కత్తి ఒక పదునైన ఆయుధం. కత్తిని ఖడ్గము, కరవాలము, చాకు, చురి, ఖైజారు అని కూడా పిలుస్తారు. చిన్న కత్తులు మంగల కత్తి: ఇది గడ్డం గీయ డానికి, ఉపయోగిస్తారు, కోడి కత్తి: కోడి పుంజుల పందాలలో దీన్ని కోడి పుంజూ కాలికి కట్టి పందెం కాసారు. ఇది చాల పదును కలిగి వుంటుంది. కురకత్తి: ఇదికూడ చిన్నది: దీన్ని కూరగాయలు కోయడానికుపయోగిస్తారు. గీస కత్తి: ఇది చాల చిన్నది: మల్లెముల్లు, గుబిలి గంటి, వంటి పరికరాలతో బాటు దీన్ని ఒక గుత్తిగా చేసి పల్లె వాసులు మొలకు కట్టుకునేవారు. ఇప్పుడు వస్తున్న అనేక రకాల వస్తువులు అనగా నైల్ కట్టరు, దానితో వుండే అనేక రకాల వస్తువులకు ఇది మూలాదారం. పేనాకత్తి: ఇది చిన్నది. మడిచి జేబులో పెట్టు కోవచ్చు: పీటకత్తి: ఇళ్లల్లో కూరగాయలు కోయడానికుప యోగిస్తారు: పీటకు కత్తి ఏర్పాటు చేసిన విధానం ఇది. పెద్ద కత్తులు .. వేటకత్తి ఇది పెద్దది. జంతు బలులుకు వాడతారు. మచ్చుకత్తి: పెద్ద పెద్ద చెట్లను కొట్టడానికి రైతులు దీనిని వాడతారు:

వివిధ రకాల కత్తులు
Characteristic parts of the knife

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో కత్తి పదముతో చాలా ప్రయోగాలున్నాయి.[1] కత్తిపీట అనగా కత్తిని ఒక కర్రతో చేసిన పీట మీద బిగించి కూరగాయలు మొదలైనవి కోయడానికి ఉపయోగిస్తారు. కత్తిబళ్లెము అనగా బళ్లెము చివర కత్తిని బిగించి ఉపయోగిస్తారు. కత్తితో చేసిన గాయాల్ని కత్తివాటు అంటారు. కత్తెర దీనికి భిన్నంగా ఒక పైపు దారు పట్టిన రెండు లోహపు కత్తుల్ని కలిపి బిగించి కత్తిరించడానికి ఉపయోగిస్తారు.

రకాలు

మార్చు
 
వ్యవసాయ దారులు వాడే చిన్న కత్తి, కొడవలి, చిన్న గొడ్డలి. దామలచెరువు గ్రామంలో తీసిన చిత్రము
  • వంట కొరకు వాడు కత్తులు
  • చెట్లు నరుకు కత్తులు
  • యుద్ధాలలో వాడు కత్తులు
  • వ్యవసాయ పనులలో వాడు కత్తులు
  • పట్టాకత్తి
  • పిజ్జా కట్టర్

ఉపయోగాలు

మార్చు

మానవ జీవనంలో దీని ఉపయోగం తప్పనిసరి.

  • ఇంట్లో కొరగాయలు కోసుకోవడానికి మొదలు
  • పొలాలలో చిన్నా పెద్దా చెట్లుకొట్టేందుకు.
  • మాంసపు దుకాణాలలో మాంసం కొట్టడానికి.
  • అన్నశాలలు, తినుబండారాల దుకాణాలు, సంతలు, కిరాణా అంగళ్ళు అన్నిటిలో వీటి ఉపయోగం తప్పని సరి.
  • మంగలి అంగడిలో బొచ్చు గొరగడానికి దీనిని వాడతారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కత్తి&oldid=4270756" నుండి వెలికితీశారు