నెల్లూరు

ఆంధ్రప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరం

నెల్లూరు (విక్రమ సింహపురి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం ఉంది. నగరానికి పడమట గణపతి రుద్రదేవుడు తవ్వించిన నెల్లూరు చెరువు ఉంది. చెరువు గట్టుపయన నెలలోరే గ్రామ దేవత ఇరుకాలమ్మ గుడి ఉంది. ఇరుకాలమ్మను జైన శాసన దేవతగా చరిత్రకారులు గుర్తించారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులలో ఒకడైన తిక్కన సోమయాజీ ఈ ప్రాంతంలో నివసించాడు.

నెల్లూరు
సింహపురి
నెల్లూరు నగర దృశ్యమాల పైఎడమనుండి సవ్యదిశలో(నెల్లూరు నగర దృశ్యం, నారాయణ కళాశాలలు, కృష్ణపట్నం ఓడరేవులో ఓడ, శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం.
నెల్లూరు నగర దృశ్యమాల పైఎడమనుండి సవ్యదిశలో(నెల్లూరు నగర దృశ్యం, నారాయణ కళాశాలలు, కృష్ణపట్నం ఓడరేవులో ఓడ, శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం.
నెల్లూరు is located in Andhra Pradesh
నెల్లూరు
నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో నెల్లూరు స్థానం
Coordinates: 14°27′N 79°59′E / 14.45°N 79.99°E / 14.45; 79.99
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎస్ పి ఎస్ నెల్లూరు
పురపాలక సంస్థగా ఆవిర్బావం1866 నవంబరు 1
నగరపాలక సంస్థగా ఆవిర్భావం2004
Named forవరి, ఉసిరి
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyనెల్లూరు నగరపాలక సంస్థ
 • MLAలు
MLA ల జాబితా
 • లోక్‌సభ సభ్యుడుఆదాల ప్రభాకర రెడ్డి
Area
 • నగరం150.48 km2 (58.10 sq mi)
Population
 (2011)[1][2]
 • నగరం6,00,869
 • Rank4వ (in AP)
 • Density4,000/km2 (10,000/sq mi)
 • Metro
5,58,548
Demonym(s)నెల్లూరోడు, నెల్లూరివారు
అక్షరాస్యత
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+05:30 (IST)
పిన్‌కోడ్
524001-524005
Area code+91–861
వాహన నమోదు సంఖ్యAP-39

పేరు ఉత్పత్తి మార్చు

 
Map

విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. వరికి అప్పటి వాడుకలో గల తమిళ భాషలో నెల్ అంటారు కావున నెల్ వూరు అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమంలో నెల్లూరుగా రూపాంతరం చెందింది. పల్లవ రాజుల చిహ్నం సింహం కనుక, విక్రమసింహుని కాలంలో సింహపురి రాజధానిగా వున్నందున ఈ ఊరిని విక్రమసింహపురి అనికూడా అంటారు. రెండు పేర్లు శాసనాలలో ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి.

ఇంకో కథనం ప్రకారం, నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయాన్ని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించారట. ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట. మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనబడినాడట. ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్ఠింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించాడట. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అంటారు కావున ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరు అయింది.

ఇంకొక కథనం ప్రకారం వేసాలమారు అనే వర్తకుడిని నెల్లూరు నిర్మాతగా చెపుతారు,ఇతని వ్యాపార వస్త్రాలు దోచుకోబడి, చెప్పుకొనే అధికారి లేక ఒక బావివద్ద కొరడా పట్టుకొని అక్కడ నీళ్లు తోడుకొనే వారి దగ్గరనుండి సుంకం వసూలు చేసేవాడు, ఇది తెలిసిన అప్పటి గోల్కొండ రాజు అతనిని పిలిచి విచారిస్తే, రాజు దృస్థికి రావటం కోసం తాను ఈ పని చేసాను అని, వసూలు చేసిన మూడు లక్షల హన్నులు రాజుకు ఇస్తే ఆ రాజు, వేసాలమారు నడవడికకు మెచ్చి నెల్లూరు అధికారిగా నియమించి, వసూలు చేసిన ధనముతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయమని చెప్పాడట[3]

చరిత్ర మార్చు

పూర్వం పెన్నా నది ఇప్పటి రంగనాయకుల గుడికి పడమట, ఎగువన రెండుగా చీలి ఈ ప్రదేశానంతా ఒక అంతర్వేదిగా (Doab-దో ఆప్=రెండు నీళ్ళ పాయలు) చేసిఉన్నట్లు కనబడుచున్నది. శయన నారాయణ స్వాములు వెలసిఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం మొదలైనవన్నీ ఇట్టి ఏటిపాయల నదిఒడ్డుననే ఉన్నాయి.

