జీన్స్ అనునవి డెనిమ్ లేదా డుంగరీ వస్త్రంతో కుట్టిన ప్యాంటు.

వదులుగా ఉన్న ఒక జీన్స్ ప్యాంటు

1950 లో కౌబాయ్ ల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన జీన్స్ టీనేజీ యువతలో బాగా జనాదరణ పొందినది. జీన్స్ రూపొందించటంలో లెవీ స్ట్రాస్ అండ్ కో., లీ, వ్రాంగ్లర్ సంస్థలు పేరెన్నిక గన్నవి. స్కిన్నీ, టేపర్డ్, స్ట్రెయిట్, బూట్ కట్, న్యారో బాటం,లో వెయిస్ట్, యాంటీ-ఫిట్, ఫ్లేర్ శైలులలో జీన్స్ లభ్యం.

చరిత్ర

మార్చు

వ్యుత్పత్తి

మార్చు

జీన్స్ చరిత్ర కార్డురాయ్ వలెనే కనిపించే, జీన్ అని పిలవబడే కాటన్ కార్డురాయ్ అనే వస్త్రం యొక్క ఉత్పత్తికి పేరెన్నిక గన్న ఇటలీలోని జెనోవా నగరంలో ప్రారంభమైనది. ఈ జీన్ జెనోవా నుండి నావికులచే ఐరోపా ఖండం సర్వత్రా ఎగుమతి చేయబడేది. ఫ్రెంచి నగరం నైమ్స్ నేతకారులు ఈ కాటన్ కార్డురాయ్ ని ఉత్పత్తి చేసేందుకు విఫల యత్నాలు చేశారు. అయితే ప్రయోగాలతో, తప్పులని సరి చేసుకోవటంతో జీన్ ని పోలిన ట్విల్ వస్త్రాన్ని రూపొందించారు. నైమ్స్ నుండి వచ్చే వస్త్రం అని అర్థం వచ్చేలా ఫ్రెంచి భాషలో వీటిని de Nimes (డె నిమ్స్) అని వ్యవహరించేవారు. పద్ధెనిమిదవ శతాబ్దపు అంతానికి గానీ అమెరికాలోకి జీన్స్ ప్రవేశించలేదు.

రివెటెడ్ జీన్స్

మార్చు
 
లెవిస్ 501 జీన్స్ యొక్క లేబుల్.

1870 లో జాకబ్ డెవిస్ అనే నెవాడాకు చెందిన దర్జీ మగవారు పని చేసే వేళల్లో వేసుకొనే ప్యాంట్లలో వత్తిడికి గురి అయ్యే ప్రదేశాలను గుర్తించాడు. ఈ ప్రక్రియకి పేటెంటు పొందాలనుకొన్నాడు కానీ తన వ్యాపారానికి ఒక భాగస్వామి కావాలనుకొన్నాడు. లెవీ వద్ద వస్త్రాలను కొంటూ ఉండటం వలన అతని సహాయం కోరాడు. మే 20, 1873 న ష్ట్రౌస్స్, డేవిస్ డెనిం వర్క్ ప్యాంట్ ల జేబులను రాగి బొత్తా (రివెట్)లతో బలపరచే ప్రక్రియకి యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ #139121 ని అందుకొన్నారు. న్యూ హ్యాంప్ షైర్ లోని మ్యాంచెస్టర్కి చెందిన అమోస్కియగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేసే వస్త్రంతో లెవీ స్ట్రాస్ అండ్ కో. ప్రఖ్యాత లెవీస్ బ్రాండు జీన్స్ ని రూపొందించటం మొదలుపెట్టినది.

భారతదేశంలో జీన్స్ వాడకం

మార్చు

భారీగా ఉండటం, ఉతకటం, ఆరవేయటం, ఇస్త్రీ చేయటం కష్టంగా ఉండటం వలన జీన్స్ గురించి తెలిసిననూ వాటిని ధరించటం పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. 1995 లో విడుదలైన దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే సినిమాలో షారుఖ్ ఖాన్ కేవలం మూడు సందర్భాలలో ఫార్మల్ ప్యాంట్లు ధరించాడు. మిగితావన్నీ జీన్స్ ప్యాంట్లే. ఇదే విధంగా 1996 లో నాగార్జున అక్కినేని నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఒకటి రెండు సందర్భాలలో తప్పితే పూర్తి నిడివి జీన్స్ ధరించాడు. విజయ దుందుభి మోగించిన ఈ చిత్రాలు జీన్స్ తో యువతని మంత్రముగ్ధులని చేశాయి. లెవీ స్ట్రాస్ అండ్ కో., లీ, వ్రాంగ్లర్ ల చే బరువు తగ్గించిన, పలుచన చేసిన, మృదువుగా ఉన్న, కొద్దిగా సాగే గుణం కలిగిన సౌకర్యవంతమైన జీన్స్ లు రూపొందించబడటంతో జీన్స్ పుంజుకొన్నాయి. ఇస్త్రీ అవసరం లేకపోవటం, ఉతకకుండా ఎన్ని మార్లైనా వేసుకోగలిగే సౌలభ్యం ఉండటం, మాసిననూ, చిరిగిననూ అవి కూడా ఫ్యాషన్లుగా జమ కట్టటంతో జీన్స్ జనం లోకి మరింతగా చొచ్చుకుపోయింది. ప్రస్తుత కాలం జీన్స్ వేసిన వారిని చూడకుండా ఒక్క రోజు కూడా గదవదంటే అతిశయోక్తి కాదేమో!

ఇవి కూడా చూడండి

మార్చు