G-20, సదస్సు

నేపధ్యము

మార్చు

1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి జీ20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకొంటుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఆ గ్రూప్‌లో ఓటింగ్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు. 2022లో భారత్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

సభ్యదేశాలు

మార్చు
  1. అర్జెంటీనా
  2. బ్రెజిల్
  3. చైనా
  4. జర్మనీ
  5. ఇండోనేషియా
  6. జపాన్
  7. ఆస్ట్రేలియా
  8. కెనడా
  9. ఫ్రాన్సు
  10. భారతదేశం
  11. ఇటలీ
  12. మెక్సికో
  13. దక్షిణ కొరియా
  14. రష్యా
  15. టర్కీ
  16. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  17. దక్షిణ ఆఫ్రికా
  18. సౌదీ అరేబియా
  19. యునైటెడ్ కింగ్‌డమ్
  20. యూరోపియన్ యూనియన్

వీటికి అదనంగా ఆహ్వానిత దేశాలు సంస్థలు ఉంటాయి. 2008 నుంచి స్పెయిన్‌ శాశ్వత ఆహ్వానిత దేశం.  జీ20లో పాకిస్థాన్‌ లేదు. 2019లో నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, చిలీ, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్, సెనెగల్‌లను ఆహ్వానించారు. ఇక సంస్థల విషయానికి వస్తే వరల్డ్‌ బ్యాంక్‌, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీవో, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లు దీనికి హాజరవుతాయి.

చర్చించే అంశాలు

మార్చు

జీ20 దేశాలు ముఖ్యంగా విస్తృతమైన ఆర్థిక అంశాలతో కూడిన అజెండాను చర్చిస్తాయి. వీటికి ప్రపంచ స్థాయి ప్రాధాన్యం ఉండాలి. సమకాలీన అంశాలను కూడా వీటిల్లో చేరుస్తారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, పన్నుల విధానాలు, ఆర్థిక విధానాలు, అవినీతిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు ఉంటాయి. వీటితో పాటు కొన్ని అనుబంధంగా  ఉండే అంశాలపై కూడా చర్చ చేపడుతుంటారు. పర్యావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటివి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=జీ20&oldid=3967007" నుండి వెలికితీశారు