ప్రధాన మెనూను తెరువు

Judo or Jūdō (柔道 jūdō?, meaning "gentle way") అనేది 1882లో Dr కానో జిగోరో ద్వారా తయారు చేయబడిన ఒక నూతనమైన జపనీయుల యుద్ధ విద్య మరియు పోరాట క్రీడ. ఇందులో ప్రత్యర్థిని నేలకు విసిరి కొట్టుట, కదల లేకుండా చేయుట మరియు ప్రత్యర్థి మీద పెనుగులాడుతూ ప్రయోగించు మెళకువలు, వ్యూహాత్మక చర్యలు, ఎదురుదాడులతో పై చేయి సాధించుట (గ్రాప్లింగ్ పద్ధతి), లేదా ప్రత్యర్థి యొక్క కీళ్ళు నిర్బంధించుట లేదా ఉడుంపట్టుతో ఉక్కిరిబిక్కిరి చేయుట ద్వారా బలవంతంగా అణచివేయుట వంటి ఏకఫలాపేక్షకై ప్రయత్నించెడి అంశాలు ఈ యుద్ధ విద్య యొక్క ప్రముఖ వైఖరి. చేతులు మరియు కాళ్ళతో, అదే విధంగా ఆయుధాలతో మోదుట మరియు త్రోయుట వంటివి జూడోలో భాగామైనప్పటికీ, కేవలం అవి మునుపు ఏర్పరచిన రూపకాలలో మాత్రమే (కటా) మరియు జూడో పోటీలలో లేదా స్వేచ్ఛాయుత అభ్యాసం (రండోరి)లో అనుమతించరు.

Judo
(柔道)
Jigoro Kano and Kyuzo Mifune.jpg
FocusGrappling
HardnessFull Contact
Country of originజపాన్ Japan
CreatorKano Jigoro
Famous practitionersTsunejiro Tomita, Mitsuo Maeda, Kyuzo Mifune, Keiko Fukuda, Masahiko Kimura, Gene LeBell, Anton Geesink, Yasuhiro Yamashita, Neil Adams, Hidehiko Yoshida, Kosei Inoue
ParenthoodVarious jujutsu schools, principally Tenjin Shin'yō-ryū, Kito-ryū, and Fusen-ryū
Descendant artsBrazilian Jiu-Jitsu, Kawaishi-ryū jujutsu, Kosen Judo, Sambo, Daido Juku
Olympic sportSince 1964[1] (men) and 1992[2][3] (women)
Official websitekodokan.org

సంప్రదాయక ప్రాచీన పాఠశాలల (కోర్యు ) నుంచి రూపొందించబడిన ఇతర జపనీయుల యుద్ధ విద్యలు, జూడో కొరకు రూపొందించిన తత్వం మరియు తదనంతర ఉపాధ్యాయత్వానికి నమూనాగా మారినది. జూడో యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ, మరికొన్ని శాఖలైన సాంబో, బార్టిట్సు, మరియు 1914లో మిత్సుయో మేడా జూడోని బ్రజిల్‌కి తీసుకువచ్చిన తరువాత రూపొందించిన బ్రెజిలియన్ జియు-జిట్సు వంటివి ఏర్పడుటకు దారి తీసింది. జూడో అభ్యాసకులను జూడోకా అని పిలుస్తారు.

విషయ సూచిక

చరిత్ర మరియు తత్వంసవరించు

 
కానో జిగోరో

స్థాపకుని ఆరంభ జీవితంసవరించు

జూడో ఆరంభ చరిత్ర, దాని యొక్క ఆద్యుడైన జపనీయ బహుశాస్త్రాజ్ఞాని మరియు అధ్యాపకుడైన జిగోరో కానో (嘉納 治五郎 కానో జిగోరో, 1860–1938) నుంచి విడదీయలేనిది. జపనీయ భాగ్యవంతుల కుటుంబంలో కానో జన్మించాడు. అతని తాత, సెంట్రల్ జపాన్ లోని షిగా పరిధిలో వరి నుంచి తీసే మద్యపానీయాన్ని తయారు చేసే స్వీయ ఉపాధితో వృద్ధిలోకి వచ్చిన వ్యక్తి. అయితే, కానో యొక్క తండ్రి, పెద్ద కొడుకు కాకపోవుటచేత వ్యాపారాన్ని వారసత్వంగా పొందలేకపోయాడు. బదులుగా, అతను షింటో గురువుగా మరియు ప్రభుత్వాధికారిగా మారుట చేత అతని కొడుకుకి టోక్యో ఇమ్పీరియల్ విశ్వవిద్యాలయంలోకి రెండవ తరగతిలో ప్రవేశించుటకు తగినంత ప్రభావం సంపాదించగలిగాడు.

ఆద్యుడు అనుసరించిన జుజుట్సుసవరించు

కానో, అతని యొక్క ఇరవైల వయస్సులో కూడా, వంద పౌండ్లకి (45 కిలోలు), మించి బరువులేక తరచూ బెదిరించే వారి యొక్క అపహాస్యానికి గురైన, చిన్నగా కనబడే దుర్బలడైన పిల్లవాడు. అతను మొదట్లో, అప్పుడు అంత్యదశలోనున్న యుద్ధ విద్య జుజుట్సు ని అతని యొక్క 17 ఏళ్ళ వయస్సులో అనుసరించుట మొదలు పెట్టాడు, కానీ అంతగా రాణించలేకపోయాడు. దీనికి కారణం అతనిని ఏ అధ్యాపకుడూ శిష్యుడిగా తీసుకోనకపోవడమే. అతని 18 ఏళ్ళ వయస్సు లో, సాహిత్యాధ్యయనం కొరకు విశ్వవిద్యాలయానికి వెళ్ళినపుడు, తన యుద్ధవిద్య అధ్యయనాన్ని కొనసాగిస్తూ, తద్వారా టెంజిన్ షిన్'యో-ర్యు కి (జుజుట్సు యొక్క సంప్రదాయక పాఠశాల) గురువు మరియు ప్రపంచం లోని అత్యున్నత హోదా కలిగిన స్త్రీ జుడోకా కేఇకో ఫుకూడా (1913లో పుట్టిన) యొక్క తాత అయిన ఫుకూడా హచినోసుకే (1828–1880) యొక్క సిఫారసుని పొందాడు. జూడోలోని స్వేచ్ఛాయుత సాధన (రండోరి ) మీద కానో యొక్క ఉద్ఘాటనకి బీజం వేసినది ఫుకూడా హచినోసుకే ప్రస్ఫుటంచేసిన సంప్రదాయక అభ్యాసంలోని మెళకువలు అని చెప్పవచ్చు.

ఫుకుడా యొక్క పాఠశాలలో కానో చేరిన ఒక సంవత్సరం తరువాత ఫుకుడా జబ్బునపడి మరణించాడు. అంతట కానో, పూర్వ సవరణ రూపకాల (కాట ) యొక్క సాధనల మీద ఫుకూడా కంటే ఎక్కువగా ఉద్ఘాటించిన ఇసొ మసతొమో (c.1820–c.1881) యొక్క మరొక టెంజిన్ షిన్'యో-ర్యు పాఠశాలలో శిష్యుడిగా చేరాడు. తన యొక్క అంకితభావంతో, కానో త్వరలోనే ప్రవీణ అధ్యాపకుడు (షిహాన్ ) బిరుదుని సంపాదించాడు మరియు 21 వయస్సులో ఇసోకి సహకారక అధ్యాపకుడిగా ఎదిగాడు. దురద్రుష్టవశాత్తూ, ఇసొ వెంటనే జబ్బునపడగా, మరియు కానో, తాను నేర్చుకోవలసినది ఇంకా చాలా ఉన్నది అని భావించి, కిటో-ర్యు యొక్క ఇకుబో త్సునేతోషి (1835–1889) శిష్యుడిగా మారి, మరియొక శైలిని అవలంబించాడు. ఫుకుడా మాదిరిగా, ఇకుబో స్వేచ్ఛాయుత పద్ధతిని ఎక్కువగా నొక్కి వక్కాణించాడు. మరొక వైపు, టెంజిన్ షిన్'యో-ర్యు కంటే మిన్నగా కిటో-ర్యు విసిరివేయు మెళకువలను మరింత ఎక్కువ పరిమాణంలో ప్రస్ఫుటం చేసింది.

స్థాపనసవరించు

ఆ సమయంలో, కానో, "షోల్డర్ వీల్" (కాట-గురుమా, ఒక వ్యక్తిని భుజాల మీద మోయుట అనబడే పాశ్చ్యాత్య మల్లయోధులు వాడే మెళకువకి స్వల్ప భిన్నమైనది) మరియు "ఫ్లోటింగ్ హిప్" (ఉకి గోషి ) విసురు వంటి కొత్త మెళకువలను కనిపెట్టాడు. అయితే, అతను అప్పటికే కేవలం కిటో-ర్యు మరియు టెంజిన్ షిన్'యో-ర్యు ల యొక్క సూత్రాలను విస్తరించుట మాత్రమే కాక ఇంకా ఏదో చాలా చేయాలని ఆలోచించాడు. జుజుట్సు లోని, శబ్ద శాస్త్రీయ సూత్రాల ఆధారిత మరియు యువకుల యొక్క శౌర్య పరాక్రమాల వృద్ధితో పాటుగా శారీరక, మానసిక మరియు వ్యక్తిత్వ వికాసాల మీద కేంద్రీకృతమైన మెళకువల ఆధారమైన సరికొత్త ఊహలతో కూడిన ప్రధాన పునరుద్ధరణ కానో మనసులో ఉంది. మే 1882లో, 22 ప్రాయంలో, విశ్వవిద్యాలయంలో అతను డిగ్రీని పూర్తి చేసే తరుణంలో, కానో తొమ్మిది మంది విద్యార్థులను లికుబో యొక్క పాఠశాల నుంచి కామకురాలోని బౌద్ధ దేవాలయం ఎఇషో-జి లో, అతని కింద జుజుట్సు అధ్యయనం చేయడానికి తీసుకొన్నాడు, మరియు లికుబో వారంలో మూడు రోజులు బోధించడానికి ఈ దేవాలయానికి వచ్చేవాడు. "కొడోకాన్ " లేక "బోధనా విధాన స్థలం " అని దేవాలయాన్ని పిలుచుటకు రెండేళ్ళ కాలం గడవగా, మరియు కానోకి కిటో-ర్యులో "మాస్టర్" అను బిరుదుతో సత్కరింపబడకుండానే, దీనిని కొడోకాన్ యొక్క స్థాపనగా పరిగణిస్తారు.

జూడో[4]ని మొట్టమొదట్లో కానో జియు-జిట్సు లేక కానో జియు-డో అని పిలువగా, తరువాత కొడోకాన్ జియు-డో లేక సులభంగా జియు-డో లేక జూడో అని పిలిచారు. తొలి రోజులలో, దీనిని మరింత సాధారణ సౌలభ్యతతో జియు-జిట్సు [5] అని పిలిచేవారు.

జూడో యొక్క అర్ధంసవరించు

 
సాంప్రదాయక జూడోలో నిర్ణయించబడిన పద్ధతులలో శిక్షణ మరియు క్రమశిక్షణ సాధారణంగా వుంటుంది.

జూడో: "సౌమ్యత్వ విధానం".
"జూడో" పదం కూడా "జుజుట్సు """ (?)లోనున్న భావసంకేత మూలాన్ని, అనగా సందర్భానుసారంగా తీసుకొనేటటువంటి "సౌమ్యత", "కోమలత్వం", "నమ్రత", మరియు "సులభం" వంటి అర్ధాలను కలిగి ఉంది. అయితే, అట్టి జు అనువాద ప్రయత్నాలు భ్రాంతిని కలుగజేయునవి. ఈ పదాల్లోని జు వాడుక "soft method" (柔法 jūhō?) యుద్ధ విద్య సూత్రాల యొక్క స్పష్టమైన ప్రసక్తి. ప్రత్యర్థిని ఓడించుటకు బలాన్ని పరోక్షంగా ప్రయోగించుట అనేది కోమలమైన పద్ధతి యొక్క విలక్షణత. దీనిలోని మరింత విశేషమైన సూత్రం, ప్రత్యర్థి యొక్క దృఢత్వాన్ని అతనికి వ్యతిరేకంగా ఉపయోగించుట మరియు మారుతున్న పరిస్థుతులకు అనుగుణంగా నేర్పుగా మారుట. ఉదాహరణకు, దాడి చేయువాడు తన ప్రత్యర్థిని త్రోయునపుడు, అతని ప్రత్యర్థి తన అడుగుని ప్రక్కకు వేయునట్లు చేయుట మరియు అతని యొక్క భారగతితోనే (తరచుగా పాదంతో పడునట్లు చేయుట) అతనిని ముందుకి విసిరివేయుట (ఇది లాగటానికి విలోమం వంటిది). కానో ప్రకారం జుజుట్సు అనేది ఒకదానికొకటి సంబంధంలేని కిటుకుల సముదాయం, మరియు వాటిని "గరిష్ట సామర్ధ్యత" యొక్క కల్పనలో కనుగొన్న సూత్రం ప్రకారంగా ఏకీకృతం చేయడానికి పూనుకొన్నాడు. మిన్న దృఢత్వం మీద మాత్రమే ఆధారపడిన జుజుట్సు మెళకువలు తొలగించబడ్డాయి లేదా ప్రత్యర్థి యొక్క బలాన్ని మరొక దిశలో వాడుకొనుట, ప్రత్యర్థి యొక్క సంతులతని పోగొట్టుట లేదా ఉన్నతమైన యాంత్రిక ప్రయోజనాన్ని వాడుకొనుట వంటి పద్ధతులకి అనుగుణంగా మలచుకోబడ్డాయి.

