కాళీపట్నం రామారావు గారి మరొక పేరెన్నికగన్న నవల - జీవధార. జీవధార ఒక నిజమైన పాత్రల చిత్రన కలిగిన కథ. ఇది 1971 లో వ్తాయబడినది. దీనిని తదుపరి 1080 లో రష్యన్ భాషలోకి తర్జుమా చేసారు.

జీవధార నవల ముఖ చిత్రము

రచయిత గురించి క్లుప్త సమాచారం మార్చు

కారా మాస్టారు గా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావ ప్రాధాన్య రచనలు చేసాడు. ప్రసిద్ధ నవలా రచయిత అయిన యండమూరి వీరేంద్రనాధ్ రామారావు రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా అత్యంత సుప్రసిద్ధమైన రచనలు చేసారు.

1966లో వీరు రాసిన 'యజ్ఞం' కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు.

ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. ఈ ప్రస్తుత పుస్తకం 2008 సంవత్సరం వరకు కారా మాష్టారు గారి రచనలు అన్నింటినీ చక్కగా ఏరి కూర్చి ప్రచురించినది. ఇందులో వారి లేఖలు, కథలు పత్రికల్లో వ్యాసాలు అన్నీ మొత్తం 567 పెద్ద పేజీల్లో కూర్చబడ్డాయి.

ఇవీ చూడండి మార్చు

మూలాలు, ఆధారాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జీవధార&oldid=2947744" నుండి వెలికితీశారు