జీవం

పకృతి నుండి శక్తిని స్వీకరించి పునరుత్పత్తి చేసే పదార్థం
(జీవితం నుండి దారిమార్పు చెందింది)

"జీవం" నిర్వచనంసవరించు

దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి. ఈ సృస్టిలో రెండు పదార్ధాలు ఉన్నాయి. అవి జీవులు, నిర్జీవులు. వాటిని వేరు చేసేది కేవలం వాటిలో ఉండే ప్రాణం.

భౌతిక శాస్త్రం గానీ, రసాయన శాస్త్రం గాని ఈ జీవం యొక్క నిర్వచనం చెప్పలేదు.

జీవ శాస్త్రం లేదా జీవ రసాయన శాస్త్రం మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే జీవక్రియలు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.

భాషా విశేషాలుసవరించు

జీవము [ jīvamu ] jīvamu. సంస్కృతం n. Life, existence. ప్రాణము. The vital spirit, the soul ఆత్మ. An animal or creature, ప్రాణి. కాకిజీవము one whose life is as long, as vile and as wretched as that of a crow. దుష్టజీవము a despicable being. జీనరూపము the living image. జీవంజీవము jivam-jīvamu. n. A fabulous bird. చకోరపక్షి, వెన్నెలపులుగు, వన్నెపులుగు. జీవగర్ర jīva-garra. n. A prop, stay, support. ప్రాణరక్షకము. R. vii. 143. జీవకుడు jīvakuḍu. n. A living man. ప్రాణి. One who lives జీవించువాడు. A servant కొలువుడుకాడు జీవచ్ఛవము jīvach-chhavamu. n. A living corpse. బ్రతికి యుండు శవము. జీవదుడు jīvaduḍu. n. One who gives life. జీవమునిచ్చువాడు. A medical man. వైద్యుడు. జీవధనము jīva-dhanamu. n. Cattle. గోవులులోనగునవి. జీవనౌషధము jīvan-aushadhamu. n. A medicine that revives life. బ్రతుకజేసే మందు. జీవన్ముక్తుడు jīvan-muktuḍu. n. One who has become emancipated from all desire. A man who is in the world but not of the world. జీవించియుండియును జ్ఞానముగొని సమస్త బంధములను బిడగొట్టుకొని ముక్తి నొందినవాడు. జీవవృత్తి jīva-uṛitti. n. Tending cattle. గోవులు గుర్రములు మొదలైనవానిని పెంచుకొని చేసే జీవనము. జీవదంతము jīva-dantamu. n. Solid ivory; ivory cut from a living elephant. జీవనము jīvanamu. n. Life, existence, livelihood, means of subsistence, profession. బ్రతుకు, బ్రతుకుతెరువు. Water ఉదకము. జీవనము చేయు to make a living, to earn a livelihood. జీవనోపాధి jīva-nōpādhi. n. Livelihood, means of living. జీవన్మృతుడు jīvan-mṛituḍu. n. One who though living is yet dead, one who is half dead. జీవించియుండియును చచ్చినవాడు. జీవరత్నము jīva-ratnamu. n. A gem of the first water. శ్రేష్ఠరత్నము. జీవరేఖలు jīva-rēkhalu. n. The finishing lines in statuary, the last touches which give a living appearance. జీవశిల jīva-ṣila. n. The living rock. జీవాంతకుడు jīvāntakuḍu. n. A bird catcher. పిట్టవేటకాడు జీవాతువు jīvātuvu. n. Livelihood. బ్రతుకు. A prop or support జీవగర్ర Cooking వంటకము. జీవాత్మ jīv-ātma. n. An embodied spirit, the individual soul enshrined in the human body as distinguished from the Supreme Soul (పరమాత్మ.) The principle of life. జీవాళము or జీవ jīvālamu. n. The main point, the chief object. A bit of cord or wire put loose between the cords of a guitar to regulate the sound. తంతికింది తాడు. జీవి jīvi. n. A living creature or animal. ప్రాణి, జీవించువాడు. స్వల్పజీవి a vain foolish brute. కాకజీవి one whose life is as long and wretched as that of a crow. జీవించు jīvinṭsu. v. n. To live, exist, subsist. బ్రతుకు. జీవిక jīvika. n. Livelihood, profession or occupation. జీవనోపాయము, బ్రతుకుతెరువు. జీవితము jīvitamu. n. Living, existence. బ్రతకడము. Life ప్రాణము. జీవితకాలము jīvita-kālamu. n. Lifetime. జీవితేశుడు jīvit-ēṣuḍu. n. "Lord of one's life, i.e.," a husband, a name of Yama, the judge of departed souls. ప్రాణనాయకుడు, యముడు. జీవుడు jīvuḍu. n. The soul, the sentient principle: a living being. ప్రాణి.