జూడో మరియు జుజుట్సు ల రెండవ లక్షణాలు భిన్నమైనవి. jujutsu (柔術 jūjutsu?) అనగా "కళ", "విజ్ఞాన శాస్త్రం", లేక కోమలత్వ "మెళకువలు", judo (柔道 jūdō?) అనగా కోమలత్వం యొక్క "దారి". "" (?) యొక్క అర్ధం దారి, త్రోవ లేక మార్గం (మరియు చైనా పదం"టావో" లోని భాగమే), అతిస్వరపు తత్వాన్ని కలిగి ఉంది. ఇట్టి విభేదం బుడో మరియు బుజుత్సుల నడుమ చేసిన విభేదం వంటిదే. ఈ పద ప్రయోగం ప్రాచీన యుద్ధ విద్యల యొక్క ఏకైక ధ్యేయమైన చంపుకొనుట నుంచి బుద్ధిపూర్వకంగా చేసిన నిష్క్రమణ. జూడో, ఒక వ్యక్తి యొక్క శారీరకమైన, మానసికమైన, భావపూరితమైన మరియు నైతికపరమైన అభివృద్ధికి తోడ్పడేదిగా కానో కనుగొన్నాడు. గరిష్ఠ సామర్ధ్యత యొక్క భౌతిక సూత్రాన్ని దైనందిక జీవితంలో కూడా విస్తరించి, "పరస్పర క్షేమం"గా వికసింపచేశాడు. ఇట్టి విషయంలో, డోజో యొక్క పరిధులను అతిక్రమించి, జీవితానికి సమగ్ర ధృక్పథం కలిగినదిగా జూడోని పరిగణించారు.

జుడోకా (అభ్యాసకుడు)సవరించు

జూడో అభ్యాసం చేసేవారిని జుడోకా లేక "జూడో అభ్యాసకుడు" అని పిలుస్తారు, అయినప్పటికీ, సంప్రదాయకంగా 4వ డాన్ లేక ఇంకా పై స్థాయికి చెందినవారిని మాత్రమే "జుడోకా" అని పిలుస్తారు. ఉత్తరపదం -కా ని, నామవాచకానికి జత చేస్తే, నిష్ణాతు దిన లేదా విశేష పరిజ్ఞానం పొందిన వ్యక్తి అని అర్ధం. 4వ డాన్ స్థాయికి దిగువనున్న ఇతర అభ్యాసకులను కెంక్యు-సెఇ లేక "అభ్యాసకులు" అని పిలుస్తారు. జుడోకా యొక్క నూతన అర్ధం, ఏ స్థాయికి చెందిన జూడో అభ్యాసకులకైనా వర్తిస్తుంది.

జూడో అధ్యాపకుడిని సెన్సెఇ అని పిలుస్తారు. సెన్సెఇ అను పదం సెన్ లేక సాకి (ముందర) మరియు సెఇ (జీవం) - అనగా నీకు ముందుగా పోయినవాడు. పాశ్చ్యాత్య డోజోస్ లో,డాన్ స్థాయి నిర్దేశకుడు ఎవరినైనా సెన్సెఇ అని పిలుస్తారు. సాంప్రదాయకంగా, ఆ పేరును 4వ డాన్ మరియు దాని పైని నిర్దేశకులకు ప్రత్యేకించింది.

జుడోగి (యూనిఫార్మ్)సవరించు

దస్త్రం:Judo orange belt.JPG
బలంగా వుండే త్రోపుళ్ళను మరియు పెనుగులాటను తట్టుకొనుటకు జుడొగిని గట్టి బట్టతో చేస్తారు.

జూడో అభ్యాసకులు జూడోగి అనగా జూడో అభ్యాసం చేయుటకు వాడే "జూడో వస్త్రాలు " అని అర్ధం కలిగిన సంప్రదాయబద్ధమైన తెల్లటి యూనిఫార్మ్ లని ధరిస్తారు. కొన్నిసార్లు ఈ పదం చిన్నదిగా చేసి గి (యునిఫార్మ్) అని కూడా అంటారు. 1907 లో కానో జూడోగిని సృష్టించాడు, మరియు అదే రకమైన యూనిఫార్మ్ లను తరువాత అనేక ఇతర యుద్ధ విద్యలకు అమలు చేశారు. ఆధునిక జూడోగిలో తెలుపు లేక నీలంలోని తాడుతో కట్టుకొనే కాటన్ ప్యాంటు మరియు అదే రంగులో తెలుపు లేక బ్లూ కుచ్చులున్న మరియు బెల్టు (ఓబి ) తో కట్టబడిన కాటన్ చొక్కా ఉంటాయి. హోదాని సూచించుటకు, సాధారణంగా బెల్టుకి రంగు ఉంటుంది. పెనుగులాటల (గ్రాప్లింగ్) యొక్క ఒరిపిడుల నుంచి రక్షించుకొనేందుకు చొక్కా (జాకెట్) ఉద్దేశించబడిన కారణంగా, అది కరాటే యూనిఫారం (కరాటేగి ) కన్నా మరింత దళసరిగా ఉంటుంది. జూడోగి యొక్క రూపకల్పన ప్రత్యర్థికి పట్టు చేజిక్కించుకొను వీలు కల్పించునట్లు ఉండగా, కరాటేగి ప్రత్యర్థికి పట్టు దొరకకుండా జారిపోవు వస్త్రాలతో చేయబడింది.

బ్లూ జుడోగి యొక్క సరి కొత్త వాడకాన్ని మొట్టమొదటగా 1986 మాస్త్రీచ్ట్ IJF DC మీటింగ్ లో అంటోన్ గీసింక్ సూచించాడు.[6] పోటీలలో, జడ్జీలు, రిఫరీలు, మరియు ప్రేక్షకులు గుర్తించుట కొరకు, ఇద్దరు పోటీదారులలో ఒకరు బ్లూ జూడోగిని ధరిస్తాడు. జపాన్ లో, జుడోకా ఇరువురూ తెల్ల జుడోగిని వాడతారు మరియు సంప్రదాయక ఎరుపు పట్టీని (జపనీయుల జెండా రంగుల ఆధారంగా) పోటీదారులలో ఒకరి యొక్క బెల్టుకి కడతారు. జపాన్ కి బైట, చిన్నతరహా పోటీలలో సౌలభ్యత కొరకు రంగు పట్టీలను కూడా ఉపయోగించగా, నీలం జుడోగి ప్రాంతీయ లేదా ఉన్నత స్థాయిలలో మాత్రమే తప్పనిసరి. జపనీస్ అభ్యాసకులు మరియు అతిశుద్ధత కోరువారు నీలం జుడోగి వాడటాన్ని చిన్న చూపు చూస్తారు.[6]

మెళకువలు మరియు అభ్యాసంసవరించు

జూడోలో వివిధ రకాలైన చుట్లు, పడడాలు, విసుర్లు, పట్లు, ఊపిరాడని పట్లు, కీళ్ళని బంధించుట, మరియు బాదడాలు ఉండగా, ప్రథమంగా కేంద్రీకృతమైనవి throwing (投げ技 nage-waza?), మరియు groundwork (寝技 ne-waza?). మెళకువలలో విసుర్లను రెండు వర్గాలుగా విభజించారు, నిలబడు పద్ధతి (టచి-వాజా ), మరియు sacrifice techniques (捨身技 sutemi-waza?). నిలబడు పద్ధతులను hand techniques (手技 te-waza?), hip techniques (腰技 koshi-waza?), మరియు foot and leg techniques (足技 ashi-waza?)గా విభజించారు. త్యాగ పద్ధతులను those in which the thrower falls directly backwards (真捨身技 ma-sutemi-waza?), మరియు those in which he falls onto his side (橫捨身技 yoko-sutemi-waza?)గా విభజించారు.

నేల మీద చేయు యుద్ధ పద్ధతులను (నే-వాజా) attacks against the joints or joint locks (関節技 kansetsu-waza?), strangleholds or chokeholds (絞技 shime-waza?), మరియు holding or pinning techniques (押込技 osaekomi-waza?)గా విభజించారు.

జూడోలో చేతుల మరియు గుప్పెళ్ళ కదలికలతో చేయు దాడి మరియు రక్షించుకొను విధమైన అభ్యాసాన్ని randori (乱取り?) అని అంటారు, అనగా అర్ధం "స్వేచ్చాయుత సాధన". రండోరి లో, ఇద్దరు ప్రత్యర్థులు ఒకరినొకరు జూడో విసురుతో లేదా పెనుగులాడు పద్ధతితో దాడి చేయవచ్చు. కత్తి మరియు ఖడ్గంతో చేయు పద్ధతులతోపాటు తన్నటం మరియు గుద్దటం వంటి కొట్లాడు పద్ధతులు (అతేమి-వాజా ) కటాలో నిలిచి ఉన్నాయి. ఇటువంటి నైపుణ్యతతో కూడిన అభ్యాసాలకి సంబంధించిన ఉపాధ్యాయత్వం సాధారణంగా ఉన్నత హోదా కలిగిన అభ్యాసకులకు ప్రత్యేకించినది (ఉదాహరణకు, కిమే-నో-కటాలో ఉంటుంది), కానీ పోటీలలో నిషేధించబడింది. మరియు సాధారణంగా రండోరిలో భద్రతా కారణాల దృష్ట్యా నిషేధించడమైనది. ఉడుంపట్లు, కీళ్ళ బంధనాలు, మరియు త్యాగ పద్ధతులు కూడా భద్రతా కారణాల దృష్ట్యా వయస్సు మరియు హోదా వంటి ఆంక్షలకు గురైనవి. ఉదాహరణకు, సంయుక్త రాష్ట్రాలలో 13 లేక ఆ పై వయస్సు వారు మాత్రమే ఉడుంపట్లు (చోక్ హోల్డ్స్) చేయవచ్చు, మరియు 16 లేక ఇంకా పెద్దవారు చేతులతో బంధించుట (ఆర్మ్ లాక్స్) చేయవచ్చు.

రండోరి మరియు విజేతను నిర్ణయించే పోటీ (షియాయ్ ) సాధనలో, ప్రత్యర్థి విజయవంతంగా ఉడుంపట్టు లేక కీళ్ళ నిర్బంధం (జాయింట్ లాక్) ప్రయోగించగలిగినపుడు, అతను లొంగిపోతాడు, లేదా "తట్టుట" అనగా తాను లొంగిపోయానని సూచిస్తూ ప్రత్యర్థిని లేదా చాపని కనీసం రెండు సార్లు తడతాడు. ఇది జరిగినపుడు ఆట అయిపోతుంది, తట్టిన ఆటగాడు ఒడిపోతాడు, మరియు ఉడుంపట్టు లేదా కీళ్ళ నిర్బంధం ఆగిపోతుంది.

కటా స్వరూపాలుసవరించు

ఇట్టి రూపాలలో (కటా) దాడి మరియు రక్షణ యొక్క పూర్వం సవరించబడిన బాణీలు ఉండగా, వాటిని జూడోలో భాగస్వామితో అభ్యసించేటపుడు, జూడో పద్ధతులకు పరిపూర్ణత తెచ్చుటకు ఉపయోగిస్తారు. ఇంకా ప్రత్యేకించి, వాటి ప్రయోజనాల్లో కొన్ని, జూడో యొక్క మూల సూత్రాలను విశదపరచుట, మెళకువలను సరైన విధంగా ప్రయోగించుటను ప్రదర్శించుట, జూడో ఆధారపడియున్న తత్వజ్ఞాన సిద్ధాంతాలను బోధించుట, పోటీలలో అనుమతించని మెళకువల సాధనకి అనుమతించుట, మరియు చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నప్పటికీ సమకాలీన జూడోలో వాడని ప్రాచీన పద్ధతులను కాపాడుట వంటివి.

