జీషన్ సిద్ధిఖీ
జీషన్ సిద్ధిఖీ (జననం 3 అక్టోబర్ 1992) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర మాజీ మంత్రి దివంగత బాబా సిద్దిఖీ కుమారుడు. జీషన్ సిద్ధిఖీ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వాండ్రే తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
జీషన్ సిద్ధిఖీ | |||
ముంబై ప్రాంతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 25 ఆగస్టు 2021 – 30 ఆగస్టు 2024 | |||
ముందు | గణేష్ కుమార్ యాదవ్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 అక్టోబరు 2019 | |||
ముందు | తృప్తి సావంత్ | ||
నియోజకవర్గం | వాండ్రే ఈస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై , మహారాష్ట్ర , భారతదేశం | 1992 అక్టోబరు 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2024-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (2019-2024) | ||
పూర్వ విద్యార్థి | ఎం. ఎం. కే. కాలేజ్, యూనివర్శిటీ ఆఫ్ ముంబై రీజెంట్స్ యూనివర్శిటీ లండన్, యునైటెడ్ కింగ్‌డమ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుజీషన్ సిద్ధిఖీ తన తండ్రి బాబా సిద్దిఖీ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వాండ్రే తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి విశ్వనాథ్ మహదేశ్వర్ పై 5,790 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
జీషన్ సిద్ధిఖీ మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను 30 ఆగస్టు 2024న కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు.[2][3] ఆయన 25 అక్టోబర్ 2024న ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చేరాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "Cong MLAs Siddique, Antapurkar expelled from party: MPCC chief Nana Patole". 30 August 2024. Retrieved 25 October 2024.
- ↑ The Telegraph (30 August 2024). "Congress expels MLAs Siddique and Antapurkar ahead of Maharashtra assembly polls". Retrieved 25 October 2024.
- ↑ The Hindu (25 October 2024). "Baba Siddique's son Zeeshan joins Ajit Pawar-led NCP; to fight from Bandra East in Maharashtra polls" (in Indian English). Retrieved 25 October 2024.
- ↑ Andhrajyothy (25 October 2024). "మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం." Retrieved 25 October 2024.