జుహు విమానాశ్రయం

(జుహు విమానాశ్రయము నుండి దారిమార్పు చెందింది)

జుహు విమానాశ్రయం, ముంబై శివార్లలో జుహు వద్ద నున్న ఒక చిన్న విమానాశ్రయం. ఇక్కడి నుండి ప్రయాణీకులను చేరవేసే చిన్న పాటి విమానాలు, హెలీకాప్టర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి [1]. 1928 లో ప్రారంభించబడిన ఈ విమానాశ్రయం భారతదేశపు మొట్టమొదటి పౌరవిమానయాన విమాశ్రయంగా పేరుపొందింది.[2] రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఇది ముంబాయి నగరం ప్రధాన విమానాశ్రయంగా సేవలందించింది.

జుహు విమానాశ్రయం
जुहू विमानतळ
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా ఎయిర్ పోర్ట్
కార్యనిర్వాహకత్వంభారత_విమానాశ్రయాల_ప్రాధికార_సంస్థ
సేవలుముంబై
ప్రదేశంజుహు, భారతదేశం India
ఎత్తు AMSL13 ft / 4 m
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 3,750 1,143 Paved
16/34 2,400 731 Paved

చరిత్ర

మార్చు
 
అరేబియా సముద్రము కు అభిముఖంగా నిర్మించిన జుహు విమానాశ్రయ రన్‌వే 08/26

1928 లో ఈ విమానాశ్రయాన్ని ఎలాంటి సదుపాయాలు లేకుండా ప్రారంభించారు. అప్పటిలో ప్రారంభమైన న్యూ బాంబే ఫ్లైయింగ్ క్లబ్ సభ్యులకు ఈ విమానాశ్రయంలో శిక్షణా కార్యకలాపాలు, వైమానిక సేవలు లభించేవి. వర్షాకాలంలో పౌర విమాన సేవలకు ఈ విమానాశ్రయం అనువు కానందున కార్యకలాపాలు రద్దుచేసారు. అయినా 1932 నాటికి ఇక్కడ చాలాసౌకర్యాలు కల్పించారు..[3] 1948లో రెండవ ప్రపంచయుద్దం జరిగే సమయాన ఈ విమానాశ్రయ సేవలు నిలిపి, ఇక్కడికి 2 కి.మీ. దూరంలో నిర్మితమైన్ శాంతాక్రూజ్ సైనిక విమానాశ్రయం నుండి నిర్వహించారు.1932 లో భారత పరిశ్రమల పితామహుడిగా వ్యవహరించే జె.ఆర్.డి.టాటా ఇక్కడి నుండి భారతదేశ మొట్టమొదటి విమాన తపాలా సేవలను ప్రారంభించడంతో భారత వైమానికరంగంలో నూతన శకం ప్రారంభమైంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Volume 7 (1953). Asian and Indian skyways. Retrieved February 20, 2011.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link) Page 52
  2. "Juhu airstrip to get a facelift". Rediff.com. 13 October 2007. Retrieved 10 February 2012.
  3. "Bombay Aerodrome at Juhu". Flight Global. 19 August 1932. Retrieved 16 September 2011.

బయటి లంకెలు

మార్చు