విభిన్నమైన కటా యొక్క పరిజ్ఞానం ఉన్నత హోదాని పొందుటకు అవసరం.

ప్రస్తుతం కొడోకాన్ గుర్తించిన ఏడు కటాలు ఉన్నాయి.

 • స్వేచ్ఛాయుత సాధన రూపాలలో (రండోరి), రెండు కటా రూపాలు ఉన్నాయి:
  • విసిరివేయు రూపాలు (నాగే నో కటా)
  • పెనుగులాడు రూపాలు (కటామే నో కటా)
 • పాత శైలి ఆత్మరక్షణ రూపాలు (కిమే నో కటా)
 • నవీన ఆత్మరక్షణ రూపాలు (కొడోకాన్ గోషిన్ జుత్సు)
 • "సౌమ్యత" యొక్క రూపాలు (జూ నో కటా)
 • ఐదు రూపాలు (ఇట్సుట్సు నో కటా)
 • ప్రాచీన రూపాలు (కొషికి నో కటా) [31]
 • గరిష్ఠ సామర్ధ్యత జాతీయ భౌతిక విద్య కటా (సేఇర్యోకు జెన్'యో కోకుమిన్ టైఇకు నో కటా)

కొడోకాన్ చేత అధికారికంగా గుర్తించబడని ఇంకా ఇతర కటా రూపాలు ఉన్నాయి కానీ వాటి అభ్యాసం కొనసాగుతోంది వీటి యొక్క ఉదాహరణలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గో నో సేన్ నో కటా, విసురుయత్నాల ఎదురుదాడుల మీద కేంద్రీకృతమైనది.

రండోరి (ముష్టిఘాత యుద్ధం)సవరించు

జూడో ప్రస్ఫుటం చేయు రండోరి అని పిలవబడే స్వేచ్ఛాయుత శైలి, జూడో యొక్క ప్రధాన శిక్షణా స్వరూపం పోరు చేయు సమయంలో నిలబడి ముష్టిఘాతం చేయు కాలాన్ని టకి-వాజా అని పిలవగా, నేల మీద చేయు మిగతా కాలాన్నినే-వాజా అని పిలుస్తారు ముష్టిఘాతానికి, భద్రతా నియమాలు వర్తించినా, వారి స్వంత అభ్యాస పద్ధతుల కన్నా ఇది మరింత చైతన్యవంతమైన, యధేచ్చమైన యుద్ధ శిక్షణా విధానం, దేన్నయితే జుజుట్సుకాలో చేయుటకు అలవాటు పడి ఉన్నారు. శక్తిని సంపూర్ణంగా ప్రయోగించుటవలన శారీరకంగా కండరాలు మరియు హృదయ-రక్తనాళ వ్యవస్థలను వికసింపచేయగా, మానసికంగా ఎత్తుగడల వేయుట మరియు ప్రతిచర్యకు పట్టు సమయం వంటి విషయాలలో వృద్ధి కనపడగా, ప్రతిఘటించు ప్రత్యర్థి మీద అభ్యాసకుడు తన మెళకువలని ప్రయోగించుట ఎలాగో నేర్చుకోవడానికి సహాయపడుతుంది. జుడోకాలలో ఉన్న సాధారణ నానుడి "జూడోకి ఉత్తమమైన శిక్షణ జూడో".

పలు రకాలైన ముష్టిఘాత అభ్యాసాలలో కొన్ని, జూ రెన్షు (ఇరువురు జుడోకా సౌమ్యంగా, ఎటువంటి ప్రతిఘటన ప్రయోగించకుండా దాడి చేసుకొంటారు); మరియు కాకరి గెఇకో (కేవలం ఒక జుడోకా దాడి చేయగా, మరొకడు తన శక్తిని మాత్రం ప్రయోగించడు కానీ రక్షక మరియు నిరోధించు పద్ధతుల మీద ఆధారపడతాడు.)

పోరు దశలుసవరించు

 
జుడొగి నేలమీదకు వెళ్ళిన తరువాత తచి-వాజా అంతమవుతుంది మరియు నే-వాజా మొదలవుతుంది.

జుడోలో, ప్రధానమైన రెండు పోరు దశలు ఉన్నాయి: నిలబడు దశ, టకి-వాజా ; మరియు నేల మీది దశ, నే-వాజా ; ఏ దశకి ఆ దశలో ఉండునట్టి వాటి స్వంత (ఎక్కువసార్లు విడివిడిగా ఉండే) పద్ధతులు, పన్నాగాలు, రండోరి, శారీరక అభ్యాసం మరియు ఇంకొన్ని. వాటి మధ్యనున్న అంతరాన్ని కలిపే "మధ్యస్థ" పద్ధతులకి ప్రత్యేక శిక్షణ కూడా అవసరమైనది. జుడోకా, వారి యొక్క ఆసక్తి దేనిలో ఎక్కువగా ఉన్నది అన్న విషయం మీద ఆధారపడి, ఒక దశలో మంచి నైపుణ్యత కలిగి ఉండి మరొక దానిలో అంత నేర్పు లేకపోయినా, ఎక్కువ మంది రెండిటి మధ్య సంతులత చూపుతారు. జుడో యొక్క పోరులో నిలబడిన మరియు నేలమీద చేయునట్టి రెండు దశలను కలుపుట వలన, జుడోకాకి నిలబడి ఉన్నట్టి ప్రత్యర్థిని పెనుగులాటలో కిందికి అణచివేస్తూ నేలకి గట్టిగా ప్రత్యర్థి భుజాలను అదిమి పట్టుట మరియు ఓడించుటకు అవకాశమిస్తుంది.

నిలబడు దశసవరించు

పోరు నియమాల ప్రకారం ప్రాధాన్యత కలిగిన, నిలబడి చేయు పోరు దశలో, ప్రత్యర్థులు ఒకరినొకరు విసురుకొనుటకు ప్రయత్నిస్తారు లేదా నిలబడు దశ[7]లో చట్టప్రకారమైన మరియు లొంగదీసుకొనే మెళకువలైన కీళ్ళ-నిర్బంధం మరియు శ్వాస ఆడకుండా చేయు ఉడుంపట్టు పద్ధతులను అరుదుగా ప్రయోగించుటకు కారణం నిలబడి చేయు విసురుల కంటే అవి నిలబడి ప్రయోగించుట మరింత కఠినమైనవి. అయినప్పటికీ, కొంత మంది జుడోకా, క్రింద పడేయడాన్ని, లొంగదీసుకోవటంతో జత చేర్చడంలో మంచి నేర్పు కలిగి ఉంటారు, అక్కడ లొంగదీసుకొనే మెళకువ నిలబడి ఉన్నప్పుడు మొదలయ్యి నేల మీద ముగుస్తుంది. అయితే కీళ్ళ నిర్బంధనం చేస్తూ చేయు విసురు పూర్తిగా నిషిద్ధమైనది.

విసిరివేయు మెళకువల (నాగే వాజా ) యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే తన కాళ్ళ మీద నిలబడి, కదులుతున్న మరియు ప్రమాదకరమైన ప్రత్యర్థి యొక్క వెన్ను క్రిందికి పడునట్లు చేసి కదలకుండా చేయుట. అందువలన, విసరడానికి ప్రధాన కారణం, ప్రత్యర్థిని నియంత్రించుట మరియు తనని తాను ప్రబల స్థానంలో ఉంచుకొనుట. ఈ విధంగా అభ్యాసకుడికి నిష్కర్షకమైన ఫలితాన్ని సాధించే సామర్ధ్యం ఉంటుంది. విసురుకి మరొక కారణం, ప్రత్యర్థిని బలవంతంగా నేల మీదికి గట్టిగా కొట్టుట వలన అతని యొక్క శరీరాన్ని అదురుపాటుకి గురి చేయడం. ప్రత్యర్థి శక్తివంతమైన మరియు పూర్తిగా నియంత్రించబడిన విసురుని ప్రయోగించినపుడు, అతను తగినంత ఆధిక్యత స్పష్టంగా ప్రదర్శించిన కారణంగా అప్పటికప్పుడే ఆటను గెలుస్తాడు (ఇప్ఫోన్ ద్వారా), తక్కువ విసుర్లకు తక్కువ మార్కులు వస్తాయి. విసురుకి మార్కు నిలబడి వున్న స్థితి నుంచి మొదలు పెట్టినపుడు మాత్రమే ఇస్తారు.

శాస్త్రీయ విశ్లేషణ మరియు తార్కికాల మీద కానో యొక్క ఉద్ఘాటనని నిలబెట్టుటకు, ప్రామాణికమైన కొడోకాన్ జుడో ఉపాధ్యాయత్వం, విసిరివేయు మెళకువని సైద్ధాంతికంగా నాలుగు దశల ఘట్టంగా నియంత్రిస్తుంది: సంతులత-కోల్పోవుట (కుజుషి ); body positioning (作り tsukuri?); execution (掛け kake?); మరియు చివరిగా the finish or coup de grâce (極め kime?). ప్రతి దశ దాని ముందు దశని గొప్ప వేగంతో అనుసరిస్తుంది; ఆదర్శప్రాయంగా అవి దరిదాపు ఒకేసారి జరగాలి. అదేవిధంగా, కొట్టడంతో (అనగా గుద్దడం, తన్నడం మొదలైనవి) గాయపరచుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అనుమతించబడవు, కానీ క్రీడాకారుడు శిక్షణా సమయంలో "వాటిని పరిగణనలోకి తీసుకొనవలసిన" అవసరముంది, ఉదాహరణకు ఒంగి ఉన్న స్థితిలో ఎక్కువ సేపు పోరాడకూడదు, ఎందుకనగా ఈ స్థితిలో మోకాలి దెబ్బలకు మరియు ఇతర విధముగా కొట్టు దెబ్బలకు అవకాశం ఉంటుంది.

నేలమీది దశసవరించు

 
నే-వాజాను అభ్యసిన్చేటప్పుడు, సాధనచేసేవారు మోకాళ్ళ నుంచి కూడా మొదలుపెడతారు.

పోటీలో, విసిరివేసిన తరువాత లేదా పోటీదారులు చట్టబద్దమైన విధంగా నేలను తాకినప్పుడు, పోరును నేలమీద కొనసాగించవచ్చు. పోటీదారుడు కావాలని నేలమీదకు జారి నే-వాజాను కొనసాగించడానికి ఒప్పుకోరు.[8] నేలమీద, పోటీదారుల ఆశయం, అణచివేసేవిధంగా గట్టిగా పట్టుకోవడం లేదా ఉడుం పట్టు లేక ఊపిరి ఆడకుండా గట్టిగాపట్టుకోవడం లేక చేతుల నిర్భందం వంటి పద్ధతులతో ప్రత్యర్థిని లొంగదీసుకోవడం (భద్రతా కారణాలవలన మోచేతుల మీద మరియు మణికట్టుల మీదే మాత్రమే నిర్భందాలకు అనుమతి.)

అణచివేసే విధంగా గట్టిగా పట్టుకోవడంసవరించు

Hold downs (押さえ込み osaekomi?) ఆత్మ రక్షణకు, పోలీసు పనులకు మరియు చేతులతో చేసే సైనిక పోరులో చాలా ముఖ్యమైనవి, ఎందుకనగా ప్రత్యర్థి మీద ఆధిపత్యం కల వ్యక్తి, తేలికగా తన రక్షణ చేసుకోగలడు లేదా ఎదురు దెబ్బలు కొట్టగలడు. జూడోలో, అణచివేసే విధంగా గట్టిగా పట్టుకోవడం లేక పట్టుకున్నదాన్ని 25 క్షణాల పాటు ఉంచగలిగితే (ఒసేకోమి), పట్టుకున్న వ్యక్తి పోటీలో విజయం సాధిస్తాడు. ఒసేకోమిలో ప్రత్యర్థిని వెనుకవైపుగా అసలైన విధంగా పట్టుకోవాలి మరియు ఒకవేళ వారు ముందుకు గాని, ప్రక్కకు గాని తిరిగినచో, మట్టెను పిలుస్తారు. (మట్టె అనగా ఆపండి అని అర్ధం). తరువాత జుడోకాలు ఇద్దరు లేచి నిలబడతారు మరియు కొనసాగిస్తారు లేక పోరాడతారు. (యోషి అని పిలుస్తారు.)

