జీరంగి ఇది ఒక రెక్కలున్న పెద్ద కీటకము. అడవులలో చెట్ల కొమ్మలను అంటి పెట్టుకొని, తమ రెక్కలతో "గీ" అనే పెద్ద చప్పుడు కొన్ని గంటల పాటు చేస్తుంటాయి. ఇది చెట్టు కొమ్మను అంటి పెట్టుకుని ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మ రంగులో వుండి అంత సులభంగా మన కంటికి కనబడదు. శబ్ధాన్ని బట్టి దాన్ని చూద్దామన్నా. అది ఉన్న చోటు నుండే శబ్దం చేస్తున్నా మన చెవులకు ఆ శబ్దం మరొక చోట నుండి వస్తునట్లు వినిపిస్తుంది. ఇది వీటి ప్రత్యేకత. గంటల తరబడి ఏక ధాటిగా శబ్ధము చేయు కీటక ఇది. దీని శబ్ధము దాని నోటి నుండి కాక, తన రెక్కలను ఆడించడము ద్వారా చేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=జీరంగి&oldid=2950137" నుండి వెలికితీశారు