ఇక్కడి సంతపేటరేవు, చారిత్రక హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.ఈ స్వామినే తిక్కన, నాచన సోమనలు ఆరాధించారు. పెన్నానది పూర్వం ఇక్కడనే ఇంకొకపాయగాచీలి, చిత్రకూటం-ఇసుకడొంక-జేంస్ గార్డెన్-ఉదయగిరివారి తోట (ఇప్పటి లక్ష్మీపురం) నవలాకుతోటల (9 లక్షల ఫలవృక్షాలను ఇచట నెల్లూరు, సర్వేపల్లి నవాబులు పెంచినారట) మీదుగా తూర్పుగా పారి, కొత్తూరు, ఇందుకూరుసేట మడుగులై, క్రింద మొత్తలు అనే కూడలిచోట ఉత్తరముఖమై, ఊటుకూరు దగ్గర మొదటి పినాకినీ శాఖలోకలసి, సముద్రంలో సంగమించింది. దీనికి భౌగోళిక ఆధారాలున్నాయి. ఈ ఏటిపాయ, పేరుకొని పోతూవచ్చి ఎప్పుడు పూర్తిగా పూడిపోయిందో చెప్పలేరు. ఈ పూడిపోయిన శాఖను వృద్ధ పినాకినీ అని అంటారు.[ఆధారం చూపాలి]

కవిత్రయంలో ఒకరైన తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశం లోనే రచించినట్లు చెపుతారు. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం లోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతన ప్రశస్తి కలిగి ఉంది.[ఆధారం చూపాలి]

నెల్లూరులో టౌన్ హాలు, శిశు వైద్యశాల నిర్మాణం చేసిన రేబాల లక్ష్మీనరసా రెడ్డి, మొదటి కళాశాల నిర్మాణం చేసిన వెంకట గిరి రాజు ముఖ్య దాతలు.

జనగణన విషయాలు మార్చు

2011 జనగణన ప్రకారం నెల్లూరు జనాభా సుమారు 6 లక్షలు.[1]

వాతావరణం మార్చు

ఉమ్మడి జిల్లాలో వేసవి అత్యధిక ఉష్ణోగ్రత (36-46)సెంటీగ్రేడ్. శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత (23-25)సెంటీగ్రేడ్. నైరుతీ ఋతుపవనాల వర్షపాతం 700-1000 మిల్లీమీటర్లు. నెల్లూరు తరచూ ఆయా కాలాలలో కరువుకు, వరదకు గురికావడం సహజంగా జరుగుతూ ఉంటుంది.[4]

పరిపాలన మార్చు

నెల్లూరు నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది. నగర పరిధిలో కలసిన గ్రామాలు కొమరిక, రావూరు, పున్నూరు, కృష్ణ పట్ణణం, మైపాడు.

రవాణా సౌకర్యాలు మార్చు

 
నెల్లూరు రైల్వేస్టేషను ముందు భాగం.పశ్చిమదిక్కు
 
నెల్లూరు రైల్వేస్టేషనుప్లాట్‌ఫారాలు
 
నెల్లూరు రైల్వేస్టేషను టికెట్ కౌంటరు (పశ్చిమదిక్కు)
 
నెల్లూరు రైల్వేస్టేషనులోని ఎస్కెలెటరు

ఇది చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-16) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉంది.

నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. నెల్లూరు పాతపేరైనా సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్‌ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది.