1905 లో వున్న నియమాల ప్రకారం, ప్రత్యర్థి భుజాలను 2 క్షణాల పాటు గట్టిగా పట్టుకో గలిగితే చాలు- అది సమురాయ్ తన చాకును లేదా ఖడ్గాన్ని తీసుకొని ప్రత్యర్థిని చంపడానికి సరిపోయే సమయం. నిజజీవితంలో యోధుడు, పోలీసు అధికారి లేదా సైనికుడు ప్రత్యర్థిని కదలకుండా చాలాసేపు వుంచి, పరిస్థితిని తన నియంత్రణలోకి తీసుకొనడానికి సరిపోయే సమయాలను, కొత్త దీర్ఘమైన సమయ అవసరాలతో పోల్చవచ్చు.

జూడోలో, గట్టిగా పట్టుకోవడం వలన లొంగుబాటు సంభవిస్తుంది, ఒక వేళ గట్టిగా పట్టుకోవడం వలన కలిగే ఒత్తిడిని ప్రత్యర్థి తట్టుకోలేకపోవడం వలన, లేక లొంగ దీసుకొనే క్రమంలో గట్టిగా పట్టుకొని వుంచడంవలన. ఇంకా జుడోకాకి ఉడుం పట్టు లేక చేతుల నిర్భందం చాలా ఎక్కువ అయినప్పుడు లేక జుడోకాకి బాగా నొప్పి కలిగినప్పుడు లేదా గాయం తగిలినప్పుడు, వారు లొంగిపోతారు.

రక్షణసవరించు

ఒక పోటీదారుడు క్రింద పడినప్పుడు, తన కాళ్ళతో ప్రత్యర్థి యొక్క క్రింద భాగమును లేదా మొండెంను చుట్టి, యెంత బలంతో ప్రత్యర్థి తనను నొక్కుతున్నడో, అంతే బలంతో తనుకూడా ప్రత్యర్థిని నొక్కాలి, అందువలన క్రిందవున్న వ్యక్తి వదిలేవరకు, ప్రత్యర్థి పైకి లేచి ఎగరకుండా వుంటాడు. ప్రత్యర్థిని కాళ్ళతో బంధించి వున్నప్పుడు, క్రింద వున్న వ్యక్తి వివిధ రకాలైన దాడి చేసే పద్ధతులను అనగా ఊపిరి ఆడకుండా బంధించడం, చేతుల నిర్భందం మరియు "శరీర కత్తెరలు" (డో-జిమే ) వంటి వాటిని వాడవచ్చు, అదే సమయంలో ప్రత్యర్థిని పైన పేర్కొన్న పద్ధతులను తన మీద ప్రయోగించకుండా నియంత్రించాలి. ఆ స్థితిని, జపనీస్ లో "డో-ఒసే " అంటారు అనగా "మొండెం పట్టుకొనుట"[9] అని అర్ధం, ఆ ఒసేకొమి స్థితిలో పైన వున్న వ్యక్తికి, క్రిందవున్న ప్రత్యర్థి మీద ఎక్కువ నియంత్రణ వుండదు. (గుర్తించవలసిన విషయం ఏమిటంటే రక్షణను సాధారణంగా వుపయోగించి నప్పటికీ, డో-జిమేను జూడో పోటీలలో ఉపయోగించడం చట్టపరంగా సమ్మతి కాదు.[10]) పైన వున్న వ్యక్తి ప్రత్యర్థి కాళ్ళ బంధనం నుంచి విడిపించుకొని, అతనిని గట్టిగా పట్టుకోనవచ్చు లేదా లొంగ దీసుకోవచ్చు, లేదా ప్రత్యర్థి రక్షణను ఛేదించి నిలబడవచ్చు. క్రింద వున్న వ్యక్తి, తన రక్షణవిధానం ద్వారా ప్రత్యర్థిని లొంగ దీసుకొనే ప్రయత్నం చేయవచ్చు లేదా ప్రత్యర్థిని త్రిప్పి, తను అతని పైకి వచ్చే ప్రయత్నం చేయవచ్చు.

 
జుజి గటమే, మెలితిప్పిన చేతుల బంధం

కీళ్ళ నిర్బంధనలుసవరించు

కీళ్ళ నిర్బంధనాల (కన్సేట్సు-వాజా )ను సాధారణంగా చేతుల నిర్బంధన అంటారు. అవి బాగా ప్రభావవంతమైన యుద్ధ మెళకువలు ఎందుకనగా, వాటివలన జుడోకా ప్రత్యర్థి మీద నొప్పి అనుసరణ ద్వారా నియంత్రణ సాధించవచ్చు, లేక అవసరమైతే, నిర్బంధించబడిన కీళ్ళను విడిపించికోవచ్చును. పోటీలలో, ప్రతర్ధిని బలవంతముగా లొంగదీసుకోనుటకు, కీళ్ళనిర్బంధనాలను పూర్తి బలముతో మోచేతుల మీద ప్రయోగించడం సురక్షితమని భావిస్తారు. పూర్వం జూడోలో కాలి నిర్బంధనలు, మణికట్టు నిర్బంధనలు, వెన్ను నిర్బంధనలు మరియు అనేక ఇతరములైన మెళకువలను అనుమతించేవారు, ఆటగాళ్ళ భద్రత కొరకు వాటిని అప్పటినుంచి పోటీలలో అనుమతించలేదు. అటువంటి కీళ్ళ మీద దాడి చేయడం వలన, ఆటగాళ్ళకు చాలా గాయాలవుతున్నాయని నిర్ధారణ చేసారు మరియు కీళ్ళు నెమ్మదిగా క్షీణించడానికి కారణమవుతున్నాయి. అయినాకాని, పద్దితి ప్రకారం జరిగే పోటీలలో నిషేధించిన మెళకువలను, ఇప్పటికీ కొంతమంది జుడోకా లు నేర్చుకొని మరియు వాటిని వుపయోగించి ఒకరితో ఒకరు అనధికారంగా పోట్లాడుతూ వుంటారు, మరియు వీటిలో చాలా పద్ధతులను సంబంధితకళలైన సంబో, బ్రెజిలియన్ ఇఉ-జిట్సు, మరియు జుజుట్సు వంటి వాటిలో, ఇప్పటికీ క్రియాశీలంగా వాడుతూ వుంటారు.

ఉడుంపట్టు మరియు ఊపిరిఆడకుండా బంధించడంసవరించు

Chokes and strangulations (締め技 shime-waza?) వాటిని సాధారణంగా మరియు సులభంగా అణచుట అంటారు. అవి వాడే వ్యక్తి, ఉడుంపట్టును బలంగా వాడి ప్రతర్ధిని, స్పృహ కోల్పోవునట్లు చేయవచ్చును మరియు ఇంకా చంపవచ్చును ఊపిరి ఆడకుండా బంధించడం వలన మెడ గుండా వెళ్ళే గళ ధమని ప్రక్కలు సంఘాతం చేయబడడం ద్వారా మెదడుకు రక్త ప్రసరణ ఆపివేయబడుతుంది, ఉడుంపట్టు మెడ లోని గాలి ప్రసారాన్ని ఆపివేస్తుంది. సాధారణంగా వాడుకలో ఈ రెండు పదాలను, తరచుగా ఒకదానికి మరొకటి వాడతారు, మరియు చాలా మంది జుడోకా [11]లు క్రమబద్దమైన తేడాను చూపరు. పోటీలలో, ప్రత్యర్థి లొంగి పోయినా లేక స్పృహ కోల్పోయినా జుడోకా విజయం సాధించినట్లు, సరిగ్గా ఊపిరి ఆడకుండా బంధిస్తే, కొద్దిక్షణాలలోనే ప్రత్యర్థిని స్పృహ కోల్పోయేటట్లు చేయవచ్చును, కాని దాని తరువాత సరిగ్గా వదిలేస్తే, సాధారణంగా ఎటువంటి ప్రమాదం జరుగదు.

ఆట లాగాసవరించు

 
అల్-జపాన్ జూడో విజేతను నిర్ణయించే పోటీలు, 2007 పురుషుల ఫైనల్

పూర్తి పద్ధతులతో కూడిన యుద్ధకళ ఐనప్పటికీ, జూడో క్రీడలాగా కూడా అభివృద్ధి చెందినది.

1932 లో లాస్ ఏంజిల్స్లో మొదటిసారిగా జూడో ఒలింపిక్స్ లో దర్శనమిచ్చింది, అక్కడ కానో మరియు 200 జూడో విద్యార్థులు దానిని ప్రదర్శించారు.[12] 1964 లో టోక్యో లో, జూడో పురుషుల ఒలింపిక్ క్రీడగా ఆరంభం అయ్యింది. రేన కానో కోగి అనే అమెరికన్ మరియు అనేకమంది ఇతరులు పట్టుబట్టడం వలన, 1988లో జూడో మహిళల ఒలింపిక్ క్రీడ అయ్యింది. 1964 లో జరిగిన పురుషుల జూడో ఘటనను, కేవలం ప్రదర్శనగా చాలామంది భావిస్తారు, కాని ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషణ్ (IJF) మరియు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారి ప్రకారం, 1964 పోటీలలో జూడో అధికారిక క్రీడ. డచ్ దేశస్తుడగు ఆంటన్ గీసింక్, జపాన్ దేశస్తుడగు అకియో కమినగాను ఓడించి, జూడో స్వేచ్ఛావిభాగంలో, మొదటి ఒలింపిక్ బంగారు పతాకాన్ని సాధించాడు. దానితో, జూడో "జపనీస్ కు మాత్రమె" అన్న రూపును పోగొట్టుకొన్నది, మరియు ప్రపంచ వ్యాప్తంగా బాగా సాధన చేసే క్రీడగా మారినది. 1988లో మహిళల ప్రదర్శనా ఘటన జరిగినది మరియు 4 సంవత్సరాల తరువాత అధికారిక పతక సంఘటనగా మారినది. పురుషులు మరియు మహిళలు శిక్షణను కలిపి తీసుకున్నప్పటికీ, పోటీలో వేరు వేరు గానే పోటీ పడతారు. 1988 నుండి పారా ఒలింపిక్ జూడో, పారా ఒలింపిక్ క్రీడగా (చూపు లేని వారి కోసం) అయ్యింది; ప్రత్యేక ఒలింపిక్స్ లో కూడా ఒక క్రీడగా మారింది.

సంయుక్త రాష్ట్రాలలో వివిధ కళాశాలల మధ్య పోటీ, ముఖ్యంగా యుసి బెర్క్లీ మరియు శాన్ జోస్ స్టేట్ యునివర్సిటీ మధ్య పోటీ, జూడోని ఒక ఆటగా మార్చడానికి దోహదం చేసింది, అదే మనం ఒలింపిక్ పోటీలలోను మరియు ప్రపంచ విజేతకై జరుపు పోటీలలోను చూస్తాము. 1940 లలో హెన్రీ స్టోన్ మరియు యోష్ ఉచిడా, Cal మరియు SJSU కి ప్రధాన శిక్షకులు, పాఠశాలల మధ్య తరచుగా జరిగే పోటీల కొరకు బరువు విభాగాల వ్యవస్థను ఏర్పరిచారు. 1953 లో అమెత్యూర్ అథ్లెటిక్ యునియన్ స్టోన్ మరియు ఉచిడాల మనవిని మన్నించి జూడోను క్రీడగా గుర్తించింది, వారి బరువు విభాగాల వ్యవస్థ అధికారిక అంశంగా మారింది. 1961 లో ఉచిడా, పారిస్ లో జరిగిన IJF సమావేశాలలో సంయుక్త రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించాడు, అక్కడ IJF బరువు విభాగాలను, ముందు జరుగబోవు విజేతను నిర్ణయించే అన్ని పోటీలలో వాడాలని నిర్ణయించారు. ముందువున్న యురోపియన్ జూడో యూనియన్ మీద బాగా ఆధారపడి IJF పుట్టింది, అక్కడ బరువు విభాగాలను చాలా సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు.

బరువు విభాగాలుసవరించు

ప్రస్తుతము 7 బరువు విభాగాలు కలవు, అవి నియంత్రించే సంస్థలను బట్టి మారవచ్చు, మరియు పోటీదారుని వయస్సును బట్టి సవరించవచ్చు:

పురుషులు:
60 kgల కంటే తక్కువ 60–66 kg 66–73 kg 73–81 kg 81–90 kg 90–100 kg Over 100 kgల కంటే ఎక్కువ
స్త్రీలు
48 kgల కంటే తక్కువ 48–52 kg 52–57 kg 57–63 kg 63–70 kg 70–78 kg 78 kgల కంటే ఎక్కువ

నిబంధనలుసవరించు

సాంప్రదాయక జూడో నిభందనలు, పోటీదారులను గాయాల నుంచి కాపాడుట మరియు ఒకరిని ఒకరు గౌరవించుకొనే నియమావళిని ఏర్పరుచుటకు ఉద్దేశింపబడినవి. ప్రేక్షకులకు ఆటను మరింత ఆసక్తికరముగా మార్చే ఉద్దేశంతో, తరువాతి కాలంలో కొన్ని కొత్త నియమాలు చేర్చారు.

