జీడి లేదా జీళ్ళు అనేవి చక్కెర పాకంతో చేసే ఒకానొక తీపి వంటకం. ఇవి ఎక్కువగా తిరనాళ్లలోనూ, సంభరాలలోనూ, తీర్ధాలలోనూ, పుణ్యక్షేత్రాలలోనూ విక్రయిస్తుంటారు.

రకాలు

మార్చు
దస్త్రం:Andhra Sweet Jeedi (Jeellu)-2.jpg
తయారైన జీళ్ళు
దస్త్రం:Andhra Sweet Jeedi (Jeellu).jpg
జీడి తయారీ విధానం
  • చక్కెర జీళ్ళు
  • బెల్ల జీళ్ళు
  • నువ్వుల జీళ్ళు

తయారీ విధానం

మార్చు

చెక్కర లేదా బెల్లం నీళ్ళలో వేసి మరగబెట్టి తీగ పాకం వచ్చే వరకూ బాగా కాచి మరగనిచ్చి దానిని ఒక పెద్ద ప్లేట్ లేదా పళ్ళెంలో వేసి తిప్పుతూ పెద్ద ఉండలా మార్చి పిసుకుతూ, అప్పటికే సిద్దం చేసుకొన్న గుంజకు ఉన్న మేకుకు వేసి దానిని పొడవుగా సాగదీస్తూ మళ్ళీ మెలితిప్పి వేస్తూ సరియైన పరువుకు రాగానే బల్లమీద వేసి సన్నగా పొడవుగా చేసి ముక్కలు ముక్కలుగా కత్తితో నరకడం చేస్తారు

ఇతర విశేషాలు

మార్చు
  • కొన్ని పల్లెలలో సైకిళ్ళపై వచ్చి పాత ఇనుప సామాన్లకు బదులుగా పిల్లలకు జీళ్ళు ఇచ్చేవారు.
  • జీళ్ళకు జీవిత కాలం తక్కువ. ఒకరోజు తరువాత మెత్తగా అయిపోతాయి. తింటున్నపుడు ముక్కలుగా అవుతాయి.కావున వాటిని గాలిచోరబడని సీసాలో పెట్టి భద్రపరచాలి
  • అసలు ఎంతకూ వదలకుండా / అయిపోకుండా విసిగించే వాటిని ఆ సాగే గుణం వలన జీడిపాకంతో పోలుస్తారు

మూలాలు, వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీళ్ళు&oldid=2985485" నుండి వెలికితీశారు