Jeevitha charitara manali chala upayogapaduthundhi ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్ర అంటారు. సాధారణ విషయాలైన చదువు, ఉద్యోగం/వ్యాపారం, బాంధవ్యాలు, మరణమే కాక, వారి అనుభవాలు, సంఘటనల చిత్రణ కూడా ఈ జీవిత చరిత్రలో భాగమే. రెజ్యూమ్ ల్లా కాక ఒకరి జీవిత కథ, వివిధ కోణల్లో వారి అనుభవాలతో పాటు వారు జీవించిన కాలం, ప్రదేశ విశేషాలు కూడా ఉంటాయి. సహజంగా జీవిత చరిత్రలు కాల్పనికేతర రచనలు అయి ఉంటాయి. కానీ జీవిత చరిత్రను రాసేందుకు కాల్పనిక పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. సినిమా వంటి ఇతర పద్ధతులను ఉపయోగించి కూడా జీవిత చరిత్ర చిత్రణ చేయవచ్చు.

ప్లటర్చ్ రాసిన, జాకబ్ టాన్సన్ ముద్రించిన  లైవ్స్ ఆఫ్ ది నోబెల్ గ్రీక్స్ అండ్ రోమన్స్ పుస్తకం  మూడో ఎడిషన్

ఒకరి జీవిత చరిత్ర వారి నుంచి నేరుగా తెలుసుకునిగానీ, వారికి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి గానీ తెలుసుకుని రాస్తారు. అలా కాక ఎవరి జీవితం గురించి వారే రాసుకోవడం అనేది ఆత్మకథ అంటారు. ఒక్కొక్కరు ఘోస్ట్ రైటర్ సహాయంతో ఆత్మకథ రాస్తారు.

చరిత్ర

మార్చు

మొదట్లో జీవిత చరిత్రా రచనలో కేవలం వ్యక్తి జీవితం గురించే కాక, అతను జీవించిన కాలం, ప్రదేశాల పరిస్థితులు, సంస్కృతి పరిణామాల గురించి కూడా చిత్రణ ఉండేది. 18వ శతాబ్దం తరువాత ఇది ఒక ప్రత్యేక ప్రక్రియగా మారిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.[1]

చరిత్రాత్మక జీవిత చరిత్ర

మార్చు
 
లేఖకునిగా ఐన్ హార్డ్

ప్రాచీన జీవితచరిత్రల్లో ప్లటర్చ్ రాసిన పార్లల్ లైవ్స్ ఒకటి. క్రీస్తు శకం 8 వ శతాబ్దంలో ప్రచురించిన ఈ పుస్తకంలో ప్రపంచంలోని ప్రముఖుల జీవిత చరిత్రలు రాశారు ఆయన. క్రీస్తు పూర్వం 44వ శతాబ్దంలో కార్నెలిస్ నెపోస్ ఎక్సెల్లెంటిం ఇంపెరేటొరం విటై అతి ప్రాచినమైన జీవితచరిత్ర.[2] పౌరాణిక విషయాలు లేకుండా సెటొనిస్ రాసిన ది లైవ్స్ ఆఫ్ ది సీసర్స్ అనే పుస్తకం కూడా ఈ కోవలోకే వస్తుందనేది ఒక వాదన.

మధ్యయుగంలో ఐరోపా చరిత్ర చాలావరకు వెలుగులోకి రాలేదు. ఈ సమయంలో రోమన్ కేథలిక్ చర్చి చరిత్ర మాత్రమే అందుబాటులో ఉంది. హెర్మిట్లు, సన్యాసులు, చర్చి ఫాదర్లు రాసిన జీవితచరిత్రల ద్వారానే ఆ కొంత చరిత్రైనా ఉందని చెప్పాలి. ఆ కాలనికి చెందిన చర్చి ఫాదర్లు, ప్రముఖ సన్యాసులు, పోప్ ల జీవితచరిత్రలు మాత్రమే రాశారు వీరైనా. ఈ పుస్తకాలు ఆధ్యాత్మికంగా ప్రజలకు, క్రిస్టియన్ మిషనీరలకు ప్రేరణగానూ ఎక్కువగా ఉపయోగపడేవి. ఐన్ హార్డ్ రాసిన లైఫ్ ఆఫ్ చార్లెమాగ్నే పుస్తకం ఈ కోవలోకి చెందినవే.

మూలాలు

మార్చు
  1. Kendall.
  2. Rines 1918, p. 719.