ఆటలో చురుగా లేకపోవడం మరియు శాస్త్రవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించినపుడు, జరిమానాలను విధించవచ్చు. చాప (టటమి ) మీద నిర్ణయించిన ప్రదేశమును పోటీదారుడు దాటినచో, పోరును వెంటనే ఆపివేయవలెను. ఒకవేళ రిఫరీ మరియు న్యాయనిర్ణేతలు, పోటీ జరుగుతున్నప్పుడు దేని గురించియైన ముచ్చటించుకోవలసి వస్తే, రిఫరీ సోనో-మామ ("కదలవద్దు" అనే అర్ధంలో ఉపయోగిస్తారు, నిఘంటువు ప్రకారం "ఎలా వున్న వాళ్ళు అలాగే") అని పిలుస్తాడు మరియు ఇద్దరు పోరాట యోధులు, ఎ స్థితిలో వున్నవారు ఆ స్థితిలో వుండిపోవాలి. అది ముగిసిన తరువాత, రిఫరీ యోషి అని పిలుస్తాడు మరియు ఆట మొదలవుతుంది.

అన్ని మార్కులు మరియు జరిమానాలు రిఫరియే ఇస్తాడు. రిఫరీ ఇచ్చిన మార్కులను లేదా జరిమానాలను, న్యాయనిర్ణేతలు మార్చే నిర్ణయాన్ని తీసుకోవచ్చు.

చూపులేని వారి జూడో కొరకు IJF నియమాలలో స్వల్ప మార్పులు జరిగాయి.

పోటీ మార్కులుసవరించు

 
'ఇప్ఫోన్' ద్వారా విజయం సాధించినందుకు గుర్తుగా రిఫరీ చేతిని పైకి ఎత్తుతాడు.

జూడో ఆట యొక్క ఉద్దేశం, ప్రత్యర్థి భుజం నేలకు తగిలే విధంగా విసిరేయడం; వెనుక భాగం నెలకు తగిలేవిధంగా గట్టిపట్టుకొనుట; ఉడుంపట్టు ద్వారా, కదలకుండా గట్టిగాపట్టుకొనుట ద్వారా లేదా చేతి నిర్బధం ద్వారా, ప్రత్యర్థిని లొంగదీసుకోనుట; వీటి ద్వారా ఒక ఇప్ఫోన్ (పాయింటు) (一本) లభిస్తుంది, వెంటనే పోటీలో విజయం లభిస్తుంది.

జూడోలో 3 స్థాయిల మార్కులు కలవు: ఇప్ఫోన్, వాజా -అరి మరియు యుకో . ఇప్ఫోన్ అనగా అక్షరాలా "ఒక పాయింటు" అని అర్ధం మరియు పోటీలో గెలుపు. ఇప్ఫోన్ను ఈసందర్భాలలో ప్రదానం చేస్తారు ఏ)నియంత్రణతో వేగంగా మరియు బలంగా ప్రతర్ది వెనుకభాగం చాలావరకు నేలను తాకే విధంగా విసిరేసినప్పుడు బి)సరిపోయినంత సమయం కదలకుండా పట్టుకోన్నప్పుడు (25 సెకన్లు) లేక సి)ప్రతర్ది లొంగిపోయినప్పుడు. వాజా-అరిను ప్రదానం చేసే సందర్భాలు: సరిపోయినంత బలం లేకుండా విసిరేసినప్పుడు లేక ఇప్ఫోన్ లో పరిగణనలోకి తెసుకొనే నియంత్రణ కలిగినప్పుడు; లేక 20 క్షణాలు పట్టుకోగలిగితే. వాజా-అరి అనేది అర పాయింట్, మరియు దానిని ఇద్దరు సాధిస్తే, విజయం సాధించడానికి పూర్తిగా ఒక పాయింట్ ని కలిగివుండాలి.

యుకో అనేది ఒక తక్కువస్థాయి కలిగిన మార్కు, మరియు దానిని టై-బ్రేకేర్ లో మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు; మిగతా యుకో మార్కులతో దీనిని కలపరు. నిఘంటువు ప్రకారం మార్కులు: వాజా-అరి అనేది, ఎన్ని యుకోలు కలిగివున్నప్పటికి దానికన్న ఎక్కువ, కాని యుకో కలసి వున్న వాజా-అరి, యుకో లేకుండా వున్న వాజా-అరి కంటే ఎక్కువ.

(ఇదివరకు, కోక అనే 4 మార్క్ కలదు, కాని దానిని 2009 లో తీసివేసారు. కోక ఉపయోగంలో వున్నపుడు, ఇది యుకో కన్నా తక్కువ మార్క్. యుకో లాగానే ఇదికూడా టై-బ్రేకర్ లో మాత్రమే వాడతారు. పోటీదారులు ఇద్దరికీ ఒకే వాజా-అరి మరియు యుకోలు వున్నప్పుడు మాత్రమే దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. యుకో అనేది, ఎన్ని కోకలు కలిగివున్నప్పటికి దానికన్న ఎక్కువ.

15 క్షణాలు పట్టుకోగలిగితే యుకో లభిస్తుంది. ఒకవేళ పట్టుకున్న వ్యక్తి మునుపే వాజా-అరిని కలిగివున్నటైతే, ఇప్ఫోన్ను సాధించడానికి 20 క్షణాలు మాత్రమే గట్టిగాపట్టుకున్న చాలు, దాంతో రెండు వాజా-అరిలు సాధించినట్లు అగును (వాజా-అరి-అవాసేటే-ఇప్ఫోన్ ). విసరడం, ఇప్ఫోన్ లేదా వాజా-అరిలు సాధించుటకు అవసరమైన దానికన్నా తక్కువ అయినచో యుకో మార్క్ ను సాధించవచ్చు. "నైపుణ్యంతో కూడిన క్రిందపడవేయడం" వంటి చెప్పబడుతున్న వాటిని కూడా వాడవచ్చు ( ఉదాహరణకు, ఎగిరే ఆర్మ్-బార్) కాని వాటితో ఏమీ మార్కులు సాధించలేరు.

పోటీ చివరలో, మార్కులు సమంగా వచ్చినచో, గోల్డెన్ స్కోర్ నియమంతో విజేతను నిర్ణయిస్తారు. గోల్డెన్ స్కోర్ లో, మ్యాచ్-టైంకి గడియారాన్ని తిరిగిమారుస్తారు, ఇది తాడో-పేడో తేల్చుకొనే పరిస్థితి మరియు పోటీదారులలో ఎవరైతే మొదట ఏదో ఒక మార్క్ ను సాధిస్తారో, వారే విజేత. ఈసమయంలో కూడా ఎటువంటి మార్క్ రాకపోతే, విజేతను హన్తి నిర్ణయిస్తారు, అది రిఫేరీ మరియు ఇద్దరు మూలగల న్యాయమూర్తుల మెజారిటీ అబిప్రాయం.

మార్కులను సూచించే విధానంసవరించు

ప్రతి ఆటగాడి, వాజా-అరి మరియు యుకో మార్కులను జూడో మార్కులపలక చూపిస్తుంది. (2009 లో కోకను నిషేధించేవరకు, దానిని మార్కులను కూడా ప్రదర్శించేవారు). సాధారణంగా ఇప్ఫోన్ మార్క్ ను మార్కులపలక మీద సూచించరు, దానికి కారణం, ఇప్ఫోన్ను సాధిస్తే వెంటనే పోటీ ముగుస్తుంది. కంప్యుటరీకరణ మార్కులపలకలు, ఇప్ఫోన్ మార్క్ ను సాధించినట్లు కొంచంసేపు సూచిస్తాయి.

సాధారణంగా మార్కులపలకలు, ఆటగాళ్లకు విధించిన జరిమానాలను కూడా సూచిస్తాయి, మరియు కొన్నిసార్లు ఇరువురు, ఎన్నిసార్లు వైద్యసహాయం పొందారో సూచిస్తాయి. (ఇరువురికి, ఆట జరుగుతున్నప్పుడు గరిష్ఠంగా రెండుసార్లు వైద్యసహాయాన్ని అనుమతిస్తారు. తక్కువ రక్తస్రావానికి సాధారణంగా అనుమతిస్తారు).

ఎలక్ట్రానిక్ మార్కులపలకలు, పోటీ సమయాన్ని మరియు ఒసేకోమి సమయాన్ని సాధారణంగా కలిగివుంటాయి.

నియమాలలో వచ్చిన మార్పులుసవరించు

భద్రతా పరమైన కారణాలవలన జూడో నియమాలు ఎప్పుడు మారుతూ వుంటాయి. జుడోక వయస్సు, హోదా లేదా అనుభవాన్ని బట్టి కూడా మారవచ్చు. అవి దేశం, క్లబ్ లేదా పోటీస్థాయి బట్టి కూడా ఆధారపడి వుంటాయి. ( అనగా, ఒలింపిక్స్ ప్రతి అంతర్జాతీయ పోటీ ప్రతి జాతీయ పోటీ).

జరిమానాలుసవరించు

మొదటి జరిమానా హెచ్చరిక, అది మార్కులపలక మీద వ్రాయబడుతుంది. రెండవ జరిమానా, ప్రతర్ధికి "యుకో" మార్క్ ను ఇస్తుంది. మూడవ జరిమానా "వాజా-అరి" నిస్తుంది. నాలుగవ జరిమానని "హన్సోకు మేక్" అంటారు, మరియు ప్రతర్ధికి "ఇప్ఫోన్" మార్క్ ను ఇస్తుంది. "హన్సోకు మేక్" వలన పోటీ శాశ్వతముగా ముగుస్తుంది. తీవ్రమైన నియమ ఉల్లంఘన వలన కూడా "హన్సోకు మేక్"ను పొందవచ్చు. ఆ సందర్భంలో, "హన్సోకు మేక్" వచ్చిన ఆటగాడు, ఆ క్రీడాపోటీ లకు అనర్హత పొందుతాడు.

ఆత్మరక్షణగాసవరించు

జూడో ప్రపంచ వ్యాప్తంగా, చాలా సైనిక పోటీలలో మరియు రక్షణ వ్యూహరచనా శిక్షణలకు మూలమైనది.[13]

పైన పెర్కొన్న వాటితోపాటు, సంప్రదాయక జుజిట్సు నేపథ్యం గల జూడోని పోలీసు మరియు సైనిక ప్రయోగములతో కలిపి, ఆత్మరక్షణ యొక్క సాంకేతికత మూలసూత్రాలుగాగల కటను తయారుచేసారు; కిమే నో కట (నిర్ణయం యొక్క రూపాలు) మరియు కోడోకన్ గోషిన్ జుట్సు (ఆత్మరక్షణ యొక్క రూపాలు). రెంకోహో వాజా పద్ధతి మెళకువలు ముఖ్యంగా పోలీసుల కొరకు తయారు చేయబడ్డాయి. (0/) జోషి జూడో గోశింహో పద్ధతి ఆత్మరక్షణ మెళకువలు ముఖ్యంగా మహిళల కొరకు తయారు చేయబడ్డాయి.[14] మిగతా కట సమూహపు పద్ధతుల ఆత్మరక్షణ ప్రయోగాలు చాలా సూక్ష్మమైన మార్గాలలో ఉన్నాయి.

వివిధరకాలైన జూడో మూలసూత్రాలు మరియు శిక్షణ పద్ధతులు, ఆత్మరక్షణలోని పద్ధతులను మరియు సామర్ద్యాన్ని పెంపొందించడానికి వుపయోగపడతాయి:[15]

 • శిక్షణా సమయంలో పూర్తి శక్తితో మరియు వేగంతో, బాగా ప్రతిఘటించే ప్రత్యర్థిని ఎదుర్కొంటారు: వేగాన్ని, సామర్ధ్యాన్ని, శక్తిని మరియు పట్టుసడలని దీక్షను పెంచుతుంది.
 • గణనీయమైన బలముతో పలుమార్లు విసిరివేయబడితే, శరీరము మరియు మనస్సు మీద నియంత్రణ సాధించవచ్చును.
 • సరిగ్గా పడడానికి అవసరమైన సురక్షితమైన పద్ధతులను శిక్షణలో తీసుకోవాలి.
 • కచ్చితంగా మరియు వేగం గలిగిన సామర్ధ్యంతో సంతులతను, దూరాన్ని మరియు సరియైన సమయాన్ని వుపయోగించి ప్రతిభావంతుడైన ప్రత్యర్థి మీద చేతులతోనూ, గుప్పిళ్ళ తోనూ బాగా దాడి చేయాలి. జూడో సాధకులు తమ సంతులనను కాపాడుకోనుచు, ప్రత్యర్థి సంతులతను నియంత్రించడంలో నిపుణులు.
 • క్రీడల జూడో నియమాలు, ప్రత్యర్థి క్రిందపడిన తరువాత, చాలా వేగంగా, ప్రత్యర్థిని కదలకుండా గట్టిగా పట్టుకోవాలి లేదా లొంగదీసుకోవాలి అని ఉద్ఘాటిస్తాయి, అందువలన ఆత్మరక్షణ సందర్భాలలో, ప్రేలుడుతో సమానమైన ఉడుం పట్టులను మరియు నిర్బంధనాలను ప్రయోగించే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.
 • సాధకుడు, ప్రత్యర్థిని ఏ కోణంలో, ఏ మార్గంలో మరియు యెంత బలంతో నేలమీదకు విసిరాలో అనేదానిమీద నియంత్రణ కలిగిఉండాలి అని ఉద్ఘాటిస్తాయి. దాని ప్రభావం, కొమలమా లేక ప్రాణాన్తకమా అనే పరిణామాలు, జూడో సాధకుని ఉద్దేశం మీద ఆధారపడివుంటాయి.