విద్యా సౌకర్యాలు మార్చు

  • విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం
  • వెంకటగిరి రాజా కళాశాల.
  • దొడ్ల కౌసల్యమ్మ మహిళా డిగ్రీ కళాశాల,
  • శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల,
  • కామిశెట్టి ఆదిశేషయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ.
  • నారాయణ ఇంజనీరింగ్ కళాశాల.

ఆర్ధిక స్థితిగతులు మార్చు

పరిశ్రమలు మార్చు

  • బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి.
  • అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి.

బ్యాంకులు మార్చు

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు నెల్లూరు నగరంలో 15 శాఖలు ఉన్నాయి.

సంస్కృతి మార్చు

పండుగలు , ఉత్సవాలు మార్చు

  • మహా శివరాత్రి - శివునికి అంకితమైన పండుగ) నవరాత్రి - 10 రోజుల హిందూ పండుగ, ఇక్కడ దుర్గాదేవిని పూజిస్తారు) దీపావళి - దీపాల పండుగ; భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, విస్తృతంగా జరుపుకునే పండుగ.
  • సంక్రాంతి, సంక్రాంతిలో భాగంగా జరుపుకునే భోగి పిల్లలు పెద్దలు సంతోషంగా జరుపుకుంటారు.
  • రొట్టెల పండుగ: మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిం ప్రజలు కలిసి నెల్లూరు చెరువు సమీపంలో బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతున్నది.

వంటలు మార్చు

దేవాలయాలు మార్చు

  •  
    అద్దాల మండపంలో పైకప్పున శ్రీకృష్ణుని బొమ్మ తీర్చి దిద్దిన వైనం.
  • శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం: ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి. (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం).
  • శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు, (పురాతన ఆలయం)
  • వేణుగోపాల స్వామి ఆలయం మూలపేట,
  • శ్రీ ధర్మరాజస్వామి ఆలయం, నెల్లూరు.
  • శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం, రంగనాయకులపేట.
  • శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానం, దర్గామిట్ట.* బారా షహీద్ దర్గా, నెల్లూరు
  • శ్రీ సాయిబాబా మందిరం, స్వతంత్ర పార్క్ ప్రక్కన,
  • మస్తానయ్య దర్గా, నెల్లూరు.
  • శ్రీ అయ్యప్పస్వామి గుడి, దర్గామిట్ట, నిప్పో ఫ్యాక్టరీ సమీపం,
  • ఈశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఉస్మాన్ సాహెబ్ పేట, నెల్లూరు,
  • శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, మూలాపేట, నెల్లూరు.

ఇతర విశేషాలు మార్చు

  • ఎమ్ జి బి మాల్ మల్టీప్లెక్స్ అయిదు ప్రదర్శన తెరలు కలిగివుంది.
  • నెల్లూరు జిల్లా తీరం వెంట బకింగ్ హాం కాలువ ఉంది.
  • పెన్నానుంచి సర్వేపల్లి చెరువు కాలువ ఉంది.

ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Integrated Municipal Solid Waste (MSW) Management Project" (PDF). Swachha Andhra Corporation. Government of Andhra Pradesh. October 2016. p. 27. Archived from the original (PDF) on 2017-05-10. Retrieved 9 June 2019.
  2. Ravikiran, G. "Fertile lands turning into concrete jungle". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 18 May 2017.
  3. "కొరడా పట్టుకొని బావి సుంకం వసూలు చేసిన వేసాలమారు" (PDF). జమీన్ రైతు వార పత్రిక.
  4. "District Profile". Archived from the original on 2019-10-23. Retrieved 2022-06-26.

బయటి లింకులు మార్చు

Manual of the Nellore District in the Presidency of Madras. Manual of the Nellore District in the Presidency of Madras. Resource Type, : Book. Author, : Boswell, A. C.. Year/Date of Publication, : ...

  • 1972 భారతి మాస పత్రిక- వ్యాసం నెల్లూరులో పెన్నా నది ఒడ్డున హరిహరనాధాలయం ఉందా?- వ్యాసకర్త మరుపూరు కోదందరామిరెడ్డి.
"https://te.wikipedia.org/w/index.php?title=నెల్లూరు&oldid=4155757" నుండి వెలికితీశారు