జీవక్రియలుసవరించు

జీవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొన వచ్చును. ఈ చర్యలు జీవం మనుగడకు అత్యావశ్యకమైనవి. వీటి వలన జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ధి, నిర్మాణము, పరిసరానుగుణ్యత మొదలగు అంశాలు చోటుచేసుకుంటాయి.

అబ్రకం పొరల్లోజీవం పుట్టుకసవరించు

భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ జీవానికి అంకురార్పణ జరుగలేదు. దానికి కారణం జీవం పుట్టుకకు కావలసిన వాతావరణం లేకపోవడమే.అబ్రకం ఫలకాల్లో జీవం ఆవిర్భవించిందని, పుస్తకంలోని పేజీల తరహాలో ఉండే ఈ ఖనిజం పొరల్లో మొదటి జీవి వూపిరి పోసుకుందని, ఈ పొరల మధ్య కంపార్ట్‌మెంట్లు ఉండేవని, వీటిలో కొన్ని పరమాణువులు కణాలుగా మారడానికి అవసరమైన భౌతిక, రసాయన వాతావరణాన్ని అబ్రకం కల్పించిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

అసలు అప్పుడేం జరిగింది???సవరించు

సుమారు 13.7 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం బిగ్ బ్యాంగ్ (బ్రహ్మాండ విస్పోటనం) జరిగి ఇప్పుడున్న విశ్వం తయారయినది.భూమి కూడా అలా విశ్వంలోనికి విసిరివేయబడ్డ ఓ ముక్క మాత్రమే.అప్పుడు ఈ భూమి ఓ మండుతున్న అగ్నిగోళం.అలా కొన్ని కోట్ల సంత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడింది.అది కూడా ఊపరితలంపై మాత్రమే.ఓ నగ్నసత్యం ఏమిటంటే ఇప్పటికి ఈ భూమి అట్టడుగు పొరలు ఇంకా చల్లారలేదు.భూమి అడుగు భాగాన శిలలు సైతం కరిగిపోయే వేడిమి ఉంది.అంటే మనం ఇంకా ఓ అగ్నిగోళంపై ఉన్నామన్నమాట.

సరే ఇక జీవం పుట్టుక విషయానికి వస్తే...కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైపొర చల్లారిన తర్వాత నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మరియు ఇతర వాయువులు ఏర్పడినాయి.కొంత కాలం తర్వాత నీరు మరియు కర్బన పదార్దాలు ఏర్పడ్డాయి.వాటిలోనే నిరంతర రసాయన చర్యల మూలంగా కొత్త రసాయన పదార్దాలు తయారయ్యాయి.వాటిలో అమైనో ఆసిడ్లు కీలకమైనవి.ఎందుకంటె జీవం పుట్టుకకు అవే కారణం మరి.

మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు సముద్రం అని చెప్పవచ్చు.నీటి సమక్షంలోనే అమినో ఆసిడ్ లు, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే ఏక కణ జీవి ఉద్బవించింది.

ఏకకణ జీవి నుండి ఇప్పటి జీవుల ఆవిర్భావంసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జీవం&oldid=2558066" నుండి వెలికితీశారు