అయితే, ఆత్మరక్షణ శిక్షణలో జూడోని ఉపయోగించడం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి.

 • జుడో-గి (క్లోతింగ్)ని ఉపయోగించడం మీద అతిగా ఆధారపడం: ప్రత్యర్థి "గి"ని ధరించనప్పుడు, ఆత్మరక్షణకు వాడే జూడోశిక్షణకు అనుభువశాలియై చేతులతో, గుప్పిళ్ళతో దాడి చేయగల వ్యక్తి కావలెను. అంతేకాక, చాలా మెళకువలు "గి"ని పట్టుకోవడం మీదా కచ్చితంగా ఆధారపడవు; అలాగే, కొన్ని మెలకువల (ముఖ్యంగా నేలమీద పోరాటాలలో లేక నే వాజా)లో "గి"ని అసలు వాడారు.
 • క్రీడా జూడో నియమాలమీద ఎక్కువ ఉద్ఘాటన: కొన్ని జూడో క్లబ్స్ లేదా అధ్యాపకులు, జూడోని ఆటల కోసమే నేర్పిస్తారు.
 • కొట్టే పద్ధతులు లేకపోవడం: జూడోలో కొట్టే పద్ధతులను, ప్రదర్శనకు లేదా కట కోసం సాధారణంగా డాన్ స్థాయి (అనగా నలుపు బెల్ట్ కలిగిన) వారికి మాత్రమే నేర్పిస్తారు.

మిళిత యుద్ధ కళలలోసవరించు

నే-వాజా/ప్రత్యర్థి మీద ప్రయోగించే మెళకువలు మరియు టచి -వాజా/నిలబడి-ప్రత్యర్థి మీద ప్రయోగించే మెళకువల, పరిజ్ఞానం జూడోసాధకులు మిళిత యుద్ధ కళల ఆటలలో పోటీపడతారు. మాజీ రష్యా జాతీయ జూడో విజేత ఫెడోర్ ఎమిలియనేంకో, ప్రపంచం మిళిత యుద్ధ కళల హెవీవెయిట్ విభాగంలో తరచుగా మొదటి స్థానం సాధించేవాడు. జూడో సాధకుడైన కరో పరిస్యన్ UFC లో విజయవంతంగా యుద్ధం చేసాడు. రామేయు తిఎర్రి సోకౌద్జౌ, కజుహిరో నకమురా మరియు ఒలింపిక్ బంగారు పతక విజేత హిడేహికో యోశిడలు ప్రస్తుతము పనిచేయని PRIDE FC లో పోరాట యోధులు. ఇతర ఒలింపిక్ పతక విజేతలు మరియు ప్రపంచ విజేతలైన జుడోక వంటి పావెల్ నస్తుల మరియు యూన్ డాంగ్-శిక్ లు MMA లో కూడా యుద్ధం చేస్తారు. యురోపియన్ జూడో కాంస్య పతక విజేత ఫెర్రిడ్ ఖేడర్ కూడా విజయవంతమైన చరిత్ర కలిగిన MMA పోరాట యోధుడు, ఇంకా యోశిహిరో అకియమ మరియు మాజీ ఒలింపిక్ జూడో పోటీదారుడు హెక్టర్ లోమ్బార్డ్ కూడా. పూర్వపు WEC మధ్యవెయిట్ విజేత పావులో ఫిల్హో తన విజయానికి కారణం జూడో మరియు జిఉ-జిట్సు అని నమ్మాడు.[16] పోరాట యోధులైన సానే కికుట మరియు హయటో సకురై కూడా జూడో నేపథ్యం కలవారే మరియు పూర్వపు UFC విజేత డాన్ ఫ్ర్యే జుడోకను సాధన చేస్తాడు, జూడోని తన ఒక పోరాట శైలిగా ప్రకటించాడు. ప్రపంచ ప్రస్తుతపు ముగ్గురు అగ్రశ్రేణి లైట్ వెయిట్ మిళిత యుద్ధ కళల సాధకులలో ఒకరైన శినయ అఒకికి కూడా జూడో నేపథ్యం ఉంది.

2008 ఒలింపిక్ బంగారు పతక విజేత సతోషి ఈశీ MMA లో పూర్తి కాలం పోటీ పడుటకు జూడో నుంచి విరామం తీసుకొన్నాడు. జపాన్ లో సేన్గోకు వృద్ధి కొరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.

జూడోలో నలుపు బెల్ట్ కలిగి, MMA పోరాట యోధులుగా గుర్తించబడిన వారు:

 • అన్తినో రోడ్రిగో నోగ్యుర
 • ఫాబ్రికో వేర్డుం
 • అండర్సన్ సిల్వ
 • రోనాల్డో సౌజా
 • రెంజో గ్రేసి
 • మన్వేల్ గంబుర్యన్
 • విటోర్ బెల్ఫోర్ట్
 • ఫెడోర్ ఎమేలియనేంకో
 • కరో పరిస్యన్

శైలులుసవరించు

కానో జోగోరో యొక్క కోడోకన్ జూడో అత్యంత ప్రజాదరణ పొందినది మరియు అందరికి తెలిసిన జూడో శైలి, కానీ ఇది ఒక్కటే కాదు. మొదటి సంవత్సరాలలో జూడో మరియు జుజుట్సు లను ఒకదానికి ఒకటి సర్వసాధారణంగా వాడేవారు, అందువలన కొన్ని జూడో రూపాలు, ఇప్పటికి జుజుట్సు లేక జిఉ-జిట్సుగా గుర్తించబడతాయి, ఆ కారణం వలన గాని లేక వాడుకలో వున్న జూడోతో వేరుగా చూపుటకు వాడేవారు. కానో యొక్క అసలు జూడో రూపం నుంచి, వివిధరకాలైన రూపాలు ఉద్భవించాయి- ఇప్పడు కొన్ని విభిన్న కళలుగా గుర్తించబడ్డాయి:

 • ఒలింపిక్ జూడో : ఇది కోడోకన్ జూడో యొక్క ప్రధానమైన రూపం.
  • పారఒలింపిక్ జూడో : చూపులేని వారికొరకు మరియు చూపుదెబ్బతిన్న వారికోసం మార్పు చేయబడింది.
 • బ్రెజిలియన్ ఇఉ-జిట్సు(BJJ) : 1914 లో, మిట్సుయో మైడ బ్రెజిల్కి జూడోని పరిచయం చేసాడు. మైడ జూడోని కార్లోస్ గ్రేసి (1902–1994) మరియు బ్రెజిల్ లో ఇతరులకు నేర్పించాడు. గ్రేసి తను తయారుచేసిన జూడోకి 'బ్రెజిలియన్ జిఉ-జిట్సు' అనే పేరు పెట్టాడు ( ఆ కాలంలో జపాన్ మరియు బ్రెజిల్ రెండింట్లో, జూడోని 'కానో జిఉ-జిట్సు' అనేవారు). బ్రెజిలియన్ జిఉ-జిట్సు, తనను స్వతంత్రంగా భావించుకొని, ప్రపంచ జూడోలో తరువాత వచ్చిన, ప్రస్ఫుటంగా నిలబడి చేయు పోరాటానికి చేర్చిన నియమాలు, లేక ప్రాణంతకమైన మెళకువలను నిషేధించే నియమాలను అనుసరించలేదు.
 • జూడో-డో : ఆస్ట్రియాలో జులియుస్ ఫ్లేక్ మరియు మరికొందరు కలసి "జూడో-డో" అనే త్రోసే విధానాన్ని జూడోకి పొడిగింపుగా తయారుచేసారు.
 • కవైషి-ర్యు జుజుట్సు : మికోనోసుకే కవైషి ఫ్రాన్సులో జూడోని నేర్పిస్తూ, కవైషి-ర్యు జుజుట్సుని తయారుచేసాడు, అది నవీన ఒలింపిక్స్/కోడోకన్ జూడో పోటీలలో నిషేధించిన అనేక మెళకువలను, వేరొకరూపంలో నేర్పిస్తుంది.
 • Kosen judo (高專柔道?) : 20వ శతాబ్దపు మొదట్లో, కోడకన్ జూడోకి ఉపశైలి అయిన కోసేన్ శైలి, జపనీస్ పాఠశాలల మధ్య పోటీలో బాగా జనరంజకమైనది, దీంట్లో కోడోకన్ జూడోకి సమానమైన చాలా మెళకువలు కలవు, కాని నేలమీది మెళకువలలో బాగా స్వేచ్ఛ ఉంది. ఈ జూడో శైలి, ప్రస్తుతపు ఒలింపిక్స్ జూడో కంటే, అసలు 1900 లోని మొదటి BJJ శైలిని పోలివుంటుంది.
 • రష్యన్ జూడో : ఇది సంబో ప్రభావితమైన, విభిన్నమైన శైలి కలిగివుంటుంది. దీనికి ప్రాతినిధ్యం వహించేవారు: బాగా తెలిసిన గురువులు ఉదాహరణకు అలగ్జాండర్ రెట్యఇన్స్ఖ మరియు ఇగోర్ యకిమోవ్, మరియు మిళిత యుద్ధ కళల పోరాట యోధులైన 3}ఇగోర్ జినోవిఎవ్, ఫెడోర్ ఎమేలియనేంకో మరియు కరో పరిస్యన్. రష్యన్ జూడో, వాడుకలోనున్న జూడోని ప్రభావితం చేసినది, దీని మెళకువలైన ఎగిరే అర్మ్బార్ వంటి వాటిని కోడోకన్ జూడోలోకి అంగీకరించబడ్డాయి.
 • సంబో (విశేషంగా క్రీడా సంబో): కానో క్రింద నలుపు బెల్ట్ తీసుకొన్న మొదటి యురోపియన్ వాసిలి ఒశ్చేప్కోవ్. ఒశ్చేప్కోవ్, సహజ రష్యన్ రెస్లింగ్ ను మరియు ఇతర పోరాట కళలను కలిపి ఒక కొత్త సంబో సిద్ధాంతాన్ని తయారుచేసాడు, దీని మీద జూడో ప్రభావం కొంతవరకు ఉంది. 1937 లో ఒశ్చేప్కోవ్, కానో క్రింద గల తన చదువును, డాన్ హోదాను వదులుకోవడానికి ఇష్టపడక పోవడంచేత, రాజకీయ శుద్ధీకరణలో మరణించాడు.[ఉల్లేఖన అవసరం] బ్రెట్ జాక్యుస్ మరియు స్కాట్ అండర్సన్ వ్రాసిన హిస్టరీ అఫ్ సంబో ప్రకారం, రష్యాలో "జూడో మరియు సంబో లు ఒకటేగా భావిస్తారు"- అయితే, నియమాలలో కొన్ని మార్పులు మరియు వేరొక యూనిఫారం ఉన్నాయి.[17]
 • డైడో జుకు : జూడోను మరియు క్యోకుషిన్ మూలాలను కలిపిన సంకర మిళిత యుద్ధ కళ.

