ఇంధనం సహాయంతో 293 సెకన్లలో రెండవదశను, 12. 83 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1, 008సెకన్లలలో మూడవదశను విజయవంతంగా ముగించారు. తరువాత 1, 023 సెకన్లకు ఇన్‌శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని 170 కిలోమీటర్ల పెరూజీ, 35, 975 కిలోమీటర్ల అపోజీ భూసమాంతర కక్ష్యలోకి 20. 61 డిగ్రిలలో ప్రవేశపెట్టారు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-09. Retrieved 2016-09-07.
  2. "Isro's desi cryo engine–powered GSLV-F05 places INSAT-3DR weather satellite in orbit". 2016-06-08. Archived from the original on 2016-09-09. Retrieved 2016-09-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "రేపు నింగిలోకి జిఎస్‌ఎల్‌వవీ-ఎఫ్05". sakshi.com. Archived from the original on 2016-09-07. Retrieved 2016-09-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌ఎఫ్-ఎఫ్05". sakshi.com. 2016-08-09. Archived from the original on 2016-09-08. Retrieved 2016-09-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "నింగిలోకి ఇన్‌శాట్-3డీఅర్". sakshi.com. 2016-09-09. Archived from the original on 2016-09-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)