భద్రతసవరించు

పరిశోధనల ప్రకారం, జూడో యువతకు భద్రత కలిగిన ముఖ్యమైన ఆట, కాని పెద్దల జూడో పోటీలో దెబ్బలు తగిలే అవకాశం, ఉదాహరణకు, గుద్దుకొను అవకాశం లేని మరియు తగిలే అవకాశం లేని బంతి ఆటలతో పోలిస్తే ఎక్కువ, కాని అది తగిలే అవకాశంకల ఇతర క్రీడల వలననే వుంటుంది.[18][19]

చోక్స్(ఉడుంపట్టు)సవరించు

ఉడుంపట్టులు, పీడనసామర్ధ్యం గల ప్రాణంతక మెలుకువలు, సరిగ్గా ఉడుంపట్టును వాడి, ప్రత్యర్థి లొంగిపోయిన తరువాత లేక స్పృహ కోల్పోయిన తరువాత, వదిలేస్తే ఎటువంటి గాయాలు కలుగవు. విద్యార్థుల భద్రత కొరకు, సాధారణంగా జూడో ఉడుంపట్టులను బాగా అనుభవంతులైన జుడోకలకు నేర్పుతారు.[20][21] ఉడుంపట్లు గట్టిగాపట్టులున్నచో భద్రమైనవి అని చెప్పుటకు సరిపోయిన సమాచారం కలదు,[22][23][24] మరియు శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనుటకు[25] మరియు స్పృహతెప్పించుటకు (కప్పో ) నేర్పుతారు.[20]

విసిరివేయుటసవరించు

సరిగ్గా విసిరేసే కిటుకును, జాగ్రత్త వాడితే ప్రతర్ధికి గాయాలు కాకుండా వుంటాయి. అయెతే గాయాలు కావడానికి కారణం, ఉదాహరణకు, విసిరేసే వ్యక్తి (టోరి), జారి లేక కావాలని ద్వేషపూరిత ఆలోచనలతో ప్రత్యర్థి మీద పడటం వలన, లేక టోరి, జారి ప్రత్యర్థి కీళ్ళ మీద అలక్ష్యంగా విసరడం వలన (ఉదాహరణకు, సరికాని ఒసోటో గారి లేదా టై ఒటోషి వుపయోగించి బలంగా మోకాళ్ళ మీద కొట్టడం వలన; లేక జారిన సోటో మకికోమి వలన లేక ఇప్ఫోన్ సెఒఇ నజే ద్వారా ప్రతర్ది భుజం మీద ఎక్కవ బలం ఉపయోగించడం ద్వారా). విసిరివేయడంలో గాయాలను తగ్గించుటకు, గురువు సరియైన విసిరే మెలకువలను అనగా సందర్భాన్ని బట్టి సాధన (ఉచి-కొమి), పూర్వసవరణల రూపకం (ఉదాహరణకు, నాగే-నో-కట), మరియు వశ్యమైన & పర్యవేక్షణలో స్వేచ్ఛయుత సాధన/మల్లయుద్ధం (రండోరి)లను విద్యార్థుల చేత బాగా సాధన చేసిన తరువాతే పోటీలకు పంపవలెను

సంస్థలుసవరించు

జూడోకి ప్రపంచసంస్థ ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ (IJF).

అధికారికంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ అస్సోసిఎటేడ్ రెస్లింగ్ స్టైల్స్ (FILA) కి జూడోలో ఎటువంటి పాత్ర లేనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇది జూడోను ఔస్తాహిక రెస్లింగ్ పోటీలలో, 4 ముఖ్యమైన విభాగాలలో ఒకటిగా గుర్తించినది (మిగాతా మూడు, గ్రీకో-రోమన్ రెస్లింగ్, ఫ్రీస్టైల్ రెస్లింగ్ మరియు సంబో).

హొదా మరియు స్థాయిసవరించు

చురుకైన పోటీదారుడు ఎక్కువ స్థాయిలకి వెళ్ళడం గురించి ఆలోచించకుండా, పోటీలలో పాల్గొనుటకు సాధన చేయుట ముఖ్యమైనదిగా భావించవచ్చు; ఉదాహరణకు, 2004 అంగవికలాంగుల ఒలింపిక్స్ లో ఇక్క్యు (గోధుమ బెల్ట్) అయిన లోరెన పిఎర్స్ అనే మహిళా పోటీదారురాలు, 70 kg ల విభాగంలో, రజిత పతాకాన్ని సాధించింది. హొదా కొరకు, పరిజ్ఞానం మరియు సామర్ధ్యం మాత్రమే కాకుండా, సాధారణంగా కనిష్ఠ వయస్సును కూడా పరిగణిస్తారు.[26] అందువలన, జాతీయస్థాయి పోటీలలో, 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న బ్లూ లేదా గోధుమ బెల్ట్ ను మాత్రమే కలిగిన యుక్తవయస్సు కలిగిన పోటీదారులు, పెద్దవయస్సు కలిగిన పోటీదారులను ఓడించుట అసాధారణం కాదు, దానికి కారణం వారికి డాన్ హొదాకి కావలిసిన కనీస వయస్సు లేకపోవడమే. వ్యక్తిగతంగా డాన్ హొదాను పొందినతరువాత, తరువాతి హొదా పొందుటకు సామర్ధ్యం, పోటీలలో ప్రతిభ మరియు/లేదా జూడోకి చేసిన సహాయము అనగా శిక్షణ మరియు స్వచ్ఛందంగా సమయాన్ని కేటాయుంచుట వంటి చాలా కారణాలు ఉన్నాయి.[27] అందువలన, ఎక్కువ డాన్ హొదా కలిగన వ్యక్తి మెరుగైన పోరాట యోధుడు కావలిన అవసరం లేదు (అయినప్పటికి, అది సాధారణంగా జరుగుతుంది).

నేర్పు మరియు జూడో పరిజ్ఞానాన్ని బట్టి జుడోక లకు హోదాను కేటాయిస్తారు మరియు వారి బెల్ట్ రంగు హోదాను సూచిస్తుంది. హొదా రెండు విభాగాలుగా వుంటుంది: నలుపు బెల్ట్ - కంటే తక్కువ స్థాయి (క్యు ) మరియు నలుపు బెల్ట్ స్థాయి (డాన్ ). కానో ఈ హోదా/శ్రేణి విధాన్నాన్ని యుద్ధ విద్యలలో ప్రేవేశపెట్టాడు మరియు అప్పటినుంచి దీనిని నవీన యుద్ధ విద్యలలో బాగా అవలంభించారు.[ఉల్లేఖన అవసరం] ప్రారంభంలో రూపొందించిన విధంగానే, సంఖ్యా పరమైన తగ్గు క్రమంలో విద్యార్థులకు 6 హోదాలను కలవు, మొదటి డిగ్రీ నలుపు బెల్ట్ (శోడన్ ) కు ముందుది 1 క్యు . సాధారణంగా 10 డాన్ హోదాలు కలవు, అవి సంఖ్యా పరమైన క్రమంలో పెరుగుతూ వుంటాయి, కాని సిద్ధాంత పరంగా డాన్ హోదాకు ఎటువంటి పరిమితి లేదు.

10వ డిగ్రీ నలుపు బెల్ట్ (జుడాన్ ) కి మరియు దాని పైకి ఉన్నవాటికి క్రమబద్ద ఆపేక్షితాలు లేవు. వ్యక్తిగత అభివృద్ధిని నిర్ణయించే ప్రస్తుతపు కోడకన్ అధ్యక్షుడు, కానో జిగోరో మనుమడైన యుకిమిత్సు కానో (కానో యుకిమిత్సు ). కోడకన్ 15 మందికి మాత్రమే ఇటువంటి హోదా కల్పించింది. 2006, జనవరి 6 న, తొషిరో డిగో, ఇచిరో అబే, మరియు యోశిమి ఒసవ అనే ముగ్గురికి ఒకేసారి 10వ డాన్ హోదా లభించింది. 22 సంవత్సరాలలో మొదటిసారికా మరియు ఎక్కువగా ఇది జరిగింది. 10th డాన్ కంటే ఎక్కువ హోదా ఎవరికి లభించలేదు, కానీ;

Theoretically the Judo rank system is not limited to 10 degrees of black belt. The original English language copy (1955) of Illustrated Kodokan Judo, by Jigoro Kano, says: "There is no limit...on the grade one can receive. Therefore if one does reach a stage above 10th dan... there is no reason why he should not be promoted to 11th dan." However, since there has never been any promotion to a rank above 10th dan, the Kodokan Judo promotion system effectively has only 10 dans. There have only been 15 10th dans awarded by the Kodokan in the history of Judo.[28]

వివిధ దేశాల సంస్థల మధ్య డాన్ హోదా ఒకే రకంగా వుంటుంది, కాని క్యు స్థాయి దగ్గర కొంచం తేడాలు కలవు, కొన్ని దేశాలలో ఎక్కువ క్యు స్థాయిలు ఉన్నాయి. అయెతే మొదట క్యు స్థాయిలో బెల్ట్ రంగు అందరికి తెలుపే వుండేది, ఇప్పుడు రకరకలైన రంగులను ఉపయోగిస్తున్నారు.

బెల్ట్ రంగులుసవరించు

బ్రెజిల్ లో జూడో బెల్ట్ రంగులు
తెలుపు  
తెలుపు  
నీలం  
పసుపు  
నారింజ  
ఆకుపచ్చ  
వంగపండు  
గోధుమ  
నలుపు  
తెలుపు మరియు ఎరుపు  
ఎరుపు  
జూడో బెల్ట్ రంగులు యూరోప్, కెనడా, ఆస్ట్రేలియా, మొదలైనవి
తెలుపు  
పసుపు  
నారింజ  
ఆకుపచ్చ  
నీలం  
గోధుమ  
నలుపు  
తెలుపు మరియు ఎరుపు  
ఎరుపు  

జపాన్ లో బెల్ట్ రంగులకు విద్యార్థి వయస్సుకు సంబంధం వుంటుంది. కొన్ని క్లబ్స్ కు తెలుపు మరియు నలుపు మాత్రమే కలవు, మిగతావి వున్నత క్యు తరగతి వారి కొరకు గోధుమ బెల్ట్స్ ను కలిగి వుంటాయి మరియు ప్రాథమిక పాఠశాల స్థాయిలో మధ్యతరగతి వారి కొరకు ఆకుపచ్చ బెల్ట్ సాధారణం.

ఆస్ట్రేలియాలో క్యు తరగతి వారి కొరకు తెలుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, బ్లూ మరియు గోధుమ రంగుల బెల్ట్స్ ఉన్నాయి.

డాన్ హొదా కలవారికి మొదటి 5 స్థాయిల వరకు నలుపు బెల్ట్స్, 6, 7, మరియు 8 స్థాయిల డాన్స్కు ఎరుపు మరియు తెలుపు రంగులు పర్యాయముగా, మరియు 9, 10 స్థాయిల డాన్స్కు ఘనమైన ఎరుపు రంగుకల బెల్ట్స్ వుండును.[29] అయితే, గోడన్ (5th డాన్ ) లు సమమైన నలుపు బెల్ట్ ను సాధారణ శిక్షణ సమయంలో ధరిస్తారు.

కొన్ని దేశాలలో జూనియర్ వయస్సుగల గుంపును గుర్తించుటకు, బెల్ట్స్ మీద రంగుల చారాలను ఉపయోగిస్తారు. చరిత్రననుసరించి, మహిళల బెల్ట్స్ మధ్యలో తెలుపు చార వుంటుంది.[ఉల్లేఖన అవసరం]

పరీక్షకు అర్హత దేశాన్ని బట్టి మారుతుంది, వయస్సు మరియు ఏ స్థాయికి ప్రయతిన్స్తున్నారు అనేదాని మీద ఆధారపడుతుంది. పరీక్ష పోటీని మరియు కటను కలిగివుంటుంది. క్యు హొదా సాధారణంగా స్థానిక గురువు (సెన్సెఇ ) ఇస్తారు, కాని డాన్ హొదా, జాతీయ జూడో అసోసియేషన్ నుంచి వచ్చిన స్వతంత్ర న్యాయనిర్ణేతల ఆద్వర్యంలో నిర్వహించిన పరీక్షలో మాత్రమే ఇస్తారు. హొదా గుర్తింపు కొరకు, జాతీయ జూడో అసోసియేషన్ లేదా కోడోకన్ లో నమోదు చేయించుకోవాలి.

బ్రెజిల్సవరించు

బ్రెజిలియన్ బెల్ట్స్ శ్రేణి సాధారణంగా తెలుపు, బ్లూ, పసుపు, నారింజ, ఆకుపచ్చ, వంగపండు, గోధుమ మరియు నలుపు (6th, 7th, మరియు 8th డాన్ పర్యాయముగా ఎరుపు మరియు తెలుపు పలకలను ధరిస్తారు, మరియు 9th మరియు 10th డాన్ హొదా కలవారు ఘనమైన ఎరుపు బెల్ట్స్ ను ధరిస్తారు).[30] అదనంగా, నీలంకి కొంచంముందు, గచ్చకాయ రంగు బెల్ట్ చాలా చిన్న జుడోక (11 లేదా 13 సంవత్సరాల లోపు) కి ఇస్తారు. కొన్నిసార్లు, స్థాయిని బట్టి, పోటీదారులను రెండు విభాగాలుగా విభజిస్తారు; మొదటిది తెలుపు నుంచి ఆకుపచ్చ దాకా, మరియు రెండవది వంగపండు నుంచి నలుపు వరకు.

కెనడాసవరించు

కెనడాలో సీనియర్స్ కొరకు బెల్ట్ శ్రేణి పెరిగే క్రమంలో: తెలుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, బ్లూ, గోధుమ మరియు చివరగా నలుపు. జూనియర్స్ కొరకు బెల్ట్ శ్రేణి: తెలుపు-ఎరుపు, తెలుపు, తెలుపు-పసుపు, పసుపు, పసుపు-నారింజ, నారింజ, ఎరుపు-ఆకుపచ్చ, ఆకుపచ్చ-నీలం, నీలం, నీలం-గోధుమ, మరియు గోధుమ.[26]

సంయుక్త రాష్ట్రాలుసవరించు

సంయుక్త రాష్ట్రాలలో సీనియర్ ఆటగాళ్ళు మాత్రమే (పెద్దవాళ్ళు, సాధారణంగా వయస్సు 16 కంటే ఎక్కువ కలవారు) డాన్ హొదాని పొందుటకు అర్హులు, నలుపు బెల్ట్ ను ధరించే గుర్తింపును పొందుతారు. ది USJF మరియు USJA లు ఇతర సంస్థల చేత పొందిన డాన్ హొదాను గుర్తిస్తాయి. ఎగువ క్యు స్థాయిలను సీనియర్స్ మరియు జూనియర్స్ (వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువ) సాధించవచ్చును మరియు నలుపు కాకుండా ఇతర రంగుల బెల్ట్స్ ను ధరించే గుర్తింపును పొందుతారు. బెల్ట్స్ రంగుల క్రమం, ఒక డోజో నుంచి మరొక డోజోకి, డోజో యొక్క సంస్థ అనుబంధాన్ని బట్టి మారుతుంది.

జూడో
సంయుక్త రాష్ట్రాలలో క్యు బెల్ట్ రంగులు
జపనీయులు
క్యు పేర్లు
USJF
సీనియర్
USJF
జూనియర్
USJA
సీనియర్
USJA
జూనియర్
USJA జూనియర్
స్థాయి పేర్లు
జునిక్యు  
తెలుపు
జూనియర్ 12వ తరగతి
జుఇచిక్యు  
తెలుపు
 
పసుపు
జూనియర్ 11వ తరగతి
జుక్యు  
తెలుపు
పసుపు
 
నారింజ
జూనియర్ 10వ తరగతి
కుక్యు  
పసుపు
 
నారింజ
జూనియర్ 9వ తరగతి
హచిక్యు  
పసుపు
నారింజ
 
ఆకుపచ్చ
జూనియర్ 8వ తరగతి
ననక్యు
లేదా USJA సీనియర్
"ప్రారంభకుడు"
 
నారింజ
 
తెలుపు
 
ఆకుపచ్చ
జూనియర్ 7వ తరగతి
రొక్ క్యు  
తెలుపు
 
నారింజ
ఆకుపచ్చ
 
పసుపు
 
నీలం
జూనియర్ 6వ తరగతి
గోక్యు  
ఆకుపచ్చ
 
ఆకుపచ్చ
 
నారింజ
 
నీలం
జూనియర్ 5వ తరగతి
యాన్ క్యు  
నీలం
 
ఆకుపచ్చ
నీలం
 
ఆకుపచ్చ
 
వంగపండు
జూనియర్ 4వ తరగతి
సాన్ క్యు  
గోధుమ
 
నీలం
 
గోధుమ
 
వంగపండు
జూనియర్ 3వ తరగతి
నిక్యు  
గోధుమ
 
నీలం
వంగపండు
 
గోధుమ
 
గోధుమ
జూనియర్ 2వ తరగతి
ఇక్క్యు  
గోధుమ
 
వంగపండు
 
గోధుమ
 
గోధుమ
జూనియర్ 1వ తరగతి
సీనియర్స్సవరించు

సీనియర్ ఆటగాళ్ళ కొరకు, ది యునైటెడ్ స్టేట్స్ జూడో ఫెడరేషన్ (USJF)[30] మరియు ) ది యునైటెడ్ స్టేట్స్ జూడో అసోసియేషన్ (USJA)[31] రెండూ పట్టికలో చూపిన విధంగా ఆరు క్యు లను నిర్దేశించాయి. ది USJA ప్రకారం "ప్రారంభకులు" (క్యు కాని వారు) పసుపు బెల్ట్ పరీక్షలో పాల్గోనేవరకు తెలుపు బెల్ట్ ను ధరించాలి. సాధకుని స్థాయిని తెలిపే పట్టీని ధరించ వలసినదిగా ది USJA నిర్దేశిస్తుంది. ఇది క్యు మరియు డాన్ స్థాయిల వరకు వర్తిస్తుంది.

జూనియర్స్సవరించు

ది USJF జూనియర్ హోదా వ్యవస్థ ప్రకారం, వారి హోదా 11క్యు (జుచిక్యు ). ది USJA జూనియర్ హోదా వ్యవస్థ ప్రకారం, వారి హోదా 12క్యు, ప్రారంభం "జూనియర్ 1st డిగ్రీ" (జునిక్యుకు సమానం, లేదా 12th క్యు ) మరియు చివరిది "జూనియర్ 12th డిగ్రీ" (ఇక్క్యుకు సమానం). సీనియర్ సాధకుల వలననే, జూనియర్ సాధకులు కుడా వారి హోదాను తెలిపే పట్టేలను ధరించాలని ది USJA నిర్దేశిస్తుంది. USJA జూనియర్ వయస్సు 17 కి చేరినచో, వారు సీనియర్ హోదాలోకి ఈ ప్రకారం మారతారు:[32]

 • పసుపు బెల్ట్ కలవారు 6th క్యు (రోక్యు) గా
 • నారింజ బెల్ట్ కలవారు 5th క్యు (గోక్యు) గా
 • ఆకుపచ్చ బెల్ట్ కలవారు 4th క్యు (యోన్ క్యు) గా
 • బ్లూ బెల్ట్ లేదా ఇంకా ఎక్కువ కలవారు 3rd క్యు (సన్ క్యు) గా
 
నవీన జూడోలో సాధారణంగా ధరించే బెల్ట్ యొక్క శైలి

ఫుట్ నోట్స్సవరించు

 1. Introduction of men's judo to the Olympics.
 2. Introduction of women's judo to the Olympics.
 3. The first Olympic competition to award medals to women judoka was in 1992; in 1988, women competed as a demonstration sport.
 4. కానో జూడో అనే పదాన్ని వాడకమునుపే, జిక్షిన్-ర్యు జూడో అనే ప్రాచీనమైన పాఠశాల 1724 నుండి కలదు, అది జపాన్ బయట చాల తక్కువ కనబడుతుంది.
 5. ఉదాహరణకు, ట్సునేజిరో టోమిట షుమారు 1906 లో వచ్చిన జూడో: ది మోడర్న్ పాఠశాల అఫ్ జియు -జిట్సు అనే పుస్తకానికి సహా రచయత (గ్రెగొరీ, ఓ.హెచ్. మరియు ట్సునేజిరో టోమిట ద్వారా. గ్రెగొరీ, ఓ.హెచ్. ద్వారా చికాగో లో ముద్రించబడినది)
 6. 6.0 6.1 "Introduction of the Blue Judogi". International Judo Federation. Cite web requires |website= (help)
 7. షిఐ రూల్స్
 8. చట్టప్రకారం, పోటీదారులు నేలమీద పోరాటాన్ని త్రోయడం ద్వారా ఆరంభిస్తారు; లేక నైపుణ్యంతో కింద పడవేయడం ద్వారా; లేక ఒక పోటీదారుని నేలమీద పడవేయడం ద్వారా; లేక ఒక పోటీదారుడు పట్టుతప్పి క్రిందపడిపోవడం ద్వారా. (అంతే కాక, త్రోయడం ద్వారా ఒక పూర్తి పాయింట్ ను సాధిస్తే, ఆటను వెంటనే ఆపివేస్తారు.)
 9. మిల్లెర్, క్రిస్. చేతులతో చేయు పోరాటం . hsma1.com . URL చివరి సారి చూసినది మార్చ్ 4, 2006.
 10. ప్రపంచ జూడో సమాఖ్య §27 (a.21)
 11. ది ఛాలెంజేస్ అఫ్ శిమేవాజా వ్రాసినది ఎలీ ఏ. మొర్రేల్, శిచిదన్ (judoinfo.com)
 12. ది కంట్రిబ్యుషన్ అఫ్ జూడో టు ఎడ్యుకేషన్ కానో జిగోరో వ్రాసినది (judoinfo.com)
 13. judoinfo.com జూడో ఒక యుద్ద విద్య లాగా
 14. judoinfo.com మహిళల ఆత్మరక్షణ
 15. judoinfo.com ఎందుకు ఆటల జూడో ఉపయోగం
 16. "entrevista a paulo filho (interview with Paulo Filho)" (Portuguese లో). youtube.com. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 17. "ది హిస్టరీ అఫ్ సంబో – యురోపియన్ జూడో నిజంగా జపనీస్ సంబో?" బ్రేట్ట్ జకెవెస్ మరియు స్కాట్ ఆండెర్సన్ వ్రాసిన [1] [2] [3]
 18. స్పోర్ట్స్ మెడిసిన్ ఇష్యూఎస్ ఇన్ ది యంగ్ జూడో అధ్లేట్ – రాబర్ట్ ఎస్ . నిశిమే, M.D. వ్రాసినది, USA జూడో స్పోర్ట్స్ మెడిసిన్ ఉపసంఘం(usjudo.org)
 19. జుడో రీసెర్చ్ అబ్స్త్రక్ట్స్ – పనితీరు, జాగ్రత్త మొదలైనవి (జూడో ఇన్ఫర్మేషన్ సైట్ నుంచి)
 20. 20.0 20.1 ప్రిన్సిపల్స్ అఫ్ జూడో చోకింగ్ టెక్నిక్స్ – నీల్ ఒహ్లేన్కంప్ వ్రాసినది (judoinfo.com)
 21. జూడో చోకింగ్ టెక్నిక్స్ (judoinfo.com)
 22. హౌ సేఫ్ ఇజ్ చోకింగ్ ఇన్ జూడో ? యి.కే. కోఇవై, M.D. వ్రాసినది (judoinfo.com)
 23. ది సేఫ్టీ అఫ్ జూడో చోక్స్ లియోనార్డ్ ఐ. లపిన్సోహం M.D. వ్రాసినది (judoinfo.com)
 24. డెత్స్ అల్లెజేద్లీ కాజుడ్ బై ది యూజ్ అఫ్ "చొక్ హోల్డ్స్" (శిమే -వాజా ) ఇ.కే.కోఇవై, M.D. వ్రాసినది. (judoinfo.com)
 25. ఎమెర్గెంచ్య్ ఎమర్జెన్సి కేర్ ఫర్ చొక్ హోల్డ్స్ జాన్ బౌలీ వ్రాసినది (judoinfo.com)
 26. 26.0 26.1 కేనడియన్ నేషనల్ క్యు గ్రేడింగ్ సిలబస్
 27. కెనడియన్ నేషనల్ (డాన్) గ్రేడింగ్ సిలబస్
 28. Ohlenkamp, Neil. "The Judo Rank System". Cite web requires |website= (help)
 29. "柔道帯の最高位は、何と紅!? "紅帯"所持者に投げられてきた!" (Japanese లో). R25.jp. 2008-05-15. మూలం నుండి 2008-05-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-11. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 30. 30.0 30.1 "FJERJ (Judo Federation of Rio de Janeiro) - Judo Graduation". Cite web requires |website= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "USJF" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 31. "United States Judo Association Rank Requirements" (PDF). Cite web requires |website= (help)
 32. "United States Judo Association Senior Handbook". Cite web requires |website= (help)

మూలాలుసవరించు

 • కోడోకన్ యొక్క చరిత్ర – మొంటన విశ్వవిద్యాలయపు వెబ్ సైట్.
 • కానో, జిగోరో (1994) వ్రాసిన కోడోకన్ జూడో అనేది జూడోకి ప్రామాణికమైన గ్రంథం. ISBN 4-7700-1799-5.
 • ఒహ్లేన్కంప్, నీల్ (2006) వ్రాసిన జూడో అన్లీశేడ్ అనేది జూడోకి మరొక ప్రామాణిక గ్రంథం. ISBN‌ 0-385-14348-6.

బాహ్య లింకులుసవరించు

మూస:Olympic sports

"https://te.wikipedia.org/w/index.php?title=జూడో&oldid=2502409" నుండి వెలికితీశారు